What game's🥺 are playing maaya 👹with devotees 🧘
Author Name:చూడామణి1M
Youtube Channel Url:https://www.youtube.com/@chudamani812
Youtube Video URL:https://www.youtube.com/watch?v=qEnPSMjWDeo
Transcript:
(00:00) ఓం నమో నారాయణాయ భక్తి మార్గంలో భక్తులు చక్కగా భక్తి చేసుకుందాం అని చెప్పేసి ఏదో ఒక సాధన అనేది చేస్తూ ఉంటే మాయ అనేది వచ్చి మనల్ని బ్రమలకు గురిచేసి భక్తి మార్గంలో నుంచి మనల్ని బయటికి రప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటదండి అయితే ఈ మాయ అనేది ఏంటి అని అంటే మీకు ముందు తెలవాలన్నమాట మాయ అంటే ఏంటో కాదండి ఈ మాయ కూడా అందరి చుట్టూ ఏమీ ఉండదు ఎవరైతే కర్మలు కష్టాలు ఆ కోరికలు ఇవన్నీ ఎక్కువ ఉండి వాటికోసమే జీవిస్తూ ఉంటారు.
(00:34) అలాంటి వాళ్ళ చుట్టే కష్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఉంటాయి చూడండి కష్టాలు ఎక్కువగా ఉండి వాటికోసం ఎప్పుడూ అల్లలాడుతూ ఉంటారు కోరికల కోసం అల్లలాడుతూ ఉంటారు. ఈ ఇవన్నీ ఎందుకు ఈ విధంగా ఉంటారు అని అంటే వీళ్ళు భక్తి మార్గంలో పురోభివృద్ధి సాధించాలి అంటే వీళ్లే కాదు ఎవ్వరైనా కూడా భక్తి మార్గంలో పురోభివృద్ధి సాధించాలి అంటే ఏం చేయాలి మనకు మనం మాయ నుంచి బయట పడాలి అవునా మాయ నుంచి బయటపడే ప్రాసెస్ే భక్తి మార్గం అవునా మనం కష్టాల కోసము కోరికల కోసం భక్తి మార్గంలోకి వచ్చినా కూడా అదంతా మాయే అని చెప్పేసి మనకు పరమాత్మ మనకు తెలియజేస్తూ ఉంటాడు అన్నమాట అయితే ఈ మాయ అనేది మన
(01:20) చుట్టూ ఈ నెగిటివ్ శక్తుల రూపంలో అంటే భూతప్రేత పిశాచ గణాల రూపంలో రూపంలో కాదు అవే భూతప్రేత పిాచ గణాలు మన చుట్టూ ఫామ్ అయి ఉంటాయి అన్నమాట దాన్నే మాయ అనొచ్చు అన్నమాట అవి ఏం చేస్తాయి అంటే మాయలో కూరుకుపోయేటట్టు మనల్ని అనుక్షణము కనిపెట్టుకొని మనల్ని మాయలో నుంచి బయట పడకుండా ఆత్మజ్ఞానం వైపుకు మనల్ని వెళ్ళకుండా మనకి కాపు కాస్తూ ఆధ్యాత్మిక ప్రయాణంలో అడ్డంకులు తీసుకొస్తూ ఉంటాయి అన్నమాట ఎట్లా అంటే ఆధ్యాత్మిక ప్రయాణం అనేది అది కష్టతరము అందులోకి వస్తే కష్టాలు తప్ప సుఖాలు ఉండవు అని మనల్ని భ్రమలకు గురి చేస్తూ ఉంటది అన్నమాట.
(02:01) అంతేకాదు ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తే భయంకరమైన అనుభవాలు అనేవి కలిగిన కలుగుతాయి కదా కలుగుతాయి. ఎందుకంటే ఈ భక్తి అనేది చేస్తూ ఉన్నప్పుడు నిరంతరంగా చేస్తూ ఉన్నప్పుడు మీకు తప్పకుండా భగవంతుని యొక్క అనుభూతులు అనేవి కలుగుతాయి. ఆ అనుభూతులు మీకు కొత్త కొత్తలో కాబట్టి మీరు అనుభూతులను చూసి విని చూసి భయపడే ఆస్కారం కూడా ఉంటది.
