Connect Soul Power with Universal Energy | Bhargava Sharma With Ravi Sastry | @sreeniravitv
Author Name:Sree Niravi Tv
Youtube Channel Url:https://www.youtube.com/@sreeniravitv
Youtube Video URL:https://www.youtube.com/watch?v=JYhQL9BWh6g
Transcript:
(00:20) ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు భార్గవ శర్మ గారు వారు అనేక యోగాలపైన రీసెర్చ్ చేసి గత 15 సంవత్సరాలుగా యోగ మార్గంలోనే జీవన విధానాన్ని సాగిస్తున్నారు. ఓ పక్క రమణ మహర్షి తత్వాన్ని మరొక పక్క హిమాలయ పరంపర అయినటువంటి క్రియాయోగాన్ని అలాగే ఎన్నో న్యూ ఏజ్ కి సంబంధించినటువంటి ఇప్పుడు కాలమాన పరిస్థితి సంబంధించినటువంటి ఎన్నో వర్క్షాప్స్ ఇవ్వటము అలాగే ప్రణవ సాధన అనే పేరుతో ఎంతో మంది జీవితాలని బాగు చేయటము అలాగే వారు చేస్తున్నటువంటి బ్రీతింగ్ పైన
(01:07) కానియండి అలాగే వేరే యోగ మార్గాల పరంగా కానియండి ఎంతో మంది జీవిత జీవితాల్ని వారు ఉద్ధరిస్తూ ఉన్నారు. వారితో ఈరోజు సజ్జన సాంగత్యం చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ నమస్కారం అండి నమస్కారంఅండి మిమ్మల్ని కలవటం చాలా హ్యాపీగా ఉంది. ఆ మీరు అసలకి ఈ మార్గంలో చిన్న వయసులోనే ప్రవేశించారు అసలకి మీరు ఈ మార్గంలోకి ఎలా రావడం జరిగింది మీ నేటివ్ ఎక్కడ మీ యొక్క కాలమా అంటే ఎట్లా ఆధ్యాత్మికంలోకి మీ ట్రావెల్ అనేది జరిగింది.
(01:42) ఈ మార్గంలోకి నేను ప్రమాదకరమ ప్రమాద వశాత్తు వచ్చానే గానీ ఉద్దేశపూర్వకంగా అయితే ఈ మార్గంలోకి రాలేదు. చిన్నప్పుడు మామూలు చదువులే తర్వాత కొలచెల వెంకట కృష్ణమూర్తి సంస్కృత కళాశాలలో సంస్కృతం చదువుకోవడం జరిగింది. ఒక లెక్చరర్ గా వెళ్ళిపోయి అందరి లాగానే ఒక టీచింగ్ జాబ్ చేసుకుంటూ లైఫ్ అలా వెళ్తుంది అనేటటువంటి లక్ష్యం పెట్టుకొనే ప్రయత్నం చేశం.
(02:08) అలా ఆ విధంగానే లక్ష్యాలన్నిటిని సంకల్పాల అన్నిటిని సిద్ధించుకుంటూ ఆ ఎంఏ సాంస్క్రిట్ అవన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్తున్న సమయంలో ఒక నైరాస్యం ఏర్పడింది అసలుఏంటి లైఫ్ అంటే ఇదేనైనా ఇలా వెళ్ళిపోవడమేనా జీవించడం అంటే మూడు పూటలు తినడం డబ్బులు సంపాదించడం ఇదేనా అనేటటువంటి ఒక నైరాస్యం వచ్చింది. సో అక్కడితో నా లక్ష్యాన్ని అక్కడ పక్కన పెట్టేసేసి ఆర్థికంగా ఎదుగుదాం అనేటటువంటి కోణంలో సాఫ్ట్వేర్ సంబంధించిన మల్టీమీడియాకి సంబంధించిన కోర్సులు కంప్లీట్ చేయడం జరిగింది.
(02:38) దానికి సంబంధించిన ఒక కంపెనీలో ఉద్యోగం కూడా చేశాను. ఆ ఉద్యోగం శాలరీ వస్తుంది కానీ స్ట్రెస్ ఒత్తిడి ఎక్కువ ఉండడంతో ఆ ఈ నైరాశం అనేది ఇంకా పెరిగింది. ఇది ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బతుకుతామో మనకు తెలియదు. ప్రశాంతంగా జీవించాలి ఆనందంగా జీవించాలి హాయిగా నిద్రపోవాలి మంచిగా మూడు పూటలు ఆకలితో తీసుకోవాలి ఇంట్లో వాళ్ళతో నవ్వుతూ హాయిగా ఉండాలి.
(03:03) ఇవి పెద్ద లక్ష్యాలు అయినాయి. అంతకుముందు బాగా పెద్ద జాబ్ చేయాలి పెద్ద పెద్దగా ఉండాలి అనేటటువంటి సంకల్పం చేసిన వ్యక్తి అవన్నీ వచ్చిన తర్వాత కాదు ఇంటి దగ్గర ఉండాలి హాయిగా ఉండాలి పిల్లలతో ఆనందంగా ఉండాలి. ప్రశాంతంగా నిద్రపోవాలి ఫస్ట్ హాయిగా మూడు పూటలు మంచిగా భోజనం చేయాలి. ఇది ఉంటే సరిపోతుంది కదా లైఫ్ కి ఎందుకు అంత ప్రయత్నం చేయాలి అనేటటువంటి కోణంలో ఒక నైరాశం ఆ ఒత్తిడిని నేను ఫేస్ చేసుకుంటూ ఆ ఒత్తిడితో లీడ్ చేస్తున్నాను కొన్ని నెలలు ఆ తర్వాత అదృష్ట వశాత్తు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారు.
(03:40) ఆయన ఆరాకే నా ఎనర్జీస్ బాగా సమాధాన పడినటువంటి స్థితిని నేను అనుభవించాను. ఆయనతో పాటు వెళ్ళడం జరిగింది. ఆయనతోనే ఈ క్రియాయోగ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాను ఒక మామూలుగా శాస్త్రీయ పరంగా ఏమేమ చెప్తారు అవి అందరికీ తెలిసినటువంటి సబ్జెక్టే నేను తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఆ గురువుగారి పేరు ఆయన పేరు లేదు పేరు ఉండదు జస్ట్ గురువు గారని పిలుస్తామ అన్నమాట ఆయన పూర్వాస్ ఆయనకి ఏంటంటే పేరు ఉండకూడదు అన్నటువంటి ఒక నియమం అన్నమాట అంటే పేరు ఐడెంటిటీ లేక ఐడెంటిటీ లేక వితౌట్ ఐడెంటిటీ ఆత్మక ఐడెంటిటీ ఉండదు కదా అట్లా అన్నమాట సో తర్వాత నేను దాని మీద రీసెర్చ్ చేసుకుంటూ
(04:19) వచ్చాను ఒక 10 సంవత్సరాలు ఈ ఎనర్జీ సెంటర్స్ మీద ఇవి వర్కవుట్ అవుతాయా అవ్వవా వర్కవుట్ అయితే ఇది సమాజానికి ఒక గొప్ప లాభాన్ని ఇస్తుంది గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. ఇంకొకటి ఇవ్వనంత గొప్పగా ఈ సమాజానికి ఉపయోగపడేటటువంటి విద్య ఇది క్రియాయోగ విద్య బ్రహ్మ విద్య సో దీని మీద మనం రీసెర్చ్ చేద్దాం 10 మంది కోసం మనం చేద్దాం అని చెప్పి దాని మీద రీసెర్చ్ చేయడం కార్యక్రమాలని కండక్ట్ చేయడం ప్రతి కార్యక్రమంలోన 100 శాతం రిజల్ట్స్ మనకి వచ్చాయి.
(04:46) ఎంతమంది జాయిన్ అయితే అంతమంది హెల్త్ ఇష్యూస్ డెవలప్ చేసుకోవడం హెల్త్ ఇష్యూస్ పోగొట్టుకోవడం అసలు నేను ఊహించమ అన్నమాట సోరియాసిస్ తగ్గడం కావచ్చు ఇట్లాంటి కొన్ని ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్ కంట్రోల్ అవ్వడం బీపీలు షుగర్లు దగ్గర దగ్గరగా టూ త్రీ డేస్ లోనే కంట్రోల్ కి రావడం అవి చూసి అవి నాకు ఇంకా సపోర్ట్ ఇంకాస ఇంకా మనం ఇంకా రీసెర్చ్ చేయాలి ఇంకా బ్రహ్మాండంగా చేయాలి అని చెప్పి ఈ ప్రయాణంలో ఎన్నో సాధనలని క్రియాయోగానికి సంబంధించినటువంటి సాధనలు మనం పరిచయం చేసుకుంటూ వచ్చాం.
(05:14) అయితే క్రియాయోగంలో మీ రీసెర్చ్ లో ఇప్పుడు కొంతమంది ఆధ్యాత్మికంగా వెళ్తే అష్టసిద్ధులు అంటారు అంత స్థితి ఒక పక్క ఉంది కొంతమంది భౌతికంగా చూస్తే ఆరోగ్యపరంగా బెనిఫిట్స్ చెప్తారు కొంతమంది భౌతికంగా ఇంకా వస్తే వాళ్ళ ఉన్న పరిస్థితులు మారుతాయని ఏ కోణంలో ఎక్కువగా క్రియాయోగం అనేది ప్రభావితం చూపుతుంది ఆ యోగాన్ని మీరు ఎట్లా ఏ కోణాల్లో మీరు ఎక్కువగా రీసెర్చ్ చేశారు నా పద్ధతి ఒకటేనండి అష్ట సిద్ధుల దాకా వద్దు ప్రశాంతంగా ఉండడం ముద్దు ఇప్పుడు ఈరోజు చక్కగా ఆరోగ్యంగా ఉండి ఒక 90 ఏళ్ళు 100 ఏళ్ళు హ్యాపీగా ఉండి ఒక 120 ఏళ్ళు హ్యాపీగా జీవించి చనిపోయామ అనుకోండి
(05:56) ఎవరికీ నష్టం లేదు అష్టసిద్ధుల కోసం ప్రయత్నం చేస్తే లైఫ్ అంతా వేస్ట్ అవుతుంది. అవి వచ్చేది రానిి తర్వాత సంగతి వచ్చినాయే అనుకోండి ఏం ప్రయోజనం నువ్వు 10 మందికి అయితే అందించలేవు కదా అష్టసిద్ధుల్ని నువ్వు సాధన క్రమం చెప్పినా కూడా చేయగలిగే వాళ్ళు లేరు కదా సో ఇప్పుడు ఉన్నటువంటి రుగ్మతలు విపరీత కొత్త కొత్త రుగ్మతలు వస్తున్నాయి రోగాలు వస్తున్నాయి ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్ అంటున్నారు వైద్యుల మందులు పడట్లేదు అసలు శరీరాలకు ఎంత అల్లోపతీ మందులు కావచ్చు హోమియోపతీ మందులు శరీరానికి పడట్లేదు అందుకే థెరపీస్ వస్తున్నాయి అలోపీని ఇప్పుడు వదిలేసేసి చాలా మంది థెరపీస్
(06:29) వాడుతున్నారు ఆక్యుపెంచర్ ఆక్యుప్రెజర్ అని రకరకాల థెరపీస్ ఎందుకు అవి ప్రాచూర్యంలోకి వస్తున్నాయి జనాలకు అర్థమైపోయింది ఆ మందులు ఒంటికి పడట్లేదు సో అసలు సహజ సిద్ధమైనటువంటి వ్యవస్థను మనం ఎందుకు అందుకోకూడదు క్రియాయోగం అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితం వేదం కంటే పూర్వమే ఆదిమ నాగరికంగా ఉన్నటువంటి వాళ్లే ఈ ఎనర్జీ సెంటర్స్ కి సంబంధించినటువంటి సాధనలు చేసి హెల్దీగా ఉన్నారు అన్నట్టుగా మనకి ప్రమాణాలు ఉన్నాయి ఆ తర్వాత వేదం తర్వాత అవి శాస్త్రబద్ధం అయిపోయి అన్ని శాస్త్రాల్లోనూ క్రియా యోగకి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ మనం చూడొచ్చు పురాణాల్లో కావచ్చు
(07:02) ఉపనిషత్తుల్లో కావచ్చు ఎక్కడైనా సరే తర్వాత తర్వాత పతంజలి లాంటి మహానుభావులు యోగ సూత్రాలు అని చెప్పి పూర్తిగా క్రియాయోగ మెటీరియల్ ని మనకు అందించారు. తర్వాత దానికి సంబంధించినటువంటి పాండిని గారు కావచ్చు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కావచ్చు శంకరాచార్యులు వారు కావచ్చు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు మనం ఈరోజు గొప్పగా కీర్తింపబడు కీర్తిస్తున్నటువంటి వాళ్ళందరూ క్రియాయోగ సాధకులే వివేకానందుడితో సహా సో అంత గొప్ప క్రియాయోగాన్ని మనం ఎందుకు వదులుకుంటున్నాం మనం ఎందుకు అసలు దాని గురించి ఆలోచించట్లేదు అనే బాధ ఒకటి ఉంది.
(07:31) క్రియాయోగం ప్రపంచవ్యాప్తంగా ప్రచూర్యం పొందినా సరే అది మాతృగడ్డ అయినటువంటి భారతదేశంలో ఎందుకు దానికి ప్రచారం లోపిస్తుంది అనేటటువంటి ఒక బాధ తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడ ఉండకుండా వేరే దేశాలకి వెళ్ళిపోయి ప్రచారం చేస్తున్నారు మనకు తెలిసిన స్వామీజీలు వాళ్ళందరూ వేరే దేశాలకి వెళ్లి క్రియాయోగ ప్రచారం చేస్తారు మన దేశంలో ఎందుకు ప్రచారం చేరు ఇవన్నీ నేను గమనించి మన దేశంలో వాళ్ళకి మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా ఈ క్రియాయోగాన్ని వాళ్ళ జీవన విధానంగా మార్చాలన్నటువంటి ఒక కంకణం లాగా కట్టుకొని మనం ముందుకు వస్తున్నాం.
