నాది అనుకోగానే రాగం-ద్వేషం-ఈర్ష్య-బాధ అన్నీ పుడతాయి చూడు🌹అష్టావక్ర టాక్ 72🌹kanthrisa
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=fsaM869N-hs
Transcript:
(00:01) అష్టవక్ర సంహిత చాప్టర్ 18 టాక్ 72 ఒక్కసారి ఈ ప్రకృతిలో ఏం జరుగుతుందో సరదాగా గమనిస్తే గనుక కొన్ని విషయాలు తెలుస్తాయి మనకి అకారణంగా ప్రకృతి నిరంతరం సజీవంగా ఉంది. ప్రకృతిలో మనిషిని కలపడానికి వీలులేదు. మనిషి తను తాను ప్రకృతి నుంచి పక్కకు జరిపి తానే సృష్టించుకుంద ప్రపంచానికి చాలా దగ్గర అయిపోయాడు.
(00:33) పుట్టిన పిల్లలంతా కూడా ప్రకృతిలోనే ఉంటారు. మనమంతా కూడా ప్రకృతిలోనే జన్మ తీసుకున్నాం. కానీ జన్మ తీసుకున్న క్షణం తర్వాత మనం ఉన్న ఇల్లు ప్రపంచానికి సంబంధించింది. ఈ మధ్య నన్న ఒకరు ప్రశ్న వేశరు మరి దేవుడి దృష్టిలో ప్రకృతి దృష్టిలో అంతా సమానమైనప్పుడు ఒకడు ధనికుడిగా ఒకడు బీదవాడిగా ఎందుకు పుడుతున్నాడు నేను నీ ప్రశ్నలోనే చాలా పెద్ద బ్లండర్ ఉంది.
(00:57) ఎవడు బీదవాడిగా ఎవడు ధనికుడిగా పుట్టట్లే అందరూ సాద సీదా మానవులుగానే పుడుతున్నారు. సాదా సీదా ప్రాణిగా పుడుతున్నారు. కానీ ఆ పుట్టిన చోటు దానివల్ల అతను ధనికుడని నీవు అనుకుంటున్నావు. పుట్టిన తర్వాత మూడు నాలుగుేళ్ళ వచ్చేవరకి ఒక బీద పిల్లవాడికి ఒక ధనికుడు పిల్లవాడికి తేడా ఏమి తెలియదు వాళ్ళు ప్రకృతితో అనుసంధానమై జీవిస్తారు.
(01:22) సో ఎవడు ఆత్మజ్ఞాని అంటే ఈ విషయాన్ని తిరిగి గుర్తించి ప్రపంచంలో తను తాను ఇరికించుకున్నానుని తెలిసి ప్రాపంచిక విషయాలకు తను పొందాలని చెప్పి పరిగెత్తాలని పరిగెత్తాలని పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి చివరికి ఇదంతా వ్యర్థం తెలుసుకొని చివరికి మళ్ళీ ప్రకృతితో జీవించేవాడు తిరిగి ఒక అబోధ బాలకుడి లాగా మారిపోయినవాడు ఈరోజు అష్టవక్రుడు సూత్రాలన్నీ ఆ అబోధ బాలక దశ గురించి చెప్తున్నాయి.
(01:51) సో పిల్లవాడు తెలియక ప్రకృతిలో ఉన్నాడు జ్ఞాని తెలిసి ప్రకృతిలో ఉన్నాడు. సో అబోధకి బోధకి ఉన్న వ్యత్యాసం అంతే ఉన్న స్థితి సేమ్ పిల్లవాడికి తెలియదు జ్ఞానికి తెలుసు ఈ అబోధ నుంచి బోధలోకి తీసుకురావడానికి మధ్యన ఉపయుక్తమైన సాధనమే బోధన ఇప్పుడు ఆధ్యాత్మిక బోధన అంటే రకరకాల పనికి రాని విషయాల గురించి చెప్పడము నువ్వు గనుక పూజ చేస్తే నీకు అమెరికా వెళ్లే వీసా వస్తుందని చెప్పడము ఇలా చేస్తే నీకు సంపద వస్తుందని చెప్పడం అవన్నీ ప్రాపంచిక విషయాలు ఆధ్యాత్మికత అంటే ఏవేవైతే తే నీ స్వభావాలు ఉన్నాయో అవన్నీ నువ్వు మర్చిపోయావు కాబట్టి తిరిగి నీకు వాటిని గుర్తు చేసే ఒక వ్యక్తి తన స్థితిని
(02:33) నీకు పరిచయం చేస్తాడు ఆ స్థితులు నీలోనే ఉన్నాయి తద్వారా సాధన అక్కర్లేదుఅని చెప్తాడు గురువు యొక్క పాత్ర అంతవరకే కానీ ఈ ప్రపంచం యొక్క వ్యాప్తి ప్రపంచం యొక్క విస్ఫోటనం ఎంత ప్రబలంగా ఉందంటే ఈ సూక్ష్మ విషయాలు మరుగున పడిపోయి ప్రాపంచిక విషయాల్లోనే మనిషి కొట్టుమిట్లాడుతున్నాడు సో ఒకసారి శండార్ట్ వేయాలని ఎవరో పిలిస్తే డెహరాడూన్ పోతే ఒక సాయంత్రం నేను మా బ్రదర్ అట్లా వెళ్ళాం మంచి నవంబర్ డిసెంబర్ కాలం చలికాలం ఎటు చూసిన పూలే అనుకోకుండా దాని నుంచి వచ్చిన మాట ఇన్ని పూలు ఎవరు పూయిస్తున్నారు సో అక్కడే ఒక వ్యక్తి ఉన్నాడు హిందీలో
(03:19) చెప్పాడు పూయించడానికి ఎవరు లేరు అవే పూస్తాయి ఆ పూస్తుంటే అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అన్నాడు. సో పిల్లలు ఆడుకుంటున్నారు పిట్టలు కూస్తున్నాయి వర్షం వస్తుంది పూలు పూస్తున్నాయి. పక్షులు అరుస్తున్నాయి గమనించాల్సిన విషయం ఒకటి లాభ నష్టాలకు అతీతం జీవితం ప్రకృతి ఆత్మజ్ఞానం నీ మనసులో లాభ నష్టాలు వచ్చాయా నువ్వు రాగద్వేషాల్లోకి బాధలోకి జుగుప్సలోకి అహంకారంలోకి జెలసీలోకి అడుగు పెడుతున్నావు అందులో ఏ సందేహం లేదు కానీ ఆశ్చర్యం ఏమిటంటే మనిషి ఒక్కడే లాభ నష్టాల్లో పడ్డాడు కాబట్టి
(04:04) మనిషి ఒక్కడికే ఆత్మజ్ఞానం అవసరం మనిషి ఒక్కడే ఆత్మ గురించి విచారణ చేస్తున్నాడు. ఈరోజు అష్టవక్రుడి సూత్రాలు చాలా మహత్వపూర్ణమైనవి అష్టవక్రుడు సూత్రాలని గొప్ప సూత్రాలు అనకండి అవి సహజ సూత్రాలు ప్రతి ఒక్కడు అత్యంత సహజంగా అర్థం చేసుకొని ఇప్పటికిప్పుడే ఇంప్లిమెంట్ చేయతగ సూత్రాలు తద్వారా ఈ క్షణమే ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం అంటే నీ సహజ స్థితుల్లో నువ్వు రమించడం మిగతా అన్నిటిని చుట్టుపక్కల ఉన్న వాటిని అవసరం కోసం ఉన్నాయని గుర్తించడం నాది నీది అని అనుకోకుండా ఒక వస్తువుని వస్తువుగా చూడటం ఇప్పుడే అమెరికా నుంచి ఒక ఫ్రెండ్ ఫోన్ చేసింది అష్టవక్ర మహాగీత విన్నాను మీరు
(04:48) నన్ను ఒక ప్రశ్న అడిగారు ఒక ఫోర్ ఫైవ్ డేస్ క్రితం ఆ ప్రశ్న ఏమిటి మీరు అందంగా ఉన్నారా అని అప్పుడు నేను అంత అందంగా ఉండను అందంగా అని చెప్పాను అప్పుడు మీరు అన్నారు కావాలని ఈ ప్రశ్న అడిగాను చూద్దాం నువ్వు ఏం చెప్తావో ఎందుకంటే అప్పటివరకు నువ్వు చెప్తున్న మాటలన్నీ చాలా అద్భుతమైనవి ఒక సరైన ప్రశ్న అది నీకు సంబంధించిన ప్రశ్న అయినప్పుడు నీ యొక్క యొక్క మనసులో ఏముందో తెలుస్తుంది ఆ ప్రశ్న అడిగాను.
