The Dark Web Explained | 96% of the Internet is Hidden | Here’s What’s Really Inside the Dark Web
Author Name:KR FACTS
Youtube Channel Url:https://www.youtube.com/@krtelugufacts
Youtube Video URL:https://www.youtube.com/watch?v=CL-gT8RdVGw
Transcript:
(00:00) మనం రోజు వాడే Google, YouTube, Instagram, Facebook ఇవన్నీ కలిపి మొత్తం ఇంటర్నెట్ లో కేవలం 4% మాత్రమే అని చెప్తే మీరు నమ్ముతారా? అవును మనం చూస్తున్న ఈ అద్భుతమైన డిజిటల్ ప్రపంచాన్ని సర్ఫేస్ వెబ్ అంటారు. మరి మిగతా 96% ఇంటర్నెట్ ఎక్కడ ఉంది? ఆ నీటి కింద ఉన్న 90% భాగాన్ని డీప్ వెబ్ అంటారు. ఇందులో మన బ్యాంక్ రికార్డ్స్, ప్రైవేట్ కార్పొరేట్ డేటాబేసెస్, పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అకౌంట్స్ ఉంటాయి.
(00:26) సర్చ్ ఇంజన్స్ కి కూడా దొరక్కుండా మన ప్రైవేసీని కాపాడడానికి ఈ డీప్ వెబ్ చాలా అవసరం. కానీ ఈ ఐస్బర్గ్ అడుగున ఎవరికీ కనిపించకుండా ఇంకా ఎవరికీ దొరకకుండా ఉద్దేశపూర్వకంగా దాచబడిన ఒక 6% చీకటి ప్రపంచం ఉంది. అదే డార్క్ వెబ్ ఇది ఎంత డేంజర్ అంటే ఇక్కడ మనుషుల ఐడెంటిటీ, క్రెడిట్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్స్ వాంట్ ఇన్ఫర్మేషన్ చివరికి ఇల్లీగల్ బ్యాండ్ ప్రొడక్ట్స్ అండ్ వెపన్స్ కూడా ఓపెన్ గా అమ్మబడతాయి.
(00:50) ఇదొక క్రిమినల్స్ అడ్డ ఇంటర్నెట్ లోని అత్యంత ప్రమాదకరమైన డార్క్ వెబ్ ని సృష్టించింది ఎవరు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ప్రపంచాన్ని గుర్తు చేసి శాసించే ఏదో ఒక అండర్ గ్రౌండ్ సైబర్ మాఫియా లేదా సూపర్ పవర్ఫుల్ హ్యాకర్ గ్యాంగ్ అనుకుంటే మీరు పూర్తిగా తప్పు దీన్ని సృష్టించింది సాక్షాత్తు అమెరికా దేశపు యుఎస్ మిలిటరీ అవును మీరు విన్నది ముమ్మాటికి నిజం అమెరికా సైన్యం ప్రపంచానికి అతి ప్రమాదకరమైన ఈ డార్క్ వెబ్ ని తయారు చేసింది.
(01:16) 1990 లో తమ సీక్రెట్ ఏజెంట్స్ కి సంబంధించిన డేటా ఎవరికీ దొరకకుండా ఉండటం కోసం యుఎస్ నావెల్ రీసెర్చ్ ల్యాబ్ లోని ముగ్గురు సైంటిస్ట్లు అంటే పౌల్ సివర్సన్, మికేల్ రేట్, డేవిడ్ గోల్డ్ స్లాగ్ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక అన్ట్రాగబుల్ నెట్వర్క్ ని డిజైన్ చేశారు. కానీ వాళ్ళు సృష్టించిన సెక్యూరిటీ సిస్టం ఈరోజు ప్రపంచంలోనే అతి పెద్ద సైబర్ క్రైమ్ నెట్వర్క్ గా ఎలా మారిపోయింది? ఇంటర్నెట్ లో ఉన్న ఈ డార్క్ వెబ్ అనే చీకటి సముద్రంలోకి మీకు ఎప్పుడైనా వెళ్ళాలి అనిపించిందా? లేదా ఎప్పుడైనా ట్రై చేశారా? సరే ఈ సముద్రం లోతు ఎంతో తెలుసా? మరి లోతు తెలియకుండా ఒక
