Friday, April 17, 2026

కోపం వచ్చినప్పుడు మీ Brain ఆగిపోతుంది 😳 | నిజం తెలుసా? Anger Management || Practical solutions

కోపం వచ్చినప్పుడు మీ Brain ఆగిపోతుంది 😳 | నిజం తెలుసా? Anger Management || Practical solutions

Author Name:Psychologyintelugu

Youtube Channel Url:https://www.youtube.com/@Psychologyintelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=reZfZdIA07s



Transcript:
(00:00) మీకు ఒక షాకింగ్ నిజం చెప్తా మీరు ఒక 10 నిమిషాలు కోపంగా ఉన్నా మీ శరీరం నాలుగు నుంచి ఐదు గంటలు సఫర్ అవుతూనే ఉంటుంది. అంటే మీరు కోపం తగ్గిపోయింది అని అనుకుంటున్న మీ శరీరానికి ఇంకా హాని జరుగుతూనే ఉంది. ఒక క్వశ్చన్ మీరు మీ కంట్రోల్ లో ఉన్నారా? లేకపోతే మీరు మీ కోపం కంట్రోల్ లో ఉన్నారా? అసలు నిజం ఏంటి అని అంటే మీ కోపం మీ కంట్రోల్ లో లేదు.
(00:28) అందుకే మీరు కోపంగా ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడతారో మీరు ఎలా బిహేవ్ చేస్తారో మీకు అసలు అర్థం కాదు తర్వాత కోపం తగ్గాక అరే నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు నేను అలా బిహేవ్ చేసి ఉండాల్సింది కాదు అని మీకు మీరే ఫీల్ అవుతారు బాధపడతారు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది బంధాలు దెబ్బతింటాయి మీకు బాధే మిగులుతుంది.
(00:52) అసలు కోపం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మనము కోపంలో ఉన్నప్పుడు ఎందుకు ఆచి తూచి మాట్లాడలేము అనింటే దీని వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది అది ఏంటి అంటే మన మెథడులో ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అని ఒక భాగం ఉంటుంది. దీని పని ఏంటి అంటే ఆలోచించడం నిర్ణయాలు తీసుకోవడం మిమ్మల్ని మీ కంట్రోల్ లో ఉంచడం ఈ మూడు దాని పని ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ పని కానీ ఎప్పుడైతే మనం కోపంగా ఉంటామో అప్పుడు ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అనేది పని చేయదు కొంచెం స్లో అవుతుంది పని చేయడం దానివల్ల మీరు కోపంగా ఉన్నప్పుడు ఆలోచించి ఆచి తూచి మాట్లాడలేరు కరెక్ట్ నిర్ణయాలు తీసుకోలేరు మీరు మీ కంట్రోల్ లో ఉండలేరు అందుకే
(01:34) కొంతమందికి కోపం వచ్చినప్పుడు ఊగిపోతూ ఉంటారు కోపంతో ఎందుకంటే ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ పనిచేయకపోవడం వల్లనే అందుకే అంటారు కోపంలో నిర్ణయాలు తీసుకోవద్దు అని కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది అన్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కోపం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనింటే మీ శరీరంలో కార్టిజాల్ అడ్రనలిన్ అనే రెండు హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మీ మెదడులో మీ మెదడులో రిలీజ్ అయి మీ రక్తం ద్వారా మీ బాడీ మొత్తం మీ శరీరం మొత్తం అవి సర్క్యులేట్ అవుతాయి అది సర్క్యులేట్ అయి మీ బాడీలో అంటే అంటే ఒక్క చిన్న విషయం ఏంటి అనింటే ఇది రిలీజ్ అవుతుంది మీ
(02:10) బాడీలో అంటే ఒక చిన్న పాటి విషం మీ బాడీలో రిలీజ్ అవుతున్నట్టే అన్నది గుర్తించండి. కోపం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనింటే మన హార్ట్ బీట్ అనేది పెరుగుతుంది అంటే గుండె వేగం పెరుగుతుంది అండ్ ప్రెషర్ పెరుగుతుంది బీపి కూడా పెరుగుతుంది బ్లడ్ ప్రెషర్ మీ గుండెకి బ్లడ్ అనేది చాలా వేగంగా వెళ్తుంది హార్ట్ బీటింగ్ పెరిగి బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల దానివల్ల మీ గుండె పొరలు అంటే హార్ట్ వాల్స్ అనేవి దెబ్బ తింటాయి.