(08:02) అయితే యోగ సాధనకి మనిషి ఇప్పుడు చాలామంది ఇప్పుడుఉన్న కార్పొరేట్ పరిస్థితుల్లో యోగ సాధనకి అంటేనే కొంత అవగాహన లేకుండా వస్తున్నారు ఏదో మీరు అన్నట్టు యక్సిడెంటల్ గానో మెయిన్ యోగ యోగ సాధన ఏదైనా సరే వాళ్ళు కష్టాల్లో ఉండో ఇబ్బందుల్లో ఉండో ఫైనాన్షియల్ గానో హెల్త్ పరంగానో ఇబ్బందుల్లో ఉండి వస్తున్నారు 90% కేసెస్ ఇదే ఆధ్యాత్మికంగా ఎదగాలని వచ్చేవాళ్ళు ఒక 10% ఉంటారు అంతకంటే తక్కువే ఉంటారు.
(08:35) సో ఈ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం చేసే సాధన ఎలా దాంట్లో నుంచి బయటికి తీసుకొస్తుంది ఒకటండి ఆకలి వేసిన వాడికి అన్నం అమృతంతో సమానం ఆ రోజు నాకు ఆకలి వేసింది. ప్రశాంతంగా ఎలా జీవిస్తాం ఈరోజు నేను అడుగుతాను 90% పీపుల్ మన టీవీస్ చూస్తూ ఉంటారు వాళ్ళందరూ ఆధ్యాత్మికం తెలిసిన వాళ్లే అన్ని దేవత గుడ్లకు వెళ్తూ ఉంటారు.
(09:01) ప్రశాంతంగా ఆనందంగా గడిపిన క్షణాలు ఎన్ని రోజులుఎన్ని అంటే లెక్కలు వేసుకుంటారు. అది కాదు కదా జీవితం అంటే నూరేళ్ల జీవితంలో నూరేళ్ళు ఆనందంగా ఉండడానికి నూరేళ్ళు సమృద్ధిగా ఉండడానికి ఏ ప్రయత్నం చేశవు. కనీసం నువ్వు చేయవు కనీసం నీ నెక్స్ట్ జనరేషన్ కైనా సరే నీ అనుభవాన్నో నీ జ్ఞానాన్నో అందించి వాళ్ళన్న ఆనందంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి కదా ఇప్పుడు మనమైతే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు గడిచినాయి అంతకుముందు అజ్ఞానంగానే ఉన్నాము కానీ ఇప్పుడు కొంత అర్థమయింది ఇది నెక్స్ట్ జనరేషన్స్ కి అందించాలి అందరూ నాలాగా ఈ మార్గాన్ని పెట్టేసేసుకొని ఈ మార్గంలోనే ఉండేటట్టుగా
(09:38) ఉండలేరు. సో మన పూర్వీకులైన వాళ్ళు కూడా ఋషులైన వాళ్ళు ఈరోజు తరాన్ని వాళ్ళు దర్శించే కదా యోగా క్లాస్ యోగా గాని ఇవన్నీ కూడా మనకు అందించారు. సో మనం కూడా నెక్స్ట్ జనరేషన్స్ కి మనం అందించాలి మనం ఎటు అయిపోయింది కాబట్టి నెక్స్ట్ జనరేషన్స్ కి సబ్జెక్ట్ ని అందించాలి అనేటటువంటి కోణంలోనే వచ్చాం ఏదో విధంగా సమస్యల్లో ఉన్నప్పుడే క్రియాయోగం వెళితే ఇంకా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చూస్తారు వాళ్ళు వదిలి పెట్టరు.
(10:05) క్రియాయోగాన్ని అమ్మతో పోలుస్తారు లలిత లలిత అమ్మవారి యొక్క విద్యగా మనం కీర్తిస్తాం మనం ఈ క్రియాయోగాన్ని అట్లాంటి అమ్మ మన సమస్యల్ని చూస్తూ ఉంటుందా ఆ చూసి కూడా ఊరుకొని ఉంటుందా సో క్రియాయోగం అనేది సాధన పరంగా ఉంటుంది మంత్రానుష్టాన పరంగా ఉంటుంది యంత్రపరంగా ఉంది మంత్రపరంగా ఉంది తంత్రపరంగా క్రియాయోగం ఇన్ని రకాలుగా క్రియాయోగాన్ని సాధకులు సాధిస్తూ ఉంటారు మేమ ఏంటంటే సాధన పరంగా క్రియాయోగాన్ని అందించే ప్రయత్నం అన్నమాట మంత్ర పరంగా యంత్రపరంగా అంటే వాటికంటూ కొన్ని నియమాలు అనుష్టాన విధి విధానాలు ఇవన్నీ ఉంటాయి అవి సాధారణమైనటువంటి వ్యక్తులు సాధించలేరు. ఒక
(10:39) యోగ లాగా చిన్న చిన్న ప్రక్రియలతో ఎనర్జీ సెంటర్స్ ని చక్కగా జాగృతం చేసుకోవచ్చు ఎనర్జీ సెంటర్ ని శుద్ధి చేసుకోవచ్చు తద్వారా హీలింగ్ అవ్వచ్చు రుగ్మతలను తగ్గించుకోవచ్చు తొందరగానే ఆలస్యం లేకుండానే మందులు వేస్తే ఎలా అయితే రుగ్మతంల నుండి బయట పడతాడు అదే విధమైనటువంటి ప్రక్రియల్ని మన క్రియాయోగంలో కూడా ఉన్నాయి అంతే ఎఫెక్టివ్ గా శరీరం మీద చూపించగలిగేటటువంటి సాధనలు ఎన్నో ఉంటాయి మన క్రియాయోగంలో సో ఇప్పుడు మీరు ఏదైనా సరే మనకి ఎనర్జీ సెంటర్స్ ని క్లీన్ చేయొచ్చు అన్నారు.
(11:10) అది ఎట్లా జరుగుతుంది? ఫస్ట్ గా మనం ఒక మనకు ఉన్నటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో భగవద్గీత కావచ్చు మన ఆచార సాంప్రదాయాలు కావచ్చు వీటన్నిటినిీ మనం ఒకసారి క్షుణణంగా పరిశీలిస్తే పాజిటివ్ థింకింగ్ గా ఉండాలి అనేటటువంటిది అయితే స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఉప్పు లేదు అనం ఉప్పు నిండుకుంది అంటాం. యజ్ఞోపవేతం తెగింది అనం యజ్ఞోపవేతం సాగింది అంటాం.
(11:35) అంటే ఏంటంటే అసలు నెగిటివ్ వర్డ్స్ చిన్న చిన్న విషయాల్లోనే రానేయకుండా అంత చక్కగా ఒక క్రమ శిక్షణగా మనకు అందించారు. ఫస్ట్ పాజిటివ్ థింకింగ్ అనేది ఆ వ్యక్తికి ఉండాలి. ఒక గురువుగా నేను ఎన్ని సాధనలు చెప్పినా ఆ వ్యక్తి నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ తో ఉంటూ నెగిటివ్ పర్సెప్షన్ తో ఉంటున్నప్పుడు ఎనర్జీ సెంటర్స్ దిగవు సాధారణంగా ఎనర్జీ సెంటర్స్ సౌండ్ కి బ్రెత్ కి యక్షన్స్ కి కనెక్ట్ అయి ఉంటాయి.
(12:00) సో అందుకే మనో మనో మనసు త్రికరణ శుద్ధి అంటారు. మనసు ఎలా ఉండాలో మాట ఎలా ఉండాలి మాట ఎలా ఉండాలో యాక్షన్స్ అలా ఉండాలి. అలాగే ఈ త్రిపుటి మనం మెయింటైన్ చేయగలిగితే శుద్ధిగా ఎనర్జీ సెంటర్స్ కాలక్రమణ శుద్ధి అవుతాయి. ముందు అసలు పాజిటివ్ థింకింగ్ గా ఉండడం పాజిటివ్ గా మాట్లాడడం లో మైండ్ లో వెళ్ళిపోయి మాట్లాడడం ఇవన్నీ తగ్గించుకొని కొంచెం ఎనర్జీస్ ని చక్కగా అర్థం చేసుకొని కనుక అటువంటి జీవన విధానాన్ని అలవాటు పడితే వాళ్ళకి ఆ విధమైనటువంటి అవగాహన మేము అందిస్తాం ముందు ప్రోగ్రామ్స్ లో మరి పాజిటివ్ గా ఎలా మాట్లాడాలి పాజిటివ్ గా ఎలా ఉండాలి ఏదైనా సమస్య వచ్చినప్పుడు
(12:33) వెంటనే బలహీనమం అయపోకుండా ఎటువంటి క్రియలతో మనం బాలెన్స్డ్ గా ఉండొచ్చు సమాధాన స్థితిలో ఉంటూనే మనం అన్ని సాధనలు సాధించగలుగుతాం యోగస్తః సహ గురు కర్మాణి అన్నారు నువ్వు యోగస్తుడివై కర్మల్ని ఆచరించు అన్నారు కాబట్టి ఆ బాలెన్స్డ్ స్టేట్ ని పొందడం కోసం ఎటువంటి క్రియలు చేయాలి పాజిటివ్ గా ఉండడం కోసం ఎటువంటి క్రియలు చేయాలి అట్లా బేసిక్ సాధనలు మనం ముందు అందించి ఆ తర్వాత అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్స్ కి వెళ్తాం అయితే మనకి ఈ చక్ర శుద్ధి ప్రక్రియ అనేది జరిగిన జరగక ముందర మనిషిలో జరిగిన తర్వాత ఎలా చేంజెస్ ఉంటాయి దాన్ని కుండల్ని శుద్ధి అంటాం మొత్తం
(13:07) ఎనర్జీ సెంటర్స్ వ్యవస్థ మొత్తాన్ని కుండల్ని అంటాం సప్త కుండల్ని వ్యవస్థని శుద్ధి చేసుకున్నటువంటి సాధకుడు ప్యూర్ కాన్షియస్ లో ఉంటాడు. అంటే తన యొక్క మనసు కావచ్చు, బుద్ధి కావచ్చు ఆలోచనలు కావచ్చు యాక్షన్స్ కావచ్చు తన యొక్క సంకల్పాలన్నీ కూడా ఈ లోకాన్ని ఉద్ధరించాలి ఈ సమాజాన్ని ఉద్ధరించాలి ఈ జగత్తును ఉద్ధరించాలన్న కోణంలో అతని యొక్క సంకల్పాలు జనిస్తూ ఉంటాయి.
(13:30) ఎవరికైతే కుండలిని శుద్ధి కాదో స్వార్ధపరమైనటువంటి మోహపూరితమైనటువంటి కామపూరితమైనటువంటి లోభపూరితమైనటువంటి సంకల్పాలని లో ఎనర్జీస్కి సంబంధించినటువంటి అంశాలతో అతను ఉంటాడు మనకి ఊర్ధ్వం గచ్యంతి సత్వస్త మధ్యేతిష్టంతి రాజసః జగన్ గుణవృత్తిస్త అదోగచ్చంతి తామసాహ అని చెప్పి భగవద్గీతలో చెప్తారు ఈ విధంగా శుద్ధి లేకపోతే కొన్ని ఎనర్జీస్ అక్కడే ఉండడంతో ప్రమాదకరమైనటువంటి ఆలోచన విధానం కలిగి ఉంటారు అంటే తను తానే హింసించుకునేటట్టుగా తను తానే నిందించుకునేటటువంటి ఆలోచన విధానం కలిగి ఉంటుంది.
(14:01) కొంతమందికి బ్లాక్ మధ్యే తిష్టంతి రాజసః రజోగుణం వాళ్ళకి ఏంటంటే ఎనర్జీస్ అక్కడే బ్లాక్ అయిపోయినటువంటి స్థితిని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. జగన్య గుణ వృత్తిష్ట హదోగచ్చంతి తామసః ఇంక లో ఎనర్జీస్ వాళ్ళ వైపు వెళ్ళిపోతారు అని చెప్పి మనకు భగవద్గీత కూడా ప్రమాణంగా చెప్తుంది. సో ఈ కుండల్ని శుద్ధి అనేది ముందు ఇంపార్టెంట్ అయినటువంటి ఒక ప్రకరణం.
(14:20) ఒక ప్రహసనం. దీన్ని దాటిన తర్వాతే సాధనలన్నీ మొదలవుతాయి. లేదు అంటే విశ్వామిత్రుడి యొక్క తపస్సు లాగా ఉంటుంది. ఎంత తపస్సు చేసినా సరే మధ్యలో కుండలిని ఇరిటేట్ చేస్తుంది ముందు అతన్ని ముందు కిందకి లాగేస్తుంది. సో అందుకని కుండలిని శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ కుండలిన శుద్ధి కావాలంటే ప్రణవం మీద మనకు స్పష్టమైన అవగాహన కావాలి.
(14:41) శబ్దం శబ్దేన శుద్ధ్యతి అని చెప్పి శబ్దం ఒక్కటే శబ్దాన్ని శుద్ధి చేయగలం. శబ్దాన్ని ఇంకా వేరే వేరే అంశాలతో శుద్ధి చేయలేం. అట్లా శబ్దాన్ని శుద్ధి చేయడం కోసం మన వాక్కును శుద్ధి చేయడం కోసమే ఓంకారాన్ని మనకు శాస్త్రం అందించింది మీరు భారత గాని రామాయణం గాన ఏ ఉపనిషత్తు చూసినా సరే మొట్టమొదట ఓంకారంతోనే మొదలవుతాయి. సో అది శబ్ద శుద్ధికి నాంది అన్నమాట.