(01:45) కాలు పెట్టడం ఎలా సో అందులోకి వెళ్ళడం నేరం కాదు కానీ అందులో ఏముందో తెలియకుండా అడుగుపెడితే తిరిగి రావడం అసాధ్యం. వెల్కమ్ టు కెఆర్ ఫాక్ట్స్ ఈరోజు మనం సర్ఫేస్ వెబ్ దాటి డీప్ వెబ్ లోకి దూకి ఆ డార్క్ వెబ్ తలుపులు తట్టబోతున్నాం. అసలు ఈ ఆనియన్ రౌటింగ్ ఎలా పనిచేస్తుంది? 2026 నాటికి ఏఐ బాట్స్ ఈ డార్క్ వెబ్ ని వాడి మనలాంటి సాధారణ మనుషులను ఎలా టార్గెట్ చేస్తున్నాయి ఇంకా రెడ్ రూమ్స్ లాంటివి నిజంగా ఉన్నాయా లేక అవన్నీ కేవలం క్రిమినల్స్ పనిన హనీ పాట్ ట్రాప్స్ మాత్రమేనా సో ఈ వీడియోలో నేను చెప్పబోయే ప్రతి ఒక్క ఫాక్ట్ అస్పర్ఎక్స్ఐ అండ్ చైన్
(02:18) అనాలసిస్ 2026 క్రిప్టో క్రైమ్ రిపోర్ట్ అండ్ఎఫ్bఐ అఫీషియల్ డాక్యుమెంట్ నుండి తీసుకున్న 100% వెరిఫైడ్ రీసర్చ్ సో మీ సీట్ బెల్ట్స్ ని వేసుకోండి. ఇంకా మీ బ్రౌసింగ్ హిస్టరీని పక్కన పెట్టండి. ఎందుకంటే మనం ఇంటర్నెట్ యొక్క అట్పడుగు పొరల్లోకి ప్రయాణించబోతున్నాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న లైక్ చేయండి అండ్ మీరు మా ఛానల్ కి కొత్త వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన టిఆర్ ఫ్యామిలీ లో జాయిన్ అయిపోండి.
(02:40) ఇంకా లేట్ ఎందుకు లెట్స్ డైవ్ ఇంటు ద డార్క్ వెబ్ నార్మల్ గా మీరు ఫోన్ లో కానీ లాప్టాప్స్ లో కానీ Google ఓపెన్ చేసి ఏదైనా వెబ్సైట్ సెర్చ్ చేస్తే ఏమవుతుంది? మీ ఐపి అడ్రెస్ డైరెక్ట్ గా ఆ వెబ్సైట్ సర్వర్ కి కనెక్ట్ అయిపోతుంది. అంటే మీరు ఏ ఊర్ నుంచి ఏ డివైస్ నుంచి ఏ టైం కి సైట్ ఓపెన్ చేశారో మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ కి అండ్ ఆ వెబ్సైట్ వాళ్ళకి పక్కగా తెలిసిపోతుంది.
(03:00) దీన్ని ట్రాక్ చేయడం చాలా ఈజీ. కానీ 1990స్ లో యుఎస్ మిలిటరీకి మరియు వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్స్ కి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. శత్రు దేశాల్లో ఉంటూ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ని అమెరికాకి పాస్ చేయాలి. అండ్ వాళ్ళని ఎవ్వరు ట్రాక్ చేయకూడదు. వాళ్ళ ఐపి అడ్రెస్ ఎవరికీ దొరకకూడదు. అప్పుడే వాళ్ళు కనిపెట్టిన ఒక బ్రహ్మాస్త్రం లాంటి టెక్నాలజీయే ఆనియన్ రౌటింగ్.
(03:21) ఈ ఆనియన్ రౌటింగ్ అనే పేరు ఎందుకు పెట్టారో తెలుసా ఒక ఆనియన్ కి ఎలాగైతే పొరలు పొరలుగా లేయర్స్ ఉంటాయో ఈ నెట్వర్క్ లో ట్రావెల్ అయ్యే మీ డేటాకి కూడా మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. దీన్ని యక్సెస్ చేయాలంటే మన నార్మల్క్రమపైఫాక్స్ లేదా ఎడ్జ్ లాంటి బ్రౌజర్స్ పని చేయవు. దీనికోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన టోర్ బ్రౌజర్ ద ఆనియన్ రౌటర్ ని వాడాలి.
