Hush Dating Trend in Hyderabad | హైదరాబాద్ ని షేక్ చేస్తున్న హుష్ డేటింగ్ | @99TVEntertainment-u9q
Author Name:99TV Entertainment
Youtube Channel Url:https://www.youtube.com/@99TVEntertainment-u9q
Youtube Video URL:https://www.youtube.com/watch?v=_Ap9mBR5iCY
Transcript:
(00:00) హైదరాబాద్ భాగ్యనగరం ఒకప్పుడు తహజీబ్ కు నిలయం ఇప్పుడు విశ్వనగరం పాలకులు మారారు. నగర రూపురేఖలు మారాయి. కెసిఆర్ హయాంలో గ్లోబల్ సిటీ అన్నారు. రేవంత్ రెడ్డి హయాంలో ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఆకాశాన్ని అంటే మేడలు సాఫ్ట్వేర్ దిగ్గజాలు మెరిసిపోయే రోడ్లు కానీ ఈ కాంతి వెనుక చీకటి కోణాలుఏంటి? సిటీ ఎంతలా విస్తరిస్తుందో సంస్కృతి అంతలా గబ్బు పడుతోందా? పడమర గాలి భాగ్యనగరాన్ని తాకి యువతను ఏ తీరాలకు చేరుస్తుంది ప్రేమ పెళ్లి బంధం ఈ పదాలకు అర్థాలే మారిపోతున్నాయా ప్రెజెంట్ వెస్టర్న్ కల్చర్ సిటీలో విస్తరిస్తోంది.
(00:34) యూత్ లో మొదలైన కొత్త రకం డేటింగ్ కల్చర్ ఏంటి ఒకప్పుడు పెళ్లి అంటే పెద్దలు కుదిర్చిన వేడుక జీవితాంతం తోడుండే పవిత్ర బంధం కాలం మారింది. ప్రేమ పెళ్లిళ్లు వచ్చాయి. పెద్దలను ఎదిరించి ఇల్లు వదిలి మూడు ముళ్ళతో ఒక్కటయ్యే జంటలను చూశం. ఆ తర్వాత ప్రేమించుకోవటం నచ్చితే పెళ్లి లేదంటే బ్రేకప్ అనే ట్రెండ్ నడిచింది. కానీ ఇప్పుడు అసలు బంధం అనే మాటే భారమైపోతుంది.
(00:57) బాధ్యత లేని సుఖం బంధనం లేని బంధం ఇదే నేటి యూత్ మంత్రం. డేటింగ్ అంటే కేవలం కాఫీ షాప్ లో కూర్చోవడం కాదు. ఇందులో ఇప్పుడు ఎన్నో వెరైటీలు ఉన్నాయి. వీటి గురించి వింటే మీరు షాక్ అవ్వాల్సిందే. క్యాజువల్ డేటింగ్ ఇక్కడ సీరియస్ అనే మాటకే తావు లేదు. కమిట్మెంట్ అసలే ఉండదు. నచ్చినన్ని రోజులు హాయ్. బోరు కొడితే బాయ్ బాయ్ చెప్పేస్తారు.
(01:17) మరొకటి ఆన్లైన్ డేటింగ్ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు సరిహద్దులతో పని లేదు. యప్స్ లో స్వైప్ చేస్తూ అపరిచితులను వెతకటం పరిచయం పెంచుకొని ఎంత దూరమైనా వెళ్ళటం. ఇంకొకటి బ్లైండ్ డేటింగ్ అసలు ముఖం తెలియదు. పరిచయమే ఉండదు కేవలం ఒక థర్డ్ పార్టీ ద్వారా కలిసి కొన్ని గంటలు సరదాగా గడిపి మాయమైపోవడం. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ఇది ఇప్పుడు సిటీలో మోస్ట్ ట్రెండింగ్.