(15:03) సో అలా ఓంకారంతో ముందుగా కుండలి వ్యవస్థను శుద్ధి చేసుకోవడం ఎనర్జీస్ని శుద్ధి చేసుకోవడం ఇట్లాంటి సాధనలు అందరూ చేయొచ్చు దానికి ఏ విధమైనటువంటి నియమాలు గాని రూల్స్ గాని ఉండవు. జస్ట్ ప్రక్రియా విధానం తెలుసుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు మీరు ఈ యొక్క సౌండ్ ద్వారా శుద్ధి అన్నారు ఇందనక వచ్చేసి బ్రతు ద్వారా కూడా మనం శుద్ధి చేయొచ్చు అన్నారు బ్రతు ద్వారా ఎలా చేయొచ్చు శ్వాస అనేది ఒక సముద్రం లాంటి సబ్జెక్ట్ దాన్ని ఎంత పెద్ద యోగి అయినా సరే ఎంత పెద్ద మహర్షి అయినా సరే ఎంత నేర్చుకున్న శ్వాస అంటే ఒక నీటి బొట్టుతో మనం అనుకోవచ్చు శ్వాస అనే స్వరమ అని
(15:41) పిలుస్తారు ముద్దుగా శ్వాసనే హంస అని పిలుస్తారు ఇంకా గొప్పగా శ్వాస అనే ప్రాణం అని పిలుస్తారు. శ్వాస అనే అన్ని రకాల ముద్దు పిల్లలతో యోగులు పిలుచుకుంటూ ఉంటారు. మీరు రామ హరి అనేటటువంటి నామోచ్చరణ కూడా శ్వాస ప్రధానంగా ఉంటుంది. రామ రామ ఆ శబ్దం మన లోపల ఒక బ్రీత్ పాటర్న్ ని డెవలప్ చేస్తుంది. రామ నామం కావచ్చు హరి నామం కావచ్చు కృష్ణ నామం కావచ్చు ఎప్పుడైతే ఈ నామం బీజాక్షరాలతో ఉంటుందో అన్ని నామాలు మళ్ళీ బ్రీత్ పాటర్న్ ని క్రియేట్ చేయవు ఒక స్పెషల్ బ్రీత్ పాటర్న్ ని ఈ నామం క్రియేట్ చేయడంతో ఆ నామం ఆ బ్రీత్ పాటర్న్ ద్వారా మన శరీరంలో
(16:26) ఉండేటటువంటి రుగ్మతలు అన్నిటిని హీల్ చేసుకునేటటువంటి విధానం మీద నేను కొంత రీసెర్చ్ చేశను మనకి 54 రకాల బ్రీత్ పాటర్న్స్ ఉంటాయి. ఒక్కొక్క బ్రీత్ పాటర్న్ ఒక్కొక్క ఎనర్జీ సెంటర్స్ ని శుద్ధి చేయగలదు ఎనర్గైజ్ చేయగలదు యక్టివేట్ చేయగలదు అన్బ్లాక్ చేయగలదు కానీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి ఎలా పడితే అలా ఏ శ్వాస పడితే ఆ శ్వాస అట్లా చేయకుండా కొంచెం అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళ మార్గ నిర్దేశం తీసుకుంటూ చేసుకుంటే ఈ 54 బ్రీత్ పాటర్న్స్ తో అన్ని రోగాలను తగ్గించుకోవచ్చు శ్వాస అంత అమూల్యమైనది.
(16:55) ఇప్పుడు శబ్దానికి శ్వాసని మనం పోటీ పెడితే శబ్దం శబ్దం స్థాయిలో ఒక శివలింగం లాగా అలా వెళ్తూ ఉంటుంది దాని ఆది అంతం మనకు తెలియదు అలాగే శ్వాసను పోటీ పెట్టామంటే అది ఒక విష్ణుమూర్తి లాగా దానికి ఆది అంతం ఉండదు ఈ రెండు అద్భుతమైనటువంటి ఎనర్జీస్ కొంతమంది శబ్దం శబ్దంతో మోక్షం పొందిన వాళ్ళు ఉంటారు. సాధకులు కర్మయోగులు ఇట్లాంటి సాధకులు ఏంటంటే శ్వాసతో మోక్షం పొందిన వాళ్ళు ఉంటారు.
(17:21) ఈ రెండింటి యొక్క సమన్వయం మానవుడికి చాలా ఉత్తమమైనటువంటి స్థితులను ఇస్తుందనే క్రియాయోగంలో శబ్దంతో కూడినటువంటి శ్వాస సమన్వయం ఉంటుంది. లం అదొక బ్రీత్ పాటర్న్ వం అదొక బ్రీత్ పాటర్న్ రం అదొక బ్రీత్ పాటర్న్ యం ఇదొక బ్రీత్ పాటర్న్ హం ఇదొక బ్రీత్ పాటర్న్ ఓం ఇదొక బ్రీత్ పాటర్న్ ఒక్కొక్క ఎనర్జీ సెంటర్స్ కి ఆ శబ్దం యొక్క బీజాక్షరం తగులుతున్న కొద్ది అక్కడ శ్వాస అలా అలా పుట్టి అలా జనరేట్ అయి వస్తూ ఉంటుంది.
(17:50) దాన్ని అనుభవించకుండా దాన్ని అనుభవిస్తేనే దానిలో ఉండే సుఖం అర్థం అవుతుంది. సో ఇప్పుడు మీరు అన్నారు మంత్రం ద్వారా కూడా జరుగుతుంది అనేసి ఇప్పుడు బీజాక్షర మంత్రాలతో అలాగే కొన్ని సార్లు యంత్రం ద్వారా కూడా జరుగుతుంది. యంత్ర ప్రక్రియ అంటే ఎట్లా ఉంటుంది? యంత్ర ప్రక్రియ అనేది పూర్తిగా ఉపాసన విధానం తెలియాలి ఆ సాధకుడు పూర్తిగా దాని యందు మాస్టర్ అయి ఉండాలి.
(18:15) గురువుల యొక్క బోధ తీసుకొని వెళ్లేటటువంటి వ్యవస్థ అతనికి ఉండకూడదు. స్వయంగా తనకి స్వచ్ఛందంగా ఆ వ్యవస్థ పైన పట్టు ఉండాలి. మాస్టర్ అవ్వడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. సో యంత్ర యంత్ర సాధనలు తాంత్రిక సాధనలు అనేవి ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని మొత్తాన్ని దానికి త్యాగం చేసి చేయాల్సి ఉంటుంది సామాన్యులు యంత్ర సాధన కంటే మంత్ర సాధన బెస్ట్ ఇంకా మంత్ర సాధన కంటే శ్వాసపరమైన సాధన చాలా ఉత్తమం.
(18:43) ఎందుకంటే యంత్రమైనా మంత్రమైనా ఏ శబ్దమైనా సరే శ్వాస నుండే బయటకి వస్తుంది. శ్వాస విధానం శ్వాసే అవుట్ పుట్ అన్నిటికీ సో శ్వాసను పట్టుకుంటే అందుకే పెద్ద పెద్ద వాళ్ళందరూ శ్వాసే ముక్తి మార్గము శ్వాసను పట్టుకుంటే చాలు కైవల్యము అనేటటువంటి భావజాలం మనం వేమన గారి దగ్గర వింటాము. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దగ్గర వింటాము. చాలామంది పత్రీజీ గారు కూడా లేటెస్ట్ పత్రీజీ గారు కూడా అదే విధానం చెప్తారు శ్వాస ఈస్ ఇంపార్టెంట్ శ్వాస చాలు శ్వాసతో ముందుకు వెళ్ళిపోవచ్చు మనం అయితే ఇప్పుడు మనకి యోగపరమైనటువంటి విషయాల్లో ఇప్పుడు యోగ అనేది ఆసనపరంగా ఉంది యోగ
(19:21) అనేది ప్రాణాయామ పరంగా ఉంది అష్టాంగ యోగపరంగా ఉంది యోగత్వం పరంగా ఉంది ఓకే ఈ డిఫరెన్సెస్ ఏంది ఆసనాలకి ప్రాణాయామానికి యోగత్వానికి కి ఈ డిఫరెన్స్ ని మీరు ఎట్లా చెప్పగలుగుతారు మొట్టమొదట మనం శాస్త్రాన్ని గనుక పరిశీలించినట్లయితే మొట్టమొదట యోగం అనే శబ్దం కపిలుడు అనేటటువంటి ఒక ముని మనకి యోగ శబ్దాన్ని పరిచయం చేశారు.
(19:45) ఆ తర్వాత పతంజలి గారు మనకి పరిచయం చేశారు వీళ్ళందరికంటే ముందు యోగ శబ్దాన్ని శ్రీకృష్ణ పరమాత్ముల వారు పరిశీ పరిచయం చేశారు. యోగ శబ్దం యొక్క వ్యుత్పత్తి అర్థం ఏంటంటే కలయక అని అర్థం కలయిక ఏదైనా అయి ఉండొచ్చు సో ఇప్పుడు ఆసనము అంటున్నాం ప్రజెన్సు తో నీ యొక్క భంగిమ నీ యొక్క బాహ్యమైనటువంటి యక్షన్ కనెక్ట్ అయితే అది ఆసనం అసభువి అనేటటువంటి అంశం అన్నమాట అంటే పోస్చర్ సుఖస్థిరం ఆసనం అంటాం సుఖము అనేది మానసికమైనటువంటి స్థితి స్థిరము అనేది భౌతికము యాక్షన్ కి సంబంధించిన రెండిటిని పోలుస్తూ చెప్తున్నది దాన్ని ఆసనం అంటారు నీ యొక్క స్థిరత్వము అక్కడ ఉండాలి అలాగని చెప్పి
(20:28) డిస్కంఫర్ట్ ఉండకూడదు సుఖంగాను ఉండాలి దాన్ని ఆసనం అంటారు. సో ఈ యోగ అనేది అనేక రకాల కలయకలు సాధకుడు పెరుగుతున్న కొద్ది ముందు మనసుని దేహాన్ని కలపాలి. అక్కడ ఒక యోగ అలాగే తర్వాత బుద్ధిని మనసుని కలపాలి అక్కడ ఒక యోగ అలాగే ఆత్మని బుద్ధిని కలపాలి అదొక అక్కడ ఒక యోగ అలాగే విశ్వ చైతన్యాన్ని తన యొక్క ఆత్మనే కలపాలి అక్కడ ఒక యోగ అలాగే జ్ఞానాన్ని విశ్వ చైతన్యాన్ని కలపాలి అది ఒక యోగ పరమాత్మని ఆత్మనే కలపాలి అది ఒక యోగ అంటే యోగ అంటే కలయిక జస్ట్ అంటే అది ఏ స్థాయిలో తను సిద్ధించుకుంటున్నాడు అన్న దాన్ని బట్టి ఆ స్థాయి యోగిగా తను ఉంటాడు. అయితే మీరు
(21:08) ఇందనక అన్నారు రమణ మహర్షి పరంపరకే చెందు రమణ మహర్షి పరంపరలో నేను ఎవరో తెలుసుకోమని ఆయన అన్నారు నేను ఎవరో తెలుసుకోవడానికి ఏ సాధన చెప్పలేదు మీరేమో సాధనలు చెబుతున్నారు ఈ రెండిటికీ వ్యత్యాసం ఏంటి అలాగే నేను ఎవరో తెలుసుకోవడానికి సాధనే లేదు అంటారు కదా లేదు అంటారు అది ఎలా నేను ఎవరు అనేది సాధనే అయితే నేను ఎవరు అనేది మామూలుగా నేను ఎవరు హూ యమ్ ఐ క్వశ్చన్ అనుకుంటా నే అది ఒక గొప్ప ప్రాక్టీస్ ఈ నేను ఎవరు అనేటటువంటి ప్రశ్నకు సంబంధించినటువంటి మనం నేపథ్యం గమనిస్తే ఆ తేజో బిందు ఉపనిషత్తు అని ఒకటి ఉంటుంది. మనకు ఆ ఉపనిషత్తులో తేజోబిందు
(21:48) ఉపనిషత్తులో కోహం నేను ఎవరు అనేటటువంటి ప్రశ్నతో నేను బుద్ధిని కాదు నేను మనసుని కాదు నేను దేహాన్ని కాదు నేను మనసుని కాదు నాకు దైవం లేదు నాకు పూజ లేదు నాకు గురువు లేదు అని ఆ ఋషి విచారణ ఉపనిషత్తు అంతా ఉంటుంది. అంటే నేను ఎవరు నేను ఎవరు అన్నప్పుడు నేను ఒక భార్గవ శర్మని నేను ఒక శరీరాన్ని అంటే అది ఒక లెవెల్ కాదు నేను అసలు నా పేరు రూపాలు ఇవన్నీ కాదు నేను మనస్సుని అని అంటే ఒక లెవెల్ నేను ఎవరు అంటే నేను బుద్ధిని అంటే అది ఒక లెవెల్ అసలు ఇదంతా కాదు నేను ఆత్మని అంటే అది ఒక లెవెల్ అంటే ఆ ప్రశ్న రూపంలో సాధకుడు సాధన చేసుకుంటూ
(22:29) తన దేహాన్ని దాటగలడు మనసుని దాటతాడు బుద్ధిని దాటగలుగుతాడు ఆత్మని దాటగలుగుతాడు. అత్యున్నతమైనటువంటి స్థాయిలన్నిటిని దాటడానికి ఆ ఒక్క క్వశ్చన్ మనకి సాధన రూపంగా ఉపయోగపడుతుంది. ప్రశ్న రూపంలో విచారణ రూపం ఇది విచారణ మార్గం అంటారు ఆయన సో ఇప్పుడు మనకి విచారణ మార్గాలు ఇన్ని ఉన్నాయి సాధన చాలామంది చేస్తున్నారు. సాధన చేసిన శక్తిని కొంతమందే నిలుపుకుంటున్నారు.
(22:55) ఆ సాధన శక్తి శరీరంలో నిలబడాలంటే ఏం చేయాలి? నిరంతరం సాధన చేయాలి. నిత్యం సాధన చేయాలి సాధన ఆగిపోయే అంశం కాదు నిరంతరం సాధకుడు సాధన చేసుకుంటూ వెళితే ఆ సాధన యొక్కటువంటి ఎనర్జీస్ ముందుగా కుండలిన శక్తిని శుద్ధి చేస్తాయి ఆ ఎనర్జీస్ అక్కడికి పో మన ప్రాణశక్తిని డెవలప్ చేసుకుంటూ వెళ్తాయి ఇంకా ఎనర్జీస్ ప్రజ్వలితంగా ఎదుగుతూ ఉంటే విశ్వాన్ని కూడా కదలించగలుగుతాయి.
