Saturday, April 18, 2026

కలియుగం - సాధన #kaliyug #sadhana #chagantipravachanalu #chaganti #chagantikoteswararao

కలియుగం - సాధన #kaliyug #sadhana #chagantipravachanalu #chaganti #chagantikoteswararao

Author Name:Anantha Bhakti Sanatana

Youtube Channel Url:https://www.youtube.com/@AnanthaBhaktiSanatana

Youtube Video URL:https://www.youtube.com/watch?v=7rRH7Y_j5ig



Transcript:
(00:00) శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయిత్ సర్వవిఘ్నోపశాంతైత్ గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమోవై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః పూజంతం రామరామి మతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం
(00:45) వాగర్ధావిసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదపితరవందే పార్వతీ పరమేశ్వరౌ సూక్తిం సమగ్రయతున స్వజమీవ లక్ష్మీహి శ్రీరంగరాజ మహిషీ మధురై కటాక్షైహి వైద్యవర్ణ గుణగుంభన గౌరవైర్యాం ఖండూల కర్ణకుహరాహ కవయోధయంతి హైమోర్ధ్వ పుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధరం బహుళ దీర్ఘ కృపా కటాక్షం శ్రీ వేంకటేశ ముఖమాత్మని సన్నిధత్తాం విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి కామా మాక్షి పట్మలాక్షి కలిత
(01:31) విపంచి విభాసి వైరించి మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఆపదాం మపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమాంహం హరిహి ఓం పరమేశ్వర స్వరూపమైన సర్వది నమస్కారం కలిబాధ మాంప తిరుమల కలియుగ వైకుంఠమనగా గైసేసిన మీ సలలిత కరుణా హృదయము కలలోనను మరువరాదు కంజదళాక్షా అని కేవలం కలియుగంలో
(02:20) మనుష్యులు అనేకమైనటువంటి పాపకర్మలు చేసి లెక్కలేనన్ని ఆపదలు ఎదుర్కోవలసిన అగత్యం ఏర్పడుతుందని తాను వైకుంఠమును విడిచిపెట్టి సప్తగిరుల మీదకు వచ్చి వెంకటాచల పర్వతం మీద ఆనందనిలయ విమానంలో తాను విరాజమానుడై పిలిచినంత మాత్రం చేత పలికి ఉద్ధరించేటటువంటి ఆ భగవంతుని యొక్క కరుణా హృదయాన్ని మనం ఎన్నటికీ మరువకూడదు అని ఆయనకి ప్రస్తుతి చేస్తూ కలిబాధ మాన్పడం కోసం ప్రధానంగా మనుష్యులు ఆశ్రయించవలసినటువంటి రూపాలలో ఒకటి చిండీ స్వరూపం కలవు చిండి అని చిండి పరదేవత అంటే చిడి కోపనే ఇతి చండిహి అని చండి హోమం చేస్తున్నారు అంటారు
(03:10) శారదా నవరాత్రులు వస్తున్న ఈ చండీ హోమానికి విశేషమైనటువంటి ప్రాధాన్యత దుర్గా సప్తశతి మంత్రాలతో అనుసంధానం చేస్తారు. అందులో ఆ చండీపర దేవత కోపంగా ఉంటుంది అని కోపంగా ఉంటుంది అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దేని మీద కోపం ఎందుకు కోపం కోపం అనేటటువంటిది ప్రబల శత్రువు అని కోపం ఉండకూడదని సామాన్యమైనటువంటి మనుష్య కోటికే ప్రబోధం చేస్తున్నటువంటి ఋషులు ఉండగా అమ్మవారికే కోపం ఉంటే ఇంక దానికన్నా గ్రహణీయమైన విషయం లోకంలో ఉంటుందా మరి అమ్మవారి వారికి కోపం ఎందుకు అంటే ఆవిడ కోపం మన మీద కాదు ఆవిడ కోపం ధర్మం మీద కాదు ఆవిడ కోపం దేని మీద అంటే
(04:00) అధర్మం మీద ఎక్కడ అధర్మం ఉన్నదో అరే ఇది నాశన హేతువ అని ఎందుకు తెలుసుకోడు తక్షణం ఫలితాన్ని ఇచ్చినట్లు కనపడుతుంది కానీ దీర్ఘకాలమునందు చాలా ప్రమాదకారి ఆ విషయాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు అందుకే శంకర భగవత్పాదులు సౌందర్య లహరి చేస్తూ ఒక మాట అంటారు భృవ భుగ్నికించిత్ భువన భయభంగవ్యసనిని అంటారు అమ్మవారు యదార్థానికి ఇలా కూర్చోవాలి కానీ ఆవిడ ఇలా కనుబొమ్మలు కొద్దిగా ముడేస్తుందిట బాగా ముడేసి తీవ్రంగా కళ్ళు విప్పింది అనుకోండి ఎవరు దగ్గరికి వెళ్లరుగా భయం కానీ ప్రసన్నంగా చూస్తూ ఉంటుంది కానీ కనుబొమ్మలు ఇలా కొద్దిగా ముడేస్తుంది కనుబొమ్మలు