(02:38) ఇది దెబ్బ తినడము అంటే ప్రతిసారి ఎక్కువగా జరగదు కొంచెం కొంచెం జరుగుతుంది కొంచెం కొంచెం జరిగి ఎక్కువగా కోపం పడే వాళ్ళకి హార్ట్ డిసీసెస్ అనేవి రావడం అనేది చాలా కామన్ అంటే ఇదిఒక ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే మీరు ఒక వస్తువుని ఒక చిన్నపాటి సుట్టితో మీరు కొడుతూ ఉన్నారు అనుకోండి మీరు రోజు కొంచెం కొంచెం కొట్టిన ఏదో ఒక రోజు మీరు కొట్టే చిన్న దెబ్బ వల్ల కూడా ఆ వస్తువుకి నష్టం జరుగుతుంది కదా అదేవిధంగా మీరు కోప్పడిన ప్రతి ప్రతిసారి మీ గుండె మీద ఒక చిన్నపాటి సుత్తితో హామర్ తో మీరు ఒక దెబ్బ వేస్తున్నట్టే చిన్నగానైనా సరే అది మీకు తర్వాత ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది.
(03:14) ఇది గుండె మీద జరిగే ఎఫెక్ట్ చాలా మందికి ఫేస్ లో కూడా కనిపిస్తుందన్నమాట ఎక్కువగా కోప్పడే వాళ్ళకి అది ఏంటి అంటే మొహంలో కూడా మార్పులు జరుగుతాయి అదేంటి అంటే ఫేస్ డల్ అవ్వడం ఇంకా ముడతలు రావడం వ్రింకిల్స్ అంటాం అవి వచ్చి తొందరగా ముసలి వాళ్ళలాగా కనిపించడం అనేది జరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరం ఎందుకు అనింటే ఈ మార్పులు మీ గుండె మీద అయ్యే మార్పులు లేకపోతే మీ మొహంలో కనిపించే మార్పులు మీకు కోపం పడగానే వెంటనే మీకు చూపించదు ఇది చాలా రోజుల తర్వాత అనేది జరుగుతుంది అప్పుడు మీరు ఏమనుకుంటారు నాకు ఏజ్ పెరుగుతుందని ఇట్లా అవుతుంది అని అనేసి మీకు మీరు ఏదో
(03:54) రీసన్స్ చెప్పుకుంటారు కానీ ఇది కోపం వల్ల జరుగుతుంది అని గుర్తించరు అది ఇంకా చాలా ఎక్కువ ప్రమాదకరం అన్నమాట ఇంకొకటి ఏమవుతుంది అని అనేసి అంటే మీరు కోపంగా ఉన్నప్పుడు మీ శ్వాస అనేది మారుతుంది. మీ బ్రెయిన్ ఏమవుతుంది మీరు కోపంగా ఉన్నప్పుడు ఒక అలర్ట్ ఇస్తుంది. ఆ ఇదేదో డేంజర్ లాగా ఉంది నువ్వు అలర్ట్ గా ఉండు అని మీ బ్రెయిన్ ఒక సిగ్నల్ ఇస్తుంది అన్నమాట.