(05:13) పోల్చుకోవడం వల్ల నీ అందం ఒకలాగా అనిపిస్తుంది. అందానికి సౌందర్యానికి తేడా అదే ప్రపంచంలో అందం ఉంది ప్రకృతిలో సౌందర్యం ఉంది. సౌందర్యం అంటే పోలికలకు అతీతం సౌందర్యం ఉంటే ఏది ఉందో దాన్ని అంగీకరించే ఒకానొక మనుదశ. నీ ఎదురుగా పువ్వు ఉంది దాన్ని యధావిధిగా అంగీకరించావు అట్లాగే నిన్ను యధావిధిగా అంగీకరించావు అక్కడితో అయిపోయింది బాత్ ఖతం కానీ ప్రపంచంలో అందం అంటే వేరే వాళ్ళ కంటే రేపటికంటే నిన్నటికంటే మొన్నటికంటే అందరికంటే కొంచెం కొత్తగా సో నువ్వు అందమని చెప్పి మూలాన్ని ఏం సార్ సవరించడం లే మూలం మీద
(05:57) నువ్వు మెరుగులు తిత్తున్నావ్ అంతే నీ పొట్ట నీ కాళ్ళు నీ పెదా దాలు నీ కళ్ళు నీ కనుబొమ్మలు నీ జుట్టు ఏవి ఎలా ఉండాలో అలాగే ఉన్నాయి అవి సౌందర్యంగానే ఉన్నాయి పోలిక తీసేస్తే సౌందర్యం పోలిక ఉంటే అందం ఈరోజు తను నాకు చెప్పిన మాట చెప్పి అష్టవక్ర సారంలోకి వెళ్దాం తను ఏమన్నది ఈరోజు ఇప్పుడే నిద్ర లేచి అద్దం చూసుకున్నాను ఏ పోలిక లేకుండా మొదటిసారి చూశాను ఉన్నదిఏదో బాగానే ఉంది.
(06:29) మొదటిసారి నన్ను నేను ఏమాత్రం సవరించుకోకుండా ఆఫీస్ కి బయలుదేరుతున్నాను. ఇలా ఎప్పుడూ జరగలేదు నేను పుట్టిన తర్వాత. సో అష్టవక్ర మహాగీత సారం తెలిస్తే నీ అబద్ధపు స్వభావాలన్నీ పోయి చాలా కోల్పోయిన భావన కలిగి నిజ స్వభావంలోకి వచ్చి ఇక ఎప్పటికీ పోదని తెలిసి ఒక పరమశాంతిని అనుభవిస్తావు నిన్న సాయంత్రం ఒక మిత్రుడు వచ్చాడు చాలా వింత చేష్ట చేశడు ఏది నా చేయి పట్టుకో అన్నాడు పట్టుకున్నాను ఒక్కసారి లాగు అన్నాడు లాగాను ఒక రెండు గెంతులు దుంకి నా వైపు దుంకాడు ఎందుకు ఇట్లా చేశవు అంటే చెప్పాడు గట్టు మీద పడేస్తా అంటున్నావు కదా నా వల్ల కావడంలే నువ్వే లాగు అన్నాడు ఇద్దరం
(07:10) నవ్వుకున్నాం అప్పుడు అతను నా అన్న మాట చాలా అద్భుతమైన మాట నాకంతా తెలుస్తుంది జస్ట్ ఒక్క అడుగు ముందుకు వేస్తే ఈ క్షణం నువ్వు అనుభవించే స్థితికి నేను వస్తానని కానీ ఇప్పటివరకు ఉన్నదంతా వదిలేసి నేను అన్యాయం అయపోతానేమో ఆ చిన్న భయం వింటాడుతుంది. అట నేను అన్నాను తొందరపడకు మనసుని ఒత్తిడి చేయకు కొంతకాలం ఉండు అక్కడ ఏమి కాదులే ఒక్కడుగు దూరంలోనే ఉన్నావు కదా ఎవర శిఖరానికి ఒక్కడుగు దూరంలో ఉన్నావు పర్వాలేదు చూస్తున్నావు కదా పర్వాలేదు ఎవ్రీథింగ్ విల్ బి ఆల్రైట్ ఈరోజు అష్టావక్రుడి సూత్రం కర్తవ్య దుఃఖమార్తాండ జ్వాలాదగ్ధాంతరాత్మన
(07:53) కుతః ప్రశమాపి యుష ధారాసారమృతే సుఖం గమనించారా అష్టవక్రుడు కొన్ని వందల సార్లు సుఖం సుఖం సుఖం అనే పదం వాడుతున్నాడు. నా ప్రపంచంలో సుఖపడొద్దు సుఖపడొద్దు సుఖపడొద్దు కష్టపడు హార్డ్ వర్క్ చెయ్ వర్క్ హార్డ్ డు సంథింగ్ ప్రూవ్ సంథింగ్ ఏం ప్రూవ్ చేస్తావు డాడీ ఇక్కడ సో ఈ సూత్రం యొక్క అర్థం ఏమిటంటే ఓ జనక కర్తవ్య నిర్వహణ చాలా కష్టం సుఖం కంటే దుఃఖమే ఎక్కువ ఆ కర్మజన్య దుఃఖం మార్తాండ జ్వాల వలె మన మానవుని దహింపజేస్తుంది ఒక పరమశాంతి అనే పియుష ధార చేతనే మనిషికి
(08:40) అంతులేని సుఖం లభిస్తుంది పరమశాంతి తాత్కాలిక శాంతి కాదు శాంతి కాదు పరమశాంతి ద అల్టిమేట్ పీస్ ప్రపంచం కర్తవ్యం ప్రకృతి కర్త శూన్యత ప్రకృతిలోన కర్తవ్యం ఉంది ప్రపంచంలో కర్తవ్యం ఉంది. కానీ ప్రకృతి కర్తవ్యానికి ప్రపంచంలో కర్తవ్యానికి తేడా ఒకటే ప్రకృతిలో కర్మ ఉంది కర్త లేడు ప్రపంచంలో కర్త ఉన్నాడు కర్మ కూడా ఉంది. ప్రకృతిలో కర్తవ్యం ఉన్నది సమస్తంలో నేను ఒక భాగం అని తెలుసుకొని ఆ సమస్త సామరస్యాన్ని చెడగొట్టకుండా నువ్వు చేసే చేష్ట హార్డ్ వర్క్ కాదు ఒక సహజమైన కదలిక నీ శరీర మనోధర్మాలని ఆధారం చేసుకొని
(09:29) నీకు ఎంత సాధ్యమో అంతా సమస్తాన్ని విస్మరించకుండా చేసేది. ప్రపంచంలో సమస్తంతో పనిలే పక్కింటి వాడితో పనిలే బంధువులతో పనిలే నువ్వు బాగుంటే చాలు సో కర్తవ్యం అంటే కర్తా భావన వల్ల నువ్వు చేస్తున్న పని దాని వల్ల ఒరిగేది ఏమిటి డబ్బు లేకపోతే పరపతి లేకపోతే బంగారం ఇది కాదు నీ కర్తా భావన పరిపుష్టం అవుతుంది నేనేదో చేశాను నేనేదో సాధించాను అన్న భావన నీకు నిరంతరం కలుగుతుంది.
