Relationship between Wife and Husband | భర్తకి భార్య ఎలా ఉంటే నచ్చుతుందో తెలుసా..| Chanakya Neeti |
Author Name:BIGTV Devotional
Youtube Channel Url:https://www.youtube.com/@BigTVDevotional
Youtube Video URL:https://www.youtube.com/watch?v=BKhnJlr0LHU
Transcript:
(00:02) గణేశాయ నమః గాయత్రి దేవ్యే నమః ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం చాణక్యుడు చదువుకోని మనిషి గురించి చాలా కఠినంగా మాట్లాడతాడు అది ఎందుకు అలా మాట్లాడాడో అలాగే ఎంత కష్టాల్లో ఉన్న మనిషి అయినా సరే వాళ్ళకి సుఖాన్ని ఇచ్చేటటువంటి ఒక మూడు ఉంటాయి ఆ మూడు ఏమిటో కొన్ని కొన్ని అనుభవాలని జీవితంలో ఒక్కసారైనా మనిషి తెలుసుకోవాలి కొన్ని కొన్ని అనుభవాలు మనిషికి కలుగుతాయి ఆ అనుభవాలు ఏమిటి అలాగే తపస్సు చదువు అలాగే గానం అంటే పాటలు పాడడం ప్రయాణం యుద్ధం ఈ ఐదు విషయాల గురించి చాణిక్కుడు ఎలా చేయాలో వాటిలో తీసుకునే జాగ్రత్త
(00:37) ఏమిటో చాలా అద్భుతమైన విషయాలు చెప్పాడు ఆ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కింతయా క్రియతే ధేన్వ యాన ద్రోద్రేన గర్భిణి కోర్దః పుత్రేన జాతేన యోన విద్వాన్ నభక్తిమాన్ అంటే దీని అర్థం ఏంటయ్యా అంటే గనక పాలు ఇవ్వలేదు అని చెప్పేసి ఆ ఆవుతో మనకు పని ఏముంది అనేటటువంటి ఆలోచన చాలా మందికి ఉంటుంది అలాగే విద్వాంసులు కానీ అంటే చదువుకోనటువంటి విద్యార్థులు ఉన్నారు అనుకోండి వాళ్ళ వల్ల పనే ఉంది అని మన సమాజం అనుకుంటూ ఉంటుందట అంటే ఆవులు ఉన్నాయి అనుకోండి ఒట్టి పోతూ ఉంటాయి ఒట్టి పోయిన తర్వాత ఆవు వల్ల ఏం ప్రయోజనం ఉండదు
(01:09) దానికి సరిగ్గా అన్నం పెట్టరు తిండి పెట్టరు సరిగ్గా దానికి దాన పెట్టరు పాలు ఇచ్చేదానికే శుభ్రంగా కడుపు నిండా అన్నం పెడతారు పచ్చగడ్డి పెడతారు దాన పెడతారు అంటే పాలు ఇవ్వలేనటువంటి ఒక ఆవు ఎలాగైతే ఈ యొక్క యజమానికి ఉపయోగం లేదో చదువుకోనటువంటి పిల్లాడు కూడా తల్లిదండ్రులకు అలాగే ప్రయోజనం లేరు వాళ్ళకి తిండి పెట్టకపోవడం పెట్టడం వల్ల ప్రయోజనం లేదు అని అని చెప్పేసి ఎంత కఠినంగా చెప్పాడు చూడండి అంటే ఈ విషయాలు ఎందుకు చెప్తాడు ఇలా కఠినంగా అంటే గనక చాణుక్యుడు ఒకే ఒక్క విషయం పిల్లలకి చదువు యొక్క గొప్పతనం తెలియాలి చదువుకోకపోవడం అనేటటువంటిది ఒక