(04:45) ఎప్పుడైనా ముడిపడితే దాని ఉద్దేశం విషయం ఏమిటి అంటే ఏదో ఆలోచనా ముద్ర దేని గురించో ఆలోచిస్తున్నారు అని ఆవిడకి ఏముంది ఆలోచించడానికి ఆవిడకి ఏం లేదు ఆవిడ ఎప్పుడూ నిరంతరం ఆనంద స్వరూపిని అటువంటి తల్లి దేని గురించి ఆలోచిస్తుంది అంటే శంకరాచార్యుల వారు అన్నారు అరే ఈ మనుష్యులకు నేను బుద్ధి ఇచ్చాను కదా బుద్ధి ఇచ్చినప్పుడు వీళ్ళకి ఏదైనా ఇబ్బంది ఏర్పడితే నా వంక తిరిగి అమ్మ అని పిలిస్తే పలకడానికి సిద్ధంగా ఉన్నాను కదా ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు నా వైపు తిరగరు నా వైపుకి తిరగకుండా అమ్మ అని పిలవకుండా అధర్మం ఏదో అప్పటికప్పటికి కాస్త మంచి
(05:27) ప్రయోజనం ఇచ్చినట్లు కనపడుతుంది కదా అని దాన్ని ఎందుకు పట్టుకుంటూ ఉంటారు అని ధృవవు భుక్కించి భువన భయభంగభవ్యసనిని నీకు అధర్మం పట్ల అనురక్తి కలుగుతుంటే నా వైపుకి తిరిగి అమ్మా అను నీకు ధర్మం మీద అనురక్తినే కల్పిస్తానుగా నేను కాపాడతానుగా నేను రక్షిస్తానుగా నన్ను ఎందుకు పిలవవు నేను ఉండగా పిలవకపోతే నువ్వు రక్షించకూడదా అంటే మరి మనుష్య ప్రాణికి బుద్ధిని ఇచ్చిందిగా అమ్మవారు బుద్ధిని ఇచ్చినప్పుడు అమ్మ అని కనీసం పిలవాలిగా అలా ఎందుకు పిలవరు వీళ్ళు అని కొద్దిగా కనుబొమమలు ఉడివేస్తుందిట అందుకని చండీపరదేవతని ఆరాధన చేస్తే అమ్మవారికి నమస్కారం చేస్తే
(06:12) దానివల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే మనలో కలిగేటటువంటి అధార్మికమైనటువంటి ఆలోచనలు పోయేటట్టు చేస్తుంది. ధార్మికమైనటువంటి ఆలోచన కలిగేటట్టు చేస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి అమ్మవారి చేతిలో ప్రధానమైన ఆయుధాలు ఏముంటాయి అంటే ఐదు పుష్ప బాణాలు ఉంటాయి చెరుకువిల్లు ఉంటుంది పాశ్యం ఉంటుంది ఒక చేతిలో అంకుశం ఉంటుంది నాలుగు చేతులలో నాలుగు పట్టుకుంటుంది.
(06:42) పక్కనే ఉన్నటువంటి కాంచీపురంలో ఉన్నటువంటి కామాక్షి పరదేవత కూడా ఈ ఆయుధాలే పట్టుకుంటుంది అందుకే కణత్ కాంచీదామా కరికల కరికలన కుంభస్తననత పరిక్షీణ మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపిదధానాకరతలైహి పురస్తారస్తాంనః పురమదితురహో పురుషికా అంటారు శంకరులు ఎందుకు ఆయుధాలు పట్టుకోవడం అంటే చెరుకు మీరు ఎటు నుంచి కొరకండి తీయగా ఉంటుంది.
(07:16) అటు కొరకండి ఇటు కొరకండి మధ్యలో కొరకండి తీయగానే ఉంటుంది. కోరికలన్నీ కూడా నా వైపు నుంచి వచ్చిన కోరికలు నాకు తీయగా ఉంటాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి అసలు కోరికెలు లేకుండా ఉండు ఒక రూపాయి సంపాదించద్దు అని అసలు ఏ శాస్త్రం చెప్పదు అలా అనుకుంటే చాలా పొరపాటు అది ఒక్క సన్యాసాశ్రమానికి చెల్లుతుందేమో కానీ ప్రత్యేకించి గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఏ కోరిక లేకుండా ఎలా బ్రతుకుతాడు నేనే ఉన్నాను ఇంత ఉపన్యాసం చెప్పాను కాసేపు ఆగి ఇంకొక రెండు గంటలు పోతే ఆకలేస్తుంది పలహారం పెట్టమని నా భార్య నడగకుండా ఉండగలనా సంతానాన్ని పొందకుండా ఉండగలనా నా భార్యా
(08:01) బిడ్డల యోగక్షేమం చూడకుండా ఉండగలనా వాళ్ళకి కావలసినవి సమకూర్చకుండా ఉండగలనా కోరిక లేకుండా ఎలా బ్రతుకుతాడు మనిషి కానీ ఇక్కడే చిన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి కోరిక పుట్టడం ఎప్పుడూ తప్పు కాదు కోరిక తీర్చుకోవడం ఎప్పుడూ తప్పు కాదు అసలు శాస్త్రం దాన్ని తిరస్కరించలేదు మీరు బాగా పట్టుకో లసినటువంటి విషయం ఎందుచేత అంటే అలా కానీ అంటే అంతకన్నా పైశాచికత్వం ఇంకొకటి లేదు ఈశ్వరుడు నిజంగా ఆ మాట అన్నాడు అనుకోండి ఆయన కన్నా వికృతమైన మనస్తత్వం ఉన్నవాడు ఇంకొకడు లేడు ఎందుచేత బ్రహ్మాండంలో ఇన్ని సుఖస్థానములు పెట్టాడా ఇక్కడ జ్ఞానేంద్రియాలు పెట్టాడా
