Wednesday, April 22, 2026

తల్లితండ్రులు మానసిక పరిస్థితి లే కారణమా? || @sridevi_vlogs515

తల్లితండ్రులు మానసిక పరిస్థితి లే కారణమా? || @sridevi_vlogs515

Author Name:RAJAHMAHENDRI__SRIDEVI

Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515

Youtube Video URL:https://www.youtube.com/watch?v=WYHYNbhNOTA



Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం పిల్లల మీద ప్రేమ ఉండడం అది సహజంఅండి. అది ప్రతి తల్లితండ్రి చేసే పనే మరి ఇప్పటి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అతి ప్రేమలు చూపిస్తున్నారు. వాళ్ళకే పిల్లలు పుట్టినట్టు బిహేవ్ చేస్తున్నారు. మతిస్తిమితం సరిగ్గా లేదా లేక మానసిక పరిస్థితి బాలేదా అన్నది వాళ్ళకే తెలీదు. మరి ఇటువంటి వాళ్ళందరూ కలిసి పసిపిల్లల ప్రాణాలను తీస్తున్నారు.
(00:29) ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే బెంగళూరు సంఘటన మీ అందరికీ తెలిసిందే ఇక్కడ వాళ్ళ పేర్లు మనం ప్రస్తావించక్కర్లేదు అమ్మ ఒక చిన్న పాపని చంపేసి తరువాత ఆమె ఉరేసుకొని చనిపోయింది. ఈ విషయం చాలా బాధాకరమైనది. ఎందుకంటే ఆమెకి అది ఒక ఫోబియానా మానసిక పరిస్థితి బాలేదా? లేకపోతే ఆమె సమస్యని ఎదుర్కోలేదా ఇటువంటివన్నీ తీసుకువచ్చి పిల్లల మీద రుద్దుతున్నారు అంటే ఫ్యామిలీ ఇష్యూస్ అయినా సరే భార్యా భర్తల మధ్య గొడవలైనా సరే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ముందుగా పిల్లల మీద చూపిస్తున్నారు వీళ్ళ వికృత చేష్టలకి ఆ పసి హృదయాలు బలైపోతున్నాయి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు
(01:16) ఇందులో తల్లి చేసిన తప్పు ఏంటి అంటే ఎంతసేపు వాళ్ళ అమ్మాయి గురించే ఆలోచన అంట వాళ్ళ అమ్మాయి ఎలా చదువుతుంది అసలు చదవగలదా లేదా జీవితాన్ని నెట్కి రాగలదా లేదా ఎగ్జామ్స్ వచ్చేసినయి పరీక్షలు ఎలా రాస్తది అన్న భయంతో ఎప్పుడూ అదే ఆలోచనతో ఉండేదంట ఇటువంటి వికృత శాస్త్రులు ఎవరు చేస్తారండి రాక్షసుల్లాగా రక్కసుల్లాగా బిహేవ్ చేస్తున్నారు.
(01:43) ఇక్కడ చదువు ఒక్కటే మార్గమా ఇంకా వేరే దారులు లేవా చదువుతేనే జీవితం ఉంటుందా ఒక్కసారి మనల్ని మనమే క్వశ్చన్ వేసుకోవాలి. ఈ వెనకటి రోజుల్లో ఏం చదివారని చెప్పి అంత నాలెడ్జ్ సంపాదించారు సంసారాలని నెట్టుకొచ్చుకున్నారు ఉమ్మడి కుటుంబాలని కలుపుకున్నారు కొద్దో గొప్ప చదువుకున్నారు ఇక్కడ చదువు అన్నది మన కుటుంబ పరిస్థితి బట్టి ఆధారపడుద్ది.
