Friday, April 17, 2026

 *సైలెంట్ గా చంపేస్తారు* .. *జాగ్రత్త !*
*ముందుగా హెచ్చరిక !* *(నేటి ఆధ్యాత్మిక కుటుంబ స్పెషల్ ఫీచర్)*
*ఈ పోస్ట్ చివరి దాకా చదివితే...*  *మీలో భయం ,* *దానితో బాటే ...* "*ఏమి చెయ్యాలి? .. ఎలా బతకాలి ?" అనే నిస్సహాయత ఏర్పడే ప్రమాదముంది* .
 "   అంతా బాగుంది ... అనుకొని బతకడంలో మజా ఉంటుంది . 

వినదగు ఎవ్వరు చెప్పిన , విన్నంతనే వేగపడక ... క్రిటికల్ థింకింగ్ వాడేవారికి .. 
ఇదిగో భయపెట్టే నిజాలు ...

"రోగాల బారిన యూత్ ..ఆరోగ్యంగా ఉంది 25% మంది మాత్రమే . మిగతా  వారు రోగాల పుట్టలు  ..   ఇరవై ఏళ్లకే అమ్మాయిల్లో ఆరోగ్య సమస్యలు .. రక్త హీనత,  డి విటమిన్ లోపం .. బి 12  విటమిన్ లోపం , కాన్సర్ ప్రమాదం " .... ఇదీ ఒక స్టార్ ఆసుపత్రి నిర్వహించిన హెల్త్ సర్వే సారాంశం ....  నిన్న అన్ని పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది .

ఇందులో లేనిది...  నేను  ఒక పాయింట్ ఆడ్  చేస్తాను .. సమాజం లో మెంటల్ డిజార్డర్ కేసులు కూడా విపరీతంగా పెరిగి పోతున్నాయి . మెడికల్ రికార్డ్స్ ... అన్ని సార్లు నిజాలను చెప్పలేవు . కారణం మెంటల్ డిజార్డర్ ఉన్న  వారు దాన్ని గుర్తించి...  చికిత్సకు పోరు . కుటుంబ సభ్యులు / స్నేహితులు చెబితే వారి పై కస్సు మంటారు .

షుగర్ .. బిపి,  డి విటమిన్ లోపం , బి 12 లోపం , రక్త హీనత , మెంటల్ డిజార్డర్ , ఊబ ఖాయం  ఫాటీ లివర్  .. రోగాల లిస్ట్  కొండవీటి చేంతాడంత . 
మరి కారణం ?
సింగల్ కారణం కాదు .. అనేక కారణాలున్నాయి . 
ఈ పోస్ట్ లో ఇప్పటిదాకా పెద్దగా ... ఎవరూ  గుర్తించని...  మాట్లాడని ఒక ముఖ్యమయిన కారణం గురించి చెబుతాను ....
 ఓపిగ్గా చదవండి .

మీరు తరచూ హోటల్ కు వెళ్లి ఫుడ్ తింటున్నారా ? 
తరచూ ఫుడ్ డెలివరీ అప్ ద్వారా ఫుడ్ తెప్పించుకొంటున్నారా ? తరచూ పార్టీ లకు వెళుతున్నారా ?
 రెడీ మేడ్ ఫుడ్ పాకెట్స్ తెచ్చి వండుకొంటున్నారా ? 
అయితే మీ బాడీ ఇప్పటికే బోరింగ్ కు వచ్చి ఉండే  అవకాశం ఎక్కువ .
కారణం సైలెంట్ కిల్లర్ .. మాల్టో డిస్ట్రీన్ ..
 పలక డానికి కూడా కష్టంగా ఉండే  ఈ పదాన్ని నూటికి 99 మంది వినివుండరు . 
ముప్పై ఏళ్ళు లోపు వారిని ఇది చంపేస్తోంది . 
ఆ మాటకొస్తే అందరినీ .. కానీ ముప్పై ఏళ్ళు లోపు వారిని ఎక్కువ .. కారణం .... వారి కడుపులోకి ఇది లెక్కకు మిక్కుటంగా వెళుతోంది .

టొమాటోతోనే,  మేక కాళ్ళతోనో  ఇంట్లో సూపు చెయ్యండి . 
నీళ్లుగా వస్తుంది . 
అదే హోటల్ లో?
 .. నా సామీ రంగా చిక్కగా .. యమ్మీ గా . 
సూప్ కు ఆ చిక్కదనం ఎలా వచ్చింది ?
 "ఏముంది ..    దానికి కార్న్ స్టార్చ్ కలుపుతారు .. ఓహో.. ఈ మాత్రం మాకు తెలియదా ? "అనుకొంటున్నారా ?
నిజమే .. కార్న్ స్టార్చ్ కలుపుతారు . 
అది బాడ్.
 అంతకన్నా ఎన్నో రెట్లు  బాడ్ .. మాల్టో డిస్ట్రిన్ .. 