(02:27) ఇట్లా ఇవి భయపెట్టిస్తాయి కూడా అన్నమాట ఇట్లా భక్తుడు భగవంతునిలో లీనం అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటే అందులో నుంచి బయటికి లాక్కవచ్చి బయట పడేస్తూ ఉంటాయి అన్నమాట ఏంటి ఈ మాయ అనే ఈ నెగిటివిటీ శక్తులు అన్నమాట అయితే అందుకనే భగవంతుని యొక్క అనుభూతులను పొందడము భగవంతుని యొక్క ప్రేమను పొందడం అంత ఈజీ ఏం కాదండి కర్మలు అనేవి చాలా విపరీతంగా ఉన్నప్పుడు భక్తిమార్గ లో కూడా అడ్డంకులు చాలా వస్తాయి ఇవి తీసుకొస్తాయి అన్నమాట మనకి భక్తి మార్గంలో అడ్డంకులు అనేవి ఈ నెగిటివిటీ శక్తులు అనేవి తీసుకొస్తాయి మనల్ని ఎట్లఎట్లా తీసుకొస్తాయి అనింటే మనం భక్తి మార్గంలోకి ఇట్లా ప్రవేశించగానే కష్టాలు స్టార్ట్
(03:12) అవుతాయి కష్టాలు స్టార్ట్ కాంగానే అరే ఎందుకు వచ్చిన భక్తి మార్గం అని మనం బయట పడడానికి చూస్తాం అన్నమాట అంటే భక్తిని ఆపేస్తారు చాలా మంది ఆపేస్తారండి ఆ వాడు చూడండి పక్కింటోడు ఏం భక్తి చేస్తున్నాడుఅని వాడు బాగనే ఉన్నాడు కదా అని చెప్పేసి ఇంకా మనల్ని మనమే సమర్ధించుకుంటాం కూడా అన్నమాట నిత్య పూజ కూడా ఆపేస్తాం ఆ మాయలో మన బుద్ధి బ్రష్టు పట్టిపోతుది అన్నమాట ఈ నెగిటివిటీ శక్తులు చేసే ప్రయత్నమే అదన్నమాట బుద్ధిని బ్రష్ట్ పట్టించేసేసి భక్తి ఎందుకులే హాయిగా ఇట్లా ఉందాం నార్మల్ గా తింటూ ఆ పని చేసుకుంటూ తింటూ సంసారం చేస్తూ పిల్లల్ని కన్నాం కదా
(03:45) వాళ్ళని చూసుకుంటూ ఉందాం అంతే అనుకుంటారు. కానీ వాళ్ళ ఆ కష్టాలు విపరీతంగా రాంగానే ఏం చేస్తారు అట్లా భక్తి మార్గాలం నుంచి బయటికి వస్తారు కొంతమంది ఏం చేస్తారంటే తెలుసుకుంటారు అన్నమాట అది భక్తి మార్గంలో ఎట్లా ఉంటదంటే మాయని గ్రహించేలాగా కూడా భగవంతుడు సహాయం చేస్తూ ఉంటాడు అది పూర్వజన్మ కృప వలన ఇది మాయ అని చెప్పేసి ఇట్లా బుద్ధిని బ్రష్ట్ పట్టిస్తాయి అన్నమాట అంతే కాదు ఇంకొకటి ఏం చేస్తాయ అంటే ఈ ఇవి ఎక్కువ అల్లల్లాతాయి అన్నమాట ఎందుకంటే నెగిటివిటీ శక్తులు అనేవి మనకు దూరమవుతాయండి భక్తి మార్గంలో భగవంతుడికి మనము అతి దగ్గరగా అవుతున్న కొద్దికి ఏం