(23:19) కొందరు మహర్షులు తపస్సు చేస్తుంటే విశ్వమే ఉడికిపోయింది దాంతో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు అనేటటువంటి మనకు ఘట్టాలు ఉంటాయి కాబట్టి సాధన ఎంత చేసుకుంటూ వెళ్తే అంత గొప్పగా ఎనర్జీస్ డెవలప్ అవుతూ ఉంటాయి నీ యొక్క సంకల్పాలు ఈ ప్రపంచానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు చాలామంది ఈ సంకల్పము అనే దగ్గరికి వచ్చే సంకల్పము అనేది ఒకటి సంకల్పం పెట్టుకోమంటారు కొంతమంది సంకల్పము సంకల్ప శుద్ధి సంకల్ప సిద్ధి అంటారు ఈ మూడిటి వ్యత్యాసం ఏంటి ఏ సంకల్పము ఎప్పుడు సిద్ధిస్తుంది దాని ప్రాసెస్ ఎలా ఉంటుందో చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయేది ఇదే ప్రతిదానికి సంకల్పం అని పేరు పెడతారు. ఒక
(23:57) వస్తువుని నేను కోరుకుంటున్నాను అంటే దాన్ని సంకల్పం అనరు వస్తువు దృష్టితో ఒక వస్తువు దృష్టి ఒక కారో ఒక బిల్డింగో ఒక లేకపోతే డబ్బులో ఇట్లా వస్తు దృష్టితో పెట్టుకునే వాటిని సంకల్పం అనరు కోరికలు అంటారు. కామ్యము కామ్యములు అంటారు కామికములు అంటారు. సంకల్పము అంటే ఏంటంటే ఒక్కసారి సంకల్పం అది జనరేట్ అవ్వడానికి దైవం సృష్టి నీ ఎనర్జీస్ నువ్వు ఈ నాలుగు ఒకే చోట కలిస్తే అక్కడ సంకల్పం ఏర్పడుతుంది.
(24:30) ఎప్పుడైతే ఆ సంకల్పం ఏర్పడిందో ఆ సంకల్పం నువ్వు మర్చిపో ఫస్ట్ సంకల్పం ఉండే లక్షణం నీ ఇద్దరిలో కూడా సంకల్పం గుర్తుంటుంది. అన్నం తింటున్నప్పుడు సంకల్పం గుర్తుంటుంది. ఎటు వెళ్ళిన సంకల్పం అనేది మిమ్మల్ని ఒక ఫోర్స్ అది సంకల్పం అనేది ఆ ఫోర్స్ మీద మిమ్మల్ని నెట్టుకుంటూ వెళ్తుంది. 15 సంవత్సరాలుగా మేము ఇదే మార్గంలో నిలబడి ఇదే మార్గంలో రావడానికి ఆ ఫోర్సే కారణం ఏ పక్క మార్గాలకి వెళ్లొచ్చు లేదా అటు వెళ్లొచ్చు లేదా ఈ మధ్య వస్తున్నటువంటి ఏ సిద్ధాంతం పడితే ఆ సిద్ధాంతాన్ని అట్లా చేయకుండా 15 సంవత్సరాలు ఒకటే క్రియాయోగ పట్టుకొని ఆ క్రియాయోగ క్రియాయోగ క్రియాయోగ అనుకుంటూ
(25:00) ఒక జపం లాగా చేసుకుంటూ ఈ మార్గంలో రావడానికి ఆ సంకల్పం యొక్క ఫోర్సే కారణం సంకల్పము అంటే ఒక వస్తువు దృష్టితో చేసేటటువంటి కోరికలని సంకల్పం అనకూడదు దైవికమై ఉండాలి శక్తితో ఉండాలి అలాగే అలాగే నీ యొక్క ఆత్మ యొక్క వ్యవస్థ కూడా అక్కడ విలీనమైనప్పుడు ఏర్పడేదే సంకల్పం అది నిన్ను నిరంతరం ఫోర్స్ గా ముందుకు నెట్టగలదు.
(25:23) అందుకే సంకల్ప మాత్రేన సాధ్యతి సర్వం అంటారు. కేవలం సంకల్పం సరిగ్గా ఉంటే దానికి ఎనర్జీ సపోర్టెడ్ గా ఉండి నీ యొక్క ఆత్మ శక్తి కూడా దానికి సపోర్టెడ్ గా ఉండే దానికి విశ్వ చైతన్యం కూడా సపోర్టెడ్ గా ఉంటే కేవలం సంకల్పం మాత్రంలోనే అన్ని సాధించేయొచ్చు అని చెప్తారు మనకి సో సామాన్యమైనటువంటి ఫ్రీక్వెన్సీలో పుట్టేటటువంటి కోరికల్ని సంకల్పాలు అనం హైయెస్ట్ ఫ్రీక్వెన్సీలో జనరేట్ అయ్యే వాటిని సంకల్పం అంటారు.
(25:44) అందుకే సంకల్ప సం్యక్ కల్పయతి సంకల్పం సో ఇప్పుడు సంకల్పము అనేదాన్ని మనం క్రియేట్ చేసుకుంటాం ఒక వ్యక్తి ఎట్లా వెళ్ళాలో ఎట్లా దీనికి ఆత్మశక్తి ఎప్పుడు తోడవుతుంది చాలా మందికి ఆత్మశక్తి కలవదు కదా ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఉంటుంది హ్యాపీగా ఉండాలని కానీ వాడికి సంకల్పం అది కానీ ఆత్మశక్తి ఎప్పుడు కలుస్తుంది ఆత్మశక్తి కలవాలంటే ఏం చేయాలి ఆత్మశక్తి కలగాలి అంటే ఒక ఛాలెంజ్ యూనివర్స్ నుండి నువ్వు స్వీకరించాలి ఇప్పుడు రాములవారు సీతాదేవి హాయిగా అరణ్యవాసంలో ఉన్నారు.
(26:16) వాళ్ళకి ఏమి లోటు లేదు. అరే రాజ్యం రాజ్యం వదిలేసి వచ్చానే అనేటటువంటి బాధ ఈయనకి లేదు ఆయనకు రాజ్యం లేదే అన్నటువంటి భావం సీతాదేవి గారికి లేదు. కాకపోతే సృష్టి విసిరిన ఒక ఛాలెంజ్ ఆత్మశక్తికి అంకురార్పణ ఏర్పడింది రావణాసురుడు ఎప్పుడైతే వచ్చి మాయాలీడిని ఒక పన్నాగం పన్ని సీతాదేవిని తీసుకెళ్తాడో అప్పుడు రాముల వారికి ఆత్మశక్తి అనేటటువంటి హనుమంతుడి యొక్క సహాయం కావాల్సి వచ్చింది.
(26:41) అలాగే జీవితంలో మనం ఒక ఛాలెంజ్ ని ఫేస్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా సంకల్పానికి ఆత్మశక్తి వస్తుంది. ఖాళీగా మనం మామూలుగా కూర్చున్న ఒక కంఫర్ట్ జోన్ లో కూర్చున్న వాడికి ఆత్మశక్తి అనేది రాదు. ఛాలెంజ్ నేను చేసి తీరాలి నేను గెలిచి తీరాలి నేను ఎట్లాగైనా సాధించి తీరాలి లేవాలి నా కోసం కాకపోతే నా కుటుంబం కోసం లేదంటే ఈ సమాజం కోసం లేదా నా చుట్టుపక్కన వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి చేయాలి అనేటటువంటి ఒక లక్ష్యంలోనే సంకల్పంలోనే ఆత్మ శక్తి అనేది వస్తుంది ఆ ఆత్మ శక్తి వచ్చింది అంటే ఎన్నిసార్లు కింద పడ్డ సరే లేచి పరిగెత్తగలను అన్న ధైర్యం ఆ సాధకుడికి
(27:13) ఉంటుంది సంకల్పం అనేది మనసు తాలూకు ప్రక్రియ బుద్ధి తాలూకు ప్రక్రియ అభాంగ్ మానస గోచరం అనొచ్చు అంటే మనసుకి అతీతమైంది బుద్ధికి అతీతమైంది ఆత్మశక్తికి కూడా అతీతమైనటువంటి ప్రేరణ అంటే మనం స్వాతంత్రం అంటాం స్వాతంత్రం తెప్పించింది గాంధీ గారు అంటాం. కానీ గాంధీ గారి అంటే ముందు కొన్ని వందల సంవత్సరాల నుండి స్వాతంత్రం మీద యుద్ధాలు చేసిన వాళ్ళు ఉన్నారు స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు.
(27:40) అంటే ఏంటి ఈ సంకల్పం అతను పుట్టక ముందు నుండే ఉంది స్వాతంత్రం అనే సంకల్పం. అది దేశకాలమాన పరిస్థితులకు అతీతంగా వెళ్తున్నటువంటి సంకల్పం. ఆ సంకల్పం యొక్క ఫ్రీక్వెన్సీ గాంధీ గారికి కనెక్ట్ అయింది. ఆయన ఆ సంకల్పాన్ని సిద్ధింప చేసేలాగా ఆయన లైఫ్ ని సాక్రిఫైస్ చేశారు అంటే ఏంటి మనం కంటే సంకల్పం మనకంటే ముందు పుడుతుంది. నాకంటే ముందే ఈ సంకల్పం ఉంది క్రియాయోగంతో సమాజాన్ని ఒక గొప్పగా తీర్చిదిద్దాల అనేటటువంటి సంకల్పం కొన్ని వేల సంవత్సరాల క్రితం కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే ఋషి వేసేసాడు ఆ సంకల్పం దానికి తగ్గట్టుగానే పాండిని గారు కావచ్చు పతంజలి
(28:15) గారు కావచ్చు శ్రీకృష్ణుల వారు కావచ్చు శంకరాచార్యుల వారు కావచ్చు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కావచ్చు వివేకానందుల వారు కావచ్చు రమణ మహర్షి గారు కావచ్చు రామకృష్ణ పరమహంస గారు కావచ్చు ఎంతో మంది వీరు తెలిసిన వాళ్ళు అజ్ఞాతంగా ఎంతో మంది క్రియా యోగాకు సంబంధించినటువంటి సాధనలు మనకు అందించారు అప్పుడప్పుడు ప్పుడు ఆచారాల్లోను సాంప్రదాయాల్లో మనం వాటిని చూడొచ్చు అదంతా సంకల్పం యొక్క గొప్ప వ్యవస్థ అది సో ఆ ప్రేరణే నన్ను ఆ ప్రేరణే మిమ్మల్ని ఆ ప్రేరణే మరి కొంతమంది నెక్స్ట్ జనరేషన్స్ కి మన సనాతన సంస్కృతి అందించే ప్రయత్నానికి అది ఒక ఫోర్స్ లా
(28:45) పనిచేస్తుంది అన్నది నేను అనుకుంటున్నాను మనసు తాలూకు బుద్ధి తాలూకు వచ్చేటటువంటి వాటిని సంకల్పాలు అనొచ్చా అనకూడదు మనసు నుండి పుట్టేదాన్ని భావం అంటారు బుద్ధి నుండి పుట్టేదాన్ని ఆలోచన అంటారు మనకి కి భావం అనేది స్వాధిష్టానంలో పుడుతుంది. ఆరు దళాలు ప్రాణశక్తి దానికి సరిపోతుంది. అలాగే మణిపురంలో ఆలోచన కలుగుతుంది దానికి 10 దళాల ప్రాణశక్తి కావాలి.
(29:12) సో సంకల్పానికి 1000 దళాల ప్రాణశక్తి కావాలి 1000 దళాల శక్తి ఉంటే తప్ప సంకల్పాన్ని మనం చేయలేం. సో సంకల్పం యొక్క శక్తి అంత గొప్పదిగా మనకి క్రియాయోగం ద్వారా అందుకోవచ్చు. కేవలం అది కోరిక అన్నమాట. మనసు ద్వారా పుడితే ఆలోచన చేయాలి అనేటటువంటి ఒక తలంపు మణిపురం ఆలోచనల ద్వారా కలిగేది. సో ఇవన్నీ చిన్న చిన్న అంశాలు వాటిని మనం సంకల్పం అనుకొని భ్రమ పడకూడదు.
(29:36) అయితే సంకల్ప సిద్ధి లేకపోతే మేనిఫెస్టేషన్ అంటారు. ఆ మనిఫెస్టేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుంది మనిషి జీవితంలో ముందుగా సంకల్పం అనేది మనం ఒక ఛాలెంజ్ ని బేస్ చేసుకొని నేను ఇది అవ్వాలనో లేకపోతే నాకు ఇది కావాలనోటువంటి ఒక సంకల్పాన్ని చేస్తాం అది కోరికే అయితే సంకల్పము అంటే ఏంటి అంటే దైవం ప్లస్ ఎనర్జీ ప్లస్ థాట్ ప్లస్ యూనివర్స్ ఈక్వల్ టు సంకల్పం లెక్కలాగా చెప్పాలి అంటే దైవం ప్లస్ ఎనర్జీ ప్లస్ థాట్ ప్లస్ యూనివర్స్ ఈ నాలుగు కలిస్తే దాన్ని సంకల్పం అంటాం.
(30:15) మామూలుగా నాకు అది కావాలి అంటే అది సంకల్పం కాదు దానికి దైవం సపోర్ట్ చేయాలి. ఏ సంకల్పం పడితే ఆ సంకల్పం చేసి మనిఫెస్టేషన్ చేస్తా అంటే కుదరదు సృష్టిలో సృష్టి వ్యతిరేకంగా వెళ్తాను అంటే బ్లాక్ చేసేస్తుంది ఎనర్జీ కాబట్టి ఈ నలుగురి యొక్క సపోర్ట్ తోనే మనిఫెస్టేషన్ అనేటటువంటి ప్రాసెస్ జరుగుతుంది. ముందు ఆ సంకల్పం మీ ఎనర్జీ ని ఎనర్గైజ్ చేయాలి.