(08:47) నువ్వు ఏ సుఖం అనుభవించద్దు ఏ కోరిక నీకు ఉండకూడదు అంటే ఎలా చెల్లుతుంది ఆయన కోరికలు ఉండకూడదు అని అనలేదు ఆయన అన్నది ఏమిటంటే కోర్కెలు ధర్మబద్ధమై ఉండేటట్టు చూసుకోమన్నాడు. మీకు చమత్కారం ఎక్కడ ఉంటుంది అంటే నేను ఒక తాడు తీసుకొచ్చి ఇలా తిప్పాను అనుకోండి ఏం చేసినట్టు కట్టేసాను అదే తాడు తీసుకొచ్చి ఇలా తిప్పాను అనుకోండి ఇప్పేసినట్టు ధార్మికమైన కోరిక బంధించదు విడుదలకి కారణం అవుతుంది అదే మోక్షానికి కారణం అవుతుంది అందుకని ఆశ్రమ వ్యవస్థ అన్నది రావడానికి కారణం అది బ్రహ్మచర్య ఉంటుంది బ్రహ్మచర్యశ్రమంలో ఒక్క గురువుగారి దగ్గర కూర్చోవడమే
(09:31) గురువుగారి దగ్గర కూర్చోవడం గురువుగారి దగ్గర పాఠం వినడం గురువుగారి దగ్గర జ్ఞానం నేర్చుకోవడం నేర్చుకుని మనం ఆ నేర్చుకున్నటువంటి విజ్ఞానాన్ని జీవితాంతం ఉపయోగించుకొని అభ్యున్నతిలోకి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాడు బ్రహ్మచర్యము అనేటటువంటి ఆశ్రమంలో జీవితాంతం ఉండిపోవడం కుదురుతుందా ఉండదు మీరు బాగా పట్టుకోవాలి ఋషులు అసలు ఏది అవసరమో దాన్ని విడిచిపెట్టి నువ్వు బతుకు ఎదురీదు ఏం చేస్తావో మాకు అనవసరం అలా ఉంటే తరిస్తావు అని చెప్పరు వాళ్ళు ఏం చెప్పారంటే ఒక వయసు వచ్చిన తర్వాత మనసు కామమును పొందుతుంది.
(10:14) ఇప్పుడు ఆ కామాన్ని నువ్వు తీర్చుకోవద్దు అని బలవంతంగా తొక్కి పెట్టారు అనుకోండి అది కాలు కింద పాము ఎలా ఉంటుందో అటువంటిది రామాయణంలో ఆ రావణాసురుడు 10 తలకాయలు తెగిపోయి యుద్ధభూమిలో పడిపోతాడు మండోదరిని తీసుకొస్తారు అందరూ అనుకుంటారు ఆవిడ ఇప్పుడు రాముణని నింద చేస్తుంది అనుకుంటారు. ఆవిడ అంటుంది రావణాసురుడి దగ్గరికి వచ్చి ఓరి దుర్మార్గుడా నువ్వు రాముడి చేతిలో చచ్చిపోలేదు నీ ఇంద్రియముల చేతిలో నువ్వు చచ్చిపోయావు తపస్సు అన్న పేరుతో ఇంద్రియాలని కొన్నాళ్ళు తొక్కిపెట్టావు ఆ ఇంద్రియాలని తొక్కిపెట్టడం ఎవరికీ సాధ్యం కాదు ఓ త్రాచుపాము ఇలా వచ్చేసింది అనుకోండి నేను
(10:58) కంగారుపడిపోయి లేచాను నా కాలు పావు పడగ మీద పడింది పావు పడగ నా కాలు కింద ఉంది అది ఇప్పుడు నన్నేం కరవదు అలా అలా అలా లా తోక తిప్పుతోంది. పాము పడగ నా కాలు కింద ఉంది అది నన్ను కరవలేదుఅని చెప్పి నేను ధైర్యంగా పాముని కాలు కింద పెట్టుకొని నించోగలనా నేను కాలు ఎప్పుడు తీద్దాం అని చూస్తాను అది నన్ను ఎప్పుడు కరుద్దాం అని చూస్తుంది.
(11:22) నేను కాలు తీయడం ఏమిటది పారిపోవడం కన్నా నన్ను కరవడానికి ప్రయత్నిస్తుంది. ఇంద్రియములను బలవంతంగా నొక్కి పెడితే కాట్లు వేసేస్తాయి. దేవీ భాగవతంలో వ్యాసుడు శుఖ బ్రహ్మతో మాట్లాడుతూ ఈ మాట చెప్తాడు ఇంద్రియాని బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థననీకశః ఇంద్రియములంత బలవత్తరమైనటువంటివి లోకంలో ఇంకా ఏవి ఉండవు అందుకే భాగవతంలో ప్రహ్లాదుడు హిరణ్యకశపుడితో మాట్లాడుతూ అంటాడు లోకములన్నియున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ విలువనేరవు నిన్ను నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రువుల ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున
(12:09) చూడుము దానవేశ్వర అంటాడు ఇంద్రియాల్ని అరిషడ్ వర్గాల్ని గెలవగలిగితే సమస్తాన్ని గెలిచినట్టే అంత తేలిక కాదు ఇంద్రియాలని గెలవడం అందుకే ఋషులు ఏం చేశరంటే ఒక వయసు వచ్చిన తర్వాత మనసులో పుటమరించినటువంటి కామాన్ని ధర్మంతో ముడి వేసేసారు ధర్మబద్ధమైన కామము విడుదల కి కారణం అది బంధించదు ఇప్పుడు ఏమైంది కామపత్ని కాదు అందుకే సనాతన ధర్మంలో ఆమె ధర్మపత్ని ఆమె యందు కామం ఉంచుకోవడం దోషం కాదు కానీ ఆ కామము పరస్త్రీ యందు ఉండకూడదు మీరు అందుకే చాలా జాగ్రత్తగా గమనించండి ఋషులు సమస్య ఒక్కటి చెప్పరు సమస్యకి విరుగుడు చెప్తారు నువ్వు కామము చేత పట్టుబడకూడదు క్రోధము
(12:59) చేత పట్టుబడకూడదు అన్న అన్నాను అనుకోండి మీరు లేచి ఏమంటారు మేము పట్టుబడడం ఏమిటంటే అది మమ్మల్ని పట్టుకుంది మేము దాన్ని పట్టుకోలేదు అది పట్టుకుంది అది ఎలా వదులుతుంది మమ్మల్ని అంటే ఋషి మార్గం చెప్పాడు ఆయన అన్నాడు మాతృవత్పరదారేషు నువ్వు ఆడతనాన్ని చూస్తే పాల కింద నిప్పు పొంగుతాయి నువ్వు అమ్మతనాన్ని చూస్తే పాల మీద నీళ్ళు కిందకి వెళ్ళిపోతాయి కాబట్టి నీ భార్య యందు తప్ప ఏ ఇతర స్త్రీ వంక చూసినా నువ్వు ప్రతిరోజు ఏ కామాక్షి పరదేవతకు నమస్కారం చేస్తున్నావో ఆమెయే నీ కన్నుల ముందకి కరచరణాదులతో వచ్చి నిలబడింది. ఆ తల్లి
(13:46) వీడిని అనుగ్రహిద్దామని రోజు చదువుతాడు కదు సహస్ర శీర్షవదన అని చదువుతున్నాడు నామాల్లో అనేక ముఖాలతో ఉంటుంది కామాక్షి అని వీడు పాపం ఇన్ని రోజుల నుంచి చదువుతున్నాడు కదా వీడికి ఒకసారి నేను బోలడిన్ని ముఖాలతో కనిపిద్దాం అనుకుంది అనుకని నన్ను ఓ ఎత్తైన ప్రదేశంలో కూర్చోబెట్టి నా ఎదురుగుండా ఇన్ని ముఖాలతో కూర్చుంది కామాక్షి ఇప్పుడు ఆ కోణంతో చూడడం మనశశాంతికి కారణం కాబట్టి మాతృవత్పరదారేషు అన్యకాంతల్ని చూసినప్పుడు అమ్మ అన్న భావన చేయి అంతే పాలు కిందకి వెళ్ళిపోతాయి అంతకన్నా సభాముఖంగా ఇక్కడ చెప్పక్కర్లేదు పరద్రవ్యానిలోష్టవత్
(14:33) నేను అలా నడిచి వెళ్ళిపోతూ ఉంటాను ఎన్నో రాళ్లుు కనపడతాయి కనబడ్డ బెడ్డ ముక్కలన్నీ ఏరుకొని జేబులో వేసుకుంటానా బెడ్డ ముక్క నాకెందుకు వేసుకోను నాది నాది కానిది ఈశ్వరుడు నాకు ఇవ్వనిది అది నా కష్టార్జితం కాదు నాకు అక్కడ కనపడింది లోష్టవత్ అని బెడ్డ ముక్క నాకు అక్కర్లే దాన్ని నేను మా ఇంటికి పట్టికెళ్ళను కాబట్టి నీది కానిది ఈశ్వరుడు నీకు ధర్మబద్ధంగా ఇవ్వనిది నీకు కనపడితే అది బెడ్డ ముక్క వదిలిపెట్టి వెళ్ళిపో అందుకే ఇందాక బాబిరాజు గారు మాట్లాడుతున్నారే వైరాగ్యం అనేటటువంటిది లోపల బాగా అంకురించాలి తప్ప పైకి నటిస్తే తెలిసేది
(15:13) కాదది ఆ రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండేవారు దంపతులు ఇద్దరూ ఇక మనం వైరాగ్యం పొందేసాం తీర్థయాత్రలు చేసుకుంటూ వెళ్ళిపోదాం ఇల్లు అవి పిల్లలక ఇచ్చేసిని బయలుదేరారు. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒక బంగారు ఉంగరం ఒకటి కనపడింది. భర్త దాని మీద కాలు పెట్టి భార్యని పిలిచి వెనకాతలు వస్తుంది ఆవిడ ఆవిడ నిన్నాడు నువ్వు ముందు నడువు నాలుగు అడుగులు వస్తానులే అన్నాడు ఆవిడ ఏంది మీ వెనక నేనుగా రావాలి భర్త వెనక భార్య వెళ్ళాలి భార్య ముందు భర్త వెనక నడిస్తే అది దారుణమైన నడక ఎవరైనా చనిపోతే ఏ ధర్మోదకాలో ఇవ్వడానికి వెడుతుంటే ముందు భార్య నడవాలి వెనక భర్త
(15:52) నడవాలి అది దారుణమైన నడక అంటారు ముందు భర్త నడిచి వెనక భార్య నడిస్తే మంగళప్రదమైన నడక అంటారు అంటే అన్ని వేళల అలా నడవ అక్కర్లేదు ఎప్పుడూ అసలు భర్త కన్నా ముందు భార్య ఉండకూడదండి కాదు ఇంట్లో బయలుదేరినప్పుడు ఆయన వెనక ఆవిడ బయలుదేరాలి ఇప్పుడు మా తక్కువ అండి అని ఉండదు అందులో నేను అసలు మీకు ఒక మాట చెప్తే మీరు నాతో అంగీకరిస్తారు మనిషి గొప్పతనం ఎక్కడ ఉంటుంది అంటే వశపడడంలో ఉంటుంది.