(01:42) పెద్ద చెడ్డ అలవాటు లేదా చదువుకోకపోవడం అనేటటువంటిది ఒక దురదృష్టం చాలా మంది సాధారణంగా భగవంతుడు అందరి యొక్క బుర్రకి ఒకే రకమైనటువంటి టాలెంట్ ని ఇచ్చాడు ఐక్యూ లెవెల్ ని ఇచ్చాడు అయితే అందరి మేధస్సులోనూ అందరి యొక్క బ్రెయిన్ లోనూ కూడా జ్ఞాపక శక్తి కానీ లేదా చదివే గుణం కానీ గుర్తుపెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా సమానంగానే ఉంటాయి అయితే జీన్స్ ప్రభావం ప్రకారంగా కొంచెం దాంట్లో కొంచెం అంటే కొంచెం మార్పులు ఉంటాయి కానీ ప్రతి మనిషి కూడా చదవాలి అనుకుంటే గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే చదవగలడు గుర్తుపెట్టుకోగలడు ఎదగగలడు తప్ప తారతమ్యాలు ఎక్కడ కూడా
(02:14) శారీరక అవయవాలు అయితే లేవు కానీ పిల్లలు ఏం చేస్తూ ఉంటారు అంటే గనక బద్ధకం తోటి లేదా తల్లిదండ్రులు ఇచ్చే గారాభం వల్ల దీనివల్ల చదువు చదువు సరిగ్గా చదువుకోక పాడవుతూ ఉంటారు దుష్ట స్నేహాలు పడుతూ ఉంటారు ఆటల మీద ఎక్కువగా శ్రద్ధ పెడుతూ ఉంటారు సెల్ ఫోన్ వ్యాహాలు ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి ఇలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడు అంటే చాణక్యుడు చదువు ఎంత ముఖ్యమో చెబుతూ ఎలాగైతే పాలు ఇవ్వనటువంటి ఒక ఆవు ఎలాగైతే యజమానికి ఉపయోగం లేదో చదువుకోని వాడు కూడా తల్లిదండ్రులకు ఎలా ఉపయోగం లేదురా బాబు చదువుకోవాలిరా అని చెప్తున్నాడు ఇక్కడ అది
(02:45) విషయం అలాగే సంసార తాపదగ్ధానాం త్రయో విశ్రాంతి హేతవః అపత్యంచ కలత్రంచ సతాం సంగతి రేవచా అంటే దీని అర్థం ఏంటి అంటే గనక సంసార తాపంతో పాడపేటటువంటి వారికి ఉపశమనాలు ఇచ్చేవి కొన్ని ఉన్నాయి సాధారణంగా సంసారం అనేటటువంటిది విపరీతమైనటువంటి తాపం ఆ పెళ్లి చేసుకున్న తర్వాత బోల్డ్ బాధ్యతలు వస్తాయి పిల్లల కన్నాక ఇంకా బాధ్యతలు వస్తాయి పిల్లలు పెరిగే కొలది బాధ్యతలు పెరిగిపోతూ ఉంటాయి వాళ్ళ గురించి బాగా చూడాలి చదివించాలి లేకపోతే పెళ్లిళ్లు చేయాలి లేకపోతే వాళ్ళ గురించి ఎక్కువగా ఆస్తులు పోగు చేయాలి వాళ్ళు ఏదైనా సమస్యలు ఎరుకుంటే బయటికి
(03:18) తీసుకురావాలి స్కూళ్లలో ఏదైనా మార్కులు తక్కువ వస్తే మళ్ళీ బాధ్యత తీసుకోవాలి సీట్లు రాకపోతే దాని గురించి రికమెండేషన్ చేసుకోవాలి ఒకటి కాదు నానా యాతన నానా అవస్థ వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్ లో పడి పడిపులు రాయాలి వాళ్ళు ఏదైనా మళ్ళీ తినరు పొరపాట్లు తప్పిదాలు చేసి అందులో ఇందులో చేతులు పెట్టిన కాళ్ళు పెట్టిన మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళకి వైద్యం చేయించాలి తగ్గేదాకా అది ఒక రకమైనటువంటి తాపత్రయం ఇలా ఒకటి కాదు సంసారం అంటే పెద్ద నరక యాతన ఇది వాళ్ళ గురించి ఎప్పుడు సంపాదిస్తూనే ఉండాలి ఎంత సంపాదించిన సంసారంలో తలగదు కానీ అంత