(10:00) చేయాలి చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి అన్న ఆరాటం నిన్ను పరుగులు పెట్టేలా చేస్తుంది. సో ప్రకృతిలో శ్రమకి చాలా అద్భుతమైనటువంటి స్థానం ఉంది. శ్రమ వేరు కష్టపడడం వేరు సో కష్టపడడంలో కాలానికి ప్రాధాన్యత ఉంది. శ్రమలో కాలానికి ప్రాధాన్యత లేదు శ్రమలో శ్రమ యొక్క జీవన సౌందర్యం అన్నారంటే కాలాన్ని మర్చిపోయి నువ్వు చేసే కర్తా భావన లేకుండా చేసే కర్మ కష్టపడడం హార్డ్ వర్క్ హార్డ్‌షిప్ అంటే నిరంతరం కాలాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని అక్కడి నుంచి ఈ కాలంలో నేను ఇది పూర్తి చేయాలి అప్పుడు నేను సాధించినట్టు అని అనుకోవడం వల్ల
(10:46) నువ్వు పరిగెత్తే ఒకానొక పరుగు సో కర్తవ్యం జీవనం దుఃఖం ప్రపంచం ప్రకృతి శ్రమ యొక్క జీవన సౌందర్యం సో శ్రమ అంటే నీ మనో శరీర ధర్మాలని అర్థం చేసుకొని ఎంత సాధ్యమో అంత పరిపూర్ణంగా చేయడం దాని ద్వారా వచ్చిన దాన్ని నాది నీది అన్న భావన లేకుండా అనుభవించడం జ్ఞాని యొక్క ఒకానొక దశ అది సో ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం రెండు రకాలుగా పని చేస్తున్నాం కాలాన్ని నిరంతరం జ్ఞప్తికి తెచ్చుకొని పని చేస్తున్నాం అందువల్ల ఒత్తిడు వస్తుంది.
(11:25) కాలాన్ని మర్చిపోయి పని చేస్తే అక్కడ ఒత్తిడి లేదు నిద్ర కాలాతీతం మనం ఒక సినిమాకి వెళ్తాం కాలాన్ని మర్చిపోవడానికి వెళ్తాం. మనం ఏదనా సినిమా చూసినప్పుడు కాలం గుర్తొస్తుంది అనుకో దాని అర్థం సినిమా బాగాలేదని నాకు ఎవరన్నా సాండ్ ఆర్ట్ గురించి లేకపోతే ప్రదర్శన గురించి టాక్ గురించి పిలిస్తే ఒకటే మాట చెప్తాను. నేనేం చెప్తాను ఇరిలవెంట్ ఎదుటి వ్యక్తికి సమయం తెలియకుండా మనం చేసినట్లయితే మన ప్రదర్శన ఫలమంతమైనట్టు అట్టా కాకుండా మనం చేస్తున్నంత సేపు ఐదు నిమిషాలు 10 నిమిషాలు చూసుకుంటున్నాడు అనుకో దెన్ నీ ప్రదర్శన అతనికి ఇప్పుడు భారమైంది.
(11:59) అతనికి సమయం గుర్తొస్తుంది ఒక తెలియని ఒత్తిడి రెస్ట్లెస్నెస్ లోకి ఎంటర్ అవుతున్నాడు. సో అష్టవక్కుడు ఏం చెప్తున్నాడు కర్తవ్య దుఃఖమార్థాండ జ్వాల ధగ్దాంతర్ ఆత్మనః కుతః ప్రశమ పియుష ధార సారామృతి సుఖం సో ఏవైతే మనం చేయాలని అనుకుంటున్నామో ఆ పందులు మనకు ప్రపంచం చెప్పలేము మనమే నిర్ణయించుకున్నాం. యంబిషన్స్ గోల్స్ ఈ ప్రపంచం చెప్పినంత మాత్రాన నువ్వు ఏర్పాటు చేసుకోవాలని ఏమీ లేదు.
(12:32) కానీ చేస్తావు సో చేయ తలపెట్టిన కార్యక్రమాలు త్వర త్వరగా చేసేయాలి అనుకోవడం వల్ల ఒక అహం భావం వస్తుంది. సో ఆ అహంభావం వల్ల నువ్వు పడే బాధనే ఈ అంతర్గత ప్రచండ మార్తండ జ్వాల కర్తవ్యం దుఃఖ మార్తండ జ్వాల దగ్దాంతరాత్మన సో నీ యొక్క మూలాన్ని దహించి వేస్తది. అంతా ఉన్నా కూడా నీకు శాంతి లేదు. నీ చుట్టుపక్కల నీ వాళ్ళంత ఉన్నారు నువ్వు కొనుక్కున్న వస్తువులు ఉన్నాయి నువ్వు కట్టుకున్న ఇల్లు ఉంది.
