పూరీగారి మాటలు మన ఆడవాళ్లు వింటారా ||భర్త తప్పు చేసినా క్షమించాలి అంటున్నారు ||మరి పిల్లలు...
Author Name:sujatha goparaju
Youtube Channel Url:https://www.youtube.com/@sujathafunnytalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=w1DEuXvE_Ew
Transcript:
(00:01) మన సినిమా డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు ఆడవాళ్ళను ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పారు. ఆయన చెప్పిన మాటలు మంచి మాటలే కానీ చెప్పే విధానం మాత్రం అస్సలు బాగోలేదు. అలాగే మన శ్రీరాముడు గురించి మన దేవుళ్ళ గురించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యకాలంలో దేవుళ్ళ మీద ఈ సినిమా యాక్టర్లు ఏ రకంగా కాంట్రవర్సీలు చేస్తున్నారో మనం చూస్తున్నాం.
(00:21) దేవుళ్ళను తక్కువ చేసి మాట్లాడడం దేవుళ్ళని ఏదో ఒకటి మాట్లాడడం దేవుళ్ళ గురించి వాళ్ళక అంతా తెలుసు అన్నట్టు ఈ రకంగా మాట్లాడుతున్నారు. అయితే ఆడవాళ్ళ గురించి ఏమన్నారు అంటే మీ భర్తలు గనుక తప్పు చేశారు అని అంటే మీ అన్నయనో మీ తమ్ముడినో మీ నాన్ననో క్షమించినట్టు వాళ్ళని కూడా క్షమించేయండి పెళ్లి చేసుకున్న ఆడవాళ్ళు జీవితంలో ఎప్పుడో ఒకసారి కన్నీళ్లు పెట్టుకొని ఏడవకుండా అయితే ఉండరు.
(00:41) భర్త తప్పు చేశడని పక్కింటి వాళ్ళకి పిలిచి చెప్పడం వాళ్ళకి చెప్పడం వీళ్ళకి చెప్పడం అనవసరంగా గొడవలు పెట్టుకోవడం ఇలాంటివి చేయకండి మీ ఇంట్లో మీ అమ్మ నాన్నని ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నారు కదా వాళ్ళు ఎన్నో సార్లు గొడవలు పడి మళ్ళీ కలుసుకొని చక్కగా జీవితాన్ని గడుపుతున్నారు కాబట్టి వాళ్ళని చూసి మీరు కూడా అదే నేర్చుకోండి భర్త తప్పు చేసినా సరే మీరు క్షమించి వదిలేయండి అని ఇలాంటి మాటలు చెప్పారు.
(01:02) మన అమ్మల్ని మనం చూస్తున్నాం. ఎన్నో సార్లు గొడవ పడుతుంటారు మళ్ళీ కలుసుకుంటా ఉంటారు కానీ అప్పటి కాలం మనుషులకి ఇప్పటి కాలం మనుషులకి ఈ మధ్యలో ఎన్ని మార్పులు వచ్చాయండి మరి మన అమ్మల కాలంలో పాపం ఎక్కువగా ఆడవాళ్ళు చదువుకునే వాళ్ళు కాదు ఐదో క్లాసో ఏడో క్లాసో అంతవరకే చదువుకున్నారు. హై స్కూల్ కి వెళ్లి చదువుకుందాం అన్న ఆడపిల్లకి ఇంత చదువు అక్కర్లేదులే నువ్వు ఇంట్లో పనులు చేసుకో అని చెప్పేసి వయసు రాగానే పెద్ద మనిషి అవ్వగానే పెళ్లిళ్లు చేసేసేవారు.
