Tuesday, May 5, 2026

 కాఫీ కబుర్లు సంఖ్య 1180 (మే 04 - 2026) -- world give day -- ఇచ్చుటలో ఉన్న హాయీ వేరెచ్చెటనూ లేనేలేదని..  అని ఓ సినీ గీత రచయిత అన్నాడు.  నిజమే needy people అవసరాలు తీర్చడంలో ఆనందం ఉంటుంది మనకి.  మనం తీర్చగలిగే ఓ చిన్న అవసరం లేదా ఓ చిన్న సహాయం అందుకున్న వ్యక్తి కి పెద్దగా ఉపయోగ పడొచ్చు.  దాన గుణం చాలా గొప్పదంటారు.  అన్నదానం వస్త్రదానం రక్తదానం జ్జానదానం..  ఇలా ఏ దానమైనా విలువైనదే గొప్పదే.  ఈ కాన్సెప్ట్ నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనే ఈరోజు ప్రత్యేకత.  2010లో ఒక విదేశీయునికి ఇవ్వడానికి ఒకరోజు కేటాయించాలని  వరల్డ్ గివ్ డే అని పేరుపెట్టి ఇటువంటి ఇచ్చే ఏక్ట్స్ ను ప్రోత్సహించాలని జనాల్లో ఒక అవేర్నెస్ అవగాహన క్రియేట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించడంతో చాలా దేశాలు పెద్ద ఎత్తున మద్దతు తెలిపాయి.  కొన్ని దేశాల్లో ఈరోజు సెలవగా ప్రకటించాయి తమ ఉద్యోగులకు సమయం దొరుకుతుందని.  మనకి అవసరం లేనివి ఇంకొకరికి ఉపయోగపడితే మంచిదే కదా అనే ఆలోచన మనలో ఉండాలి.  ఏదీ వృధా కాకూడదు.  ఇళ్ళల్లో అంతగా మనకి ఆవసరంలేని వాడనివి ఉంటే ఇచ్చేస్తే అవతలి వారికి పనికొస్తాయి. మనకి కొంత జాగా కలిసొస్తుంది.  గనుక ఈరోజు వరల్డ్ గివ్ డే సందర్భంగా ఇచ్చేందుకు, దానం చేయడానికి కొంత సమయం కేటాయించి ఇతరులకు కొంత మంచి చేద్దాం..  ---- గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని) విజయనగరం. ఫోన్ 99855 61852....

No comments:

Post a Comment