(12:59) నువ్వు సాధించిన మెడల్స్ ఉన్నాయి బట్ స్టిల్ లోపట ఏదో కాలిపోయిన వాసన ఉంది. నాకు అసలు సుఖించడం ఇంపాజబుల్ ఎన్ని లంపటాలు పెట్టుకున్నాను ఇక ఈ జీవితంలో నేను శాంతిగా ఉండాలంటే ఒక మూడు నాలుగేళ్లు కష్టపడితేనే శాంతి అవన్నీ ఎవరు చెప్పారు నీకు ఈ క్షణమే ఉన్నది చాలు అనుకో ఇలా అంటే కొందరు ఫండమెంటలిస్ట్లు లేకపోతే డెవలప్మెంట్ ఓరియంటెడ్ బెంట్ ఆఫ్ మైండ్ ఉన్నవాళ్ళు ఏమంటారు అలా అందర అనుకుంటే ప్రపంచం యొక్క వేగం సన్నగిల్లిపోతది దాన్ని ఎవరు నిర్ణయిస్తారు అదిఒక రాట్ రేస్ అంతే ప్రపంచం ఇప్పుడు ఉన్న స్థితి ఒక 20 ఏళ్ల తర్వాత వచ్చినా ఏమీ కాదు కానీ నీ ప్రశాంతత నీకు చాలా
(13:40) ముఖ్యం. సో మనిషి లేదా మానవజాతి అంతా తను చేసే కార్యక్రమాలు అత్యంత ముఖ్యంగా కాలానికి ముడిపెట్టి తను పెడుతున్న పరుగు వల్ల ఒక అంతులేని అశాంతికి లోనవుతున్నాడు. మరి తనకు ఆత్మశాంతి ఎట్లా వస్తుంది? సో సంకల్పాలు వికల్పాలు పక్కకు జరగాలి మనసు నుంచి సో నా యొక్క శాంతికి నేను చేసే పనితో సంబంధం లేదని తెలియాలి రూడిగా నేను యధావిధిగా బాగున్నాను నా యొక్క సహజ స్వభావమే ప్రశాంతత నా సహజ స్వభావమే శాంతి నా సహజ స్థితే ధ్యానము
(14:27) నేను చేసే పని నిష్కామ కర్మ అని తెలిసినప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి ఆల్రైట్ సో ఈ సూత్రం యొక్క సారాన్ని ఒక మాటలో చెప్పాలంటే చేయడం వల్ల శాంతి రాదని తెలుసుకో నువ్వు చేసే పనిని కాలానికి లింక్ చేసి అక్కడి నుంచి పరిగెత్తడం వల్ల నీకు శాంతి రాదని సో కాలాన్ని పరిగణలోకి తీసుకొని పని చేశవా నీలో ఒత్తిడి యొక్క ఆవిర్భావం జరిగి తీరుతది ఇందులో ఏ సందేహం లేదు.
(14:58) ఇది నన్ను నేను చూసుకునే చెప్తున్నాను నేను 2009 నుంచి కాలానుగుణంగా ఎప్పుడు పని చేయలేదు. చేస్తున్న పనికి కాలం పడుతుంది కానీ ఇంత కాలంలో పూర్తి చేయాలి అని ఎప్పుడు అనుకోను ఇప్పుడు నేను పుస్తకాన్ని రాస్తున్నాను కోర్ట్స్ ఆఫ్ మషిన్ నిన్న ఆ ఖలీల్ గిబ్రాన్ పుస్తకం చదివినప్పుడు ఇది కూడా తెలుగులో ట్రాన్స్‌లేట్ చేస్తే బాగుంటుంది అనిపించింది తప్పకుండా చేస్తాను కానీ ఎప్పుడో అయిపోతుందో తెలిీదు.
(15:19) అట్లా కాకుండా నేను ఒక ఆఫీస్ లో ఎంప్లాయి అనుకో నా బాస్ నాకు చెప్పాడు అనుకో నథింగ్ డూయింగ్ ఈ మంత్ ఎండింగ్ కల ఇది పూర్తి కావాలి నెక్స్ట్ మంత్ 15 కల అది పూర్తి కావాలి. మన పరువు ప్రతిష్ట ఎట్ స్టేక్ కన్ గయస్ లెట్స్ డ ఇట్ అని నీకు ఒక ఫేక్ ఇన్స్పిరేషన్ ఫేక్ మోటివేషన్ ఇస్తారు అలా నువ్వు చాలా కష్టపడి అన్నిటిని కోల్పోయి ఒత్తిడితో నువ్వు ఏదైనా పూర్తి చేసినప్పుడు నిన్ను అప్రిషియేట్ చేస్తారు ఆ అప్రిసియేషన్ కోసం నువ్వు ఇదంతా చేస్తావ్.
(15:47) సో శాంతి కోసం ఏమి చేయకు శాంతి నీ స్వభావం కాబట్టి శాంతితో అంతా చెయి నా ఆత్మకథలో ఒక మాట రాశను ఆనందం కోసం నేను ఏమి చేయడం లేదు. ఆనందం లోంచి చేస్తున్నాను ఆనందంలోనుంచి వస్తున్నాను ఆనందం నా సహజ స్వభావం ఏమి చేసినా చేయకపోయినా నేను బాగున్నాను చుట్టుపక్కల నేను సృష్టించుకున్న వస్తువులు లేకపోతే నేను కొన్న వస్తువులు లేకపోతే నా అనుకున్న వస్తువులు వీటి మీద నా యొక్క ప్రశాంతత ఆధారపడలేదు.
(16:12) అని తెలుసుకోవడం పరమజ్ఞానం ఆ తర్వాత అష్టవక్రుడు జనకుడితో చెప్తున్నాడు భవోయం భావనా మాత్రో నకించిత్పరమార్త నాస్త్వభావం స్వభావానాం భావా భావ విభావినం ఒకటే స్టేట్మెంట్ అష్టవకుడు చెప్తున్నాడుఈ ఈ భవసాగరం భావన మాత్రం ఆధ్యాత్మికతకు సంబంధించిన మనం పురాణాలు పుస్తకాలు చూస్తే ఈ భవసాగరాన్ని ఎట్లా దాటాలి భవసాగరం అంటే నేను భావనలతో సృష్టించుకున్న ఒక కల్పనా సాగరం నాది నీది అని ఎన్ని అనుకున్నావో అంత సాగరం బిల్డ్ అవుతది. మొదట చిన్న
(17:00) పిల్లవాడు నాది అని ఒక్క వస్తువును అనుకుంటాడు పిల్లకాలం మొదలైంది వాటర్ డ్రాప్ అట్లా నాది నాది నాది అనుకున్న వస్తువులను జమ చేసుకుంటూ పోతున్నాడు. ఆ తర్వాత నాది అనుకున్న వస్తువుకి ఏదన్నా డామేజ్ జరిగితే బాధపడుతున్నాడు. నాది అనే వస్తువుని ఎవరనా మెచ్చుకుంటే ప్రశంసిస్తే పొంగిపోతున్నాడు. నాది అనే వస్తువులు అందరికంటే ఎక్కువ ఉంటే ఒక రకమైన గర్వంతో విర్రవీగుతున్నాడు ఇదంతా మనిషి స్టోరీ కదా దాటు బయోగ్రఫీ ఆఫ్ హ్యూమన్ కైండ్ ఎందుకు ఇదంతా వై? స్వస్తావ ఒకడు చెప్తున్నాడు ఓ జనక ఈ భవసాగరం భావన మాత్రం ఇందులో పరమార్థం కించిత కూడా లేదు.
