Friday, May 1, 2026

 *ఆత్మీయ బంధుమిత్రులకు లక్ష్మి నృసింహ జయంతి మరియు గురువారపు   శుభాకాంక్షలు 💐💐🥭🥭🌹🌹..*                                                 విశ్వ గురువులు గీతాచార్యులు శ్రీకృష్ణ భగవానుల వారు, శ్రీ లక్ష్మి నారసింహ స్వామి వారు,పూజ్య గురువులు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, పూజ్య గురుశ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారు జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యులవార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..        *ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్నా ఆత్మీయులకు శుభాకాంక్షలు* 💐🌹🥭🍫🍇


     తప్పు చేసే అవకాశం రోజుకు వంద సార్లు వస్తుంది, *కానీ మంచి చేసే అవకాశం ఎప్పుడో కానీ రాదు.* కాబట్టి మనకు మంచి చేసే *అవకాశం* వచ్చినప్పుడు *దానిని* జార  విడుచుకోకూడదు...... 

     ఎదుటి వాళ్ళు మనకు *నచ్చిన పనులు* చేస్తే వారు *మంచోళ్ళు.* అదే మనకు *నచ్చని పనులు* చేస్తూ వాళ్ళకి నచ్చినట్లు ఉంటే *చెడ్డోళ్ళు.* మన ఇష్టాయిష్టాలే ఎదుటివారి *వ్యక్తిత్వం* ఇదే నేటి *మనిషి తత్వం..* 

      ఒకరిని *అపార్థం* చేసుకోడానికి కొన్ని 
*సెకండ్ల సమయం* చాలు *కానీ* అర్థం చేసుకోడానికి *రోజులు* పడుతుంది, అందుకే *అపార్థం* చేసుకోవడంలో *ఒక వంతు అర్థం* చేసుకోడానికి ప్రయత్నించండి. *బంధాలు* బలపడతాయి *కలకాలం* నిలబడతాయి

       తన కొమ్మలకు పూసిన *పూలు* రాలిపోతున్నాయని యే *మొక్క* బాధపడదు.. రేపటి రోజున కొత్త *పువ్వులు* పూయించటానికి ఉత్సాహంగా తీరికలేకుండా *కష్టపడుతుంది*..గడిచిపోయిన రోజులు గురించి *చింతించటం* కాదు రాబోయే రోజుల గురించి *పనిచేయటమే* జీవితం..ఆ పూల మొక్కే మనకు ఆదర్శం కావాలి..

        దేముడా..*ఆదాయం* తక్కువైనా అవసరం మేరకు *ఆహారం* ఇవ్వు..
*ఆయుస్సు* తక్కువైనా రోగం లేని *ఆరోగ్యం* ఇవ్వు.
*వసతి* తక్కువైనా ప్రియమైన *తోడును* ఇవ్వు..
*డబ్బులు* లేకపోయినా నిన్ను *పూజించే* మనస్సు ను ఇవ్వు..
*బంధాలు* తక్కువైనా నమ్మకమైన *స్నేహం* ఇవ్వు 🙏🙏                                                 
                                                             
       ఏ *రాత* రాసినా కాగితం తనలో *దాచుకుంటుంది*..కాని కొన్ని *రాతలు* మాత్రమే *కాగితాన్ని* మనం *దాచుకునేలా* చేస్తాయి.. అలాగె కొన్ని *పరిచయాలు* తోటి రైలు *ప్రయాణికులు* లాగ ఉంటాయి. మరికొన్ని పరిచయాలు *మనస్సు* పోరల్లో *దాగి* ఉంటాయి..

      మీకు *సహాయం* చేసిన వారిని మరచిపోవద్దు, నిన్ను ప్రేమించేవారిని *ద్వేశించవద్దు* . నిన్ను నమ్మిన వారిని *మోసం* చేయవద్దు.
     🙏🕉️🙏

No comments:

Post a Comment