(04:20) దానివల్ల మీ శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి. మీరు ఎప్పుడైతే ప్రమాదంలో ఉన్నప్పుడు మీ శరీరంలో జరిగే మార్పులు మీరు కోపంగా ఉన్నప్పుడు మీ శరీరంలో జరిగే మార్పులు రెండూ సేమ్. ఏమవుతుంది అనింటే మీ శ్వాస అనేది మారుతుంది. మీరు నార్మల్ గా శ్వాస తీసుకోవడం ఎట్లా అయితే ఉంటుందో మీరు కోపంగా ఉన్నప్పుడు కొద్దిసేపు స్లోగా శ్వాస తీసుకుంటారు కొద్దిసేపు వేగంగా శ్వాస అనేది తీసుకుంటారు.
(04:45) ఎందుకు ఇట్లా అవుతుంది అనింటే మీ శ్వాస ద్వారా మీ శరీరం మీ మెదడుకి చెప్తుంది ఇంకా అలర్ట్ గా ఉండు నువ్వు ఇప్పుడే కామ్ డౌన్ అవ్వకు అని దానివల్ల కూడా మీరు తొందరగా కామ్ డౌన్ అవ్వకుండా ఈ అడ్రనలిన్ ఈ కార్టిజోల్ హార్మోన్స్ ఒక ఐదారు గంటలు మీ శరీరం మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి అంటే మీరు ఒక మూడు నిమిషాలు కోపానికి వచ్చినా దాని ప్రభావం అనేది ఐదారు గంటల వరకు మీ శరీరం మీద ఉంటుంది అంటే మీరు ఎంత ప్రమాదం అనేది అర్థం చేసుకో కోడి మీరు ఊకే తరచుగా కోపంకి రావడం వల్ల ఏమవుతుంది అనింటే మీకు గాఢ నిద్ర అనేది పట్టదు అంటే డీప్ స్లీప్ డీప్ స్లీప్ అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్
(05:25) ఎందుకు అంటే మనం చాలా గాఢంగా నిద్రపోయినప్పుడు మన శరీరంలో చాలా వ్యాధులు నయం అవుతాయి దానంతట అవే మనం కోలుకుంటాం వ్యాధుల నుంచి దీన్ని రికవరింగ్ అంటారు సెల్ఫ్ హీలింగ్ అంటారు ఇదనేది నిద్రలో చాలా మంచిగా జరుగుతుంది. కానీ మీరు డీప్ స్లీపింగ్ రాకపోవడం వల్ల ఈ కోపం వల్ల మీకు మీ శరీరం అనేది దానంతటా అది నయం కాక మీ ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి కూడా చాలా తగ్గుతుంది ఊరికే తరుచుగా కోపానికి రావడం వల్ల ఒక్క ముక్కలో చెప్పాలి అంటే మీరు బయట వరకు కోపం చూపించాలి అని అనుకుంటారు కానీ నిజానికి మీ శరీరానికి మీరే శిక్ష వేసుకుంటున్నారు అన్నది గుర్తించాలి
(06:08) ఇప్పుడు కోపాన్ని ఎలా నియంత్రించు కోవాలి అన్నది అర్థం చేసుకుందాం కోపాన్ని కంట్రోల్ చేయడము అంటే కోపాన్ని పూర్తిగా అనిచివేయడం సప్రెస్ చేయడం కాదు కోపాన్ని అర్థం చేసుకోవడం ఫస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే ట్రిగ్గర్ ని గుర్తించడం అంటే కొందరికి ఒక కామన్ పాటర్న్ ఉంటుంది కోపం రావడానికి కామన్ గా కొన్ని రీసన్స్ ఉంటాయి కొన్ని కారణాలు కొందరి కొందరికి ఆకలిగా ఉన్నప్పుడు కోపం వస్తుంది కొందరి కొందరికి అలసిపోయినప్పుడు బాగా అలసిపోయినప్పుడు కోపం వస్తుంది కొందరు కొందరికి ఒక పర్టికులర్ వ్యక్తితో మాట్లాడినప్పుడు కోపం వస్తుంది ఫస్ట్ ఫస్ట్ మీకు ఎందుకు ఒక
(06:42) రోజులో ఎందుకు మీకు కోపం వచ్చింది అంటే ఫస్ట్ మీది మీరు ఆలోచించుకోండి గుర్తించండి ఒకరోజు మీరు రోజు నిద్రపోయే కన్నా ముందు కూర్చొని ఒక పేపర్ మీద రాసుకోండి ఈరోజు నాకు ఎందుకు కోపం వచ్చింది అని ఫస్ట్ గుర్తించడం అన్నది చాలా ఇంపార్టెంట్ స్టెప్ గుర్తించిన తర్వాత మీకు ఎప్పుడైతే కోపం వస్తుందో అప్పుడు మీరు మాక్సిమం వీలైనంతగా మాట్లాడకుండా ఉండడానికి ట్రై చేయండి ఎందుకు అంటే నేను ఇంతకుముందు చెప్పిన కదా మీరు కోపంగా ఉన్నప్పుడు ఇప్పుడు మీకు ఆలోచించే శక్తి అనేది పూర్తిగా మందగిస్తుంది.