(01:25) ఆడపిల్లలు ఇదే అత్తారి ఇల్లు ఇక్కడ మొగుడితోటి ఇలా ఉండాలి అత్తగారికి సేవలు చేయాలని ఇంకా అత్తగారి ఇల్లే వాళ్ళకి ప్రపంచం లాగా ఉండేది దేనికి కూడా ఎదురు సమాధానం చెప్పేవాళ్ళు కాదు ఏది కావాలన్నా భర్తను అడిగి తీసుకునేవారు వాళ్ళ నోట్లో చదువు ఉండేది కాదు వాళ్ళ చేతిలో ఒక రూపాయి ఉండేది కాదు ఇంటి పనులకే పరిమితమైపోయేవారు అప్పట్లో ఇంటి పనులు కూడా ఎంత కష్టంగా ఉండేవండి ఇప్పటిలాగా మిషన్లు ఉన్నాయా పిల్లల్ని చూసుకుంటూ భర్తను చూసుకుంటూ ఇంటి పనులు చేసుకుంటూ అలా కుటుంబాలను నడుపుకుంటూ వచ్చేవారు ఎన్ని గొడవలు జరిగినా భర్త కొట్టినా తిట్టిన అమ్మ
(01:53) నువ్వు అత్తారిళ్లు వదిలి రాకమ్మ అప్పట్లో పెద్దవాళ్ళు కూడా అలాగే చెప్పేవారు పుట్టింటికి రావాలని అంటే భర్త పర్మిషన్ అత్తగారి పర్మిషన్ తీసుకొని పుట్టింటికి వెళ్ళేవాళ్ళు అప్పటి రోజులు అలా ఉండేవాళ్ళు వాళ్ళు చదువుకోలేదు ఉద్యోగాలు లేవు వాళ్ళ చేతిలో డబ్బులు లేవు కాబట్టి కానీ ఇప్పటి కాలం పిల్లలు ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళే మగవాళ్ళతో పోటీగా లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు మగవాళ్ళతో సమానంగా అన్ని రంగాలలోనూ ముందున్నారు ఆ నువ్వు పబ్బుకి వెళ్తావా తాగుతావా చెప్పు నేను వస్తా పబ్బుకి వచ్చి ఇద్దరం తాగుదాం అంటున్నారు నువ్వు సిగరెట్
(02:21) కాలుస్తావా నేను సిగరెట్ కాలుస్తా నువ్వు విదేశాలకు వెళ్తావా నేను కూడా విదేశాలకి వెళ్తా నువ్వు ఆ వర్క్ చేయగలవా నేను కూడా అదే వర్క్ చేస్తా అని మగవాళ్ళు చేసే ప్రతి పనిని కూడా ఈ రోజున ఆడవాళ్ళు చేస్తున్నారు లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు మరి అలాంటి పిల్లల్ని అమ్మ నువ్వు భర్త కొట్టినా భరించు భర్త తిట్టినా భరించు అత్తగారు తిట్టిన ఆడబడుసులు సాధించిన నువ్వు పడాల్సిందా అని చెప్పేసి ఈ కాలం పిల్లలకు చెప్పామ అనుకోండి ఎవరైనా ఊరుకుంటారా ఆయన చెప్పిన మాటలకి చాలా మంది ఆడవాళ్ళు కౌంటర్ ఏమఇచ్చారుఅంటే అయితే మీ మగవాళ్ళు నచ్చిన అమ్మాయిలతో తిరిగి
(02:49) జల్సాగా ఎంజాయ్ చేయండి చెడు వేసనాలకి బానిస అయి ఏం జరిగినా సరే మేము ఏమి మాట్లాడం అలాగే మరి మేము కూడా అలాగే మాకు నచ్చినట్టు మేము తిరుగుతాం మమ్మల్ని కూడా ఏమి అనకండి మమ్మల్ని కూడా క్షమించేయండి అని చెప్పేసి చాలా మంది ఆడవాళ్ళు కామెంట్లు చేశారు. చూసారా అండి ఈ కాలం ఆడవాళ్ళు ఎంత ఫాస్ట్ గా ఉన్నారో అప్పుడు కాలంలో ఉన్నట్టు ఉండమంటే ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఉంటారు మేము సంపాదించుకుంటున్నాం నువ్వు చూడకపోతే మానేయ్ మా బతుకు మేము బతకగలమని ఇలా ధైర్యంగా దీమాగా మాట్లాడే ఆడవాళ్ళు ఉన్నారు.