(02:07) మన మనసుకు నచ్చింది మనం చేయాలి. అది చదువా వేరే పనా లేకపోతే ఇంకొకటా అది మనం ఎంచుకోవాలి అంతేగానీ ఈ రోజుల్లో పేరెంట్స్ ఎలా ఉన్నారు ఒకరితో ఒకరు పోల్చుకుంటున్నారు. మన రిలేటివ్స్ లో పిల్లలు బాగా చదివినా మనకి నిద్రపట్టదు. మనకి ఈర్షా ద్వేషాలు అసూయ వాళ్ళ పిల్ల డాక్టర్ చదువుతుంది ఇంజనీర్ చదివేస్తుంది వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది వాళ్ళ అబ్బాయిరెండు లక్షల శాలరీ తెచ్చుకుంటున్నాడు.
(02:40) పోద లెగితే ఇలా ఏడిచేస్తూ అసూయ పడుతూ ఉంటారు. మరి పక్కన పిల్లవాడు కనీసం పక్కింటి పిల్లలో వీధిలో పిల్లలతో కూడా పోల్చడం క్లాసులో ఉన్న పిల్లలతో పోల్చడం ఇలా పోల్చుకోబట్టే మన మనశశాంతి లేకుండా పోతుంది ప్రశాంతత లేకుండా పోతుంది మనతో పాటు మన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నాం మన పిల్లల చావులు చూస్తున్నాం.
(03:03) ఇది ఎక్కడి ధర్మం అసలు ఒక్కసారి ఆలోచించండి. మనకంటే అడవిలో మృగాలు మేలు ఎందుకంటే మృగం కూడా తన బిడ్డని తాను సాకుతూ ఉంటది. తన పస్తులు ఉండి బిడ్డకి ఆహారాన్ని అందిస్తది. తనకి రెక్కలు వచ్చాక వదులుద్ది అంటే ఒక పక్షి కూడా చాలా జాగ్రత్తగా బిడ్డని గూటిలో పెట్టి సాకి దానికి ఆహారాన్ని అందించి దాని భద్రత చూసి దానికి రెక్కలు వచ్చిన తర్వాత ఆ పక్షులు ఎగిరిపోయేంతవరకు కాపు కాస్తది.
(03:35) మరి మనం ఏం చేస్తున్నాం ఎంతో అమూల్యమైన మానవ జన్మ ఎత్తాం మనకి అసలు విచక్షణ జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నాం. ఎందుకు పిల్లల మీద అంత కక్ష ఏం పాపం చేశారు వాళ్ళు మీ కడుపున పుట్టారు కనీసం ఇంట్లో ఆడవాళ్ళు ఇల్లు చూసుకొని పిల్లల్ని కూడా చూసుకోపోతే ఎందుకు ఒక్కొక్క తల్లి ఉంటది మొగుడు మాట అన్నా పిల్లని కొడతది మొగుడు బయటకి తీసుకెళ్ళిపోయినా బిడ్డని దాంతది ఆమె చికాకులు చిరాకులు అన్నీ పిల్లల మీద చూపిస్తారు.
(04:06) ఇప్పుడు ఉన్న తల్లిదండ్రులు అందరూ ఈ కోవకు చెందినోళ్లే అంతే కాదండి పెద్ద పెద్ద చదువులు చదివినోళ్ళు గోల్డ్ మెడలిస్టులు ఇంకా స్టేట్ ఫస్ట్ లో వచ్చినోళ్ళు ఇంకా పెద్ద పెద్ద ర్యాంకర్లు వీళ్ళు కూడా నండి జాబ్ అన్నది రాక వాళ్ళు కూరగాయలు కొట్టుపెట్టుకోవడమో సొంత వ్యాపారాలు చేసుకోవడమో ఒకచోట ఏదో ఊడిగం చేయడమో చేస్తున్నారు టీ కొట్టు కూడా పెట్టుకుంటున్నారు బీటెక్ చదివిన వాళ్ళు మరి దీనికి ఏం సమాధానం చెప్తారు ఎంతసేపు చదువు చదువు చదువు ర్యాంకులు రావాలి నీకు మంచి మార్కులు రావాలి అంటే పరీక్ష అన్నది నీ మార్కుల్ని డిసైడ్ చేస్తది కానీ మీ జీవితాన్ని కాదండి. అదేమిటంటే