(07:14) అట్లాంటి మూమెంట్ లో మీరు ఏమి ఆలోచించకుండా మాట్లాడి తర్వాత నేను ఎందుకు అట్లా మాట్లాడాను అని బాధపడే కన్నా మీరు వీలైనంతగా నాకు ఇప్పుడు కోపం వస్తుంది నేను ఇప్పుడు మాట్లాడొద్దు అని మీకు మీరు చెప్పుకోండి దీనివల్ల ఏమవుతుంది అట్లీస్ట్ మీకు పెద్దగా నష్టం జరగకుండా ఉంటుంది అయినా కానీ మీకు కోపం కంట్రోల్ అవ్వట్లేదు కంపల్సరీ మీరు మాట్లాడాలి అని అనుకున్నప్పుడు తక్కువలో తక్కువ ఒక 30 సెకండ్స్ అన్నా మాట్లాడకుండా ఉండడానికి ట్రై చేయండి దీనివల్ల మీరు వెంటనే స్పందించడం వల్ల వచ్చే నష్టం కన్నా ఒక 30 సెకండ్లు ఆగి మీరు మాట్లాడితే ఆ మూమెంట్ లో కొంచెం మీ మెదడుకి టైం దొరుకుతుంది
(07:50) కొంచెం మంచి మాటలు వస్తాయి దాని వల్ల కొంచెం నష్టం అనేది తక్కువగా జరుగుతుంది. ఇది ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ మూడో స్టెప్ ఏంటి అని అనేసి అంటే మీ బ్రీతింగ్ ని కంట్రోల్ చేయడం నేను ఇంతకుముందు చెప్పిన కదా మీకు కోపం వచ్చినప్పుడు మీ బాడీలో మార్పులు వస్తాయి మీ శ్వాస అనేది వేగంగా అవ్వడం స్లోగా అవ్వడం అవుతుంది దానివల్ల మీ బ్రెయిన్ కి నువ్వు కామ్ డౌన్ అవ్వకు ఇప్పుడే ఇంకా అలర్ట్ గా ఉండు అన్న సిగ్నల్ మీ బాడీ పంపిస్తూ ఉంటుంది మీ శ్వాస ద్వారా సో ఇట్లాంటి సిచువేషన్ లో మీరు ఏం చేయాలి అంటే మీకు కోపం వచ్చింది అయిపోయింది మీరు ఇప్పుడు ఓకే నాకు కోపం తగ్గిపోయింది అని
(08:24) అనుకున్నప్పుడు ఒక 10 మినిట్స్ కోపం అయిపోయిన తర్వాత మీరు వెళ్లి పక్కన కూర్చొని డీప్ బ్రీతింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి అంటేఫోర్ సెకండ్స్ శ్వాస లోపలికి తీసుకొని ఒకఫోర్ సెకండ్స్ మీ శ్వాస లోపలనే హోల్డ్ చేసి మెల్లిగా ఆరు సెకండ్ల పాటు మెల్లిగా మీ శ్వాసని బయటకి వదలండి ఇది ఒక 10 సార్లు రిపీట్ చేయండి దీనివల్ల ఏమవుతుంది అనింటే మీ శ్వాస పాటర్న్ అనేది నార్మల్ అవుతుంది అంటే మీరు నార్మల్ టైం లో ఎట్లైతే శ్వాస తీసుకొని వదులుతూ ఉంటారో అట్లా తొందరగా జరుగుతుంది అట్లా జరగడం వల్ల మీ శ్వాస అనేది కంట్రోల్ లో ఉండడం వల్ల మీ బ్రెయిన్ కి మళ్ళీ ఒక సిగ్నల్