(03:40) ఈ బ్రౌజర్ లో వెబ్సైట్స్ అన్నీ డాడ.com కా లేదా డాట్ఇన్ తో కాకుండా డాట్ ఆనియన్ అనే ఎక్స్టెన్షన్ తో ఎండ్ అవుతాయి. అసలు ఈ టార్ నెట్వర్క్ లోకి ఎంటర్ అయ్యాక ఏం జరుగుతుందో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే మీరు టోర్ వాడి ఒక డాట్ ఆనియన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఆ సిగ్నల్ డైరెక్ట్ గా ఆ వెబ్సైట్ కి వెళ్ళదు.
(03:58) ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది వాలంటీర్ కంప్యూటర్స్ వీటినే నోట్స్ అంటారు. సో వాటిలో ఏవైనా మూడు వేరు వేరు కంప్యూటర్స్ ద్వారా మీ డేటా జంప్ అవుతూ వెళ్తుంది. సో అందులో ఫస్ట్ ది వచ్చేసి ఎంట్రీ నోడ్ అంటే ఫస్ట్ మీ డేటా ఇక్కడికి వెళ్తుంది. వీనికి మీరు ఎవరో తెలుసు కానీ మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నారో తెలియదు. ఇంకా సెకండ్ వచ్చేసి రిలే నోడ్. ఇది వచ్చేసి మధ్యలో ఉంటుంది.
(04:18) వీనికి అసలు డేటా ఎవరు పంపారో తెలీదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. జస్ట్ వచ్చిన డేటాని పాస్ చేస్తుంది. ఇంకా థర్డ్ ఎగ్జిట్ నోడ్. ఇది ఫైనల్ గా డేటాని ఆ డాట్ ఆనియన్ వెబ్సైట్ కి పంపించేస్తుంది. కానీ ఈ డేటాని పంపింది మీరే అన్న విషయం దీనికి అసలు తెలియదు. దీని రిజల్ట్ ఏంటో తెలుసా మీ అసలు ఐపి అడ్రెస్ అండ్ లొకేషన్ ప్రపంచంలో ఎవ్వరికీ దొరకదు.
(04:37) అండ్ చివరికి మీరు వాడుతున్నజియో లేదాఎటల్ లాంటి ఇంటర్నెట్ ప్రొవైడర్స్ కి కూడా ఇంకా మీరు దేన్ని యాక్సెస్ చేస్తున్నారో కూడా తెలీదు. ఇది టోటల్ 100% అనోనిమిటీ. వాస్తవానికి 2002 లో ఈ టార్ట్ ప్రాజెక్ట్ ని పబ్లిక్ కి రిలీజ్ చేశారు. 2008 లో టోర్ బ్రౌజర్ ఫస్ట్ వెర్షన్ పబ్లిక్ లాంచ్ అయింది. అమెరికా ఉద్దేశం ఏంటంటే చైనా ఇరాన్ లాంటి నియంత్రిత దేశాల్లో సెన్సార్షిప్ ని ఎదుర్కొని జర్నలిస్టులు అండ్ యాక్టివిటీస్లు ప్రైవేట్ గా స్వేచ్ఛగా మాట్లాడుకోవాలని కానీ అనోనిమిటీ అనే పవర్ ఎప్పుడైతే పబ్లిక్ చేతికి వచ్చిందో అప్పుడు ఎవరికీ దొరకమన్న ధైర్యంతో ఇంటర్నెట్ లోని చీకటి మూలల్లో
(05:10) క్రిమినల్స్ తమ సామ్రాజ్యాన్ని నిర్మించడం స్టార్ట్ చేశారు. రీసెంట్ గా 2025 పాండ సెక్యూరిటీ అండ్ ప్రే ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ప్రకారం ప్రతిరోజు దాదాపు 3 మిలియన్ యూసర్స్ ఈ డార్క్ వెబ్ ని యాక్సెస్ చేస్తున్నారు. ఇందులో అత్యధికంగా యusఎస్ నుంచి 17.6% అండ్ జర్మనీ నుంచి 13.47% ట్రాఫిక్ వస్తుంది. ఇక్కడ ఒక విషయం మీరు చాలా క్లియర్ గా అర్థం చేసుకోండి.