(04:21) జరుగుతుందంటే ఈ నెగిటివిటీ శక్తులు మనకు దూరంగా అయిపోతూ ఉంటాయి అన్నమాట అంటే మాయా మనల్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటది అన్నమాట ఇక మనం కష్టాలకు కూడా భయపడం అంటే కోరికలు కూడా తీరుతూ ఉంటాయి స్లో ప్రాసెస్ లో అమ్మవారు ఏది ఇవ్వాలనా అనేది అది ఇస్తూ ఉంటది కాకపోతే కోరికలు కోరికలు కష్టాలు అంతా మాయే భగవంతుడే నిత్యం అని చెప్పేసి భగవంతుడి పట్ల ప్రేమతోని ప్రేమ ఎక్కువైపోయి భగవంతుడు అనుభూతులకు లోనైపోయి ఆ ఆనందాన్ని చవి చూసిన తర్వాత ఈ కోరికలు కష్టాలు అనేవి వాటికి చలించవ అన్నమాట ఇగ మనం ఆ అసలు ఏమో అంటారు శాస్త్రం ఉంటది చూడు మొండోడు అని చెప్పేసి ఏదో ఒక శాస్త్రం ఉంటది దానిలాగా
(05:03) ఏందంటే అసలుకి మనకి ఆ ఏదో దున్నపోతు మీద వాన గురిచినట్టుగా అంటారు చూడండి దున్నపోతు మీద వాన కూర్చిన దానికి ఏం స్పందన ఉండదు అట్లాగే నిలిచి ఉంటది అట్లా అన్నమాట ఉదాహరణకు అట్లా వచ్చేసింది గుర్తొచ్చింది చెప్తున్నా అట్లా మనకి కష్టాలు కడగండ్లు ఆ ప్రేమలు అవమానాలు నిందలు ఇవన్నీ మనల్ని ఏమి చేయవన్నమాట అసలు మనం స్పందించనే స్పందించమ అన్నమాట అర్థమవుతుందా భగవత్ శక్తి మన దగ్గరికి ఎంతెంత ఫామ్ అవుతూ ఉంటే మనం అంతంత స్ట్రాంగ్ అవుతూ ఉంటామ అన్నమాట ఆ స్ట్రాంగ్ అయ్యే క్రమంలో మాత్రం ఈ నెగిటివిటీ శక్తులు ఉంటాయి కదా వాటి డ్యూటీ అవి చేయడానికి ఇవి మనల్ని
(05:41) భయపెట్టేయడానికి చూస్తాయి అన్నమాట ఏంటిది కలల రూపంలో కూడా భయపెట్టిస్తాయి ఇట్లా మనం భక్తి భక్తి మార్గంలోకి అడుగు పెట్టినమో లేదో ఇక కలలు నిద్ర పోతే చాలు కళ్ళు మూస్తే చాలు ఇంకా భూత ప్రేతాలు పిశాచ గణాలు ఏవో విచిత్ర లోకాలు విచిత్ర లోకాలు రక్తాలు బ్యాడ్ బ్యాడ్ కలలు అసహ్యకరమైన కలలు ఇంకా చెప్పలేని చండాలమైన కలలు ఇవన్నీ పడతాయి అన్నమాట ఆ నిజం మీరేమో అనుకుంటారు నేనేమో భక్తి మార్గంలోకి వచ్చినా ఆ మంచిగా భక్తి చేస్తున్నా నేను మంత్ర జపం చేస్తున్నా నేనేమో నిత్య పూజ చేస్తున్నా అమ్మ అమ్మ అని కలవరిస్తున్నా నాకెందుకు ఇంత దరిద్రపు కలలు పడుతున్నాయి అని మీకు అనుమానం వస్తది
(06:20) అన్నమాట అనుమానం వస్తది కొంతమంది ఏంది కలల వలన డిస్టర్బ్ అయితారు అన్నమాట డిస్టర్బ్ అయి కలల వల్ల డిస్టర్బ్ అయి భయపడి ఈ పాడుకాల లేనిది ఆపేద్దాం అని అట్లా కూడా ఆపేసి భక్తి మార్గాలు వచ్చి బయటికి వచ్చేస్తారు. ఇట్లా కూడా జరుగుతుంది. ఇంకేం చేస్తారంటే ఈ మాయ మీరు ఏమైనా వ్రతాలు దీక్షలు చేసేటప్పుడు కూడా మీ జిహవ చాపల్యాన్ని పెంచుతాయి అన్నమాట.