(08:59) వెళ్తుంది ఇప్పుడేం ప్రమాదం లేదు నువ్వు నార్మల్ గా ఉండొచ్చు నువ్వు అలర్ట్లో ఉండాల్సిన అవసరం లేదు అని దానివల్ల కార్టిజోల్ అడ్రలన్ హార్మోన్స్ ఉత్పత్తి అనేది తగ్గుతుంది. ఇది చాలా ఎఫెక్టివ్ అండ్ మీరు కోప్పడిన ప్రతిసారి మీరు కూల్ డౌన్ అయ్యారు మీ కోపం తగ్గిపోయింది అని అనుకున్న ప్రతిసారి ఇది మీరు చేయండి. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది.
(09:19) ఇంకొక రీజన్ ఏంటి కోపం రావడానికి అనింటే ఊహాగానం ఇమాజినేషన్ చాలాసార్లు ఎవరో ఎప్పుడో అన్న మాటల్ని మళ్ళీ మనం ఊహించుకోవడం వల్ల లేకపోతే అసలు అతను అననే లేదు ఫ్యూచర్ లో ఇట్లా అంటే నేను ఇట్లా ఆన్సర్ చేయాలి అతనికి అని మనది మనమే ఏదో ఒక పని చేసుకుంటూ ఆలోచిస్తూ కోపం తెచ్చుకుంటూ ఉంటాం అంటే మనకు తెలవకుండానే మనకు కోపం వస్తూ ఉంటుంది లోపల మన బ్రీతింగ్ మారిపోతూ ఉంటుంది.
(09:45) ఆ మనది మనమే ఎక్కువగా అట్లా మనం అవర్స్ అవర్స్ గడిపేసిన వాళ్ళు కూడా ఉంటారు ఇట్లా ఆలోచించుకుంటూ ఇది చాలా ప్రమాదకరం ఇది ఫస్ట్ మీరు కోపం వస్తుంది అనంగానే గుర్తించి దాన్ని ఆపేయండి అండ్ చాలాసార్లు అది నిజం కూడా కాకపోవచ్చు కొన్ని కొన్నిసార్లు అతను నన్ను కావాలనే గుర్తించట్లేదు అతను నన్ను కావాలని కించపరిచి మాట్లాడాడు అని అనుకుంటారు. కొన్ని కొన్ని సార్లు అది రియాలిటీ కాకపోవచ్చు అతను ఏదో స్ట్రెస్ లో ఉండొచ్చు కొన్ని కొన్ని సార్లు అతను నన్ను పట్టించుకోలేదు అని అనుకుంటాడు కానీ అతనికి ఏదో వేరే వర్క్ ఉండొచ్చు ఇది కూడా నిజమై ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మీరు రియాలిటీని యక్సెప్ట్
(10:17) చేయండి మీరు సెకండ్ ఎక్స్ప్లనేషన్ ఇవ్వండి ఓకే అతను బిజీగా ఉన్నాడేమో ఓకే అతనుఏదో స్ట్రెస్ లో ఉన్నాడేమో అతని ప్రాబ్లమ్స్ అతనికి ఉంటాయిలే అని అనుకోవడం వల్ల మీకు చాలా మట్టుకి మీ బ్రెయిన్ కి ఒక ఎమోషనల్ యాక్టివిటీ అనేది తగ్గుతుంది దీనివల్ల అంటే భావోద్వేగాలు అనేవి తగ్గిస్తుంది మీ బ్రెయిన్ కి ఇంకొకటి ఏంటి అంటే మీరు కోపంగా ఉన్నప్పుడు ఇప్పుడు నాకు కోపం వస్తుంది అని గుర్తించండి మీరు గుర్తించారు అనిఅంటే మీ బ్రెయిన్ కొంచెం రిలాక్స్ అవుతుంది ఓకే వీడికి అర్థం అవుతుంది కోపం వస్తుంది అని అనేది మీ బ్రెయిన్ యక్టివిటీ అనేది కొంచెం