ఇంట్లో వండితే వంట .. బయట నుంచి తెప్పిస్తే పెంట ..
మాల్టోడిస్ట్రిన్ నుంచి  తప్పించుకోలేరు ..
మీరు ఎంత హెల్త్ కాన్షియస్ అయినా...   జాగ్రత్తగా ఫుడ్ ఆర్డర్ చేసినా తప్పించుకోలేరు ..
1. రెండు నిముషాల ఇన్స్టంట్  నూడుల్స్ 2. సూప్  పాకెట్స్ . 3. చిప్స్ , 4. ఎనర్జీ డ్రింక్స్ , గ్లూకాన్ - డి 5. ఇన్స్టంట్ కాఫీ / టీ;  కోల్డ్ కాఫీ / టీ . 6. చంటి పిల్లల ఫుడ్ . 7. హార్లిక్స్ బోర్నవిటా . 7. రెడీ టు  ఈట్ కర్రీస్ ఉప్మా,  పోహా . 8. షుగర్ ఫ్రీ స్వీట్స్ 9. ఐస్ క్రీం , ఫ్లేవర్డ్ మిల్క్ 10 ఎనర్జీ డ్రింక్స్ ఓఆరఎస్ డ్రింక్స్ 11 స్వీట్స్ , చాకోలెట్స్,  ఐస్ క్రీమ్స్ ..12. చికెన్ మంచూరియన్ గ్రేవీ 

ఒక్క మాటలో చెప్పాలి అంటే బయట దొరికే .. ప్యాకెట్లలో దొరికే ... ప్రతి ఆహారం లో ఇది ఉంది .

తెల్లన్నం .. అంటే సింపుల్ కార్బ్స్ . 
అది మంచిది కాదు . 
మైదా విషం . 
మాల్టోడిస్ట్రిన్ కాలకూట విషం .
దీన్ని గురించే ఈ పోస్ట్ . 

ఏమి చేస్తుంది ?
1. దీని గ్లైసెమిక్  ఇండెక్స్ -  110 . 
క్షణాల్లో బ్లడ్ షుగర్ లెవెల్ అమాంతం పెరిగేలా చేస్తుంది . దీని వల్ల  ఇన్సులిన్ సేన్సిటివిటి దెబ్బతింటుంది .  ఆరోగ్యంగా ఉండేవారిని కూడా డయాబెటిస్ లోకి నెట్టేస్తుంది . 
2. గట్  ఆరోగ్యాన్ని  నాశనం చేస్తుంది .  ఉదరంలోని   మంచి బాక్టీరియా ను చంపేస్తుంది . చెడు  బాక్టీరియా ను పెంచి పోషిస్తుంది . గట్  హెల్త్ దెబ్బ తినడం వల్ల .. D  విటమిన్ ,   బి 12 విటమిన్     లోపాలకు  దారి తీస్తుంది . ఈ రెండు విటమిన్ లోపాలుంటే ఇరవై కి పైగా ఆరోగ్య  సమస్యలు . 10 రోజులకు ఒక సారి డయాగ్నస్టిక్ సెంటర్ కు   ఆసుపత్రికి వెళుతూ వారికి   ఎటిఎం  గా మారి  బతుకును నరకం చేసుకోవడమే . . 

3. గట్  హెల్త్ దెబ్బ     తింటే .. మెంటల్ ఎక్కుతుంది . 
ఇదేంటి మోకాటికి బోడిగుండుకు లింక్ అనుకుంటున్నారా ? జనాల్లో వ్యాకులత , మానసిక కుంగుబాటు , చిరాకు,  అసహనం మెంటల్ డిజార్డర్స్ బాగా పెరిగి పోవడానికి ... గట్  హెల్త్ దెబ్బ తినడం .. ఒక ప్రధాన కారణం . వివరాలు కావాలని మీరు అడిగితే ఈ టాపిక్ పైనే ఒక పోస్ట్ పెడతాను .
చేతిలో సెల్ ఫోన్ .. ప్లేట్ లో మాల్టోడిస్ట్రిన్ ఫుడ్ . 
హత్యలు ఆత్మ హత్యలు లెక్కకు మిక్కుటంగా జరుగుతున్నాయి అంటే  జరగవా ? 

4. ఊబ కాయం .. మాల్టోడిస్ట్రిన్  ఎంప్టీ కాలరీలు .. పోషక విలువలు సున్నా . గ్రాముకు 4 కిలోకాలరీల శక్తి ఇస్తుంది .
5.  దీనితో ఒంట్లో కొవ్వు . వొళ్ళంతా జివ్వు .. అదే ఇన్ఫలమేషన్ .. బ్రెయిన్ కూడా ఇన్ఫల్మెట్ అయ్యే ప్రమాదం .