(03:47) గౌరవిస్తారా తిరిగి మళ్ళీ పిల్లలు అంటే గనక అంతలా ఉండదు అయితే ఇంత సంసారంలో నలిగిపోయేటటువంటి యజమానికి అంటే మగవాడికి ఊరటని ఇచ్చేవి కొన్ని ఉన్నాయి ప్రశాంతతను ఇచ్చేవి కొన్ని ఉన్నాయి ఏమిటి ఆ ప్రశాంతతను ఇచ్చేది అంటే గనక సత్సంతా అంటే ఒక తండ్రి నానా యాతన పడిపోయి ఇబ్బంది పడుతూ ఉండేవాడికి మంచి పిల్లలు పుడితే ఇంటికి వచ్చిన వెంటనే నాన్నగారు రండి కాళ్ళు కడుక్కోవడానికి కాళ్ళు కడగడానికి నీళ్లు ఇచ్చి కాళ్ళు కడుక్కోండి అని చెప్పి నాన్నగారు మంచి నీళ్లు తాగుతారా అని చెప్పేసి ఒక గ్లాస్ తో మంచి నీళ్లు ఇచ్చి నాన్నగారు కూర్చున్న వెంటనే ఫ్యాన్
(04:14) వేసి నాన్నగారు కూర్చున్న వెంటనే ఏదైనా అవసరమైతే పట్టుకొచ్చి ఇచ్చి రాత్రి ఏమైనా కొంచెం కాళ్ళు తొక్కమంటే తొక్కి నొక్కి ఇలా ఏదైనా కొంచెం ఏదైనా పట్టమంటే పట్టుకొచ్చి కొంచెం ఇంటికి వచ్చినప్పుడు ఆలనా పాలన చూసి బాగా చదువుకుంటూ తండ్రికి ఇబ్బంది లేకుండా అమ్మయ్య వీళ్ళు బాగానే చదువుకుంటున్నారు వీళ్ళు గొడవ నాకు లేదు అని మనశ్శాంతిగా తండ్రి తనతో పని తాను చేసుకునేటటువంటి రీతిలో పిల్లలు బిహేవ్ చేస్తే కనక వాళ్ళని సత్సంతానము అంటారు పెద్దయిన తర్వాత తండ్రి చెప్పిన పెళ్లి చేసుకుంటూ అలాగే తండ్రి చెప్పినటువంటి విధానంలో నడుస్తూ ఉన్నట్లయితే కనక అలా అని
(04:44) చెప్పేసి తండ్రులు ఏం బలవంతం చేసేసి ఇష్టం లేని పెళ్లిళ్లు చేయరు కదా చేస్తే తప్పు కాదనటం లేదు మీరు ఎవరినైనా ఇష్టపడిన కూడా తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించుకోవాలి తప్ప వాళ్ళని బాధపెట్టి పెళ్లిళ్లు చేసేసుకోవడాలు రకరకాల నిర్ణయాలు తీసేసుకుని ఏదేదో గొప్ప గొప్ప వాళ్ళు అయిపోవడానికి ఏదో రకరకాల పిచ్చి పిచ్చి పనులు చేసేయడాలు తల్లిదండ్రులు బాధపెట్టి చేయకూడదు అందుచేత ఈ రకంగా సత్సంతానం ఎంత యాతనలో ఉన్నటువంటి యజమానికైనా ఆనందాన్ని ఇస్తాయి బయట ఎంత కష్టపడి వచ్చినా సరే అలాగే సగుణవతి అంటే ఇంట్లో ఉండే భార్య అన్నమాట ఇంట్లో ఉండే భార్య గుణవంతురాలు