(05:31) పర్ బ్రౌజర్ డౌన్లోడ్ చేసుకోవడం గానీ డార్క్ వెబ్ లోకి ఎంటర్ అవ్వడం గానీ నేరం కాదు. ఇట్స్ 100% లీగల్. మీ ప్రైవసీ కోసం దాన్ని వాడొచ్చు. కానీ ఆ డాట్ ఆనియన్ సైట్ లోకి వెళ్లి లీగల్ గా దొరికే ఏమైనా వస్తువులు కొనడం ఇంకా స్టోలెన్ డేటాని డౌన్లోడ్ చేయడం లేదా ఇల్లీగల్ కి సంబంధించిన ఫోరం ఫార్మ్స్ లో పాల్గొనడం లాంటివి చేస్తే మాత్రం అది పక్కగా క్రిమినల్ అఫెన్స్ మరి డార్క్ వెబ్ లో అసలు ఏం అమ్ముతున్నారు 2026 నాటికి మన కళ్ళ ముందే మన ఐడెంటిటీ ఎంత చీప్ గా అమ్మడవుతుందో చూస్తే మీరు నిజంగా షాక్ అవుతారు.
(06:01) మరి డార్క్ వెబ్ లో అసలు ఏం అమ్ముతున్నారు? ఈ చీకటి ప్రపంచం ఏదో ఒక గజిబిజిగా ఉండే హ్యాకర్స్ గ్రూప్ అయితే కాదు ఇదిఒక హైలీ ఆర్గనైజ్డ్ అన్గ్రౌండ్ ఎకానమీ అంటేఅమెon లో లేదాఫ్కార్ట్ లో మీరు వస్తువులు కొన్నప్పుడు ఎలాగైతే సెల్లర్ కి రేటింగ్ ఇస్తారో ఇంకా కస్టమర్ సపోర్ట్ ఉంటుందో డబ్బులు సేఫ్ గా ఉండడానికి ఎస్క్రో అకౌంట్స్ ఉంటాయో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అలాగే జరుగుతుంది.
(06:22) నమ్మడానికి కష్టంగా ఉన్న మేజర్ డార్క్ వెబ్ మార్కెట్ ప్లేసెస్ లో ఇవన్నీ ఉన్నాయి. అసలు వీళ్ళు తెఫ్డెడ్ డేటాని ఎందుకు అమ్ముతున్నారో తెలుసా? సో ఇప్పుడు క్రౌడ్ స్ట్రైక్ రిలీజ్ చేసిన 2023 డార్క్ వే ప్రైస్ ఇండెక్స్ ప్రకారం మాట్లాడుకుందాం. అంటే 5000 బాలెన్స్ ఉన్న ఒకరి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కేవలం 125 డాలర్స్ సుమారు 10వ000 రూపాయలు అండ్ 2000 డాలర్స్ బాలెన్స్ ఉన్న ఒక ఆన్లైన్ బ్యాంకింగ్ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ కేవలం 60 ఒక పర్సనల్ gిమెయిల్ అకౌంట్ అండ్ పాస్వర్డ్ జస్ట్ 60 మీ Facebook అకౌంట్ కేవలం 25 కమ్ముడు అవుతుంది.
(06:54) ఇంకా ఒక సంవత్సరంన సబ్స్క్రిప్షన్ కేవలం 20 అంటే జస్ట్ 1870కే దొరుకుతుంది. ఇంకా మీ సాంగ్స్ కి లేదా మ్యూజిక్ కి 1000 సౌండ్ క్లౌడ్ ప్లేస్ కావాలా కేవలం 1 డాలర్ ఇస్తే చాలు. ఇంకా ఫేక్ యusఎస్ గ్రీన్ కార్డ్ ధర కేవలం 450 డాలర్స్ అలాగే ఫేక్ పాస్వర్డ్స్ తయారు చేయడానికి వాడే యుకే పాస్వర్డ్ టాంప్లేట్ కేవలం 22 డాలర్స్ ఒకరిద్దరిది కాదు ఏకంగా ఒక కోటి 10 మిలియన్ల మంది ఈమెయిల్ అడ్రెస్సెస్ డేటాబేస్ కేవలం 120 డాలర్స్ కి అమ్మేస్తున్నారు.