(16:22) ఓ కుక్క వశపడింది కాబట్టి అన్నం పెడుతున్నాం ఇల్లు కాస్తోంది గుర్రం వశపడింది కాబట్టి ఎక్కుతున్నాం లక్ష్యానికి తీసుకెళ్తోంది గాడిద వశపడింది కాబట్టి బరువు వేస్తున్నాం నడుస్తోంది ఏనుగు వశపడింది కాబట్టి వెంకటేశ్వరుడి ఉత్సవమూర్తిని పెడుతున్నాం మాడ వీధుల్లో తిరుగుతోంది సింహం వశపడింది కాబట్టి సర్కస్ లోకి తీసుకొస్తున్నాం.
(16:45) జంతువులు వశపడితేనే ఉపయుక్తం అవుతుంటే మనిషి ఎవరికీ వశపడనంటే వశపడాలి ఎంత గొప్పవాడైనా గురువుకు వశపడాలి భార్య భర్తకు వశపడాలి కొడుకు తండ్రికి వశపడాలి అలా వశవర్తి అయితేనే రాణిస్తాడు నేను ఎవరికీ వశపడనండి అంటే వాడు రాణించలేడు జీవితంలో అందుకని అదేదో ఒకరిని తక్కువ చేయడం ఒకరిని ఎక్కువ చేయడం కాదు మళ్ళీ వెనక్కి రండి అందుకని ముందు భర్త వెనక భార్య అది గౌరవం అలా అది మంగళప్రదమైనటువంటి నడక మళ్ళీ మళ్ళీ ఇంకొక్క అడుగు వెనక్కేయండి భార్యా భర్తలు ఇద్దరు బయలుదేరారు ఉంగరం కనపడింది భర్త దాని మీద కాలు పెట్టి భార్యని ముందుకు నడవమన్నాడు ఆవిడ అంది మిమ్మల్ని
(17:21) అనుగమిస్తాను మీ వెంట ఎందుకు నేను ముందుకు వెళ్ళడం ఎందుకు మీరు నడవండి నేను నడుస్తాను అంది లేకతే అలసటగా ఉందా నేను నిలబడతాను ఆయన అనుకున్నాడు బాబోయి నడవమంటే నడవటం ఏమి లేదులే ఒక్క నాలుగు అడుగులు అయి వస్తాను అన్నాడు ఆవిడ అంది ఇంకా ఇంత వైరాగ్యం వచ్చిందని ఇద్దరం ఇంటి నుంచి బయలుదేరినా మీకు బంగారం ఉంగరానికి బెడ్డ ముక్కకి తేడా తెలుస్తోంది అన్నమాట అంటే అసలు వైరాగ్యం ఎవరికి వచ్చింది ఆయన అనుకున్నాడు ఈ ఉంగరం చూస్తే తీసుకుంటుందేమో మళ్ళీ లేనిపోని ఆలోచనలు వస్తాయని కాలు కింద పెట్టాడు.
(17:58) ఇంకా నీకు బంగారం ఉంగరానికి బెడ్డ ముక్కకి తేడా తిరిగెడుకడం పోలేదా అని ఆవిడ అడిగింది. అందుకని భావన సంపత్తి లోపల ఏర్పడాలి ఆ భావన అంతా కూడా కాబట్టి పరద్రవ్యాని లోష్టవత్ నీకు అక్కర్లేనిది అది నీది కానిది బెడ్డ ముక్కగా భావన చెయ్ అలాగే ఆత్మవత్ సర్వభూతేషు నేను ఆయన్ని కొట్టడం కాదు ఆయన నన్ను కొడితే నాకు ఎంత బాధ కలుగుతుంది కాబట్టి నేను కొట్టను నాకన్నా చాలా బలవంతు ఓ కర్ర పెట్టి నా మోకాల మీద కొడితే నాకు ఎంత నెప్పిడుతుంది ఓ కుక్క పిల్ల అంతే కదు అది కుక్క పిల్లని నేను మనిష్యుడిని బలవంతుడిని కర్ర పెట్టి
(18:43) నేను ఎందుకు కొట్టాలి కాబట్టి ఆత్మవత్ సర్వభూతేషు యపస్యతి సపస్యతి ఒక పని చేసే ముందు ఒకటే పరీక్ష పెట్టుకో ఇది నాకు జరిగితే అది ఒక్కటే ఆలోచించు ఇలా నాకు చేస్తే నన్ను కొడితే నన్ను తిడితే బాధ కలుగుతుంది కాబట్టి అవతల వాళ్ళకి చేయదు ఆత్మవత్ సర్వభూతేషు నిన్ను ఇతర ప్రాణిలో చూసుకో అది నీకు నచ్చితే చేసేయ [సంగీతం] ఇలా అంటే బాగుపడడానికి ఉపయోగపడుతుంది అను పర్వాలేదు ఇలా అంటే అవతల వాళ్ళకి చాలా బాధ కలుగుతుంది అనొద్దు ఇది ఋషి సమస్య చెప్పడు సమస్యతో పాటు పరిష్కారం చెప్తాడు అందుకే కామము
(19:31) పొటమరించినప్పుడు ధర్మ ధర్మపత్నిని పక్కకి చేరుస్తారు వివాహము అని ఇప్పుడు విశేషమైన భగవంతుని పొందడానికి గృహస్థాశ్రమం పనికవచ్చింది ఇద్దరు చెయ్యి చెయ్యి పట్టుకొని నడుస్తారు ఇది కట్టు మీద కట్టు ఓ కట్టు విప్పరు ఏదో పచ్చగడ్డి తీసుకొచ్చి రైతు ఆనపకాయ కోయడానికి వెళతూ ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాడు ప్రదోష వేళ అయిపోతే పాదు ముట్టుకోకూడదు ఒరేయ్ నేను ఆనపకాయ కోసుకొస్తాను అని కొడుకుని పిలిచి పచ్చగడ్డి మూట కట్టు ఇంటి దగ్గర ఆవుకి వేయాలన్నాడు కొడుకు కొడుకు తాటాకు తీసుకొచ్చి తడప కట్టారంటారు తడపలా చేసి పచ్చగడ్డి కింద నుంచి పెట్టి మోకాలు
(20:09) పెట్టి నొక్కి గడ్డిని గట్టిగా కట్టుకట్టాడు తండ్రి ఆనపకాయ కోసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చాడు ఏరా పచ్చగడ్డి మూట కట్టావా మోపు కట్టానండి అన్నాడు చూసాడు నిజంగా వాడి బలానికి కట్టిన కట్టు నిలబడదు అలా అంటే వాడు బాధపడతాడు తండ్రి ఏం చేసాడంటే ఇంకో తేటాకు తీసి తడప తెచ్చి మళ్ళీ పచ్చగడ్డి కింద పెట్టి తన మోకాలతో గట్టిగా నొక్కి గట్టిగా బిగించి కట్టాడు.
