*ఏదిపుణ్యం*
ఒక వీధి లో ప్రతి ఇంటా బిక్షగాడు బిక్షాటన చేస్తూ వస్తున్నాడు.
వీధిలో ఆడుకుంటున్న పిల్లాడిని తన తల్లి పిలిచి పిల్లాడి చేతిలో బియ్యం ఇచ్చి ఆ బిక్షగాడికి వేయమంది.
బిక్షగాడు పక్క ఇంటికి వెళ్లి అడిగాడు
ఆ స్త్రి కూడా తన పిల్లాడిని పిలిచి పిల్లాడి చేతిలో బియ్యం ఇచ్చి ఆ బిక్షగాడికి వేయమంది
కొన్ని రోజులకు ఇద్దరు స్త్రీలు మరణించారు.
మొదటి స్త్రి స్వర్గానికి
రెండవ స్త్రి నరకానికి వెళ్లింది.
రెండవ స్త్రి తను చేసిందేగా నేను చేసాను మరి నేనెందుకు ఇక్కడకు అని అడిగింది.
ఇద్దరు ఒక్కటే చేశారు కాని మీ ఆలోచనా తీరు వేరు.
మొదటి స్త్రి తన కొడుకు చేతుల మీదుగా ఇచ్చి పుణ్యం అంతా తన కొడుక్కి రావాలి అనుకుంది.
కాని నువ్వు
నీ చేతులతో ఇస్తే ఎక్కువ పడుతుంది అది చిన్న పిల్లాడి చేతిలో అయితే తక్కువ పడుతుంది అని అనుకుని ఇచ్చావు.
అక్కడ ఆ తేడానే ఇక్కడ ఈ తేడా.
దేవుడి దగ్గర లెక్కలు కరెక్ట్ గా ఉంటుంది.
ఎవరికి ఎప్పుడు ఏమివ్వాలో ఆయనకు బాగా తెలుసు కాకపోతే కాస్త ఓపికగా ఉందాం .
తప్పు చేసినవాడు శిక్ష అనుభవించకుండా తప్పించుకోలేడు.
🙏శివాయ గురువే నమః 🙏.
No comments:
Post a Comment