(07:21) ఇంకా చెప్పాలంటే వెస్టరన్ యూనియన్ ద్వారా ఒక హ్యాక్ చేయబడిన అకౌంట్ నుండి 1000 డాలర్స్ పైన దొంగలించి ట్రాన్స్ఫర్ చేయడానికి హ్యాకర్లు తీసుకునే కమిషన్ కేవలం 32 డాలర్స్ మాత్రమే. ఒక వెబ్సైట్ వారం రోజుల పాటు పని చేయకుండా క్రాష్ చేయడానికి హ్యాకర్లు తీసుకునేది కేవలం 350 డాలర్స్ సో చూశరుగా వాళ్ళ దృష్టిలో మన ఐడెంటిటీ ఒక మనిషి కాదు జస్ట్ ఒక కమోడిటీ అంటే అమ్ముకునే ఒక సరుకు అందుకే డార్క్ వెబ్ లో జరిగే మొత్తం క్రైమ్స్ లో 65% కి పైగా కేవలం ఈ ఐడెంటిటీ థెఫ్ట్ గురించే ఉంటుంది.
(07:50) అండ్ 2022 నాటికి దాదాపు 1500 కోట్ల యూసర్ పాస్వర్డ్స్ అండ్ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ అమ్మకానికి వచ్చాయి. అయితే ఇదంతా ఒక ఎత్త అయితే డార్క్ వెబ్ లో మనుషుల ప్రాణాలతో ఆడుకునే ఇంకో చీకటి కోణం ఉంది. అదే డ్రగ్స్ అండ్ హ్యూమన్ ట్రాఫ్కింగ్ 2022 లోనే డార్క్ వెబ్ ద్వారా 470 మిలియన్స్ కి పైగా బ్యాన్ అయిన డ్రగ్స్ అంటే కోకైన్ ఫెనటైల్ లాంటివి సేల్స్ జరిగాయి.
(08:10) వీటన్నిటికీ మించి అత్యంత కిరాతకమైన చైల్డ్ నెట్వర్క్స్ ఇక్కడే రన్ అవుతున్నాయి. జర్మన్ పోలీసులు 2021లో టేక్ డౌన్ చేసిన బాయ్ స్టోన్ అనే నెట్వర్క్ లో ఏకంగా 4 లాక్స్ రిజిస్టర్డ్ యూసర్స్ ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి. డార్క్ వెబ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే రెడ్ రూమ్స్ అండ్ టాక్సిక్ అడల్ట్ కంటెంట్ అంటే ఒక మనిషిని లైవ్ లో కెమెరా ముందు కట్టేసి డబ్బులు కట్టిన వాళ్ళు చెప్పినట్లుగా ఆ మనిషిని కిరాతకంగా చేసే ప్రదేశాలను రెడ్ రూమ్స్ అంటారు.
(08:39) ఇవి నిజంగానే ఉన్నాయా చాలా మంది ఏమనుకుంటారంటే ఇవి రూమర్స్ అనే అనుకుంటారు. కానీ ఈరోజు నేను మీకు విత్ ప్రూఫ్స్ అండ్ అఫీషియల్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయో చూపిస్తాను. ముందుగా ఒక టెక్నికల్ నిజం మాట్లాడుకుందాం. పార్ బ్రౌజర్ లో డేటా మోడ్ వేరు వేరు దేశాల నోట్స్ ద్వారా జంప్ అవుతూ వస్తుందని ఇందాకనే చెప్పుకున్నాం కదా దీనివల్ల ఇంటర్నెట్ స్పీడ్ ధారుణంగా పడిపోతుంది.
(08:55) ఎంతలా అంటే ఒక నార్మల్ హెచడి ఫోటో లోడ్ అవ్వడానికి కొన్ని సెకండ్స్ పడుతుంది. అలాంటప్పుడు హై క్వాలిటీ వీడియోని లైవ్ స్ట్రీమింగ్ చేయడం టార్ నెట్వర్క్ లో టెక్నికల్ గా 99% అసాధ్యం. అండ్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అండ్ ఎఫ్బిఐ రిపోర్ట్స్ ప్రకారం ఇంటర్నెట్ లో కనిపించే లైవ్ రెడ్ రూమ్స్ అన్నీ కస్టమర్స్ దగ్గర నుంచి బిట్కాయిన్స్ ని దొంగలించడానికి హ్యాకర్స్ క్రియేట్ చేసిన ఫేక్ స్కామ్ మాత్రమే.
