🔱*భూతనాధుడు* 🔔🚩
*పెద్ద పెద్ద శివాలయాలలో భూతగణాల శిల్పాలు చెక్కి వుండడం మనం చూస్తూ వుంటాము.* *పరమేశ్వరుని అనుచరులైన ఈ భూతగణాలు మహేశ్వరుని సంకల్పాలను తక్షణమే నెరవేరుస్తాయి. 33 రకాల భూత గణాలు వున్నాయని శివపురాణ గ్రంధాలు తెలుపుతున్నవి.*
*భూత గణాలు ఈశ్వరుని సంకల్పాన్ని శిరసావహించి, మానవుల పాప , పుణ్యాలకి తగినట్లు ఆచరణలో పెడతాయి.*
*కామ భూతం.. మానవులను యిష్టానుసారం ఆడిస్తుంది.*
*రాక్షస భూతం...*
*కోపాన్ని కలిగిస్తుంది.*
బేతాళ భూతం... కార్యాలకు విఘ్నాలు కల్పిస్తుంది.
కిరణ భూతం.. మనిషిని వ్యసనాలకు బానిసను చేస్తుంది.
క్షూస్మాండ భూతం ..
సజ్జనులకు తోడ్పాటు నందిస్తుంది.
యక్ష భూతం..
ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది.
సిధ్ధభూతం...
సన్మార్గం చూపిస్తుంది.
కురవ భూతం..
జ్ఞానాన్ని సిధ్ధింప చేస్తుంది.
గంధర్వ భూతం ...
అందమైన అంగసౌష్టవాన్ని కలిగిస్తుంది.
ముని భూతం..
శాస్త్రాలపై ఆసక్తి కలిగిస్తుంది.
వృధ్ధ భూతం.. దేహారోగ్యానికి కీడు చేస్తుంది.
దేవ భూతం..
సంత్సంగాన్ని కలిగిస్తుంది.
వరుణ భూతం..
ఆనందాన్ని కలిగిస్తుంది.
అర్ధపితా భూతం.. సోమరితనం కలిగిస్తుంది.
ఈసుర భూతం..
కోరిన కోరికలు నెరవేరుస్తుంది.
విద్యున్మాలి భూతం..
భయం కలిగిస్తుంది.
నికట భూతం...
స్త్రీ వ్యామోహాన్ని కలిగిస్తుంది.
మణివర భూతం...
ధైర్యాన్ని కలిగిస్తుంది.
కుబేర భూతం..
సిరి సంపదలను యిస్తుంది.
విరుపాశ భూతం...
దేహ బలాన్నిస్తుంది.
సహ భూతం...
పిచ్చి కలిగిస్తుంది.
సాగోర్త భూతం సిధ్ధుని చేస్తుంది.
యాగసేనా భూతం...
తనని తనే పొగుడుకునేలా చేస్తుంది.
నిస్తేజ భూతం ..
క్రూరత్వం కలిగిస్తుంది.
ఇంద్ర భూతం...
భోగాలనిస్తుంది.
నాగ భూతం...
ఒంటరితనం కలిగిస్తుంది.
విశాఖ భూతం..
విసుగును కలిగిస్తుంది.
కసుమాల భూతం...
అతి భోజనప్రియత్వం కలుగుతుంది.
అసాధ్య భూతం..
మొరటు తనాన్ని కలిగిస్తుంది.
పిత్త భూతం...
మతిభ్రమణం కలిగిస్తుంది.
బ్రహ్మరాక్షస భూతం..
నీచత్వం అంటగడుతుంది.
ఈ గుణగణాలన్ని మానవుల పాపపుణ్యా
లననుసరించి పరమేశ్వరుడు తన భూతగణాలద్వారా సంక్రమించేలా చేస్తాడు.
ఈ వివరాలు శివ పురాణ గ్రంధాలలో తెలుపబడినవి. *ఆధ్యాత్మిక కుటుంబం*
No comments:
Post a Comment