(01:39) వీరు స్నేహితులే కానీ వారికి కావలసింది కేవలం శారీరక సుఖం మాత్రమే ఎమోషన్స్ లేవు బాండింగ్ అసలే లేదు. కేవలం అవసరం తీర్చుకోవడమే లక్ష్యం. ఇక బెంచింగ్ ఇది మరీ విచిత్రం అప్పటికే ఒకరితో రిలేషన్ లో ఉంటారు. కానీ బ్యాకప్ కోసం ఇంకొకరిని బెంచ్ మీద వెయిటింగ్ లో పెడతారు. అంటే ఏ క్షణమైనా ఒకరిని వదిలేసి మరొకరి దగ్గరకు వెళ్ళిపోయే మైండ్ గేమ్ ఇది.
(02:01) ఇవన్నీ ఒక ఎత్తయితే ఇప్పుడు హైదరాబాద్ ను షేక్ చేస్తున్న కొత్త పదం హుష్ డేటింగ్. పేరుకు తగ్గట్టే ఇది మహా గోప్యంగా సాగుతుంది. అసలు బయట ప్రపంచానికి కాదు కదా కనీసం సన్నిహిత మిత్రులకు కూడా తెలియకుండా సాగే నిశశబ్ద రిలేషన్షిప్ ఇది. దీంట్లోఇగ స్టోరీలు ఉండవు Facebook స్టేటస్ లు ఉండవు జంటగా దిగిన ఫోటోలు అస్సలు పోస్ట్ చేయరు. మనం ఎక్కడికి వెళ్తున్నాం మన బంధానికి పేరేంటి అనే ప్రశ్నలను అస్సలు అడగరు.
(02:25) ప్రైవసీయే వీరి ప్రాణం. రద్దీగా ఉండే పబ్ల కంటే ఏకాంతంగా ఉండే ప్రదేశాలకే వీరు ఓటు వేస్తారు. ఎందుకు ఈ హుష్ డేటింగ్ సమాధానం ఒక్కటే. సమాజపు జడ్జ్మెంట్ నుంచి తప్పించుకోవటం ఎప్పుడు పెళ్లి అని అడిగే బంధువులు ఎవరితో తిరుగుతున్నావ్ అని ఆరాతీసే సమాజం వీటి నుంచి తప్పించుకోవడానికి ఈ రహస్య మార్గాన్ని ఎంచుకుంటున్నారు.
(02:45) కెరీర్ కు ఆటంకం కలగకూడదని నో లేబుల్ బంధాలకే యువత మొగ్గు చూపుతోంది. హైదరాబాద్ ఐటి హబ్ గా మారింది. స్టార్టప్ కల్చర్ పెరిగింది. ఆధునిక భావాలు వేగంగా విస్తరిస్తున్నాయి. కానీ ఈ క్రమంలో మనం దేన్ని కోల్పోతున్నాం జీవితాన్ని ఆస్వాదించాలి. వెంటనే బంధాలకు పేరు పెట్టక్కర్లేదు అని కొందరు అంటుంటే స్పష్టత లేని బంధాలు మనిషిని మానసిక రోగిగా మారుస్తాయని నిపుణలు హెచ్చరిస్తున్నారు.
(03:08) హుస్ డేటింగ్ అనేది మారుతున్న కాలానికి ప్రతిబింబం కావచ్చు కానీ అవగాహన లేకపోతే అది భావోద్వేగపరమైన స్మశానంగా మారుతుంది. ఏ బంధంలోనైనా పరస్పర గౌరవం స్పష్టత లేకపోతే అది పతనం వైపుకే దారితీస్తుంది. ట్రెండ్ ను గుడ్డిగా ఫాలో అవ్వటం పరిణితి కాదు. మన మనసుకు ఏది సరైనదో ఆలోచించి నిర్ణయం తీసుకోవడమే అసలైన విజయం.
(03:28) విశ్వనగరంలో వికసిస్తున్న ఈ వింత పోకడలు ఎట్టి దారి తీస్తాయి ఈ సీక్రెట్ రిలేషన్షిప్స్ రేపు ఏ రకమైన నేరాలకు మానసిక ఒత్తిళ్లకు కేంద్రాలుగా మారుతాయి భాగ్యనగర యువత ఆలోచించండి స్వేచ్ఛ వేరు స్వైర విహారం వేరు మీ జీవితం మీ నిర్ణయం కానీ బాధ్యత మరవకండి అండి.
No comments:
Post a Comment