(17:41) ఆత్మ అభావం కాదు భావ భావం గల సమదర్శి స్వభావంలో అభావం అనేదే లేదు భావ భావం అంటే సదా సద్వివేకం సంసారం భావన మాత్రం అని గుర్తించు సో నీవు సంకల్పించుకొని సృష్టించుకున్న రకరకాల విషయాలకే సంసారం అని పేరు నీ చుట్టూ ఉన్నది సంసారం గాన కాదు నీవు క్రియేట్ చేసుకొని నావి అని అనుకున్నదే నీ సంసారం అని గుర్తుపెట్టుకో ఈ భ్రాంతిలో ఎప్పుడు పడకు సంసారం వేరు ప్రపంచం వేరు ప్రపంచం అంటే ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులంతా కలిపి ప్రపంచం
(18:25) ఆ ప్రపంచంలో ఏరుకొని నీ ఇంట్లో అట్టి పెట్టుకున్న మనుషులు నువ్వు ఏరుకొ తెచ్చుకున్న సిద్ధాంతాలు నువ్వు ఏరికోరి తెచ్చుకున్న కొన్ని వస్తువులు నీ సంసారం అయింది. తద్వారా నీ మనసు విక్షిప్తమైంది. నాది నీదిలో పడ్డది. ప్రశంస అభిశంసలో పడ్డది. సో నీవు సంకల్పం చేసినందుకు నీ ప్రపంచం సృష్టించబడ్డది. నీ ప్రపంచం అంటే నీ సంసారం ప్రపంచంలోంచి నువ్వు ఏరుకున్న వస్తువులు మనుషులు సిద్ధాంతాలే నీ యొక్క సంసారం అవన్నీ అవాస్తవాలు వాటికి నీ యొక్క ఆనందానికి నీ ప్రశాంతతకి నీ శాంతికి నీ సుఖానికి ఏం సంబంధం నీ నిద్రకి నీ ఆకలికి వాటితో ఏం సంబంధం
(19:14) మా ఊర్లో ఒకసారి ఇట్లా జరిగింది వాళ్ళ పెంచుకున్న బర్రె తప్పిపోయింది. దాంతో ఆవిడ ఏడుపు మొదలుపెట్టి రెండు మూడు రోజులు భోజనం మానేసి హాస్పిటల్ పాలయింది. నేను చూస్తున్నాను ఇదంతా నా బర్ర లేకపోతే నేను బతకలేను ఆశ్చర్యం ఏంటంటే ఆ బర్రె మూడు రోజుల తర్వాత దొరికింది అది తీసుకొచ్చినవాడు చెప్తున్నాడు ఎక్కడ పోయింది బర్రి ఏమనా తోలుకుపోయారా లేదండి జస్ట్ మందలో నుంచి పక్కకెళ్లి చాలా గడ్డి ఉన్న ఏరియాకి వెళ్లి అక్కడే పడుకొని హాయిగా అక్కడే గడ్డి తింటూ బ్రహ్మాండంగా బతికేస్తుంది అప్పుడు నాకు అనిపించింది ఓహో ఈమెకి బర్రెతో సంబంధం ఉంది కానీ బర్రెకి ఈమెతో
(19:58) సంబంధం లేదు. బర్రె వర్తమానంలో ఉంది తనకు కావలసింది గడ్డి మూలాన్ని పట్టుకుంది అంతే ఎవరు గడ్డి వేస్తారు అన్నది తనకు ఇంపార్టెంట్ కాదు కానీ ఈమెక అట్లా కాదు తనది అనుకున్న బర్రె వల్ల తను బాధకు లోనైంది తను ఏడ్చింది. సో నువ్వు ఏడ్చే ఏడుపుక అంతటికి కారణం నా అన్న భావన నాది అన్న భావన నేనే అన్న భావన ఈ మూడు దరిద్రాలు పోవాలి జీవితం నుంచి నా నాది నేనే దీని మీద ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం రాయొచ్చు నేను తర్వాత రాస్తాను కూడా తక్కువ కాంటెక్స్టే పేజీలు ఎక్కువ ఉండొచ్చు రాసేది కొంచెమే ఉండాలి నా నాది నేనే ఈ మూడు తీసేస్తే నీకు ఏ అస్తిత్వం
(20:39) లేదు నేనే అన్నది అహంకారం నికి సంబంధించింది. నా అన్నది నీకు వేరే వస్తువుకు మధ్య ఉన్న సంబంధాన్ని ఏర్పాటు చేసుకునే ప్రక్రియ నాది అన్నది నువ్వు సొంతం చేసుకున్నది. ఈ మూడు విషయాల్లోనే నువ్వు నిరంతరం కొట్టుమిట్టాడుతున్నావ్. నేనే అని చెప్తున్నావ్ కొన్నిసార్లు నాది అని చెప్తున్నావ్ కొన్నిసార్లు నా అంటున్నావ్ నా ఆలోచనలు నా ఐడియాస్ ఇంకా అది మేనిఫెస్ట్ కాలేదు.
(21:08) నాది అంటే సొంతం చేసుకున్నది. నేనే అంటే ఇవన్నీ సొంతం చేసుకోవడం వల్ల నాకువచ్చిన ప్రశంస నాకువచ్చిన గౌరవం నాకువచ్చిన అవార్డులు ఇవన్నీ కలిపి నా గురించి నాకు కలిగిన ఒక అబద్ధపు కల్పన భావన మాత్రం సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి నాది అనుకోగానే రాగం వచ్చింది ద్వేషం వచ్చింది బాధ వచ్చింది జలసీ వచ్చింది దుగ్ధ వచ్చింది కన్నీళ్లు వచ్చాయి.
(21:33) నిద్రలో నాది పడిపోయింది సుఖం ఉందా లేదా అందుకే రమణ తాత చాలాసార్లు చెప్పేవాడు నిద్ర యొక్క మూలంలో నీ యొక్క సహజ స్థితి ఉంది. ఆత్మజ్ఞానం యొక్క అంతశ్రోత నీకు నిద్రలో దొరుకుతుంది. సో సుఖము నీ స్వభావం హాయిగా ఉండటం నీ స్వభావం ప్రశాంతత నీ స్వభావం. సష్టవక్రుడి యొక్క ఈ సూత్రాన్ని అర్థం చేసుకుంటే దాని యొక్క అంత సూత్రం ఒకటి ఉంది ఏవేవి నీవు అనుకుంటున్నావో అవేవి నీవి కాదు ఏవేవి నీవి కాదు అనుకుంటున్నావో అదంతా నీది కొంచెం ఉల్టా పల్టా ఉంది అంటే నువ్వు చేసే
(22:18) భావన వల్ల నీకు బాధ ఏర్పడదు సరైన భావన చెయ్ ఆనందం నాది ప్రశాంతత నాది ప్రకృతి నాది ప్రకృతి కృతే నేను అని అనుకోవడం వల్ల అది ఎప్పటికీ నీ నుంచి దూరం కాని కారణంగా నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంటావు ఏదైతే క్షయం ఉందో వస్తువుకి ఏ మనుషులైతే నీతో ఎప్పటికీ ఉండరో అట్లాంటి వాళ్ళని నా అని ఎందుకు అనుకుంటున్నావ్ ఒక చిన్న కథ ఒక సముద్రపు ఆ ఇసుక తీరంలో ఒక ఇద్దరు పిల్లలు ఇసుక గూడు కట్టుకున్నారు.