(09:17) కానీ ఆగండి లైవ్ స్ట్రీమ్ ఫేక్ అవ్వచ్చు కానీ అక్కడ జరిగే కిరాతకమైన క్రైమ్స్ మాత్రం ఫేక్ కాదు 100% రియల్ ఈ డార్క్ వెబ్ లో కిరాయి గ్యాంగ్స్ ఉంటాయి. ఎవరైనా డబ్బులు ఇచ్చి చేయించొచ్చా? దీనికి ఆన్సర్ 100% ఎస్ దీనికి బెస్ట్ ప్రూఫ్ ఏంటంటే డార్క్ వెబ్ లోనే అతి పెద్ద మార్కెట్ అయిన సిల్క్ రోడ్ క్రియేటర్ రోజ్ వుల్ బ్రేక్. ఇతను తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం తన డేటాని లీక్ చేస్తానని బెదిరించిన ఆరుగురు వ్యక్తులని మర్డర్ చేయించడానికి ఏకంగా 7,30,000 డాలర్లు అంటే సుమారు 6 కోట్ల రూపాయలకి కిరాయి గ్యాంగ్ కి పేమెంట్ చేశాడు.
(09:47) ఇదేదో నేను చెప్తున్న కథ కాదు. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అఫీషియల్ ప్రెస్ రిలీజ్ లో స్వయంగా ఎఫ్బిఐ బయట పెట్టిన పక్కా ప్రూఫ్. ఈ క్రైమ్స్ వల్లే అతనికి జీవిత ఖైదు అంటే లైఫ్ సెంటెన్స్ పడింది. ఇలాంటిదే ఇంకొక భయంకరమైన కేస్ డెసా మాఫియా. ఇది డార్క్ వెబ్ లో ఒక ఫేమస్ హిట్ మన్ వెబ్సైట్. ఎవరినైనా యక్సిడెంట్ లాగా చేయాలంటే ఇంత రేటు గన్తో చేయాలంటే ఇంత రేట్ అని మెనుూ కార్డు పెట్టి మరి ఆర్డర్ తీసుకునేవారు.
(10:12) కానీ చివరికి ఏమైందో తెలుసా ఒక హ్యాకర్ ఆ సైట్ ని హ్యాక్ చేసి ఆ డేటాబేస్ ని పోలీసులకి ఇచ్చేసాడు. ఆ సైట్ నడిపేవాడు స్కామర్ అయి ఉండొచ్చు. కానీ వాడికి డబ్బులు కట్టిన వాళ్ళు స్కామర్స్ కాదు పగర్తో రగిలిపోతున్న నిజమైన ప్రజలు బిజినెస్ పార్ట్నర్స్. వాళ్ళు నిజంగానే లక్ష రూపాయల బిట్కాయిన్స్ ని ఆ సైట్ కి పే చేశారు. ఇంకా ఆ డేటాబేస్ ఆధారంగా ఇంటర్నేషనల్ పోలీసులు ఎంతో మందిని రియల్ లైఫ్ లో అరెస్ట్ చేశారు.
(10:32) అంతేకాదు లైవ్ రెడ్ రూమ్స్ ఉండకపోవచ్చు. కానీ రికార్డ్ చేయబడిన ఎక్స్ట్రీమ్ కోర్ వీడియోస్ అండ్ కిరాతకమైన చైల్డ్ నెట్వర్క్స్ ఇక్కడ ఒక పెద్ద మాఫియాలా నడుస్తున్నాయి. ఒక మనిషిని కిడ్నాప్ చేసి వాళ్ళని చీకటి గదుల్లో బంధించి వాళ్ళను అత్యంత కిరాతకంగా టార్చర్ చేసిన వీడియోలని కొన్ని వేల డాలర్లకి ఈ డార్క్ వెబ్ ఫారామ్స్ లో అమ్ముకుంటున్నారు.
(10:52) యూరోపోల్ 2024 రిపోర్ట్స్ ప్రకారం కేవలం ఇలాంటి రాక్షస ఆనందం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే సైకోపాత్స్ ఈ నెట్వర్క్ లో వేల సంఖ్యలో ఉన్నారు. ఈ చీకటి ప్రపంచంలోకి పొరపాటున ఒక సాధారణ మనిషి ఎంటర్ అయితే వాళ్ళ బ్రెయిన్ వాష్ అయిపోయి మెంటల్ గా డిస్టర్బ్ అవ్వడం 100% గ్యారెంటీ. అయితే నిన్నటి వరకు మనుషులు మాత్రమే ఈ డార్క్ వెబ్ ని శాసించారు.