(30:33) ఎనర్గైజ్ అయినటువంటి ఆ ఎనర్జీస్ యూనివర్స్ తో అసోసియేట్ అవ్వాలి. అసోసియేట్ అయిన తర్వాత యూనివర్స్ కాస్మిక్ ఎనర్జీని రిలీజ్ చేయాలి. ఆ కాస్మిక్ ఎనర్జీ రిలీజ్ అయిన తర్వాత మెటీరియలైజేషన్ ప్రాసెస్ జరుగుతుంది. మెటీరియలైజేషన్ ప్రాసెస్ లో కూడా ఎనర్జీస్ బలహీనంగా ఉంటే స్టాప్ అయిపోతాయి బ్లాక్ అయిపోతాయి. ఆ మెటీరియలైజేషన్ జరిగేటటువంటి ప్రాసెస్ లో కూడా ఎనర్జీస్ బాగుంటే అప్పుడు మెటీరియలైజ్ అవుతుంది ఇంత ప్రక్రియను మనం ఈ సాధనతో మనం ఈజీగా సాధించొచ్చు ఆ ప్రక్రియ అయితే ఇక్కడ మనకి ఆత్మశక్తి అనేది ఉంది విశ్వశక్తి అనేది ఉంది ఆత్మశక్తిని విశ్వశక్తితో అనుసంధానం విశ్వశక్తిని
(31:07) ఆత్మశక్తితో అనుసంధానం చేయాలంటే ఎలా ఆత్మ శక్తి అనేది సాధకుడి యొక్క సాధన నుండి పుడుతుంది. విశ్వశక్తి అనేది సాధకుడి యొక్క పూర్వజన్మ సుకృతం నుండి కలుగుతుంది. అంటే తన యొక్క నేచర్ తన యొక్క ప్రకృతి దానికి అనుగుణంగా ఉండదు. కొంతమంది సాధన చేస్తారు. కానీ వాళ్ళకి విశ్వశక్తి అనేది ఉండదు. కొంతమంది అసలు ఏ సాధన ఉండదు వాళ్ళకి విశ్వశక్తి బ్రహ్మాండంగా ఉంటుంది.
(31:30) మనం అది గమనించొచ్చు. సో విశ్వశక్తి అనేది సాధన నుండి కంటే వారి యొక్క పూర్వజన్మ సుకృతం నుండి వారి యొక్క గురుదేవుల దయ నుండి గురుదేవుల యొక్క అనుగ్రహం నుండి కూడా విశ్వశక్తి పుడుతుంది. దైవికమైనటువంటి అంశాల ద్వారా విశ్వశక్తి జనరేట్ అవుతుంది. సాధనతో పుట్టేది ఆత్మశక్తి సో సాధనతో ఉండేటటువంటి ఆత్మశక్తిని తో పాటు విశ్వశక్తి కూడా ఉండాలంటే గురువు యందు నమ్మకం గురుదేవులు చూపించినటువంటి మార్గం ముందు దాని యందు విశ్వాసం దైవం ముందు విశ్వాసం ఈ యూనివర్స్ చూస్తుంది మనం ఏం చేసినా సరే ఏమ అనుకుంటున్నా సరే బయటదే కాదు లోపల కూడా ఏం జరుగుతుందో మొత్తం అదే అద్దంలో సినిమా
(32:07) చూసినట్టుగా చూడగలదు అనేటటువంటి ఒక నమ్మకం పెట్టుకొని ఒక ప్యూర్ గా నువ్వు ఉండగలిగితే కాస్మిక్ ఎనర్జీతో నీ ఆత్మశక్తిని చక్కగా సమన్వయం చేయగలుగుతావు అదే మనకి దైవాసుర సంపద్వి భాగయోగంలో మనకి స్వామి వారు అందించినటువంటి సూత్రం. అయితే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు విశ్వశక్తితో ఆత్మశక్తి అనేది అనుసంధానం అనేది చేసుకోవడం వల్ల ఇది ప్రయోజనం అన్నారు విశ్వశక్తితో ఆత్మశక్తి అన్నప్పుడు ఇప్పుడు కొంతమంది దాని వల్ల వాళ్ళకి భౌతికంగా ఇవన్నీ కలుగుతాయి అనేసి చెప్పారు.
(32:40) అయితే కొంతమంది ఏ ఆత్మసాధన ఉండదు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న చాలామంది ఫైనాన్షియల్ గా ఇప్పుడు మేనిఫెస్టేషన్ ప్రకారం వెళ్ళినప్పుడు శక్తితో మేనిఫెస్టేషన్ అంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్స్ అందరికీ వాళ్ళకి ఆధ్యాత్మికత అంటే పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు కొంతమందికి తెలిసి ఉండొచ్చు సో వాళ్ళకి ఎలా జరుగుతుంది సామాన్యులకు ఎందుకు జరగటం లేదు కొంతమందికి అది అదృష్టం లాగా ఎందుకు కలిసి వస్తుంది ఓ జీవితంలో ఒక యోగం లాగా వాడికి యోగం ఉందిరా మంచి రిచ్ అయిపోయాడు అలా పెట్టంగానే అనేది ఎందుకు జరుగుతుంది దీనికి ఎనర్జీకి ఉన్న సంబంధం ఏంటి
(33:16) ఈ మేనిఫెస్టేషన్ ప్రాక్టీస్ చేసేది ప్రపంచవ్యాప్తంగా నన్ను అడిగితే రెండు రకాల వాళ్ళు మేనిఫెస్టేషన్ రెండు విధాలుగా ప్రాక్టీస్ చేస్తారు. ఈ ప్రపంచంలో ఉండే జీవులందరూ జీవరాశులు అన్నీ కూడా మేనిఫెస్టేషన్ చేస్తాయి. ఒక వర్గం ఏంటంటే తెలియక మేనిఫెస్టేషన్ చేస్తాయి. ఒక వర్గం తెలిసి మేనిఫెస్టేషన్ చేస్తాయి. మేనిఫెస్టేషన్ నాకు తెలియదండి నేను మనిఫెస్టేషన్ ప్రాక్టీస్ చేయను అనేటటువంటి వ్యవస్థ లేదు.
(33:41) నీకు తెలిసినా తెలియకపోయినా కోరికలు అనుకుంటాం కదా నాకు ఇది కావాలి నాకు ఇది జరగాలి నాకు ఇది అవ్వాలిని అనుకుంటాం దాని ప్రకారం ఏదో ప్రయత్నం చేస్తాం ఫలితం వచ్చినా రాకపోయినా ఇది నా కర్మ ఇది నా ప్రాప్తం అనుకుంటాం తీసుకుంటాం మళ్ళీ నెక్స్ట్ ఒక సంకల్పం చేస్తాం వెళ్తాం అది అన్కాన్షియస్ గా సబ్కాన్షియస్ గా జరిగేటటువంటి మనిఫెస్టేషన్ ఎవరైతే సాధన అర్థం చేసుకొని వ్యవస్థలను అర్థం చేసుకొని అసలు సంకల్పం నుండి సిద్ధి వరకు ఉండేటటువంటి ఆ మార్గాన్ని చక్కగా స్పష్టంగా అర్థం చేసుకొని అవగాహన చేసుకొని గురువుల యొక్క బోధ ోధని స్పష్టంగా అర్థం చేసుకొని వారి యొక్క గైడెన్స్ తీసుకొని స్టెప్ బై స్టెప్
(34:13) స్టెప్ బై స్టెప్ వారి చేతిలో చెయి పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తే దాన్ని పరిపూర్ణమైనటువంటి మెటీరియలైజేషన్ గా అసలు ఏ విధమైనటువంటి ప్రమాద రహితమైనటువంటి మెటీరియలైజేషన్ గా చెప్పొచ్చు మనం అలా వాళ్ళు వాళ్ళకు తెలిసినటువంటి ట్రైనర్స్ యొక్క హెల్ప్ తీసుకొని మనిఫెస్టేషన్ యొక్క ప్రాసెస్ లో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. మనవాళ్ళు ఎలా ఉంటారు అంటే ఏ ఛానల్ లో ఏది చెప్తే దాన్ని ఫాలో అయిపోదాం గుడ్డిగా ఒకడేమో సాంబ్రాణి ఆకు పెట్టుకోమంటాడు ఒకడో బిర్యానీ ఆకు పెట్టుకోమంటాడు ఒకడో యాలకులు పర్సులో పెట్టుకోమంటారు రకరకాలైనటువంటి వ్యవస్థలు మనకి ప్రచారంగా ఉన్నాయి అవి
(34:43) నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు నమ్మే ముందు అది ఏ విధంగా శాస్త్రీయం అది శాస్త్రీయమా కాదా అలా చేసిన వాళ్ళు ఉన్నారా పూర్వం ఇవన్నీ గమనించుకొని చేస్తే లాభం ఉంటుంది లేదు అంటే ఏమవుతుందంటే అది లైఫ్ టైం బాధగా మిగులుతుంది ఎనర్జీస్ కి సంబంధించిన టువంటి అంశాలలో మనం ఏ చిన్న దోషం చేసినా సరే అది పెద్ద విపత్తుగా పరిణమిస్తుంది. ఎనర్జీకి సంబంధించినటువంటి సాధనలో ఏదైనా సరే స్వల్ప మాత్రానైనా సరే సరిగా చేస్తే అది బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని అందిస్తుంది అని చెప్పి మనకు భగవద్గీతలో చెప్తున్నారు.
(35:14) సరే ఇప్పుడు ఎనర్జీస్ తో గేమ్ అంటారు ఇప్పుడు మనకు ఒక టెంపుల్ కి వెళ్ళిన ఒక ఒక పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. ఆ టెంపుల్ కి వెళ్ళినప్పుడు అక్కడ పాజిటివ్ ఎనర్జీస్ లో మనం అక్కడ పూర్వకాలంలో మన వాళ్ళు చెప్పేవాళ్ళు ఏదనా బాగా లేకపోతే ఒక గుడికి ఒక క్షేత్రానికి వెళ్లి శ్రీశైలం వెళ్లి మూడు రోజులు నిద్ర చేసిరా అంటరా లేకపోతే తిరుమలకి వెళ్లి మూడు రోజులు నిద్ర చేసిరాండి అని చెప్పేవాళ్ళు ఇప్పుడంటే ఆ నిద్రలు చేసే పరిస్థితులు లేవు అప్పుడు హ్యాపీగా గుడి ఆవరణంలో పండుకునే వాళ్ళు వచ్చేవాళ్ళు సో అది ఎట్లా వాళ్ళకి ఆరోగ్యాన్ని వాళ్ళకి ఎట్లా క్రియేట్
(35:48) చేసేది అప్పట్లో ఆ మూడు రోజులు నిద్ర చేయడం వల్ల దాని వెనకు ఉండే సైన్స్ ఏంటంటే మన టెంపుల్స్ అన్ని గుడి పైన కొండ పైన కడతారు. సో మూలమూర్తిని మనం దర్శించుకోవాలంటే కొండ ఎక్కాలి. ఎప్పుడైతే మనం పైకి ఎక్కేటటువంటి పైకి వెళ్తున్నప్పుడు కుండల్ని రేజ్ అవుతుంది. ఎప్పుడైతే అంత పైకి ఎక్కిన తర్వాత ఆజ్ఞ స్థాయిలో ఎనర్జీస్ జనరేట్ అవుతాయి.
(36:08) అంత పైకి ఎక్కిన తర్వాత దైవ దర్శనం తీసుకొని అప్పుడు ఏదైనా సంకల్పం చేస్తే అది సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎనర్జీస్ ఆల్రెడీ ఊర్ధ్వ గతిలో ఉన్నాయి కాబట్టి కాకపోతే ఈ విధమైనటువంటి వ్యవస్థ వల్ల తాత్కాలికమైనటువంటి ఉపశమనం కలుగుతుంది కానీ సాధనతో అతను ఎనర్జీస్ ఊర్ముఖానికి లేపలేదు కాబట్టి శాశ్వతమైనటువంటి పరిష్కారాలు దొరకవు.
(36:27) దాంతో మనం ఆ విధమైనటువంటి అనుభూతి పొందడం కోసం సంవత్సరానికి ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఒక మొక్కులాగా మనం చేస్తూ ఉంటాం. నిజానికి అది గుడ్డి కంటే మెల్ల నయం లాగా తాత్కాలికమైనటువంటి ఉపశమనం కోసం మనం వాటిని చేయొచ్చు కానీ సాధనతో గనుక మనం ఎనర్జీస్ ని డెవలప్ చేసుకుంటే శాశ్వతమైనటువంటి లాభాలు కలుగుతాయి నేను దాన్ని ఆ విధమైనటువంటి వ్యవస్థ ఉండాలి దానితో పాటు శాశ్వతమైనటువంటి వ్యవస్థ వైపు కూడా మనం ఒకసారి ఆలోచించి సాధనతో కూడా ఎనర్జీస్ ని చక్కగా జాగృతం చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఉదాహరణకి మనకి ఏదైనా ఇబ్బంది అనిపించింది అనుకోండి టెన్షన్ అవుతున్నాం
(37:00) అనుకోండి వెంటనే ఇంట్లో ఉండం మెట్లెక్కేసి పైకి వెళ్తాం పైకి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఉంటాం అప్పుడప్పుడు రెండు చేతులు ఇలా వెనక్కి పెట్టుకుంటాం. ఈ రెండు చేతులు వెనక్కి పెట్టగానే అది మూలాధారానికి కనెక్ట్ అవుతూ ఉంటాయి. దాంతో కొంచెం స్ట్రెస్ బస్టర్ అన్నమాట స్ట్రెస్ తగ్గుతూ ఉంటుంది పైకి వెళ్ళడం వల్ల ఎనర్జీస్ రేజ్ అవుతాయి ఇవన్నీ సబ్కాన్షియస్ మైండ్ లో జరిగేవి కాన్షియస్ లో జరగట్లే సో మనకు తెలిసి చేసే సాధన వల్ల పరిపూర్ణమైనటువంటి ఫలితాలు కలుగుతాయి.