(22:50) కట్టుకున్న తర్వాత ఆ దూరంగా వాళ్ళ పేరెంట్స్ ఏదో పిచ్చపట్టిగా మాట్లాడుకుంటున్నారు ఇద్దరు తల్లులు అంతలో ఇసుక గూడు కట్టుకున్న తర్వాత ఒక పిల్లవాడు పక్కవాడు ఇసుక గూడిని నుంచి కొంచెం ఇసుక లాక్కున్నాడు దాంతో ఆ పాపకు కోపం వచ్చి ఇద్దరు కిందపడి కొట్టుకుంటున్నారు ఇసక గుళ్ళు కూలిపోయాయి వాళ్ళ బట్టలు నాశనం అయిపోయాయి ఇది చూసిన తల్లులు ఇద్దరు పరిగెత్తుకొని వచ్చి ఒకటే మాట అన్నారు ఇది పనికి రాని ఇసుక దీని గురించి ఇంత కొట్టుకోవడం ఏమిటి అని చెప్తుండగా ఎవరో పరిగెత్తుకొని వచ్చి వీళ్ళద్దరికీ చెప్పారు మీ ఆయన వీళ్ళ ఆయన ఇంట్లో ఉన్న కొన్ని ఇటుకలు తీసి వాళ్ళ
(23:28) ఇంట్లో వేసుకుంటున్నాడు అనగానే వీళ్ళద్దరు జుట్టు పట్టుకొని కొట్టుకున్నారంట. అప్పుడు ఆ ఇద్దరు పిల్లలు అన్నారు ఆఫ్టర్ ఆల్ కొన్ని ఇటుకల కోసం కొట్టుకోవడం ఏమిటి? కథ అక్కడ ఎండ్ అయిపోయింది. సో నేను చాలాసార్లు మా ఇంట్లో చెప్తాను పెద్ద మనుషులు చిన్న మనుషులు లేరు అందరూ పిల్లలే కొందరు పెద్ద పిల్లలు కొందరు చిన్న పిల్లలు 70 ఏళ్ల వయసు చిన్న పిల్లలు 70 ఏళ్ల మనసు ఉన్న పెద్ద పిల్లలు అంటే ఇంకా మనసులో ఈ నాది అనే వెంపర్లాట ఉంది.
(23:56) సో అందుకే అష్టవక్కుడు చెప్తాడు భావ భావ విభావినాం భవోయం భావనా మాత్రో నా స్వభావం స్వభావానం నకించిత్ పరమార్థతః సో కాస్త వివేకం కావాలి వివేకం అంటే డిస్క్రిమినేట్ చేయగలిగే ఒక స్థితి అందుకే వివేకానందుడు అన్నారు ఏది మంచి ఏది చెడు ఏది మనది ఏది మనది కాదు ఏది నా స్వభావం ఏది నా స్వభావం కాదు దేన్ని నేను పట్టుకోవాలి దేన్ని నేను వదిలేయాలి అని స్పష్టంగా తెలిసి నవాడు మనం ఏదనా కూరగాయలు తరుగుతున్నప్పుడు వివేకంతోనే చేస్తాం దాని పొట్టంతా పడేస్తాం లోపట ఉందన్న మిగిలిన కాయతో వంట చేసుకుంది వివేకం కోతికి వివేకం ఉండదు చిన్న పిల్లలకి వివేకం ఉండదు.
(24:43) కెన్యాలో ఒక జాతి ఉండేదంట. వాళ్ళంతా ఆటవికులు ప్రపంచంలోకి రారు వాళ్ళు ప్రపంచంలో ఉన్న మనుషుల్ని కలవరు ఒకసారి ఒక సైంటిస్ట్ ఆ తెగను వెతుకులాడుకుంటూ పోయి ఆశ్చర్యపోయాడంట వాళ్ళు అక్కడంతా అరటిపండు విరివిగా పెరుగుతుంది అడవి అరటిపండు చెంగదలి ఆ అడవి అరటిపండు వాళ్ళు కొన్ని తరాల నుంచి అరటిపండు తొక్క తిని పండు పడేస్తూ వస్తున్నారు.
(25:17) అండ్ వాళ్ళు ఆరోగ్యపరంగా చాలా బాగున్నారు. ఈ సైంటిస్ట్ ఈ ట్రావెలర్ ఆశ్చర్యపోయాడు. అప్పుడు వాళ్ళకి చెప్పాడు అరటిపండు తినే విధానం అది గానే కాదు సో ఒక్క మనిషి అందరినీ ఇన్ఫ్లయెన్స్ చేశాడు. అప్పటినుంచి అందరూ అరటిపండు తినిలో బయట ఉంద తొక్క పడేస్తున్నారు. సో ఒక మనిషి ఎర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడు లేనిది తర్వాత తర్వాత మనిషికి కలిగేది వివేకమే.