6. విసెరల్ ఫాట్ పెరగడం అంటే..  కీళ్లు .. రక్త నాళాలు , కిడ్నీ,  కాలేయం , మోకాళ్ళు .  సర్వం ... సమస్తం డామేజ్

 7.  మాల్టోడిస్ట్రిన్ అనే కాలకూట విషం వల్ల...  తినాలన్న యావ పెరిగిపోతుంది . అతిగా తినడం .. ఫుడ్ అడిక్షన్ . రోజంతా ఏదో తింటూ తాము చస్తూ ఫార్మసురుల్ని బతికిస్తారు ఇలాంటి వారు .
8.  టాయిలెట్ లో ముక్కాలా ముక్కాలా పాట !    బోవెల్ కండీషన్ చెడిపోతుంది .

1. ఇంతటి విషాన్ని ఎందుకు కలుపుతారు ? 
2. ప్రభుత్వాలు ప్రపంచ అనారోగ్య సంస్థలు ఎలా అనుమతిస్తున్నాయి ?  
3. ఎవరూ   దీన్ని గురించి మాట్లాడారెందుకు ? 
  4. దీన్ని దేని నుంచి తయారు చేస్తారు ?
 5. ఐస్ క్రీం మొదలు చివరాఖరికి ప్రోటీన్ పౌడర్,   హార్లిక్స్,  పసిపిల్ల ఆహారం లో కూడా ఎందుకు కలుపుతారు ? ... 
ఇవే కదా మీ ప్రశ్నలు ?
అవే  నా ప్రశ్నలు కూడా . 
ఆలోచించండి . 
తెలుసుకొనే ప్రయత్నం చేయండి . 
లేదా నన్ను అడగండి ..
 ఇంకా పోస్ట్ లు పెడతాను .
 అన్నీ ఒకే పోస్ట్ అయితే లెంగ్త్ ఎక్కువ అవుతుంది . 

అశ్వథామ  హతః కుంజరః     టైపులో ప్రపంచ అనారోగ్య  సంస్థ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ జనాల్ని ఎలా మోసం చేస్తున్నాయో ఆలోచించండి 
" తక్కువ మొత్తం లో తింటే పెద్దగా ఏమీ కాదు" అని ప్రపంచ అనారోగ్య సంస్థ సన్నాయి నొక్కులు .. 
పొద్దునుంచి  రాత్రి దాక .. బొక్కే ప్రతి ఫుడ్ లో అదే.
అదే మూల సమస్య .  
" ఇంత మొత్తం లో తినమని మేము చెప్పామా ? తింటే తప్పు మీదే కదా ? అయినా లేబిల్ పైన ప్రింట్ చేసి వుంటారు కదా . చూసుకోవాలి కదా?"  అని ఆన్సర్ కమింగ్ ..
 ఓన్లీ ఇఫ్ యూ అస్కింగ్ .
 బట్ ది కొచ్చిన్ ఈజ్ హూ అస్కింగ్ .
 అల్  బిజీ ... తినింగ్...   తినింగ్ ..
నో శోచింగ్ .. నో థింకింగ్ .
 నాలాంటోడు అస్కింగ్ అయితే..   తిట్టింగ్ . 

మీ ఇంట్లో బర్త్ డే పార్టీ .. పెళ్లి .. లేదా ఇంకో ఫంక్షన్ . గతంలో అయితే ఇంట్లోనే వంట చేసేవారు . వంటవారిని నియమించుకొనేవారు . వంటలో ఏమి వాడే  వారు .?
సహజం గా దొరికేవి .. 
మరి ఇప్పుడో?
 .. కేటరింగ్ వారికి ఇచ్చేస్తారు .
ముందుగా వెల్కమ్ డ్రింక్ . అటు పై స్నాక్స్ .. సూప్ .. 
మాల్టోడిస్ట్రిన్ .. ఆర్టిఫీషియల్ స్వీట్నర్ .. కృతిమ రంగులు .. రసాయన రుచులు .. 

 ఇంట్లో వండుకోండి . 
ఎప్పుడో నెలకో మూడు నెలలకో బయట ఫుడ్ .. జస్ట్ టేస్ట్ కోసం ఓకే . 

అన్నింటికీ మించి పిల్లలకు .. అమ్మాయిలయినా అబ్బాయిలయినా వంట నేర్పండి 
. ఆఫీస్ కాంటీన్ లో ఫుడ్ ఫ్రీ గా  పెట్టినా    తినొద్దు . 
తరచూ టూర్స్ లో ఉంటూ  హోటల్ ఫుడ్ తినేవారు .. పరమ జాగ్రత్త . సైలెంట్ గా చంపేస్తారు .          

No comments:

Post a Comment