ఆత్మీయబంధుమిత్రులకు బుధవారపు శుభోదయ శుభాకాంక్షలు
విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్పా స్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ...
*ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్నా ఆత్మీయులకు శుభాకాంక్షలు*
💐💐🥭🥭
🍇🍇🍫🍫
🍁 *ప్రతీదీ నాకు ఆదర్శమే*🍁
👉ఎప్పుడూ విడిపోయిన వాటిని కలపడానికి తాపత్రయ పడే *🥢సూది* నాకు ఆదర్శం...
తన మూలంగా లోకం ఆగిపోకూడదని రోజంతా వెలుగునిచ్చే *🌞సూర్యుడు* నాకు ఆదర్శం...
తను కరిగిపోయినా పక్కవాల్లకు వెలుగునివ్వాలనుకునే
🕯️ *కొవ్వొత్తి* నాకు ఆదర్శం...
పడకొట్టినవాడిపైన
పగపట్టకుండా,
దారం దారం పోగేసుకుని మరో గూడు కట్టుకునే *సాలేపురుగు*🕸
నాకు ఆదర్శం...
తీరాన్ని సంద్రంగా మార్చాలని అనుక్షణం ప్రయత్నించే *అలలు*🌊 నాకు ఆదర్శం...
దూరం ఎంతైనా క్రమం తప్పకుండా నడిచే
*🐜చీమలు* నాకు ఆదర్శం...
మొలకెత్తడం కోసం
భూమిని సైతం చీల్చుకుని వచ్చే🌱 *మొక్క* నాకు ఆదర్శం...
ఎదురుగా ఏ అడ్డంకులున్నా లక్షం వైపే దూసుకెల్లే
🏹 *"బాణం* నాకు ఆదర్శం...
ఒక సారి అన్నం పెడితే చాలు ,
జన్మంతా విశ్వాసంతో ఉండే 🐕 *కుక్క* నాకు ఆదర్శం...
జీవించేది కొంతకాలమే
అయినా అనుక్షణం
ఆనందంగా ఉండే
🦋 *సీతాకోకచిలుక*
నాకు ఆదర్శం...
తానెంత చిన్నదైనా ,
తన వంతు భూదాహాన్ని తీర్చే *💧చినుకు* నాకు ఆదర్శం...
చుట్టూ చీకటే ఉన్నా,
వెన్నెలను పంచే *🌛చందమామ* నాకు ఆదర్శం...
అసాద్యమని తెలిసినా
ఆకాశాన్ని అందుకోవాలని ప్రయత్నించే *గాలిపటం* నాకు ఆదర్శం...
ప్రత్యర్థి పెద్దదైనా సరే,
ప్రయత్నించి కాసేపైనా సూర్యున్ని కప్పి ఉంచే *మేఘం* నాకు ఆదర్శం...
తానున్న పరిసరాల చుట్టూ పరిమలాలు నింపే *🌹పువ్వు* నాకు ఆదర్శం...
వేడినంతా తానే తీసుకుని, మనకు మాత్రం చల్లని నీడనిచ్చే *🌴చెట్టు*
నాకు ఆదర్శం...
ప్రతిదానిలోనూ మంచిని మాత్రమే గ్రహించాలని చెప్తూ పాలనీటి మిశ్రమమంలో పాలని మాత్రమే తాగే *హంస🦢* నాకు ఆదర్శం...👍
🙏🙏🕉️🕉️🙏🙏
No comments:
Post a Comment