(37:25) తెలియక ఏదో అలవాటుగా చేస్తుంటాం ఆ ఎనర్జీస్ ఇప్పుడు టెన్షన్ పట్టినప్పుడు ఇట్లా ఇట్లా ఇట్లా అనుకుంటాం. దాని వెనక ఏం జరుగుతుంది ప్రెజర్ పాయింట్స్ అన్ని యాక్టివేట్ అవుతూ ఉంటాయి చేతుల్లోనే అన్ని ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి. అదే తెలుసు నువ్వు రోజు ఉదయాన్నే ఒక సాధన లాగా చేసుకుంటే అసలు స్ట్రెస్ఏ ఉండదు కదా అనేది నా అభిప్రాయం మనకి సమాజంలో చూసినట్లయితే యోగాపరమైనటువంటి స్కూల్స్ అనండి యోగపరమైనటువంటి సంస్థలు అనండి ప్రాపరిగేనయి యోగా సాధన చేసేవాళ్ళు పెరిగారు.
(37:54) కానీ ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతున్నాయి ఇది పెరిగినప్పుడు ఇి తగ్గాలి కదా ఎందుకు ఇవి పెరుగుతున్నాయి అది మనకి చాలామంది ఆ ప్రాక్టీసెస్ లాగా చూస్తున్నారు ఎక్కడ మిస్మీ అవుతుంది ఇదేదో హోమియోపతీ మందు లాగానో అల్లోపతి మందు లాగా చేసేది సాధన కాదు స్పష్టంగా వెళ్ళాలి ఏమి చేయాలి ఈ ఐదు ప్రశ్నలు గుర్తుపెట్టుకోవాలి ఏ సాధన చేయాలన్నా అప్పుడే ఆ సాధన వల్ల మనకు సంపూర్ణమైన ఫలితాలు కలుగుతాయి ఏం చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎందుకు చేయాలి దేనికోసం చేయాలి ఈ ఐదింటికీ సమాధాన పడకుండా ఎవరో భార్గవ శర్మ చేశడు చెప్పాడనో లేకపోతే ఫలానా వ్యక్తి చెప్పాడనో ఫలానా
(38:34) పెద్ద హిమాలయ పర్వత యోగి వచ్చి చెప్పాడనో చేస్తే సమస్యలు అలానే ఉంటాయి నాకంటూ స్పష్టంగా నేను దేనికి చేయాలి ఎందుకు చేయాలి ఎలా చేయాలి ఒక వ్యక్తికి వ్యక్తికి ఎనర్జీస్ పరంగా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంతెందుకు ఒకళ్ళకి ఒకళ్ళకి మానసిక పరంగా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలాగే సాధన కూడా మనం ఏది చేయాలి ఇప్పుడు ఉదాహరణకి స్త్రీలని పురుషులు చూసుకుంటే స్త్రీలకి చంద్రనాడు ఎక్కువగా ఉద్దీపన అవుతూ ఉంటుంది.
(38:58) పురుషులకి సూర్యనాడు ఎక్కువగా ఉద్దీపన ఉంటుంది. దాని ప్రకారం ప్రాణాయామం చేయాల్సి వస్తే చంద్రనాడికి సంబంధించినటువంటి సాధన ఎక్కువగా పురుషులు చేయాల్సి ఉంటుంది. సూర్యనాడికి సంబంధించిన సాధన ఎక్కువగా స్త్రీలకు చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క నాడి ఇడా పింగళా నాడుల యొక్క ఉద్దీపన ఎలా ఉంది అన్నది బేస్ చేసుకొని ప్రాణాయామం చేయాలి. ఇక ఒక గురువుగారు కూర్చుంటారు అందరికీ కలిపితే ఒకటే ప్రాణాయామం చేయండి అని అంటే ఎట్లా రిసల్ట్స్ వస్తాయి నాకు ఏ విధమైనటువంటి నాడి ఎక్కువగా పనిచేస్తుంది దాన్ని బేస్ చేసుకొని ఏ నాడి అయితే బలహీనంగా పనిచేస్తుంది ఆ బలహీనమైనటువంటి
(39:26) నాడిని ఏ సాధనలతో ప్రదీయుక్తం చేసుకోవాలి ఆ అవగాహన ఉండి గనుక మనం సాధన చేసినట్లయితే ఆసనాలైనా అంతే నేను ఏ ఆసనాలు వేయాలి ఏ ఆసనాలు వేయకూడదు నా దేహ ధర్మానికి తగ్గట్టుగా ఏ ఆసనాలు అసలు వేయకూడదు కొంతమందికి శీర్షాసనం వేయకూడదు కొంతమందికి సర్వాసనం వేయకూడదు కొంతమందికి పశ్చిమోత్తాసనం వేయకూడదు కొంతమందికి వెనక్కి వంగే ఆసనాలు వేయకూడదు బలహీనంగా ఉండేవాళ్ళు ఇవన్నీ శాస్త్రం చక్కగా చెప్పినప్పుడు వాళ్ళు చేశారనో వీళ్ళు చేశారనో కాకుండా నాకంటే ఒక స్పష్టమైన అవగాహనతో వెళ్తే సాధన వల్ల అందరికీ సత్ఫలితాలు కలుగుతాయి ఐదే ఐదు ప్రశ్నలు ఏం చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎక్కడ
(39:59) చేయాలి ఏ విధంగా చేయాలి అంతే ఆ స్పష్టమైన ఇన్ఫర్మేషన్ నువ్వు తీసుకో గురువుని 10 సార్లు ప్రశ్నించు సాధనకు వెంటనే దిగకుండా ముందు ఈ ప్రశ్నకు సమాధానం తీసుకొని అసలు ఎందుకు చేయాలి ఈ సాధన నేనే ఎందుకు చేయాలి వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహ శీవమే తదేకం వదనిశ్చిత్య ఏన శ్రేయోవహం అప్నయం అంటాడు అర్జునుడు శ్రీకృష్ణుడితో శ్రీకృష్ణుడు అంతటి వాడితో నాకు అనవసరమైనవి చెప్పొద్దు సోది నాకు ఏది చేయాలో ఇప్పుడు నాకు ఏది అవసరమో అది మాత్రమే నిశ్చయించి చెప్పు అని అర్జునుడు శ్రీకృష్ణుడు అడిగినప్పుడు గురువులని నువ్వు ఎందుకు అడగలేవు నాకు ఇప్పుడు సమస్య
(40:32) ఇది నాకు ఇప్పుడు ఇది చేయాలి ఇది ఎందుకు చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఎప్పుడు చేయాలిఅని నువ్వు ఎందుకు అడగవు నువ్వు అడిగినా కూడా సమాధానం చెప్పకపోతే వదిలేసేయ ఆ గురువుని నీకు ఎక్కడైతే తే సమాధానం దొరుకుతుందో అక్కడికి రా అక్కడ ప్రశ్న లేయ అక్కడ సమాధానం పొందు సాధన చెయ్ బ్రహ్మాండమైనటువంటి శ్రేయస్సుని అందరూ పొందుతారు.
(40:51) ప్రశ్న ఉపనిషత్తే మనకు ఉంది ప్రశ్నించడానికి మొహమాటం పడితే సాధన చేయడం. లోపం అదేనండి సమాజంలో ఉన్న లోపం అది ప్రశ్నించడానికి ఇబ్బంది పడతారు. సో ఇక్కడ సాధనలో జరిగేటటువంటి ఇబ్బందులు అనే దాని మీద నా దగ్గరికి నేను రెగ్యులర్ గా ఆస్ట్రాలజీ ప్రాక్టీస్ చేస్తుంటాను. మొన్న రీసెంట్ గా ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి ఏంటి అంటే ఏం చేశారంటే ఒక ఏదో యక్షిని సాధన ఏదో క్రేజీగా వెళ్లి ఒక గురువుగని అడిగాడు ఆయన ఇచ్చేసాడు ఈయనకి చేశడు ఆ యక్షిణి వచ్చి ఎదురు కూర్చుంటుంది ఈయనకి ఏమ అడగాలో తెలియదు ఏమ అడగకూడదో తెలియదు వాళ్ళకి ఎందుకు చేశాడో తెలియదు దేనికి అనేది ఇప్పుడు మీరు అడిగినందుకు
(41:30) ఎందుకు ఏమిటి అని కాదు ఊరిక ఆ యక్షిణిని అంటే యక్షిని సిద్ధిస్తుంది అని చెప్పాడు ఆయన ఎక్కడో ఆయన దగ్గరకి పోయేసి అది తీసుకున్నాడు చేసేసాడు చేసేయటం వల్ల వచ్చిన తలకాయ నొప్పి ఏంటంటే ఈయనకి ఆ యక్షిని కనిపిస్తుంది కనిపిస్తుంటే ఇప్పుడు ఒక యక్షిని అనేది స్త్రీ రూపంలో కనిపిస్తుంది ఈడికి వచ్చిన సమస్యల్లో ఏందంటే అది ఎప్పుడు కనిపిస్తుంటే కరెక్ట్ గా బాత్్రూమ్ కి వెళ్ళలేడు అంటే తను చెప్పిన డైరెక్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనకి ఎదురుగా ఒక లేడీ ఉంటే బాత్్రూమ్ కి ఎట్లా వెళ్తా అంటే బాత్రూమ్ కి వెళ్ళలేడు సరిగ్గా తను అనుకున్నవి చేసుకోలేడు తను డ్రెస్ అప్ అవ్వాలనుకున్నా కానీ
(42:06) నవ్వుతూ కనిపిస్తుంది అవును అవును అంటే అది ఒక రకమైన అదే అన్నమాట ఇట్లాంటి సందర్భాల్లో ఇట్లా చేసిన వాళ్ళకి మనం ఏం చెప్పాలి సమాధానం అందరి సంగతి అయితే పక్కన పెడితే నాకు కనుక అలా ఫోన్ చేస్తే దయచేసి నాకు ఫోన్ చేయకండి అని చెప్పి పెట్టేస్తాను నేను ఎందుకంటే రాంగ్ ప్రాక్టీసులకు నువ్వు వెళ్లద్దు అసలు ఫస్ట్ కింద పడ్డాక తర్వాత ఎవరు మనల్ని రక్షించలేరు అనేది నా అభిప్రాయం నేను ఎందుకంటే అది నా సాధన కాదు అది నా వ్యవస్థ కాదు కాబట్టి అసలు రాంగ్ ప్రాక్టీసులకి వెళ్ళకూడదు.
(42:36) నీకు పూర్వాపరాలు తెలియకుండా అది నువ్వు చేయాలో చేయలేదో యోగ్యత లేకుండా దానికి అర్హత ఉందో లేదో తెలుసుకోకుండా నువ్వు రాంగ్ ప్రాక్టీస్ లోకి వెళ్ళడమే పెద్ద తప్పు వెళ్లేసేసి మిస్టేక్ అయిపోయి ఆ గురువు దగ్గరే నువ్వు ఆ గురువుకి ఆ యాక్షన్ అప్ప చెప్పాలి అది ఒక్కటే పరిష్కారం సో నేను మేమఏంటంటే ఇ అట్లాంటి అంశాలకు మనం ఎంగేజ్ అవ్వం అంటే ఇప్పుడు ఎట్లా అంటే అది క్రేజ్ ఏదో దేవత కనిపిస్తుంది అనంగానే చేసేయటం చేసేసిన తర్వాత దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోవటం అన్నమాట ఇంకోటి అబ్బాయి ఏమనుకుంటున్నాడు యక్షినినే యక్షిని లలిత అమ్మవారు ఒకటే అనే భావనలో
(43:14) ఉన్నాడు అంటే ముందర వీళ్ళకి యక్షిని కిన్నెర కింపురుష దైవము ఋషి మహఋషి దైవము పరాదేవత అనేది జ్ఞానం ఉంటే అంటే మన మోక్ష దేవతలు ఎవరు అనేది మనకు ఉంటే ఇది ఉంటుంది ఇప్పుడు చాలామంది ఇప్పుడు సాధన చేసేటప్పుడు సూర్యుని ఉపయోగించుకోవడం వల్ల చాలా అద్భుతాలు జరుగుతాయి అని చెబుతారు. ఏది మనకి యోగ మార్గం సూర్యుడిని ఎలా ఉపయోగించుకుంటే అద్భుతం జరుగుతుంది అసలు సూర్యుడికి ఉన్న ప్రయారిటీ ఏంటి ఏ మంత్రం అయినా సరే గాయత్రీ మంత్రం కావచ్చు మృత్యుంజయ మంత్రం కావచ్చు గణపతి మంత్రం కావచ్చు, పంచాక్షరి మంత్రం కావచ్చు ద్వాదశాక్షరి మంత్రం
(43:58) కావచ్చు, అష్టాక్షరి మంత్రం కావచ్చు ఏదైతే ప్రధానంగా మంత్రానుష్టానంలో ఉండేటువంటి మంత్రాలన్నిటిని ఋషి వాటిని కనిపెట్టి దాని విధానం ఒకటి చెప్తారు. సూర్య మండలంలో ఆ మంత్రాది దేవత ఉన్నట్టుగా ధ్యానం చేస్తూ మంత్ర సాధన చేయమని చెప్తారు. అంటే గాయత్రి మంత్రం చేస్తున్నాం అంటే గాయత్రి మాత్రం సూర్య మండలంలో ఉన్నట్టుగా ధ్యానించాలి. అంటే ఇది ఒక గొప్ప సాధన.