(20:38) ఇప్పుడు కొడుకు వేసిన కట్టు వదిలైపోయి తనంత తాను జారిపోతుందా లేదా కట్టు ఇప్పాలా ఇప్పక్కర్లేదు అందుకే బ్రహ్మచారి కావడానికి ఉపనయనం ఉంటుంది బ్రహ్మచర్యం పోవడానికి మంత్రాలు ఉండవు జారిపోతుంది అంతే గృహస్తాశ్రమం అన్న కట్టుబడితే బ్రహ్మచర్యం అన్న కట్టు జారిపోయింది అంతే ఆ కట్టోటి మళ్ళీ విడిపించడానికి మంత్రాలు ఉండవు మళ్ళీ దానికి ఎక్కడ క్రతువులు ఉండవు ఇప్పుడు గృహస్థాశ్రమానికి వెళ్ళాడు గృహస్థాశ్రమంలో ఏ కోరిక లేకుండా ఎలా బతుకుతావ్ అందులోకి వెళ్ళావంటే నువ్వు తినాలి భార్యకు పెట్టాలి బిడ్డలకు పెట్టాలి ఎప్పుడైనా ఒక కోరిక పుడితే అది తీర్చుకోవచ్చా తీర్చుకోకూడదా
(21:21) దీనికి ఒకటే అగ్ని పరీక్ష ఇది ధర్మం అన్న చట్రంలోకి ఇముడుతుందా అదిఒక్కటే చూడాలి ఇముడుతుంది తీర్చేసుకో ఏమి దోషం లేదు అది నిన్ను భగవంతుడికి దగ్గర చేసేస్తుంది. అది ధర్మ చక్రంలోకి ఇమడదు తీర్చుకోవద్దు అది పాపము కింద పరిణమిస్తుంది అది పాపమే ఈశ్వరుని చేరకుండా ప్రతిబంధకం అదే సమస్త దుఃఖములకు కారణం అవుతుంది. అందుకని అప్పుడు చేయకు ఆ పని విడిచిపెట్టేసేయ కాబట్టి ధర్మము అనబడేటటువంటి చట్రంలోకి ఇమిడినటువంటి కోరిక తీర్చుకోవాలి కానీ మనసుకు ఒక బలహీనత ఉంటుంది.
(22:01) అది ఒక కోరిక చెప్పేటప్పుడు ధర్మ చకటంలోకి ఇమిడుతుందా ఇమడదా అది అది చూడదు అది దానికి కోరిక ఒకటే చెప్తుంది అదే పనిగా చెప్పేస్తూ ఉంటుంది. కొన్నాళ్ళు నువ్వు మనసుతో మాట్లాడడం అలవాటు చేసుకోవాలి మనసు వంక తిరిగి ఓ చాలా సంతోషం చెప్పావు కానీ ధర్మ చక్రంలోకి ఇమడదు తీర్చడం కుదరదు పో మీరు అలా ఒక్కమారు చెప్పారని ఇంక ధర్మ చక్రంలోకి ఇమడని కోర్కెలు మనం చెప్పినా జీవుడు వినడం మనం చెప్పొద్దు అని అదేమ ఊరుకోదు చెప్తూనే ఉంటుంది రామకృష్ణ పరమహంస ఒక ఉపమానం చెప్పేవారు ఒకాయన కుక్కని పెంచాడు ఆ కుక్కని రోజు ఒళలో కూర్చోపెట్టుకో అలవాటు చేసుకున్నాడు అది ఆయన మూతి నాకుతుంది గడ్డం నాకుతుంది
(22:45) బుగ్గలు నాకుతుంది ఆయన దాన్ని ఎంతో ప్రేమగా కౌగలించుకుంటాడు. ఒకాయన ఇంటికి ఎవరో పెద్ద మనిషి వచ్చాడు ఏమిట్రా నీకు ఎంత ప్రేమ ఉన్నా కుక్కని ఒళలో కూర్చోపెట్టుకొని కౌగలించుకొని అది నిన్ను ముద్దెట్టుకోవడం నాకడం అటువంటి పనులు చేయకూడదు అసహ్యంగా ఉంటుంది. కుక్క మీద ప్రేమ ఉంటే ఉంచుకో ఎక్కడి వరకు ఉండాలో అక్కడ వరకు ఉండాలి అంతేగన కుక్క ఒళలోకి వచ్చి నాకడం ఏమిటి తప్పు అది అన్నాడు ఆయన ఏం చేసాడు అయితే నాన్నగారండి ఇవాళ నుంచి కుక్కని ఒళలోకి ఎక్కించుకోను పెంచుకుంటాను అంతే కుక్కను తీసి పక్కన పెట్టేసాడు.