(25:44) సో ప్రాపంచిక విషయాల్లో వివేకం అందరికి ఉంది ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి ఈ ఫ్రిడ్జ్ మంచిది కాదు ఈ ఫ్రిడ్జ్ మంచిది సినిమాకి వెళ్ళాలి దీని రేటింగ్ మంచిది దీని రేటింగ్ మంచిది కాదు బట్టలు కొనుక్కోవాలి ఆ కాటన్ అయితే బాగుంటుంది టెరీ కాటన్ బాగోద్దు పాలిస్టర్ బాగోద్దు వివేకం వల్ల ఇది సూపర్ఫిషియల్ విషయాల్లో అందరికీ వివేకం ఉంది కానీ ఆత్మ విషయంలో వివేకం కావాలి నీ ఆత్మ సంబంధ విషయాలు ఏమిటి నువ్వు సృష్టించుకున్న అబద్ధపు కల్పన భావన రహస్యాలు ఏమిటి అట్లాంటి వాటి వైపు ఒక్కసారి చూడు ఆ వివేకంతో ఒక్క అడుగు ముందుకేయ్ తద్వారా నీకు జీవితం యొక్క పరమార్థత అత్యంత సహజంగా
(26:22) అందుబా పాటులోకి వస్తుంది. నిజమైన విజ్ఞానం అది వివేకం నిజమైన విజ్ఞానం సో నిజమైన వివేకం ఉదయిస్తే నువ్వు వివేకానందుడే ఇక జీవితంలో నువ్వు బాధపడవు నిజమైన వివేకం వచ్చిందా నువ్వు నిరంతరం శాంతిని అనుభవించబోతున్నావు ఎందుకు ఏది నీదో ఏది నీది కాదో స్పష్టంగా తెలిసిపోయింది. స్పష్టంగా తెలిసిపోయింది ఎయిర్పోర్ట్ కి వెళ్ళారు అనుకోండి అక్కడ బ్యాగేజ్ క్లెయిమ్ అంటారు కొన్ని వందల బ్యాగులు వస్తుంటాయి పోతుంటాయి నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటావో తెలుసా ఎందుకు ఏది నీదో తెలుసు గనుక బ్యాగులు వెంట పడవు కానీ అక్కడ ఒక చిన్న బాబు ఉంటాడు మమ్మీ అది
(27:00) మనది మమ్మీ అది మనది అటు ఇటు పరిగెడతాడు నా కాదు నాన్న అది మనది కాదు లేదు ఎర్రగా ఉంది మమ్మీ మనదే సో ఎర్రగా ఉన్నవన్నీ మనవి కాదు నాన్న నీ వివేకం చెప్తుంది. అగో మమ్మీ సేమ్ మన సైజే ఉంది కాదు నాన్న అది మనది కాదు. ఫైనల్ గా చెప్పింది ఇగో దేని మీద అయితే ఈ రిబ్బన్ కట్టి ఉందో దేని మీదైతే ఈ పేరు రాసిఉందో అది మనది అర్థమైందా ఆ అర్థమైంది మమ్మీ ఒక గురువు చేసే పని అంతే ఏదేది నీది అనుకుంటావో అది నీది అనుకోకు నాయనా నేను మీకు అదే చెప్తున్నాను అన్ని నా చుట్టుపక్కల కూడా బోళన వస్తువులు ఉన్నాయి ఏవి నావి అనుకోవడంలే అవసరానికి ఉపయోగించుకుంటున్నాను ఒకవేళ అవి పోతే
(27:34) వెతుకులాడుతాలను అవి మరి ఎప్పటికి కనబడకపోతే ఇంకొకటి కొనుక్కుంటుంది లేకపోతే పేపర్ మీద రాసుకుంటాను లేదా ఇదే రికార్డ్ చేయాలి మా అమ్మ మొబైల్ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. ఏముంది అందులో పని చేయడం ముఖ్యం కర్త లేకుండా పని చేయడం ముఖ్యం. సో ఈ రెండు సూత్రాల సారాన్ని మీ హృదయంలో దింపుకోండి. నిన్ను బాధిస్తున్నది వస్తువు కాదు నిన్ను బాధిస్తున్నది మనిషి కాదు సిద్ధాంతం కాదు వాటిని నా అనుకోవడమే నీ బాధ కారణం అని గుర్తిస్తున్నావా లేదా సో ఈ అకారణంగా సజీవంగా ఉన్న ప్రకృతిలో నువ్వు భాగం అనుకో ఏ బాధ లేదు.
(28:12) ఏది నీది కాని చోట నువ్వు ఎంత బాగున్నావో అందుకే అడవికి వెళ్తాం మనం ఏదనా బంధువుల ఇంటికి వెళ్తాం ఎంత హాయిగా ఉంటావో ఎందుకంటే అక్కడ ఏది ఉన్నా లేకపోయినా పగిలిపోయినా గీతలు పడ్డా నీ మనసుకి ఏ ప్రాబ్లం రాదు క్లేషం అంటుకోదు. అందుకని అష్టావకుడు చెప్పే విషయాలని కాస్త విని బాగుంది బాలేదు అని చెప్పకండి ఎంక్వైరీ ఇంటు యువర్ ఓన్ లైఫ్ ఒకరోజు అన్నిటిని ఉపయోగించుకో ఏది నాది అనుకోకుండా అందరితో ఉండు ఎవరు నావాళ్ళు అని అనుకోకుండా అందరినీ తా సమానంగా చూసుకో మనం ఊరికే భాషాపరంగా చెప్తాం నా చెయ్యి అని చెప్పక్కర్లేదు చేయి అంతే ఇక్కడ చేయే
(28:58) నీవు నా చెయ్యి భాష నా ముక్కు భాష ముక్కే నేను అది నాలో భాగము గనుక సో సమస్తాన్ని నీలో భాగం చేసుకో ఎప్పుడైనా ఒక కోజ జుట్టు రాలిపోతది ఏ బాధపడకు దాని స్వభావం అది పోయేది పోతుంది. సో ఈరోజు సూత్రాల్లో ఈ రెండు సూత్రాల్లో ఉన్న రెండు మూడు ముఖ్యమైన పాటలు చెప్తాను. ఆ తర్వాత వీళ్ళు వీలైతే వీటిని రాసి పెట్టుకోండి.
(29:25) మీ హృదయంలో అట్లా పెట్టుకోండి కానీ మళ్ళీ దాన్ని ఒక మూడు నమ్మకంగా సూత్రంగా లేకపోతే ఎవడో చెప్ప అట్లా దాన్ని విచారణ చేయండి. కర్తా భావన వల్ల కర్తవ్యం వస్తుంది. నువ్వు చేసే కర్తవ్యము దాని వల్ల నువ్వు సాధించే వాటి వల్ల నీ కర్త భావన స్ట్రాంగ్ అవుతుంది. అది నిన్ను బాధిస్తుంది కర్తను వదిలేయ అని చెప్తున్నాడు అష్టవక్కుడు అష్టావక్రుని సారమంతా రెండే వాక్యాలు అన్నింటికీ సాక్షిగా ఉండు కర్త భావన లేకుండా ఉండు బాత్ ఖతం ఇంతకుమించి ఏమీ లేదు సమస్త ఆధ్యాత్మిక గ్రంథాల సారం ఇంతే బుద్ధుడు చెప్పిన వేవేల మాటలు విన్నా అక్కడికే రావాలి. రకరకాల ఉపనిషత్తులు శంకర
(30:05) భగవత్పాదుల వారు వ్యాఖ్య చేసిన 12 గొప్ప ఉపనిషత్తులు బృహదారణ్యక నుంచి మాండ్యుక వరకు దాని మీద వ్యాఖ్య చేసి దాన్ని చదివి అర్థం చేసుకొని ఒకవేళ నువ్వు అనుభవిస్తే చివరికి ఇదే మిగులుతుంది అన్నిటిని సాక్షిగా చూస్తున్నావ్ ఏది నాది కాదు అనుకుంటున్నావ్ చేస్తున్న పని కర్త లేకుండా చేస్తున్నావ్ సమస్తంలో భాగం అనుకుంటున్నావ్ బాధకతం వేదాలు చదివినా ఇంతే గురువు దగ్గర కాళ్ళు పట్టుకొని అక్కడే ఉండి గురువును చూస్తూ చివరిగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇంతే అది ఈ క్షణమే అర్థం చేసు చేసుకోవయి తద్వారా ఎవ్వడి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు.