(10:47) తగ్గిస్తుంది మీ బ్రెయిన్ సో మీకు కోపం వస్తున్నప్పుడు ఇప్పుడు నేను నాకు కోపం వస్తుంది నేను కొంచెం కంట్రోల్ లో ఉండాలి నేను కొంచెం నా మాట మీద దాని మీద నేను కంట్రోల్ పెట్టుకోవాలి నేను దీని నుంచి తొందరగా బయట పడాలి ఎందుకంటే దాని వల్ల నాకే నష్టం అని మీరు గుర్తించండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి కోపం రావడం అనేది సహజం అందరికీ వస్తుంది కోపం కానీ మీరు మీ కోపం కంట్రోల్ లో వెళ్ళకండి మీ కోపాన్ని నియంత్రించుకోవడానికి మీకు కోపం వస్తుంది అని అనంగానే ఐదు నిమిషాలు వేగంగా నడవడం లేదంటే మీకు వచ్చే ఆలోచనలన్నీ ఒక పేపర్ మీద రాయడం తర్వాత మీరు డీప్ బ్రీతింగ్
(11:20) ప్రాక్టీసు చేయడం సైలెంట్ గా ఉండడం ఇట్లా చేయండి ఎందుకంటే కోపం వల్ల మీరు వేరే వాళ్ళకి కలిగించే నష్టం కన్నా మీ శరీరానికి మీరే ఎక్కువగా నష్టం కలిగిస్తున్నారు అందుకనే మీరు శాంతంగా ఉండడం ప్రాక్టీస్ చేశారు అని అనుకోండి నేను చెప్పిన ప్రాక్టికల్ సొల్యూషన్స్ అప్లై చేసి దానివల్ల కొద్ది రోజులకి మీ శరీరం దానికి అలవాటు చేసుకుంటుంది ఓకే కోపం ఎక్కువగా పడొద్దు అన్నది అలవాటు చేసుకొని మీకు ఎక్కువగా నష్టం కాకుండా మిమ్మల్ని మీ కాపాడుతుంది.
(11:50) మీకు ఈ ఇన్ఫర్మేషన్ గనుక వర్తీ అనిపిస్తే నేను చేసే రీసెర్చ్ నాకు చేయడానికి చాలా ఎఫర్ట్స్ అనేవి కావాలి నా నుంచి సో మీకుఈ ఇన్ఫర్మేషన్ గనుక వర్తీ అనిపిస్తే ఒక లైక్ చేయండి హై పాయింట్స్ ఇవ్వండి సో దట్ వేరే వాళ్ళకి ఇది రీచ్ అవుతుంది. అండ్ ఇప్పుడు గనుక మీరు ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారు వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారు అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని మీ ఆలోచనలు ఏంటి మీరు ఇంకా ఏం ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు లేకపోతే మీకు ఇంకా ఏ టాపిక్ మీద వీడియో కావాలి అన్నది డెఫినెట్ గా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి

No comments:

Post a Comment