(11:11) కానీ 2025 ఎండింగ్ నాటికి ఈ డార్క్ వెబ్ లోకి మనుషులకంటే భయంకరమైన ఒక కొత్త శక్తి ఎంటర్ అయింది. దానికి ప్రాణం లేదు కానీ బ్రెయిన్ ఉంది. అదే అన్సెన్సార్డ్ ఏఐ అది ఇప్పుడు డైరెక్ట్ గా మన ఇండియన్స్ ని ఇంకా మన తెలుగు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ని ఎలా టార్గెట్ చేస్తుందో తెలుసా? తెలిస్తే మీరు మీ ఫోన్ వాడాలన్నా కూడా వనికిపోతారు. అంటే నిన్నటి వరకు ఎలా ఉండేదంటే ఇంటర్నెట్ లో ఎవరినైనా హ్యాక్ చేయాలంటే నెలలు తరబడి కోడింగ్ నేర్చుకోవాలి సాఫ్ట్వేర్ రాయాలి కానీ ఇప్పుడు ఆ సీన్ మొత్తం మారిపోయింది.
(11:37) ఎందుకంటే డార్క్ వెబ్ లోకి ఒక కొత్త సైబర్ క్రిమినల్ వచ్చాడు. వాడి పేరే అన్సెన్సార్డ్ ఏఐ. మనం వాడే చార్ట్ జిపిటి లేదా జెమినై లోకి వెళ్లి హౌ టు హ్యాక్ ఏ బ్యాంక్ అకౌంట్ అని అడిగితే అవి వెంటనే సారీ ఐ కాంట్ ఆన్సర్ అని ఆన్సర్ ఇస్తాయి. ఎందుకంటే వాటికి ఎథిక్స్ అండ్ సేఫ్టీ ఫిల్టర్స్ ఉంటాయి. కానీ డార్క్ వెబ్ లో అమ్ముడవుతున్న ఫ్రాడ్ జిపిటి వామ్ జిపిటి అండ్ డిఐజిఏ లాంటి మోడల్స్ కి ఎలాంటి రూల్స్ అండ్ ఫీచర్స్ ఉండవు.
(12:02) సో ఒక స్కామర్ వెళ్లి హౌ టు హాక్ ఏ బ్యాంక్ అకౌంట్ అని అడిగితే అది క్లియర్ గా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. [సంగీతం] అండ్ దానికి కావాల్సిన పర్ఫెక్ట్ కోడ్ ని రాసి ఇచ్చేస్తుంది. సో ఈ టెక్నాలజీ వల్ల ఇప్పుడు కోడింగ్ లాని ఒక నార్మల్ క్రిమినల్ కూడా ఒక ప్రొఫెషనల్ హ్యాకర్ లాగా మారిపోతున్నాడు. దీన్నే వాళ్ళు ఫ్రాడ్ యస్ ఏ సర్వీస్ అని పిలుస్తున్నారు.
(12:20) కానీ కేవలం బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ చేసి డబ్బులు దొంగలించడం మాత్రమే కాదు మన పరువుని ప్రాణాల్ని తీసే భయంకరమైన టెక్నాలజీ ఈ డార్క్ వెబ్ లో పుట్టుకొచ్చింది. అదే ఏఐ డిఫెక్స్ మనలో చాలా మంది రోజు సరదాగా Instagram అండ్ Facebook లో మన ఫోటోస్ అండ్ వీడియోస్ పబ్లిక్ గా అప్లోడ్ చేస్తూ ఉంటాం. కానీ ఆ ఫోటోస్ ని టార్గెట్ చేసి ఈ డార్క్ వెబ్ క్రిమినల్స్ డీప్ ఫేక్స్ క్రియేట్ చేస్తున్నారు.
(12:41) డార్క్ వెబ్ లో ఎలాంటి సెన్సార్ షిప్ లేని కొన్ని అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్ అమ్మబడుతున్నాయి. సో క్రిమినల్స్ వాటిని కొని సోషల్ మీడియాలో ఉన్న నార్మల్ ఫొటోస్ ని తీసుకొని అత్యంత అసభ్యకరమైన వీడియోస్ లో మీ ముఖాన్ని అతికించి పర్ఫెక్ట్ గా డీఫై క్రియేట్ చేస్తున్నారు. ఆ వీడియో చూడడానికి 100% సేమ్ పర్సన్ ఉన్నట్టే కనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళు మీకు WhatsAppట్ లోనో మెయిల్ లోనో ఆ ఫేక్ వీడియో పంపి బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు.