(04:45) మనం పిల్లలకి చదువు చదువు ఒక్కటే మార్గం అని పిరికిగా పెంచకూడదు చదువు మీదే డిపెండ్ అయినట్టు చూడకూడదు. చదువు మనకి ఉద్యోగం భద్రత జీతాన్ని ఇస్తది. కానీ మనం పిల్లల్ని పెంచే విధంలో మన బిడ్డలకి ఏం నేర్పాలి అండి ఎలా బ్రతకాలో నేర్పాలి. ఎలా బ్రతికి చూపించాలో నేర్పాలి. ఎలా ఓటమిని ఎదుర్కోవాలో నేర్పాలి.
(05:13) పక్కనోడితో పోల్చకూడదు వాడు ఆ చదువు చదివాడు వాడు ఆ ఉద్యోగం చేస్తున్నాడు లేకపోతే వాడు ఇల్లు కట్టాడు వాడు కారు కొన్నాడు ఇవి చెప్పకండి దయచేసి జీవితంలో ఎలా బ్రతకాలో నేర్పండి ఎలా బ్రతికి చూపించాలో నేర్పండిప మందికి ఎలా ఆదర్శంగా ఉండాలో నేర్పండి నీవల్ల ఒక 10 మందికి కాదు కదా కనీసం ఒక్కరికైనా సహాయం అందిందో లేదో చూడమని నేర్పండి. ఇవి చెప్పాల్సినవి ఎథిక్స్ నేర్పండి అంతేగాని పిరికితనం నేర్పకండి ప్రతి పని మీరే చేసేసేయకండి ఛాయిస్ లేకుండా చేయకండి మీ ఇష్టాన్ని వాళ్ళ మీద రుద్దకండి దయచేసి ఇవన్నీ మానండి ఇదివరకు రోజుల్లో చేతి పనులు చేసుకునేవారు ఒక వయసు రాగానే
(05:57) చదువు ఎందుకు మనకని తీసుకెళ్లి పనిలో పడేసేవారు. ఒక గురువు దగ్గర పని నేర్చుకోవాలంటే కనీసం ఆరు నెలలు సంవత్సరమైనా గురువు వెనకాతలు తిరుగుతూ వాళ్ళ ఇంట్లో పనులు చేస్తూ ఊడిగం చేస్తూ గురువుగారిని మెప్పించేవారు చేతులు కట్టుకొని ఉండేవారు ఆ తర్వాత ఆ గురువుకి నమ్మకం కలిగితేనే పని నేర్పటానికి సుత్తి శానం ఇచ్చేవాడు మనం ఒకరి దగ్గర పని నేర్చుకోవాలంటే ఏకాగ్రత కావాలండి శ్రద్ధా బుద్ధులు కావాలి ఇష్టా ఇష్టాలు తెలుసుకోవాలి డెడికేషన్ కావాలి మరి మీ ఇష్టాలని వాళ్ళ మీద రుద్దకండి ఆ పసి ప్రాణాల్ని బలిగొరకండి మీ మానసిక పరిస్థితి బాగోకపోతే డాక్టర్స్ దగ్గరికి
(06:36) వెళ్ళండి మీ సమస్యని వాళ్ళకి వివరించండి అంతేకాకుండా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. అసలు థెరపీ అన్నవి అటువంటివి ట్రీట్మెంట్స్ ఏవో ఉంటాయి అవి తీసుకోండి. అంతేకానీ క్రూర మృగాల సైతం బిడ్డల్ని కాపాడుకుంటుంటే మీరు ఇదా చేసేది ఎంతో విలువైన మానవ జన్మ భగవంతుడు ఎందుకు ఇచ్చాడు ఏదో ఒక అర్థం లేకుండా ఇవ్వడు అది ఏమిటో అన్నది తెలుసుకోండి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వండి మిమ్మల్ని చూసి తల్లిదండ్రులు అందరూ క్రూర మృగాలు అవ్వకూడదు అని చెప్పి నేను ఈరోజు వీడియో చేయడం జరిగింది.