(03:17) ఆయన చెప్పిన దాంట్లో ఇంకొకటి తప్పుగా అనిపించింది. దేవుడితోటి పోల్చి చెప్తున్నారు. దేవుడు మీరు దేవుణని పెళ్లి చేసుకున్న సరే కష్టాలు భరించాల్సిందే దేవుడు కూడా రాత్రిపూటి మిమ్మల్ని వదిలేసి దేశంలో ఎవరి ఇంట్లో ఏం కష్టాలు ఉన్నాయి అని చెప్పేసి దేవుడు కూడా భార్యను వదిలేసి వెళ్ళిపోయిన సంఘటనలు ఉన్నాయి మీరు దేవుణని చేసుకున్నా సరే ఏదో సమయంలో కన్నీళ్లు పెట్టాల్సిందే అని ఈ రకంగా భగవంతుడితోటి పోల్చాడు అలాగే శ్రీరాముడు సీతమ్మ తల్లికి కష్టాలు పెట్టలేదా మరి ఇలాంటివన్నీ చూసుకున్నప్పుడు ఆడవాళ్ళు ఎప్పుడోకప్పుడు కష్టాలు భరించాల్సిందే మీ భర్త ఎన్ని తప్పులు చేసినా మీరు క్షమించి వదిలేయండి
(03:46) అని చెప్పారు. దేనికైనా సరే అండి భగవంతుడితోటి ఏది కూడా ముడి పెట్టకూడదు. వాళ్ళతోటి మనకు పోలిక ఏంటి చెప్పండి మనం దేవుడు ఒకటేనా కానీ ఈయన చూడండి భగవంతుడిని కూడా కలిపి ఈ రకంగా మాట్లాడడం అయితే ఎవరికీ కూడా నచ్చలేదు సోషల్ మీడియా అంతా కూడా ట్రోల్ అయింది. అయితే ఇక్కడ పూరి జగన్నాథ్ గారు మరి ఏ ఉద్దేశంతో మెసేజ్ ఇచ్చారో గాని మరి ఈ భార్యా భర్తలకి పిల్లలు కూడా ఉంటారు కదా భర్త ఈ రకంగా చెడు వేసనాలకి బానిస అయిపోయి అలా చెడు మార్గంలోకి వెళ్ళిపోతున్నాడు అనుకోండి భార్య ఎంతవరకుని భరిస్తుంది భార్య మరి పిల్లల్ని ఎవరు చూసుకోవాలి ఆ తండ్రి
(04:16) తప్పుడు పనులు చేస్తుంటే ఆ తండ్రిని చూసి ఆ పిల్లలు ఏమి నేర్చుకోవాలి మరి బాధ్యతలు ఎవరు పట్టించుకోవాలి మరి పూరి జగన్నాథ్ గారు దీని గురించి కూడా చెప్పిఉంటే బాగుండది. మీ అమ్మ మీ నాన్నని చూసి మీరు నేర్చుకోండి అని ఈ ఆడవాళ్ళకి చెప్పారు కదా మరి ఈ తల్లిదండ్రులు కూడా పిల్లలు ఉంటారు కదా మరి ఆ పిల్లలు వీళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి తండ్రి ఆ రకంగా చెడ్డ పనులు చేస్తుంటే తండ్రిని చూసి పిల్లల్ని నేర్చుకోవాలా ఇంతకుముందు కాలంలో ఒక్కరు సంపాదిస్తే 10 మంది తినేవాళ్ళు కానీ ఈ రోజుల్లో కుటుంబం అంతా సంపాదిస్తే గాని గడవని రోజులు మరి ఇలాంటి ఆడవాళ్ళకి ఏం
(04:43) మెసేజ్ ఇస్తున్నారు పిల్లల బాధ్యతలు ఎవరు పట్టించుకుంటారు తండ్రి అలా తప్పుదారిలోకి వెళ్ళిపోతుంటే ఏ భార్య అడగకుండా ఉంటుంది బాబు పిల్లల పరిస్థితి ఏంటి నువ్వు ఏమి పట్టించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు పిల్లలు చెడిపోరా పిల్లల్ని నేను ఏం చేయాలని మరి ఆ భార్య ప్రశ్నించదా మరి అక్కడ తగువులు రావా అక్కడ కొట్లాటలు రావా విడిపోయే పరిస్థితి రాదా పిల్లల్ని పట్టించుకోలేని తండ్రి కూడా ఒక తండ్రేనా మరి ఇలాంటివి కూడా ఉంటాయి కదండీ ప్రతి కుటుంబంలోనూ పెళ్లి చేసుకున్నారని అంటే భార్యా భర్తలు ఇద్దరే ఉండరు సంవత్సరానికో రెండు సంవత్సరాలకో మనకు పిల్లలు కూడా