(06:44) మీరు మీరు వ్రతంలో దీక్షలో లేదా ఒకరోజు ఒక పొద్దులో ఉన్నా కూడా మీకు మటన్ మీద చికెన్ మీద నోట్లో నీళ్లు ఊరుతాయి అన్నమాట చికెన్ తినేసేయాల అని అనిపిస్తుంటది అన్నమాట అంటే చుట్టూ ఉన్న నెగిటివిటి శక్తులు మీ జిహ్వ చాపల్యాన్ని పెంచుతాయి అన్నమాట ఇట్లా కూడా చేసేసి మన భక్తిని అటకెక్కించే ఆస్కారం అనేది ఉంటదన్నమాట కాబట్టి జిహ్వ చాపల్యాన్ని చంపమని మీ ఇష్ట దైవానికి ప్రార్థన చేస్తే పరమాత్మ మనకు సహాయం చేస్తాడు అన్నమాట ఆ జిహ్వ చచాపల్యాన్ని చంపేస్తాడు ఆ ఇది నిజం మనం అడగం కానీ నిజంగా ఉన్నాడు అని చెప్పేసి విశ్వాసంతో అడిగితే ప్రతిఒక్క కోరిక నెరవేరుస్తాడు
(07:20) పరమాత్మ ఇట్లా జీవ చాపల్యాన్ని పెంచడమే కాకుండా విపరీతంగా ఊరికూరికే కోపం వస్తుంటది. అదొకటి మళ్ళీ ఇంకా ఇంకొకటి జరుగుతది ఏందంటే ఇతరులు ఎవరైనా వచ్చి మనల్ని భక్తి మార్గంలో నుంచి పక్కదోవట్టేయాలని కూడా చూస్తారన్నమాట అది కూడా ఈ మాయ ఈ నెగిటివిటీ శక్తులు చేసే పనే అన్నమాట వాళ్ళని ప్రేరేపిస్తే అన్నమాట ఎందుకు వచ్చినా భక్తి ఎంజాయ్ చేద్దాంరా సినిమా చూద్దాంరా ఆ ఎందుకు రోజు పొద్దున్న వెళ్లి అంత కష్టపడి దీపం వెలిగిస్తున్నావ్ నువ్వుల నూనె అంతా వేస్ట్ చేస్తున్నావ్ ఒత్తులు వేస్ట్ చేస్తున్నావ్ ఏంది ఇదంతా అగరొత్తుల పోగా ఇంట్లో ఎందుకు ఎందుకు
(07:57) ఇదంతా అగరొత్తుల పోగ మంచిది కాదు ఆరోగ్యానికి శ్వాసకోషాలు దెబ్బతింటాయి అది ఇది అంతా చెప్పేసి మొత్తానికి అయితే భక్తి మార్గం నుంచి బయటికి రప్పించాలని చూస్తారన్నమాట కానీ నిజంగా భగవత్ కృప అనేది ఉంటే ఎవ్వరు ఎన్ని చెప్పినా కూడా వినమన్నమాట మనం వినం ఆ నిజంగా భగవత్ కృప ఉంటే ఇలాంటి వీడియో వాళ్ళ కళ్ళ ముందరికి వచ్చేస్తే వాళ్ళు తెలుసుకుంటారు కూడా అలాంటి మాయా వ్యక్తుల దగ్గర నుంచి కూడా దూరం అవుతూ ఉంటాం అన్నమాట మనం ఆ ఇంకా శారీరక సౌందర్య మీద ఆహా అందం అందం మీదకి ఆకర్షణ వెళ్ళిపోతది కొంతమంది భక్తి మార్గంలోకి వస్తారు కానీ సడన్ గా ఎవడో ఒకడు వచ్చి దుర్వ్యసనాలు అనేవి
(08:37) నేర్పించడం అనేది జరుగుతది పురుషులు అయితే మందు నేర్పించడం అది సడన్ గా భక్తి మార్గంలోకి వచ్చి మందు తాగడం సిగరెట్ తాగడం ఏంది ఇదేంది ఇంకఎక్కువ తాగుతారు ఇంకెక్కువ ఆ కొన్ని వ్యసనాలు అనేవి నేర్చుకుంటారు కామాసక్తి ఎక్కువైపోతది కొంతమందికి ఆ ఎందుకు ఇట్లా ఈ ఇవి చేస్తాయండి భగవంతుడు కాదు అది చేసేది ఇవి ఈ నెగిటివిటీ శక్తులు అనేవి మన కర్మలు మన కర్మలు అన్నమాట ఆ ఎందుకు చేస్తాయి అంటే ఏ మేము ఎందుకు ఉన్నామ అనుకుంటున్నావు ఇవంటంటే నెగిటివిటీ శక్తులు అనుకుంటాయి అన్నమాట ఏమని మేము ఎందుకు ఉన్నాం మీరు చేసిన పాప కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ చేత
