ప్రేమ, ప్రేమ, ప్రేమ.. తప్పులు వెతక్కండి! || @sridevi_vlogs515
Author Name:RAJAHMAHENDRI__SRIDEVI
Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515
Youtube Video URL:https://www.youtube.com/watch?v=iXUYEmL12nU
Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం ఇద్దరి మధ్యన ప్రేమ పుట్టాలంటే ఒక అద్భుతం జరిగి ఉండాలండి. అది మీ అందరికీ కూడా తెలుసు కదా ప్రతి ఒక్కరి లైఫ్ లో ప్రేమ అన్న మధురమైన క్షణాలు మనకి తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోయినాయి. కొంతమంది అవి నిజం చేసుకున్నారు కొంతమంది అదే ప్రేమని దూరం చేసుకున్నారు కానీ జ్ఞాపకాలు అనవి ఎక్కడికి పోవు కదా ఆ జ్ఞాపకాల్లోనే బ్రతికేసేవాళ్ళు చాలామంది ఉంటారు కొంతమంది కాలదన్నుకున్నోళ్ళు ఉంటారు.
(00:40) మరి ప్రేమించడం కాదు ప్రేమించిన మనిషిని అర్థం చేసుకో అని మన పెద్దవాళ్ళు మనకి చెప్తూ ఉంటారు. ఇందులో ఎంత నిజం ఉంది మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కచ్చితంగా కామెంట్ బాక్స్ లో ఉంచండి. ప్రేమ రెండు అక్షరాలు అదే మాట వినగానే మనసు పులకరించిపోతుంది. తనువు పరవశించిపోతుంది. ఆ ఏజ్ లో ఏది కనిపించదు వినిపించదు. అందుకనే ప్రేమ గుడ్డిది అంటారు.
(01:14) ఇది ఎంతవరకు నిజం అంటారు? ఈనాటి యువత అదే ప్రేమ అంటే అంతగా ప్రేమించి ఇష్టపడి కావాలని ఏరి కోరి పోరాటాలు చేసి యుద్ధాలు చేసి పెళ్లిలు చేసుకుంటున్నారు కానీ అదే ప్రేమలో నిజాయితిని వెతుకుతున్నారు అందుకనే కొన్ని జంటలు కాదు కదా వందల వేల జంటలు ఈరోజు విడిపోతున్నాయి. ప్రేమని అర్థం చేసుకుంటే మధుర కావ్యంగా జీవితాంతం మనకి తోడుంటుంది.
(01:49) మనిషి లేకపోయినా అదే ప్రేమ జ్ఞాపకాలతో జీవితాంతం బ్రతికేయవచ్చు. జీవితంలో గెలవాలంటే పట్టు విడుపులు ఉండాలండి అదేమిటి అంటే ప్రేమించటం ఒక్కటే కాదు అదే ప్రేమను జీవితాంతం తీసుకువెళ్ళాలి అంటే చివరి వరకు తీసుకువెళ్ళగలగాలి. ఇద్దరు కలిపి భార్యా భర్తలు గాని ఇటు ప్రేమించుకునే జంటలు గాని అదే ప్రేమలోనే అర్థాలని వెతుక్కోవాలి అంటే ప్రేమిస్తే కొంతవరకే మనిషి మనతో ఉంటాడు అదే ప్రేమలోనే అర్థం చేసుకోవడం అలవాటు చేసుకుంటే అదే పార్ట్నర్ జీవితాంతం మనతో కలిసే ఉంటారు.
(02:34) ఇవి తెలుసుకోకుండా చిన్న చిన్న గొడవలు అపోహలకి అనుమానాలకి జీవితాల్ని బలి చేసుకుంటున్నారు. విడిపోవడం అన్న కాన్సెప్ట్ అన్నది ఇలా చిటికి వేసినంత సమయం కూడా పట్టకుండా సడన్ డెసిషన్లు తీసుకుంటున్నారు. మరి దీని వలనే కదా జంటలు విడిపోవటం గాని ఇంకా అనర్థాలకి గాని ఘోరాలకి గాని హత్యలకి గాని మనం ఎవరినైనా ఇష్టపడుతున్నాము అంటే ఏదో ఆశించో అవసరం ఉండో ఇంకేదో అవకాశం వస్తుందనో ఇష్టపడతాం అది నిజమైన ప్రేమ కాదు మరి నిజమైన ప్రేమ ఎందులో ఉంటుంది అర్థం చేసుకోవడంలో ఉంటుంది ఆడవాళ్ళు అవ్వనివ్వండి మగవాళ్ళ అవ్వనివ్వండి అంటే వాళ్ళ కష్టాన్ని గాన వాళ్ళ ఇష్టాలని గాని
(03:22) వాళ్ళ ప్రేమని గాని వాళ్ళ నష్టాలని గాని ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఎమోషన్స్ ని గాని అర్థం చేసుకొని ప్రతి విషయంలో సలహాలు ఇస్తూ తోడుగా ఉన్నాను అన్న భరోసాని ఇస్తూ ఉంటే ఆ లైఫ్ వేరే విధంగా ఉంటుంది. అర్థం చేసుకోవడమేనా ఇది అందరూ అర్థం చేసుకుంటారు మీరు నన్ను ఒక విషయం అడగొచ్చు అదేంటి శ్రీదేవి గారు ప్రేమకి అర్థం చేసుకోవడానికి రెండిటికి చాలా తేడా ఉంది కదా ఇక్కడ ప్రేమ అంటే ఒల్లు పులకరించిపోద్ది మరి అర్థం చేసుకోవడం అంటే ఒక ఫ్రెండ్ ని అర్థం చేసుకుంటాం ఇంట్లో వాళ్ళని అర్థం చేసుకుంటాం తోడపుట్టినోళ్ళని అర్థం చేసుకుంటాం అని మీరు అడగవచ్చు కానీ లైఫ్ లో నిజమైన
(04:04) బాధ్యతలు చేపట్టినప్పుడే ఆటోమేటిక్ గా ప్రేమప పుడతదండి నేను ఇప్పుడు చెప్పిన కష్ట సుఖాలు ఇష్టాలు ప్రేమలు వగేరా ఇవన్నీ పట్టుకున్నప్పుడు దానంతలు అదే ప్రేమ పుడుతుంది. అందులోనే నిజమైన జీవితం ఉంటుంది. ప్రేమ అన్నది అబద్ధమైన జీవితంలో బతుకుతూ ఉన్నాం మనం నిజమైన ప్రేమ ఎందులో ఉంటుంది అంటే అర్థం చేసుకోవడంలో ఉంటుంది.