(05:12) వస్తారు మరి ఆ పిల్లల బాధ్యతలు ఎవరు పట్టించుకోవాలి భర్త ఎన్ని తప్పుడు పనులు చేసినా భార్య అలా చూస్తూ ఉంటే మరి ఏంటి మీలాగా కోటీశ్వరులు అనుకోండి ఏమి ఇబ్బంది ఉండదు ఏ భార్య అడగదు పిల్లలు పని వాళ్ళని పెట్టుకొని భార్య చక్కగా చూసుకుంటుంది ఎందుకంటే ఆస్తులు ఉన్నాయి కాబట్టి కానీ లేని వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు పేదవాళ్ళు భార్యా భర్తలు కష్టపడితే గాని కుటుంబం గడవని వాళ్ళు అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.
(05:35) వాళ్ళ పరిస్థితులు ఏంటి ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో డబ్బు విషయంలోనే గొడవలు అవుతున్నాయి. ఎందుకంటే పెళ్లిళ్లు చేసుకున్న సరే భర్త సంపాదన సరిపోక మళ్ళీ భార్యలు కూడా ఉద్యోగం చేసి సంపాదించే పరిస్థితి ఇద్దరూ సంపాదిస్తే గాన కుటుంబం గడవని పరిస్థితి పిల్లల్ని ఈ రోజు చదివించాలని అంటే లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. మీరు పాతకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కాలం ఆడవాళ్ళు కూడా అప్పటి ఆడవాళ్ళలాగానే ఉండాలని అంటే మీ అమ్మలాగానే కాపురాలు చేసుకోండి అని అంటే ఎవరు చేయగలరు చెప్పండి మెయిన్ ఇక్కడ అంతా కూడా డబ్బుతోనే వస్తున్నాయి గొడవలు ఆయన ఏదో ఆడవాళ్ళకి ఒక
(06:03) మంచి మెసేజ్ని ఇద్దామని అనుకున్నారు కానీ చెప్పే విధానం బాగోలేదు చిన్న చిన్న తగాదల నుండి విడిపోయిన వాళ్ళు ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళకి చెప్పండి అమ్మ చిన్న చిన్న తప్పులని క్షమించండి అమ్మ పెద్ద గొడవలు చేసుకోకండి విడిపోకండి అని అలా మంచి మాటలు చెప్పండి అంతేగాని భర్త ఎన్ని తప్పులు చేసినా చెడు వ్యసనాలకి బానిస అయినా ఇంకొక అమ్మాయితో తిరుగుతున్నా సరే అమ్మ నువ్వు ఏమి అనకు భర్తని మీ నాన్న మీ తమ్ముడు మీ అన్నయ్య చేస్తే నువ్వు ఎలా క్షమిస్తావో అలాగే క్షమించు అని అన్నారు చూసారా ఆ విషయమే బాగోలేదు అప్పటి కాలానికి ఇప్పుడు కాలానికి పోలిక ఏంటి చెప్పండి ఈ కాలంలో