(09:17) అనుభవింపజేయడం కోసమే మేము ఇక్కడ ఉన్నాం మీ పక్కన మీరేమో అనుభవించకుండా ఉండడం కోసం భగవంతుని పాదాలు పట్టుకుంటే మా డ్యూటీ ఏమైపోతది ది ఆ మేము డ్యూటీ సరిగ్గా చేయలేదు అని చెప్పేసి మాకు పైనుంచి ఆర్డర్స్ వస్తాయి కాబట్టి వీళ్ళ ఏం చేస్తారంటే ఈ నెగిటివిటీ శక్తులు ఏం చేస్తాయి అంటే మనల్ని అన్ని విధాలుగా మనల్ని భ్రష్టత్వం పట్టించడానికి మనల్ని ప్రయత్నిస్తూ ఉంటాయి అన్నమాట ఇట్లా ఈ గర్వం అహంకారం కూడా వచ్చే ఆస్కారం ఉంటది ఓ చివరి చివరి అని చెప్పను కానీ భక్తి మార్గంలో ఒక మధ్య స్థాయిలోకి వెళ్ళినంక సిద్ధులు మనకు సిద్దులు అనేవి జాగృతం
(09:54) అయినంక ూడా మన ఈ నెగిటివిటీ శక్తులు ప్రయత్నిస్తాయి బయటికి తీసుకురావడానికి ఎట్లా సిద్ధులు వచ్చినయి నాకు అని చెప్పేసి తల నెత్తి మంట నెత్తి మీద కొమ్ములు మొలిచినట్టు అయిపోతది మనకి గర్వం అహంకారం నేను నార్మల్ పర్సన్ కాదు అని చెప్పేసి ఒక అహంకారం అనేది వస్తది అప్పుడు కూడా మనం భక్తి మార్గంలో ఇక ముందుకు వెళ్ళలేము అడ్డుకట్ట పడిపోతది అన్నమాట ఈ ఇవన్నీ చేసే చర్యలు ఎవరు అనుకున్నారు మన కర్మలే ఆ మరి అందరూ ఎందుకు అందరికీ ఎందుకు ఇలాంటివి జరగవు కొంతమంది రాకెట్ లాగా దూసుకొని వెళ్ళిపోతూనే ఉంటారు.
(10:26) ఆ చిన్నప్పుడు నుంచే యోగి లక్షణాలతో పుడతారు నార్మల్ పర్సన్ గా పుట్టినా కూడా సడన్ గా యోగి అయిపోతాడు. సడన్ గా ఆమె యోగిని అయిపోతది ఎందుకు అయిపోతది సడన్ గా ఆమె యోగిని మనం ఎందుకు కాలేదు మనం ఎందుకు కాలేదు మనకఎందుకు ఇన్ని ఆటంకాలు మన కర్మలు అన్నమాట మనకి ఇంకా అనుభవించాల్సిన కర్మలు ఉన్నాయి కాబట్టి మనకు అడ్డుకట్టలు వేస్తూ ఉన్నాయి ఇవి వాళ్ళకేమో అయిపోయినయి వాళ్ళ కర్మలు అయిపోయినాయి వాళ్ళ కర్మలు పూర్వజన్మలలో అనుభవించేసింరు కాబట్టి వాళ్ళకి పుట్టగానే కొన్ని సంవత్సరాలకే 16 సంవత్సరాలు రమణ మహర్షి గారు చూడండి రామకృష్ణ పరమంస గారు చూడండి 25 ఏళ్ల
(11:04) వయసులోనే అంతకంటే చిన్న వయసులోనే అండి స్వామి వివేకానంద గారు ఆరేళ్ల వయసులో పరమహంస యోగానంద గారు ఇలాంటి యోగులు వీళ్ళు ఆ పుట్టడం పుట్టడమే యోగుల్లాగా పుట్టేస్తారు వీళ్ళు లేకపోతే ఒక ఏజ్‌లో యోగిలాగా సడన్ గా యోగి అయిపోతారు. అదన్నమాట ఈ మాయాశక్తి ఇక్కడ చివరగా నేను చెప్పేది ఏందంటే ఈ మాయాశక్తులు మనల్ని భ్రమలకు గురి చేస్తుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండి అది మాయ అని గ్రహించి భక్తి మార్గాన్ని వదలకుండా అమ్మవారి పాదాలు గట్టిగా పట్టుకొని ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ ఈ వీడియో ముగించి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఓం నమో నారాయణాయ
No comments:
Post a Comment