(07:09) ఎందుకు చూడండి మీరు కుక్క పిల్లల్ని పెడతది పంది పిల్లల్ని పెడతది వాటిని ఎంత జాగ్రత్తగా సంరక్షించుకుంటది. తన బిడ్డను ముట్టుకుంటేనే వెంటాడి కరిచి చంపుతుంది కుక్క గాని పంది గాని కోడి చూడండి కోడి తన పిల్లల్ని రక్షించుకోవడానికి గెద్ద నుంచి ఎగిరెగిరి ఆకాశంలోకి ఎగరలేకపోయినా ఎగిరెగిరి పొడుస్తూ ఉంటది కాకుల్ని గెద్దల్ని మరి వాటిలకు ఉన్న విచక్షణ జ్ఞానం మనకు లేదా ఇక పశువులు సైతం లేగ దూడల్ని ఎంతో ముద్దుగా సాకుతూనే ఉంటాయి తన నాలికతో స్పర్శతో చక్కగా నాకుతూ ఉంటాయి.
(07:44) మీరు చేసేది చాలా పొరపాట్లు మీ కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకోండి మీ మెంటల్ని ఇంట్లో చిన్న చిన్న సమస్యలకి డబ్బు లేదని భార్యా భర్తల మధ్య గొడవకి పక్కనోళ్ళని చూసి చుట్టాల్ని చూసి లేదా మనకన్నా పై స్థాయిలో ఉన్నారు ఎదిగిపోతున్నారు అందంగా ఉన్నారు అవి కొనుక్కున్నారు ఇవి కొనుక్కున్నారు ఇవి కొనుక్కున్నారు అని ఇటువంటి చిన్న చిన్న కారణాలు కూడా పిల్లల మీద రుద్దుతున్నారు పిల్లల్ని గొడ్డును బాదినట్టు బాతున్నారు.
(08:10) మిమ్మల్ని మీ అమ్మ నాన్న ఎలా పెంచారు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి గుర్తు తెచ్చుకోండి ఏ తల్లి తండ్రి అయిన కష్టం వచ్చిందని డబ్బు లేదని తింటానికి తిండి లేదని బిడ్డల్ని వదులుకోలేదు చంపుకోలేదు వెనకటి రోజుల్లో కానీ ఈ రోజుల్లో బిడ్డలు తల్లిదండ్రులని వదిలేస్తున్నారు ఇంత కూడు పెట్టట్లేదు ఆ స్టేజ్ కూడా దాటిపోయి తన బిడ్డల్నే తాను చంపుకుంటున్నారు అంటే పాము తన గుడ్లని తాను పొడుచుకొని తింటుంది చూసారా తాగుద్ది చూసారా అలా చేస్తున్నారు.
(08:43) మళ్ళీ మళ్ళీ ఇటువంటివి ఈ దురదుష్టకరమైన సంఘటనలు రిపీట్ కాకుండా జాగ్రత్త పడతారని ఆశిస్తూ రేపటి తరాన్ని కాపాడుకుందామని జాగ్రత్త పడుతూ మన కన్న బిడ్డలే మనకి ఆఖరి రోజులో మనకి కర్ర అవుతారని మనకి ఊతంగా నిలుస్తారని మీకు మరీ మరీ చెప్తున్నాను. జీవితంలో బతకటాకి చదువు ఒక్కటే మార్గం కాదండి జీవితంలో ఎలా బతకాలి ఎలాగైనా బతకాలి అన్నది ఇక్కడ సందేశం బతికి చూపించడం ఒక సవాలు మరి మీ బిడ్డల్ని మీరు కాపాడుకుంటారు కదు అనుక్షణం కంటికి రెప్పల కాపాడుకోండి.
(09:23) ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అందరికీ ఉపయోగపడుతుంది.

No comments:

Post a Comment