(23:15) ఈయన అనుకున్నాడు కుక్కను వదిలేద్దాం కుక్కని ఒళలోకి కించుకోవద్దని కుక్కకి తెలియద్దా విషయం కుక్క ఏం చేస్తుంది మళ్ళీ పరిగెత్తుకవచ్చి ఒళలో కూర్చుంటుంది ఈయన ఒక్కటి కొట్టాడు పాకి అని అది వెళ్ళిపోయింది కానీ కొయ కొయ కొయ అరగంట ఊరుకుంటుంది మళ్ళీ కాసేపు ఆగి అదే స్మశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం పురాణ వైరాగ్యం అంటే మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ వచ్చి ఒళలోకి ఎక్కుతుంది వచ్చినప్పుడల్లా మూతి మీద ఒకటి కొడితే 10 రోజులు పోయిన తర్వాత దూరం నుంచి చూసి ఇలా కాళ్ళు చాపి కొయి కొయ్యి అంటుంది తప్ప మీదకి ఎక్కదు కొన్ని కోట్ల జన్మల నుంచి మనసుకు అలవాటు అయిపోయింది దాని
(23:51) ఇష్టం వచ్చినవన్నీ చెప్తూ ఉండడం వింటూ పోతే నువ్వు బానిస అవుతావు వెనక్కి తిరిగి ఆగి ఆలోచించి జవాబు చెప్పడం అలవాటు అయింది అనుకోండి ధర్మబద్ధమైన దానిని తీర్చుట కుదరదు ఇదే మాట మనసూచిత చెప్తూ ఉండగా కొంతకాలం అయిన తర్వాత సాధనలో మనసు ఏం చేస్తుంది అంటే అసలు ప్రతిపాదించదు ఆయన వినడు అనవసరం అటువంటి కోరికే ఇప్పుడు మనసుని చంపకూడదు మనసుని వశం చేసుకోవాలి అందుకే శంకరాచార్యుల వారు కోతితో పోల్చాడు ఇప్పుడు నేను అలా వస్తుంటే ఒక కోతి ఆ మూల అలా పడుకొని ఉందనుకోండి నేను ఏమంటాను ఏవండీ పాపం దానికి ఒంట్లో బాగులేదా ఏమిటి
(24:35) అలా పడుకుంది అంటాను కోతి అంటే అలా ఆడుకుంటూ ఉండాలి తిరుగుతూ ఉండాలి ఎలా తిరుగుతూ ఉండాలి ధర్మాన్ని పట్టుకొని తిరుగుతూ ఉండాలి ధర్మం పట్టుకొని నువ్వు ఎన్ని కోరికలు కోరుకో ధార్మికమైన కోరికలు అంటే మీకు ఒక్క ఉదాహరణ చెప్తే పట్టేసుకుంటారు నాకు చక్రపొంగలు తినాలని ఉంది ధర్మమా అధర్మమా నేను గృహస్తుని చక్రపొంగలు తినాలని కోరుక పుడితే తప్పేటి దాంట్లో కానీ నా కొరకు అని వండుకొని తినేయకూడదు మా ఆవిడ్ని పిలిచి ఏమోయ్ రేపు పొద్దున్న చక్కటి చక్రపొంగలు చెయి అని దాన్ని తీసుకెళ్లి వెంకటరమణ మూర్తికి నైవేద్యం పెట్టి పోనీ మీ ఇష్టం ఏ స్వామికియతే ఆ స్వామికి నైవేద్యం చేసి
(25:16) దాన్ని నేను తినే ముందు మధుర పదార్థం కాబట్టి అది అవతల వారికి సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి కొద్దిగా తీసి పక్కన పెట్టి నేను చక్రపొంగల్ని ప్రసాదంగా కళ్ళకు అద్దుకొని తిన్నాను అనుకోండి అది నన్ను ఏమి బంధించదు అది ప్రసాదం అయింది ఇప్పుడు సరి కదా నేను మధుర పదార్థం ప్రసాదం ఇంకొకరికి పెట్టాను కాబట్టి అది నా ఉద్ధరణకు కారణం అవుతుంది.
(25:38) కాబట్టి ఏది ధర్మబద్ధమైన కోర్కయో అది బంధించరు ఏది ధర్మబద్ధము కాదో అది బంధిస్తుంది. ఇప్పుడు ధర్మబద్ధమై కోరిక ఉండాలి అంటే పరిశీలించుకోగలిగినటువంటి శక్తి మనకి కలగాలి దానికే భక్తి అని పేరు ఎందుకు నేను తీర్చుకోకూడదు అలా అంటే అలా తీర్చుకోవద్దు అని పరమేశ్వరుడు చెప్పాడు నేను ఆయన చెప్పినట్లు బ్రతుకుతాను దానికే భక్తి అందుకే పాశం పట్టుకొని మామూలు కోర్కెలన్న పాషాలు వద్దురా అని భక్తి పాశాలు వేసి దగ్గరికి లాక్కుంటుంది ఆవిడ ఏ విధమైనటువంటి అధార్మిక ైనటువంటి భావనలు లోపల నుండి పుట్టవు కానీ దానికి చెల్లెలు ఉంటుంది దాని పేరే క్రోధం కోరిక తీరలేదు
(26:25) అనుకోండి కోపం వస్తుంది. కోపానికి గుర్తు అంకుశం ఎందుకని ఏనుగు చాలా గొప్పది కానీ మామిటికి ఎందుకు లొంగుతుంది ఆయన మీద కూర్చుని అంకుశంతో దాని మస్తిష్కంలో పురుస్తాడు ఆ తల పోటు తల బద్దలైపోయినట్టు ఉంటుంది దానికి భరించలేదు అందుకే అంకుశం అక్కడ పెట్టాడు అనుకోండి దానికి ఎంత భయమో మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద దేవాలయాల్లో చూడండి ఏనుక ఒక లక్షణం ఉంటుంది అది కదలకుండా ఉండలేదు.