(30:37) విముక్తి నీ స్వభావం అయినప్పుడు గురువు దగ్గర ఎట్లా పడి ఉంటావు మూర్ఖత్వం కాదు విముక్తి నీ స్వభావం అయినప్పుడు ఒక పుస్తక పుస్తకాన్ని ఒక అట్ట పుస్తకాన్ని దానికి అంత అధిక దాని సారాన్ని గ్రహించు పుస్తకాన్ని పక్కన పెట్టు పుస్తకంలో ఉన్నది నీ జీవితం యొక్క జీవన విధానం కావాలి పుస్తకాన్ని వెండిపెట్టుకొని తినడం ఏమిటి నాన్సెన్స్ సో చేస్తే శాంతి వస్తుంది అనుకోకు చేస్తే సుఖం వస్తుంది అనుకోకు సుఖంగా ఉన్నావు కాబట్టి చేస్తున్నావ్ అని తెలుసుకో ఇంకా అత్యంత ముఖ్యమైన విషయం కాలం అనే విషయాన్ని అర్థం చేసుకో కాలాన్ని విస్మరించి నువ్వు పని చేస్తే
(31:15) ధ్యానం కర్త శూన్యత ఎక్కడెక్కడ కాలాన్ని విస్మరించేస్తున్నావ్ కర్త లేడు గమనించండి. ఎక్కడెక్కడ కాలానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఆ తక్కువ కాలంలో పూర్తి చేయాలని నువ్వు ప్రయత్నం చేస్తావు అది పని గాని ఏదైనా సరే అక్కడ నీకు బాధ ఉందని గుర్తిస్తున్నావా లేదా ఆ తర్వాత ఎన్ని విషయాలని నాది అనుకుంటున్నావు అన్నిసార్లు బాధపడతావని గుర్తిస్తున్నావా లేదా సో అన్నిటిని ఉపయోగించుకో నా నేను నాది ఇవన్నీ అబద్ధపు కల్పనలు కేవలం ఈ ప్రపంచం వల్ల నీలో కలిగిన భావనలు అందర అట్లా ఉండటం వల్ల
(32:00) నీకు అట్లా అనిపించిందని గుర్తుపెట్టుకో ఇప్పుడు నువ్వు పారిస్ వెళ్తావ అనుకో ఎప్పుడన్నా 1920 1930 వీడియో ఆఫ్ పారిస్ అని కొట్టండి అందరూ ఒకలా కనిపిస్తారు క్యాప్స్ పెట్టుకొని ఉంటారు. 1960 వీడియో అని కొట్టు ఇంకొకలా ఉంటారు. సో ప్రపంచం ఎలా ఉంటే ఆ ప్రపంచంలో నువ్వు ఒక భాగం కాబట్టి అట్లా ఉంటావు అంతే ప్రకృతిలో నువ్వు వచ్చావను కొన్ని నీకు ఎట్లా హాయిగా ఉంటే అట్లా ఉంటావ్ అందుకే స్వామీజీలు లేకపోతే గురువులు వీళ్ళు ఏ దేశం పోయినా వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు.
(32:25) వాళ్ళు ప్రపంచం కోసం మారలే వాళ్ళు చెప్పింది ఏమిటి నీకు అట్లా ఉంటే హాయిగా ఉంది నాకు ఇట్లా ఉంటే హాయిగా ఉంది. దేశకాల మానవ పరిస్థితుల నుంచి వాళ్ళ మనసు బయట పడ్డది. సో విషయం జటిలంగా ఏమీ లేదు మనమే జటిలం చేసుకుంటున్నాం వి ఆర్ మేకింగ్ ఎవ్రీథింగ్ కాంప్లికేటెడ్ డోంట్ కాంప్లికేట్ యువర్ లైఫ్ విత్ రాంగ్ అండర్స్టాండింగ్ అబద్ధపు కల్పనలు అబద్ధపు భావనలు వద్దు ఏది వదిలేయకు మనసులో నుంచి తీసేయ్ చివరిగా ఒక మాట నాది అనుకోగానే రాగం ద్వేషం బాధ జెలసి ఇవన్నీ వచ్చేస్తాయి అని గుర్తిస్తున్నావా లేదా అదన్న డిక్లేర్ చెయ్ ఎక్కడెక్కడ నాది అన్న భావన లేదో
(33:07) అక్కడ రాగము లేదు ద్వేషము లేదు బాధ లేదు జుగుప్స లేదు దుగ్ధ లేదు పోలిక లేదు అభిప్రాయం లేదు ఏమీ లేదు అబ్సల్యూట్లీ నథింగ్ సో ఆత్మజ్ఞానం అంటే ఏది నీది కాదుఅని తెలుసుకోవడం ఏవి నీవో అవి గుర్తించడం ప్రశాంతత నీవు నీది కాదు నీవు ఆనందమే నీవు ధ్యానమే నీవు కృష్ణమూర్తి చెప్తాడు కదా మెడిటేషన్ ఇస్ మెడిటేటర్ ధ్యానమే ధ్యాని బాబు అర్థం అర్థం చేసుకో దీనికి 24 గంటల సమయం చాలు.
(33:38) అంతకంటే ఎక్కువ అవసరమే లేదు. నెమ్మదిగా 24 గంటలు కాకపోతే 24 రోజులు తీసుకో లేద 24 నెలలు తీసుకో కొంచెం ఫరక్ న పడతాను నా దగ్గరికి ఎవరు వచ్చినా చెప్తాను డోంట్ ఫోర్స్ మైండ్ చూస్తూ ఉండు నిన్న ఒక అమ్మ వచ్చింది ఆమెతో చెప్పాను ఇప్పటి వరకు ఉన్న సమస్యలు వదిలేయ్ ఇక మీదట కొత్త అవగాహనతో జన్మని నేను చెప్పాను అనుకోకుండా ఒక బిడ్డకు జన్మని ఇచ్చావు అనుకొని ఓ కొత్త అవగాహనకు జన్మనియరాదు ఈ ఇస్తా అని చెప్పే పో టైం పట్టంది రెండేళ్ళు పట్టది కానీ ఆ తర్వాత నీకు 20 ఏళ్ళ జీవితం ఉంది ఎవ్రీథింగ్ బి ఆల్రైట్ ఇక్కడి నుంచి మీ ఓపిక కింద నేను శిరస్సు
(34:15) వంచి నమస్కారం చేస్తున్నా ఉన్న చోటే హాయిగా ఉండండి ఉన్నది చాలా బాగుంది ప్రయత్నం చేయొద్దు అనట్లేదు మంచిగా ప్రయత్నం చేద్దాం మనందరం ఎక్సలెన్స్ కోసం ట్రై చేద్దాం ఒక్కటే దాని రిజల్ట్ ఏదైనా నవ్వుకోవడం మర్చిపోవద్దు ప్రిసరస్
No comments:
Post a Comment