(13:03) ఇది ఎంత దారుణంగా మారిపోయిందంటేఎఫ్bిi అండ్ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ 2022 టు 2024 రిపోర్ట్స్ ప్రకారం ఈఏఐ డీ ఫేక్ బ్లాక్ మెయిల్ కేసులు ఏకంగా 500% వరకు పెరిగిపోయాయి. పరువు పోతుందన్న భయంతో ఇంకా ఫేక్ వీడియోస్ ని ఎక్కడ వైరల్ చేస్తారన్న టెన్షన్ తో ఎంతో మంది అమాయకులు అండ్ స్టూడెంట్స్ డిప్రెషన్ లోకి వెళ్లి ప్రాణాలు కూడా తీసుకున్నారు.
(13:22) టెక్నాలజీ ఇస్తున్న పవర్ తో దొరకమన్న ధైర్యంతో ఈ టైప్ ఆఫ్ డార్క్ వెబ్ యూసర్స్ ఇప్పుడు డిజిటల్ టెర్రరిస్ట్ లాగా మారిపోయారు. అండ్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న డార్క్ వెబ్ సామ్రాజ్యం గురించి అండ్ ఇక్కడ జరుగుతున్న క్లైమ్స్ గురించి విన్నాక మీకు ఈ డార్క్ వెబ్ క్రూయల్ గా అనిపించొచ్చు. కానీ ఈ చీకటి ప్రపంచం ఉంది కదా అని మనం ఇంటర్నెట్ వాడడం మానేయలేం.
(13:42) ఇంకా టెక్నాలజీకి దూరంగా బతకలేం. ఇక్కడ మనకు కావాల్సింది భయం కాదు అవేర్నెస్ మనం భయపడాల్సింది హ్యాకర్లని చూసి కాదు మనలో ఉన్న నెగ్లిజెన్స్ ని చూసి సో ఈరోజు నుంచే కొన్ని రూల్స్ మార్చుకోండి అంటే మీ సోషల్ మీడియా అకౌంట్ ని ప్రైవేట్ లో పెట్టుకోండి అండ్ మెయిన్ గా ఏంటంటే ఎవరికో చూపించుకోవడానికి పబ్లిక్ లో ఫోటోలు పెట్టకండి.
(14:01) ఇంకా ఏ అకౌంట్ కైనా సరే టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ లో ఉంచుకోండి. అండ్ WhatsAppట్ లో లేదా మెయిల్స్ లో వచ్చే అన్నోన్ లింక్స్ ని పొరపాటుని కూడా క్లిక్ చేయకండి. మన డేటాని మనం కాపాడుకోవడమే ఈ సైబర్ రాక్షసుల నుండి తప్పించుకునే ఏకైక మార్గం. అండ్ ఈ వీడియో క్లోజ్ చేసే ముందు ఒకసారి మీ ఫోన్ ఫ్రంట్ కెమెరా సైడ్ చూడండి. మీరు ఏ యాప్ ఓపెన్ చేయకపోయినా మీ ప్రమయం లేకుండానే ఆ కెమెరా మిమ్మల్ని రికార్డ్ చేసి మీ డేటాని డార్క్ వెబ్ లో అమ్ముతుందంటే ఎలా ఉంటుంది అందుకే టెక్నాలజీ ఇచ్చిన ఫ్రీడమ్ ని ఎంజాయ్ చేయండి అని గుడ్డిగా నమ్మకండి.
(14:28) సో వెంటనే మీ పాస్వర్డ్స్ మార్చుకొని టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోండి. అండ్ ఈరోజు నేను మీకు ఒక పవర్ఫుల్ అలర్ట్ ని ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ మైండ్ ని బ్లాంక్ చేసి ఉంటే మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసి గట్టిగా ఒక లైక్ వేసుకోండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా సేఫ్ గా ఉండాలి కదా అండ్ ఇలాంటి వెరిఫైడ్ ఫాక్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
(14:49) సరే గాయస్ మరి ఇంకొక మైండ్ బ్లోయింగ్ రియాలిటీతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు సేఫ్ గా ఉండండి మీ డిజిటల్ ఫుట్ ప్రింట్ మీదనే కన్నేసి ఉంచండి. జై హింద్.
No comments:
Post a Comment