(26:54) దాని రెండు కాళ్ళ ముందు అంకుశం పెట్టి మామటి ఆ పక్కన కూర్చుంటాడు ఎవరితోనో మాట్లాడుతుంటాడు. ఏనుగు కదలకుండా ఉండలేదు కదా అది కదలాలి ఎలా ముందు అంకుశం ఉంది అంకుశాన్ని దాటను కూడా దాటను దాటకుండా ఇలా తొండం ఇలా ఊపుతుంది అడ్డంగా అయితే ఇలా ఇలా అంటుంది కాలు మీరు ఎప్పుడైనా గమనించండి ఏనుగుని కాలు ఎత్తుతుంది ఇలాగ అంకుశం దాకా పెడుతుంది మళ్ళీ వెనక్కి తీసేసి వెనక్కి పెట్టేస్తుంది కాలు అంకుశం దాటి మాత్రం కాలు వేయదు అంకుశానికి ఏనుగు లొంగిపోయింది ఏనుగు ఎంత పెద్దదో ఒక్కసారి కోపం అంటూ వచ్చేయాలి కానీ లోపల నుంచి బయట నుంచి లోపలికి రాదు లోపల నుంచి బయటకి వస్తుంది
(27:37) వచ్చినప్పుడు ఏనుగ అంత ఉంటుంది. అసలు దానికి వశపడిపోయిన వాడిని కోపంతో ఉన్నవాడిని ఫోటో తీసి వాడికి చూపించండి వాడే తెల్లబోతాడు ఇలా ఉంటానా ఇంత వికారంగా అంత భయంకరమైన స్థితిలోకి తీసుకెళ్ళిపోతుంది మనిషిని ఆలోచించనివ్వదు ఊపేస్తుంది. అటువంటి కోపం మనల్ని పాడు చేయకుండా ఉండాలంటే అమ్మవారి పాదాలు పట్టుకోవాలి. అమ్మవారు ఏం చేస్తుందంటే ఇప్పుడు దాన్ని సాధన కింద మారుస్తుంది ఎలా అంటే కోపము ఉత్తమ కోపంగా మారుతుంది ఉత్తమ కోపంగా మారడం అంటే కోపం మీద కోపం వస్తుంది ఇన్నాళ్ళు నాకు చాలా కోపం అండి అనేవాడు ఇప్పుడు అంటాడు ఏమిటి నాకు ఈ దిక్కుమాల కోపం అయిన దానికి కాని
(28:22) దానికి కోపమే ప్రతిదానికి కోప్పడమే పైగా కోపం పోకుండా అలా గుండెల్లో తిష్ట వేసుకు కూర్చోవడమే ఇంకా ఏమిటి ఈ స్థితి చి నేను ఈ కోపం విడిచిపెట్టాలఅనుకుంటాడు ఇప్పుడు కోపం మీద కోపం ఎందుకు వస్తుందిఅంటే అమ్మవారి అనుగ్రహం వల్ల ఆ జాజ్యం వదిలిపోతుంది. ఇవి కలియుగంలో ఉండేటటువంటి ప్రబల శక్తులు ఇదే మహానుభావుడు ధర్మరాజు గారితో మహర్షి చెప్పిన మాటలు కామక్రోధములు రెండు పీడించేస్తాయి ధర్మబద్ధములు కావు దీనివల్ల ఏమైపోతాడు అంటే మనుష్యుడు మళ్ళీ కొన్ని కోట్ల జన్మల పాటు తిరిగి ఎక్కువగా వెళ్తాడు మనుష్య జన్మ ఎన్నాళ్ళు ఉంటుందండి మహా ఉంటే 70 కాకపోతే 80 పోనీ పూర్ణాయుదాయం
(29:09) ఉంటే 100 ఉంటే మాత్రం అందరూ కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిలా అపారమైన జ్ఞాపక శక్తితో ఉంటారా ఉండరు 80 ఏళ్ళ వచ్చేటప్పటికి విస్మృతి వచ్చేస్తుంది గుర్తుండదు తాళం ఎక్కడ పెట్టాడో గుర్తుండదు వీడెవరో గుర్తుండదు వాడుఎవరో గుర్తుండదు ఏం మాట్లాడాడో గుర్తుండదు చెవులు వినపడడం తగ్గిపోతుంది కళ్ళు కనపడ తగ్గిపోతుంది శరీరం జర్జరీభూతం అవుతుంది.
(29:36) అప్పుడు అటువంటి స్థితిలో అన్ని జ్ఞాపకం ఉంటాయని నమ్మకం లేదు. 20 ఏళ్ళ వచ్చే వరకు శాస్త్ర పరిజ్ఞానం కలగనే కలగదు మిగిలినవి 60 ఏళ్ళు సగం నిద్రలో పోయింది ఇక మిగిలింది 30 ఏళ్ళు సంసార పోషణలో 20 ఏళ్ళు పోయింది మిగిలింది 10 ఏళ్ళు 10 ఏళ్లల్లో మిగిలినవి ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఎక్కడ భగవత్ భక్తి ఎక్కడ నిలబడుతుంది అందుకే అసలు అమ్మవారి అనుగ్రహం కలిగినటువంటి వాడికి ఉండేటటువంటి లక్షణం ఏమి అంటే వాడు నిరంతరము పరిశీలి శీలనాత్మకమైనటువంటి దృష్టితో ఉంటాడు ధర్మం వైపికి అడుగు వేస్తాడు తప్ప అధర్మం వేపికి అడుగు పడకుండా

No comments:

Post a Comment