Friday, May 1, 2026

డబ్బు, సంసారం, దైవం అన్నీ మీతోనే! | Balance Material & Spiritual Life Tips | Satyagrahi

డబ్బు, సంసారం, దైవం అన్నీ మీతోనే! | Balance Material & Spiritual Life Tips | Satyagrahi

Author Name:Satyagrahi

Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=_wxrRrS4EVU



Transcript:
(00:05) నేటి కాలంలో మనందరం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య అశాంతి మనం చేస్తున్న ఉద్యోగం మన చుట్టూ ఉన్న మనుషులు మన బాధ్యతలు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని మనం భావిస్తూ ఉంటాం. ఈ గొడవంతా వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండని మన మనసులో ఎప్పుడో ఒకప్పుడు అనిపించే ఉంటుంది కదా మనం ఆధ్యాత్మికతను లేక ప్రశాంతతను ఒక ఎస్కేప్ ప్లాన్ గా చూస్తున్నాం.
(00:28) ఆఫీసులో ఒత్తిడి పెరిగితే మెడిటేషన్ చేయాలనుకుంటాం. ఇంట్లో గొడవలు అయితే దేవుడు ముందు కూర్చుంటాం. అంటే మన దృష్టిలో దైవం వేరు మన జీవితం వేరు. మన సమస్య ఏంటంటే మనం ఆధ్యాత్మికతని ఒక గోడలా వాడుకుంటున్నాం. ఆ గోడ వెనక తాక్కుంటే బాధ్యతలు మనల్ని తాకమని అనుకుంటాం. కానీ అది నిజం కాదు. ఈ భూమ్మీద అందరితో పాటు కలిసి మన పని మనం చేసుకుంటూ ఎలాగ ప్రశాంతంగా ఉండాలో తెలియకపోవడమే అసలైన అజ్ఞానం.
(00:56) ఈ సమస్య రావడానికి కారణం బాధ్యతని మనం ఒక బరువు లాగా భావించడం మీరు సంపాదిస్తున్న డబ్బు మీరు పెంచుతున్న పిల్లలు మీరు చూస్తున్న తల్లిదండ్రులు ఇవన్నీ మీకు బంధనాలు అని మీరు పొరబడుతున్నారు. అందుకే మీరు బాధ్యతల నుండి పారిపోవాలని చూస్తున్నారు. కానీ గుర్తుంచుకోండి బాధ్యతలను విడిచిపెట్టడం ఆధ్యాత్మికత కాదు. అది కేవలం పిరిగితనం. మనం ప్రాపంచిక సుఖాల్లో మునిగిపోయినప్పుడు లేదా ఆ సుఖాలు దొరకనప్పుడు కలిగే నిరాశలో నుంచి భక్తిని వెతుక్కుంటాం.
(01:23) కానీ అది నిజమైన ఆధ్యాత్మికత కాదు. మన మనసు ఎప్పుడూ ద్వంద్వత్వంతో ఉంటుంది. అయితే సంసారం లేదా సన్యాసం ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం మనకు తెలియడం లేదు. లాహరి మసేల జీవితం మనకు నేర్పించేది అదే. ఆయన ఒక సాధారణ క్లర్క్ గా పనిచేస్తూ భార్యా పిల్లలతో కలిసి ఉంటూనే అత్యున్నతమైన సమాధి స్థితిని చేరుకున్నారు.
(01:45) మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే మనకు పనుల మీద ఉన్న మక్కువ కంటే ఆ పనుల వల్ల వచ్చే ఫలితం మీద ఆశ ఎక్కువ. ఆ ఆశే మనల్ని అశాంతికి గురి చేస్తుంది. మరి ఈ సమస్యకి పరిష్కారం నిష్కమ కర్మ అంటే పనిని చేయడం కానీ పని ఫలితం మీద మమకారం పెంచుకోకపోవడం మీరు చేస్తున్న ఉద్యోగాన్ని కేవలం డబ్బు కోసం కాకుండా సమాజానికి మీరు అందిస్తున్న సేవగా భావించండి.
(02:08) అందులోనూ మీరు చేసే పని మీకు ఇష్టమైన పనై ఉండాలి. అలా చేస్తేనే మీకు ఎంతో ఆనందం కలుగుతుంది. అందులోనూ మీ భార్య లేకపోతే భర్తకి మీ పిల్లలకి మీరు చేస్తున్న సేవని కేవలం బాధ్యతగా కాకుండా దైవసేవగా చూడండి. లౌకిక ప్రపంచంలో ఉంటూనే అలౌకిక స్థితిని పొందడం సాధ్యమే. దానికి కావాల్సింది హిమాలయాల్లో గుహలు కాదు మీ హృదయంలో ఒక నిశశబ్దమైన ప్రదేశం.
(02:36) మీరు ఎంత బిజీగా ఉన్నా లోపల ఒక సాక్షిలా మీ పనులు గమనించడం నేర్చుకోవాలి. మీరు భోజనం చేస్తున్న ఆఫీస్ లో ఫైల్స్ చూస్తున్నా అది మీ దైవానికి మీరు సమర్పిస్తున్న నైవేద్యం అనుకోండి. ఎప్పుడైతే మీరు చేసే ప్రతి పనిలో దైవత్వాన్ని చూస్తారో అప్పుడు మీ ఇల్లే ఒక దేవాలయం అవుతుంది. మీరు చేసే ప్రతి పని ఒక పూజ అవుతుంది. సన్యాసం అంటే బట్టలు మార్చుకోవడం కాదు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవడం.
(03:00) మరి ఈ రోజు నుంచి మీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలి? ముందుగా మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేయండి. మీరు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు చేసే పనుల్లో అంకిత భావం పెంచండి. మీ ఇంట్లో ఉన్న వ్యక్తులను కేవలం మనుషుల్లా కాకుండా దేవుడు మీకు అప్పగించిన బాధ్యతలుగా ప్రేమించండి. మీరు ఎంత గొప్పగా ధ్యానం చేసినా మీ పక్క ఉన్న మనిషి బాధ మీరు గుర్తించకపోతే ఆ ధ్యానం వ్యర్థం.
(03:23) నిజమైన యోగి అంటే కళ్ళు మూసుకొని గంటలు గంటలు కూర్చునేవాళ్ళు కాదు. కళ్ళు తెరిచి తన బాధ్యతలని చిరునవ్వుతో నిర్వర్తించేవారు రేపు కాదు వచ్చే నెల కాదు ఇప్పుడే ఈ క్షణమే మీ ఆలోచనను మార్చుకోండి. మీ వృత్తిలో నిజాయితీగా ఉండండి. మీ కుటుంబ సభ్యుల పట్ల ప్రేమగా ఉండండి. బయట ప్రపంచంతో పోరాటం ఆపి మీ లోపల ఉన్న అశాంతితో సంధి చేసుకోండి.
(03:47) సంసారం అనే సముద్రంలో మునిగిపోకుండా అందులో తామర ఆకు మీద నీటి చుక్కలా జీవించడం నేర్చుకోండి. అది నేర్చుకున్న రోజు మీరు ఎక్కడుంటే అక్కడ స్వర్గం కనిపిస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే కచ్చితంగా లైక్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.

No comments:

Post a Comment