(06:33) పిల్లలు కన్న తల్లిదండ్రులు ఏదైనా ఒక మాట అంటేనే పడట్లేదు ఎదురు సమాధానం చెప్తున్నారు మాకు అన్నీ తెలుసు మీరేంటి మాకు చెప్పేదని ఈ రకంగా ఎదురు సమాధానం చెప్తున్నారు అలాంటిది భర్త తిట్టినా భర్త కొట్టినా పడండి అనిఅంటే ఏ ఆడపిల్ల పడదు అయినా అంత తిట్టి కొట్టే పరిస్థితి ఎందుకు రావాలి చెప్పండి భార్యని ని ప్రేమగా చూసుకుంటే అక్కడ ఏ గొడవలు రావు కదా భర్త తప్పుడు అడుగులు వేసి తప్పుడు పనులు చేస్తే ఏ భార్య అడగకుండా చూస్తూ ఊరుకుంటుంది చెప్పండి పైగా రాముడివారు సీతాదేవి గురించి మాట్లాడడం దేవుళ్ళ గురించి మాట్లాడడం దానికిని ఇక్కడఉన్న
(07:02) ఆడవాళ్ళకి ముడి పెట్టడం నిజంగా వింటే కొంచెం ఇబ్బందికరంగానే అనిపించింది మీరు చెప్పే మాటలు చాలా మంది ట్రోల్ చేసుకుంటూ ఉంటారు మంచి మంచి విషయాలు చెప్తారు కానీ ఆడవాళ్ళకి మీరు ఇచ్చిన ఈ మెసేజ్ లో మాత్రం కొంచెం తప్పుగానే అనిపించింది చాలా మంది దీన్ని తప్పు పట్టారు ఆడవాళ్ళు ఏమన్నారంటే మేము కూడా మిమ్మల్ని క్షమించేస్తాం మ్మల్ని కూడా మీరు క్షమించేయండి మేమేం చేసినా సరే మీరు కూడా అడగకండి అని అన్నారు.
(07:24) చూసారా అండి కౌంటర్ ఎలా ఇచ్చారో అయితే మేము కూడా తప్పులు చేస్తాం మేము తప్పులు చేసినప్పుడు కూడా మీ అక్కో మీ అమ్మో మీ చెల్లో తప్పు చేసినట్టు మీరు కూడా మమ్మల్ని క్షమించేసేయండి అప్పుడు ఏ గొడవ ఉండదు రెండు సమానం అయిపోతాయి అసలు ఇద్దరు భార్యా భర్తలు ఇద్దరి మధ్యన ఎటువంటి గొడవలు ఉండవని చాలా మంది ఇలా కౌంటర్ గా కూడా మాట్లాడారు. చూసారా అండి కాలం ఎలా మారిపోయిందో మనం పాత కాలం నాటి ఆడవాళ్ళ తోటి ఇప్పుడు ఆడవాళ్ళతోటి అస్సలు పోల్చుకోకూడదు అప్పుడు చదువులు లేవు ఉద్యోగాలు లేవు అంత తెలివితేటలు కూడా లేవు అత్తారి వెళ్లే దైవంగా భావించేవారు అత్తారి ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాలి
(07:52) అని అంటే అమ్మో ఇంకా జీవితం పోయినట్టే అని ఆ రకంగా ఆలోచించి ఎన్ని గొడవలు ఉన్న ఎన్ని కష్టాలు ఉన్న ఎన్ని బాధలున్న అక్కడ అలాగే భరించేవారు కానీ ఈ కాలంలో పిల్లలు మాత్రం అస్సలు భరించరు ఒక్క మాట అంటే మాటకు మాట ఎదురు చెప్తారు లేదు అని అంటే వీడు ఆకలి ఇచ్చి వెళ్ళిపోతారు అది పరిస్థితి ఆడవాళ్ళ కోసం ఒక మంచి మెసేజ్ ని ఇవ్వాలని అనుకున్నారు కానీ చెప్పే విధానంలో మాత్రం పొరపాటు జరిగింది.
(08:15) ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.
No comments:
Post a Comment