(44:20) సూర్యభగవానుడు అనేటటువంటి వ్యక్తి మన యొక్క అభౌతిక సహస్రార శక్తి కేంద్రానికి ప్రతీక ఆయన. సహస్రార శక్తి కేంద్రానికి ప్రతీకగా ఉండేటటువంటి సూర్య భగవానుడు అనేటటువంటి మనం ఆ విధమైనటువంటి వ్యవస్థను గుర్తించిన వాళ్ళు సూర్య భగవానుడికి ఎనలేని స్థాయిని ఎనలేని ప్రాధాన్యతని మన ఆచార వ్యవహారాల్లో అందించారు. సో ప్రతి సాధనకి మీకు జ్యోతిష్యం చూసుకున్నా సరే సూర్యుడు ఆరోగ్య భాస్కరాదిత్య అంటారు సూర్య భగవానుడు అనే ఆరోగ్యం భాస్కరా భాస్కరాదిత్య అంట సూర్యుడిని ఒక ఉత్తమమైనటువంటి స్థానంలో ఉంచుతారు వాస్తులో అయినా సరే సూర్యుని ప్రధానంగా తీసుకుంటారు సూర్యరశ్మి ఆ గృహంలో
(45:00) పుష్కలంగా పడేది శుభం అని చెప్తారు. సో సూర్యుడు అనే వ్యవస్థ చాలా ఉన్నతమైనది క్రియా యోగంలో కూడా సూర్యుని మనం సహస్రారంతో పోల్చుకొని సాధన చేస్తూ ఉంటాం మంత్రానుష్టానం చేయాలన్న ఏది చేయాలన్నా సరే అది ఉత్తమమైనటువంటి స్థితి కాకపోతే దాన్ని సహస్రారంతో సమన్వయం చేసేటటువంటి ఆ వ్యవస్థ తనకు స్పష్టంగా అర్థమైతే సూర్యుని చక్కగా ఉపయోగించుకోగలుగుతాడు అన్నిట్లో ఇప్పుడు యోగము సాధన యోగము వేరు సాధన వేరు యోగ సాధన వేరు ఈ యోగాన్ని సాధించడానికి సాధకుడు ఏ విధంగా సంసిద్ధుడు అవ్వాలి ముందుగా తనకంటూ ఒక మార్గాన్ని పెట్టుకోవాలి. ఒక మార్గం అంటూ ఉండాలి కదా
(45:40) ఒక పంధా ఉండాలి కదా లాయర్ అవుదాము అంటే ఒక మార్గం కావాలి ఒక మార్గంలో వెళ్తేనే లాయర్ అవుతాం ఒక మార్గంలో వెళ్తేనే పిఎం అవుతాం ఒక మార్గంలో వెళ్తేనే డాక్టర్ అవుతాం అది ఏ మార్గం అయి ఉండాలి వస్తు మార్గమా ఆధ్యాత్మిక మార్గమా రెండే మార్గాలు ఉన్నాయి సృష్టిలో లౌకిక మార్గం ఆధ్యాత్మిక మార్గం అద్వైత మార్గం ద్వైత మార్గం రెండే మార్గాలు దానికి రకరకాల పేర్లు చెప్పుకుంటాం ముందుగా నీ మార్గం ఏమిటి అందరూ గొప్పగా కీర్తించినటువంటి మార్గాన్ని నువ్వు ఎంచుకుంటాను అంటే అది అద్వైత మార్గం రెండోది లేదు నేనే ఉన్నా బ్రహ్మ సత్యం జగన్ మిథ్య నువ్వే అంత నీదే
(46:21) అంత నీలోనే అంత అనే భావాన్ని నువ్వు డెవలప్ చేసుకుంటూ అద్వైత మార్గంలో వెళ్తాను అంటే ఈ సృష్టి మొత్తం నీకు సపోర్ట్ చేస్తుంటుంది. లేదు ద్వైత మార్గంలో వెళ్తాను అంటే మొదట్లో ఓకే సపోర్ట్ నీకు కావాలి కాబట్టి గుడ్డులో కంటే మెల్లనయం కాబట్టి దేవతా అర్చనలు ఇవన్నీ కూడా నీకు అవసరమే కాబట్టి వాటిని పట్టుకొని అదే శాశ్వతం అనుకోకుండా తర్వాత అయినా సరే నిర్గుణోపాసనకు వచ్చి నిరాకారమై సచ్చిదానందమై సచ్చిదానంద ఘనమైనటువంటి స్వరూపాన్ని నువ్వు అందుకునే ప్రయత్నం చేస్తే అద్భుతమైనటువంటి స్థితిని అందుకోగలుగుతావు మార్గం ఎప్పుడూ కూడా అద్వైత మార్గమే అయి ఉంటేనే సాధనలో
(46:53) సత్వలితాలు పొందుతాం మనకి ఉత్తరగీతలో పూజకోటి సమం స్తోత్రం స్తోత్ర కోటి సమోజపం జపకోటి సమో ధ్యానం ధ్యాన కోటి సమోలయహ అంటే మనక పూజ నుంచి లయం వరకు చెప్పారు ఇవి ఎట్లా బ్యాలెన్స్ అవుతుంది దీన్ని ఎట్లా మీరు థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ఫస్ట్ పిల్లవాడికి క్రమ శిక్షణ నేర్పించాలి అనుకోండి పొద్దున్నే లేవాలి యోగా చేయాలి ఇలా కూర్చున్న పుస్తకం చదువుకోవాలి అని అంటాం కాస్త తనకు అర్థమైింది అనుకోండి అది అలవాటు పడ్డాడు అనుకోండి మాట్లాడతాం అరే నీకు ఈ సబ్జెక్ట్ వచ్చింది కదా దాని గురించి మాట్లాడమని చెప్తాం అది రెండో విధమైనటువంటి ప్రక్రియ మాట్లాడిన తర్వాత
(47:28) దాని గురించి చెప్పమని చెప్తాం నలుగురికి చెప్పమని చెప్పిన తర్వాత దాని గురించి ఆచరించడం అనేది ఫోర్త్ స్టేజే అన్నమాట పూజ అనేది కేవలం మనల్ని ఒక క్రమశిక్షణ గాటిలో పెట్టడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక భౌతికమైనటువంటి ప్రాక్టీస్ అంటే మనసుని ఉదయాన్నే పూట బ్రహ్మ ముహూర్త సమయంలో ఏకాగ్రంగా చేస్తే ఆ అది తర్వాత తర్వాత యాక్షన్స్ కి అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతుంది.
(47:52) అందుకే చాలా మందికి పూజ పొద్దునే చేయకపోతే అరే నేను పూజ చేయలేదురా అనేటటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది. సో పూజ అనేది ఒక భౌతిక మైనటువంటి ప్రాక్టీస్ మనసుని శరీరాన్ని లయం చేసేసేసి ఒక ఏకాగ్రతగా ఉండడానికి ఒక ధ్యానం ప్రాక్టీస్ లాగా పూజ అన్నమాట తన యొక్క పూర్తి స్థాయి నిగ్రహాన్ని పెంచడం కోసం భౌతికమైన ప్రాక్టీస్ దాన్ని మించి ఉంటుంది జపం దాన్ని మించి ఉంటుంది సాధన దాన్ని అదంతా అయిపోయిన తర్వాత వచ్చేది లయ ఆ లయ సాధనలో నీకు అసలు సాధనే ఉండదు ఆటోమేటిక్ గా ఎనర్జీస్ అన్ని ఏకాగ్రంలో ఉంటాయి థర్డ్ డే యాక్టివేషన్ లో ఉంటుంది ఎనర్జీస్ అన్ని యూనివర్స్ తో అసోసియేట్ అవుతుంటాయి
(48:24) సంకల్పాలన్నీ ప్యూర్ గా వస్తూ ఉంటాయి ఏ విధమైనటువంటి వాటికి భయం గాన బాధ గాని కలగదు. ఇక సాధనలో ఉండేటటువంటి పూర్తి స్థాయి స్థితిలో ఇక జపాలు చేయాల్సిన అవసరం ఉండదు కదా అందుకే ఆ స్థాయి అది దాన్ని లయ స్థితి అంటాం మంగళ స్థితి అంటాం. అయితే ప్రతి ఒక్కరు కూడా కుండల్ని కుండలిని కుండలిని అంటారు ఈ కుండలిని గురించి మీరు ఏం చెప్తారు కుండలిని అనేది ఒక సబ్జెక్టు గా తీసుకుంటే 84 లక్షల జన్మలు మనం ఎత్తాం.
(48:49) ఒక మనిషి మోక్షాన్ని పొందాలి అంటే 84 లక్షల జన్మలు ఎత్తితేనే అతను మోక్షాన్ని పొందుతాడు 84 లక్షల జన్మల్లో పాప జన్మలు ఉంటాయి క్రూర జన్మలు ఉంటాయి నీచ జన్మలు ఉంటాయి ఉత్తమ జన్మలు ఉంటాయి సాధు జన్మలు ఉంటాయి కిరాతక జన్మలు ఉంటాయి రకరకాల జన్మలు ఉంటాయి ఏవండీ నేను ఒకాయన అడిగారు ఇట్లా ఏవండీ నేను ఇప్పటివరకు అసలు నేను మాంసాహారం తినలేదండి నేను ఎట్లా పాప జన్మలు ఎత్తుతానండి నేను ఎట్లా నీచ జన్మలు ఎత్తుతాను నేను అన్ని మంచి జన్మలో ఎత్తుకుంటూ వచ్చానండి అన్నట్టుగా మాట్లాడారు పళ్ళెంలో లో అన్నం పెట్టా అన్నం పెడతాం తెల్లటి అన్నం పెట్టాం పప్పు వేసాం కూరేసాం అన్ని రకాల
(49:24) పదార్థాలు వడ్డించాం ఎర్రగా ముక్కలతో నూనెతో ఉన్నటువంటి ఆవకాయ ముక్కలు ఎర్రగా ఉన్నవి అవి పళ్ళల్లో పడితే నోరు ఊరుతుందా ఊరదా ఎందుకు నోరూరింది ఎర్రగా ముక్కలను చూస్తూ ఉంటే నోరు ఊరింది అంటే అర్థం ఏంటి కొన్ని జన్మల్లో ఆ విధమైనటువంటి మాంసాహార జన్మలు ఎత్తితేనే కదా ఆ విధమైన సంస్కారం ఉండేది ఒక పప్పు చూస్తే నోరు ఊరదు కూర చూసినా నోరు ఊరదు ఎర్రగా పచ్చడి ముక్కలు చూస్తే ఎందుకు నోరు ఊరుతుంది ఆ ఎరుపుకి ఎందుకు నోరు ఊరుతుంది నీకు సంస్కారం ఉండబట్టే కదా సో ఎవరు వ్యక్తిగా అంగీకరించడ అంగీకరించనా ఈ 84 లక్షల జన్మల యొక్క సంస్కారాల యొక్క లోడు నే కుండలిని
(50:01) వ్యవస్థ అంటాం దీన్ని మెమరీ సిస్టం అంటాం మెమరీ ఇట్ ఇస్ జస్ట్ మెమరీ ఈ మెమరీ మొత్తం అంతా ఉంటుంది సెల్ లో కూడా ఉంటుంది సెల్ మెమరీ అంటాం ఇప్పుడు సైన్స్ కూడా ఇది ఈ సిస్టం ని ఒప్పుకుంటుంది సెల్ లో కూడా మెమరీ ఉంటుంది ప్రతి దాంట్లోన మెమరీ ఉంటుంది సబ్కాన్షియస్ మెమరీ అంటాం కాన్షస్ మెమరీ అంటాం పర్మనెంట్ మెమరీ అంటాడు టెంపరరీ మెమరీ అంటారు.
(50:21) ఏదనా ఇక్కడ దెబ్బ తగిలింది అనుకోండి టెంపరరీ మెమరీ పోతుంది. అంటే చిన్న చిన్న విషయాలు గుర్తుండవు చిన్నప్పుడు విషయాలు గుర్తుంటాయి. నేను యోగా క్లాసులు చెప్పేటప్పుడు ఇట్లాంటి కేసులకి మనం యోగా క్లాసులు అందించాం. వాళ్ళకి చిన్నప్పటి నుండి అన్ని గుర్తుంటాయి ఇప్పుడు ప్రస్తుతంలో ఉండేవి గుర్తుండవు. మర్చిపోతూ ఉంటారు అంటే తలకి దెబ్బ తగిలితే టెంపరరీ మెమరీ లాస్ అవుతాడు.
(50:40) పొట్టకి గాని వెన్నుపూసకి గాని పెద్దగా దెబ్బ తగిలిందంటే పర్మనెంట్ మెమరీ క్లోజ్ అయిపోతుంది పూర్తిగా మెమరీ ఇబ్బంది పడుతుంది. సో దీన్నే కుండలి వ్యవస్థ అంటారు మీకు సింపుల్ గా వర్డ్స్ లో చెప్పాలంటే దిస్ ఈస్ ఏ ఓవరాల్ మెమరీ సిస్టం సో ఈ మెమరీ సిస్టం పూర్తిగా నువ్వు తీసేయాలి అంటే కుండలిని శుద్ధి చేసుకోగలిగితే ఆ కర్మల యొక్క ప్రభావం నీ మీద ఉండదు.
(51:02) నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేస్తూ జీవించగలుగుతావ్. దానికోసమే మహావతార బాబా గారు క్రియా కుండలిని అని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కుండలిని కుండలిని ఎట్లా ఉద్దీపనం చేసుకోవాలిఅనేటువంటి సాధనలు అందించారు. అయితే ఇప్పుడు మనకి థర్డ్ ఐ థర్డ్ ఐ అంటారు అసలు థర్డ్ ఐ అనేది ఎటువేట్ అయితే ఏం జరుగుతుంది అ థర్డ్ ఐ వల్ల ప్రయోజనం ఏంటి థర్డ్ ఐ అనేది ఒక నాలుగో ఫేజ్ లో సాధకుడు పొందేటటువంటి స్థితి ముందు కుండల్ని శుద్ధి కావాలి.