(04:28) అందుకనే మన పెద్దవాళ్ళు ప్రేమలు వేస్టు ప్రేమలు దండగా ప్రేమ గుడ్డిది ప్రేమ వివాహాలు చేసుకుంటే జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పేవారు అంటే పెద్దలు కుదిరిచ్చిన సంబంధంలో ఇటువంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆ ప్రేమ అన్నది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట రోజు రోజుకి వాళ్ళకి చిటికీ మాటికి గొడవలు ఉంటాయి అలకలు ఉంటాయి కానీ అర్థం చేసుకొని సర్దుకు పోతూ ఉంటారున్నమాట అందుకని నే ఒక కుటుంబ వ్యవస్థని తయారు చేస్తారు.
(05:01) పిల్లల్ని కూడా అదే రీతిలో పెంచుతూ ఉంటారు. చచ్చే అంతవరకు ఒకళని ఒకళలు వేడకుండా చనిపోయినవాళ్ళు కూడా ఉంటారన్నమాట. భార్యా భర్తలు పెద్దలు కుదుర్చిన పెళ్లిలో ప్రేమ లేదా అంటే ఖచ్చితంగా 100 కి 200 శాతం ఉంటుంది. ఐ లవ్ యు అన్న మాటలో ఎంత మత్తు ఉంటుందో ఎంత మాయ ఉంటుందో అది ఎంత మనసుకు తాగుతుందో కానీ అర్థం చేసుకోవాలి అన్న బాధ్యతలో బంధం బలపడుతుంది.
(05:34) అంటే ఒకరికొకరు భరించుకుంటారు. అలాగే లైఫ్ ఒక మధురమైన గేయంగా మార్చుకుంటారు అన్నమాట మరి ఇదండీ ప్రేమ అన్నది గుడ్డిదా లేదా అబద్ధంలో బతుకుతున్నామా నిజాల్ని వెలికి తీయడంలో పార్ట్నర్ ని అవమానిస్తున్నామా మరి అర్థం చేసుకొని పోతే జీవితాంతం హ్యాపీగా బతికేయచ్చు కదా ఏమంటారు ఇక్కడ ఇంకో చిన్న మాట కూడా మీకు చెప్పాలండి బలవంతంగా లాక్కున్న బంధాలుఏవి వి మనతో పాటు ఉండిపోవు అవి అశాశ్వితమైనవని మనం గుర్తించాలి.
(06:13) అది ప్రేమ కావచ్చు ఏ రిలేషన్ అన్నా కావచ్చు డబ్బు కావచ్చు ఆఖరికి ఒక మనిషి కావచ్చు మరి ప్రేమతో గెలుచుకోవాలి అంటే అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటేనే ప్రేమ ఉంటదని మనం గుర్తించాలి. ఆఖరికి బలవంతంగా లాక్కున్న బంధాలు మనతో ఉండవు సరి మనల్ని పిచ్చివాళ్ళని చేస్తాయి. మనం మన రిలేషన్స్ మీద గాని మన పార్ట్నర్ మీద గాని పెత్తనాలు చేయకూడదు ఏదైనా ఓర్పుతో నేర్పుతో గెలుచుకోవాలి భరించాలి క్షమాగుణం ఉండాలి ఎన్నిసార్లు క్షమించమ అన్న క్వశ్చన్ మీరు నాకు వేయవచ్చు ఎన్నిసార్లు క్షమించాలి అప్పుడే మనిషిని గాని ప్రేమను గాని బంధాన్ని గాని జీవితాన్ని గాని గెలవచ్చున్నమాట మరి ఈ వీడియో గురించి
(06:58) మీరేమనుకుంటున్నారు నాకు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని చెప్పండి ఈవీడియో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి
No comments:
Post a Comment