(51:29) కుండల్ని యొక్క వ్యవస్థ పూర్తిగా శుద్ధి అయి కుండల్ని సహస్రారగతమై ఉండాలి అది ఫస్ట్ స్టేజీ నెక్స్ట్ ప్రాణశక్తి అనేది ఆరు శక్తి కేంద్రాలలోనూ పూర్ణమైనటువంటి స్థితిని పొందాలి అంటే మూలాధార నాలుగు దళాలు ఉండాలి. మనకు ఒకటే దళం ఉందనుకోండి ఆజ్ఞ శక్తి కేంద్రం యాక్టివేట్ అవ్వదు. స్వాధిష్టానానికి ఆరు దళాల ప్రాణశక్తి కావాలి ఆరు దళాలు లేవు అనుకోండి వేస్ట్ అలాగే విశుద్ధికి 16 దళాల ప్రాణశక్తి కావాలి అంటే రోజువారే నువ్వు ఆ 16 దళాల ప్రాణశక్తిని పూర్తి స్థాయిలో విశుద్ధికి అందించగలిగేటటువంటి సామర్థ్యం ఉండాలి మన దేహానికి ఆ విధమైనటువంటి వ్యవస్థ
(52:04) లేనప్పుడు ఆజ్ఞ శక్తి కేంద్రం అవ్వదు సో ప్రాణశక్తిని పూర్తి స్థాయిలో మెయింటైన్ చేసేటటువంటి సాధనలు ఉంటాయి అవి సాధనలు చేయాలి అలాగే విశ్వశక్తికి సంబంధించినటువంటి వ్యవస్థతో పూర్తిగా అనుసంధానం అయి ఉండాలి ఈ మూడు ప్రక్రియలు జరిగితే నాలుగో స్థాయిలో థర్డ్ ఐ అనేది యక్టివేట్ అవుతుంది. దాన్నే ఈశత్వ సిద్ధి అంటారు మనక అష్ట సిద్ధుల్లో అణిమా గరిమా లగిమా మహిమ ప్రాకామ్య వశత్వ ఈశత్వ యతకామ వశాయత్వ అని అష్టసిద్ధుల్లో ఈశత్వ అనే సిద్ధి అప్పుడు కలుగుతుంది.
(52:32) సో ఇప్పుడు చాలామంది ఇప్పుడు స్పిరిచువల్ టెర్మినాలజీ కుండల్ని అవేకనింగ్ అని అలాగే మనకి పాస్ట్ లైఫ్స్ అన్ని చూసుకోవచ్చని లేకపోతే మన కర్మలన్నీ ప్రక్షాలన అవుతాయి ఇట్లా మాట్లాడుతుంటారు. కానీ వీటన్నిటి వల్ల జరిగే ప్రయోజనం ఏంటి? పాస్ట్ లైఫ్ చూడడం దాని వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మన కాన్షియస్సే క్లోజ్ చేసేసింది.
(52:56) నీకు పాస్ట్ జన్మలు అక్కర్లేదు కదా ఇప్పుడు నాలుగో తరగతి చదివాక ఐదో తరగతికి వచ్చావు నీకు కావాల్సిన ఐదో తరగతిలో ఉండే పాండి ఇచ్చావు నాలుగో తరగతిలో సంగతులు అవసరం లేదు నీకు అందుకే పూర్వ జన్మలకు సంబంధించిన నామం గాని రూపాలు గాని దానికి సంబంధించినటువంటి మెమరీ గాని ఈ జన్మలో ట్రాన్స్ఫర్ అవ్వదు. ఏది ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే స్కిల్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి.
(53:18) ఆ జన్మలో సంగీత సాధన చేసి ఉండొచ్చు అది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ జన్మలో జ్యోతిష్యం మీద ప్రయోగాలు చేసి ఉండొచ్చు పరిశోధన చేసి ఉండొచ్చు అది ట్రాన్స్ఫర్ అవుతుంది అంతేగాని దేహం ట్రాన్స్ఫర్ అవ్వట్లే పోయిన జన్మలో ఇలా నేను ఉండను వేరే దేహంతో ఉంటా కాబట్టి దేహం ట్రాన్స్ఫర్ అవ్వట్లే మనసు ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ దేహానికి సంబంధించిన నామ రూప ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ట్రాన్స్ఫర్ అవ్వట్లా ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు అంటే సృష్టి నీకు అవసరం లేదని చెప్తున్నట్టే నీకు అవసరం లేదయ్యా అవి అని చెప్తున్నట్టే నేను దానికి వ్యతిరేకంగా పోతానా పాస్ట్ లైఫ్ తెలుసుకుంటా అంటే అది యూనివర్స్ కి
(53:49) వ్యతిరేకమైనటువంటి వ్యవస్థ వస్తా అటువంటి సాధనలు చేసినప్పుడు ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది అన్నట్టుగా సాధకుడి యొక్క పరిస్థితి ఉంటుంది. అలాగే మీరు ఇంకో రెండు మూడు విషయాలు చెప్పారు అది శాస్త్రం ఒప్పుకుంటుంది. కుండల్ని శుద్ధి కావాలి కర్మలు నశించాలి. ఆయన చెప్తారు కదా కర్మ దగ్దం కావాలి జ్ఞానేషు కర్మ దగ్ధానం అంటారు కాబట్టి జ్ఞానం చేతే కర్మలు దగ్దం అవుతాయి అంటున్నారు కాబట్టి కర్మ దగ్దం అనేది కావాలి దానికి ప్రాపర్ ప్రాక్టీస్ నువ్వు ఎంచుకొని చేయాలి.
(54:14) అయితే మనకి ఇప్పుడు సాధన చేస్తూ ఉన్నాం మీరు కుండల్నీలో అంతా మెమరీ ఉంది అంటారు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇప్పుడు సాధన చేస్తున్నప్పుడు అతనికి ఎన్నో స్కిల్స్ ఉంటాయి ఇన్ని లక్షల జన్మల్లో ఎన్నో స్కిల్స్ ఉంటాయి ఆ స్కిల్స్ ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో కవిత్వం రాస్తాడు 10 జన్మల క్రితం ఎక్కడో ఒక మహాయోగిగా సాధన చేసి ఉంటాడు సో అయన్నీ ఆ స్కిల్స్ ని ఈ జన్మలోకి లాక్కొని రావాలి అంటే మనం ఏం చేయాలి ఆటోమేటిక్ గా వస్తాయి సహజంగానే ట్రాన్స్ఫర్ అవుతాయి కాకపోతే ఈ జన్మలో దానికి సంబంధించినటువంటి వ్యవస్థ వస్థలో నువ్వు కొంచెం పరిశోధన చేస్తే ఆటోమేటిక్
(54:51) గా అవి అట్రాక్ట్ అవుతాయి. ఇప్పుడు నాకు పూర్వ జన్మలో సంగీతం మీద సాధన చేసి ఉండొచ్చు. నేను ఈ జన్మలో సంగీతం మీద సాధన చేసి ఉండకపోవచ్చు దాని మీద ప్రవేశం కూడా లేకపోయి ఉండొచ్చు కానీ అభిరుచి ఉంటే ఆటోమేటిక్ గా ఆ సాధన వస్తుంది మనం ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారి వింటూ ఉంటాం. బాలసుబ్రహ్మణ్యం గారు శాస్త్రీయ సంగీత విద్వాంసుడు కాదు.
(55:11) ఆయన జస్ట్ పాటలు సాధన చేసుకుంటూ వచ్చిన వ్యక్తే అలాంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. మన ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు శాస్త్రీయ సంగీత విద్వాంసుడు కాదంటే ఎవరు నమ్మరు. ఆయన గమ్మకాలు గాన ఆయనకుఉన్న సాహిత్యంలో పట్టు గాని ఆ శబ్దం మీద ఉన్నటువంటి పట్టు గాని మనం గమనిస్తే ఏ విద్వాంసుడు అనుకుంటాం కానీ ఆయనే చెప్పారు. శాస్త్రీయ సంగీతం లేదని సో అట్లా పూర్వజన్మలో ఉండేటటువంటి అంశాలు అభిరుచి మీరకు వచ్చేస్తాయి అట్రాక్ట్ అయిపోతాయి ఆ అభిరుచిని గుర్తించి అంటే మనకి చిన్న పిల్లల వయసులో కొన్ని అభిరుచులు ఉంటాయి.
(55:39) ఆ అభిరుచులని గుర్తించి మనం గాని ముందుకు వెళ్తూ ఉంటే ఆటోమేటిక్ గా యాక్టివేషన్ ఆటోమేటిక్ గా అవుతాయి ఆ యాక్టివేషన్ అనేది జరుగుతుంది ఇప్పుడు స్పిరిచువాలిటీ లోకి ఒక సాధనలో ఒక స్థితికి వస్తారు వచ్చిన వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? తన ఎనర్జీస్ ఎప్పటికీ పతనం కాకుండా నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి. దానికోసం రకరకాల వాళ్ళు రకరకాల వ్యవస్థలని ఆధారం చేసుకుంటారు ఇప్పుడు స్వామీజీలు ఉన్నారు బయటకి వెళితే నలుగురిలో కలిస్తే నలుగురితో టచ్ చేస్తే వాళ్ళ వల్ల మన ఎనర్జీస్ పతనం అవుతాయి అని చెప్పి కాషాయపు రంగు వేసుకొని నేను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా
(56:17) గుర్తించాలి అనేటటువంటి ఒక వ్యవస్థను డెవలప్ చేసుకుంటాను వాళ్ళకి వాళ్ళుగా ఒక ఆశ్రమాన్ని పెట్టుకని ఆశ్రమంలోనే ఒక జీవన విధానాన్ని కలిగి ఉంటారు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే మడి ఆచారాలు సోల్ గా చెప్పాలి అంతే మడి ఆచారాలతో వాళ్ళు ఉన్నారు వెళ్తూ ఉంటారు. అది మామూలు వ్యక్తులకి కుదరదు. ఇప్పుడు నలుగురు దగ్గరికి వెళ్తున్నామ అంటే వాళ్ళ ఎనర్జీస్ ఇంపాక్ట్ పడుతూ ఉంటాయి.
(56:39) ఇప్పుడు పొద్దున్నే ఒక వ్యక్తి ఫోన్ 10 మినిట్స్ డిలే అయిపోగానే మొత్తం అన్ని వర్క్స్ డిలే అయిపోతూ ఉంటాయి. ఒక వ్యక్తి అట్లా నెగిటివ్ ఎనర్జీ తో వచ్చాడంటే ఆ టైం అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది ఆ ఎనర్జీ యొక్క దోషాలు మనకి అప్లై అవుతూ ఉంటాయి. సో వీటిని మనం ఓవర్కమ్ చేయడానికి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు హంస సోహం అనేటటువంటి రెండు అద్భుతమైనటువంటి సాధనలు కేవలం శ్వాసలతో ఈజీగా పరాయి వ్యక్తి గుర్తించడానికి వీలు లేకుండా అసలు మనం హంస సాధనలు చేస్తున్నామ అనే విషయం పక్కన ఉన్నటువంటి వ్యక్తికి గాలికి కూడా తెలియకుండా ఈ సాధనలు చేయొచ్చు.
(57:09) అంత సైలెంట్ గా చేయొచ్చు హంసోదన సాధన వాటితో ఏ విధమైనటువంటి బయట ఎక్కడికి వెళ్ళినా సరే ఎనర్జీస్ మన మీద ప్రభావం పడకుండా మనం రక్షించుకోవచ్చు ఇది సింపుల్ ప్రతి ఒక్కళ్ళు చేయగలిగింది అవి చేయలేము. మీరు సోహం అంశ అన్నారు కాబట్టి నేను రాసినటువంటి శ్వాస పుస్తకం అద్భుతం పుస్తకం అది విభజించే అవునండి నేను భగవద్గీత మీద ఆశ్రమంలో ఉన్నప్పుడు మలయాళ స్వామి వారు భగవద్గీత చూశను ఆ భగవద్గీత శ్లోకము దాని వెనకు ఉండే ఋషుల యొక్క మాటలు అన్ని ఒక పెద్ద బాల శిక్షలో ఇంత పుస్తకం అది ఆ తర్వాత మళ్ళీ నేను అలాంటి సమగ్రమైనటువంటి విశ్లేషణ అందించినటువంటి పుస్తకం ఇదే మలయాళ స్వామి వారి భగవద్గీత
(57:50) తర్వాత ఆ రవిశాస్త్రి గారి పుస్తకం ఇదే మొదటిసారి ఇది గనుక చదివితే మీకు శ్వాస పట్ల ఉపనిషత్తుల్లో ఏమున్నాయి యోగులు ఏమేమి చెప్పారు వేరే వేరే గ్రంథాలలో ఏమేమి చెప్పారు వారికి ఉన్న అనుభవం వారు ఎక్కడెక్కడికో తిరిగి ఎంతో మంది గురువులని కలిసినటువంటి అనుభవం మొత్తం ఇందులో చక్కగా సంక్షిప్తంగా మనకు అందించారు. శ్వాసం మీద పూర్తి స్థాయి గ్రిప్ ఒక పిహెచ్డి స్థాయిలో ఇన్ఫర్మేషన్ మనకి ఈ గ్రంథంలో ఉంది.
(58:16) అద్భుతంగా తరించడానికి ఈ గ్రంథాన్ని మనం చక్కగా అందుకొని శ్వాస మీద పూర్తి పట్టును సాధించి సకల రోగాల నుండి ముక్తి పొందడానికి శ్వాసే మోక్షధామం దానికి ఈ బుక్కు చాలా ఉపయోగపడుతుంది గ్రంథం ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను. చాలా సంతోషం అండి చాలా అద్భుతమైన విషయాలు మాతో పంచుకున్నందుకు చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం ఓపక్క యోగ పరంగాను జనరల్ గా జరిగే వాటి పరంగాను అన్నిటి పరంగాను ఈ యొక్క విషయాలను పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలుండి ధన్యవాదాలు ఇప్పటివరకు అద్భుతమైనటువంటి జ్ఞానగంగా ప్రవాహాన్ని మనం స్వీకరించాం వారి అనుభవంలో ఉన్నటువంటి సంకల్ప సిద్ధి దగ్గర
(58:57) నుంచి సంకల్ప శుద్ధి దగ్గర నుంచి మానవ జీవితం లో అప్లై అయ్యేటటువంటి ఎన్నో విషయాల గురించి వారు కూలంకశంగా భార్గవ శర్మ గారి దగ్గర నుంచి మనం స్వీకరించాం. మరొక్కసారి మరొక విశిష్టాతితో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం.
No comments:
Post a Comment