(05:12) అనుకోండి చక్కగా భర్త కోసమే ఎదురు చూస్తూ భర్తకు వచ్చిన వెంటనే చక్కగా మంచి రుచికరమైన అన్నాన్ని వండి పెట్టి రుచికరమైన పదార్థాలు పెట్టి కాస్త అన్నలా పాలన చూస్తూ కాస్త ఏదైనా తలకి నూనె రాసో లేకపోతే ఏదైనా తలకాయ నొప్పుగా ఉందంటే నొక్కో లేకపోతే ఏదైనా ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు అంటే గనక కొంచెం సేద తీర్చో ఏదైనా ఇబ్బందులు బాధలు ఉంటే గనక ఇంట్లో ఉండేటటువంటి భార్య సుగుణవతి అయితే గనక ఆ తాపము బయట ఉండేటటువంటి స్ట్రెస్ తగ్గించి ప్రశాంతతను ఇచ్చేటటువంటి భార్య సుగుణవతి అంటే మంచి పిల్లలు ఉండాలి మంచి భార్య ఉండాలి ఇంకా మూడోది ఏమిటి ఆనందాన్ని
(05:42) ఇచ్చేది సంసారం సంసారంలో ఉన్నవారికి ఆనందాన్ని ఇచ్చేటటువంటి మూడోది ఏమిటంటే గనక తత్సాంగత్యము మంచి స్నేహితుడు ఉన్నాడండి లేదా మంచి సద్గురువు ఉన్నాడండి లేదా మంచి కాలనీలో మంచి మనుషులు ఉన్నారు అందరూ కూడా సాధారణంగా ఆఫీస్ నుంచి వచ్చాక ఇంట్లోకి వెళ్తారు పిల్లలు బాగా ఆదరిస్తారు భార్య చక్కగా ఏదో వండి పెడుతుంది తర్వాత హాయిగా ప్రశాంతంగా బయటికి వచ్చి మంచి వాళ్ళ దగ్గర కూర్చున్నారు అనుకోండి వాళ్ళు మంచి విషయాలు ధర్మాలు ఉపోద్గాతాలు లేదా లోకంలో ఉండే మంచి విషయాలు చెప్తున్నారు అనుకోండి లేదా మనం ఏదైనా నలిగిపోతున్నాం సమస్య తోటి లేకపోతే ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి
(06:12) ఇబ్బంది పడుతున్నాం అప్పుడు మంచి సలహాలు ఇచ్చి ఇలా చేయవయ్యా అని చెప్పారు అనుకోండి అదంతా కూడా సత్సాంగత్యము అంటే మంచి వాళ్ళతోటి కలయిక సడన్ గా ఏదో పడిపోయాం దెబ్బలు తగిలాయి అండ్ ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళు కావలసిన వాళ్ళు వచ్చి వెంటనే ఆటోలో ఎక్కించుకొని వైద్యం చేయించారు అంటే వీళ్ళందరూ సత్సాంగత్యము అవుతారు అంటే ఒక సంసార యాతనలో ఉండే మనిషి మంచి సంతానం వల్ల మంచి భార్య వల్ల చుట్టుపక్కల ఉండేటటువంటిది సత్సంగత్యం అంటే గనుక మంచి మనుషుల వల్ల సంసార తాపం తగ్గుతుంది అంటే సంసారంలో ఉండే యాతన ఇబ్బంది స్ట్రెస్ అనేటటువంటివి పోయి ఆనందంగా ఉంటాడట అందుచేత
(06:42) ఈ మూడు ఉంటే ఆనందంగా బతుకుతాడు అని చెప్తున్నాడు చూడండి అందుచేత ఈ మూడు అందరూ కలుగజేసుకోవాలి అలాగే సకృత్ జల్పంతి రాజానః సకృత్ జల్పంతి పండితాః సకృత్ కన్యాః ప్రదీయంతే త్రీన్యేతాని సకృత్ సకృత్ అంటే దీని అర్థం ఏంటి అంటే గనక ఇది ఎందుకు చెప్తాడు అంటే గనక చాణిక్యుడు వివాహాల గురించి చెప్తాడు ఈ విషయాన్ని కూడా మీరు అపార్థం చేసుకోవడానికి వీల్ లేదు ఎందుకంటే గనక చాణక్యుడు చెప్పినటువంటి కాలం వేరు దేశకాల వైపరిచిత సంగే కాలాలు పరిస్థితులు మారాయి ఇప్పుడు కాలంలో అమ్మాయిలు మారిపోయారు ఇది కన్యాదానం గురించి చెప్పాడు అంటే ఒక్కసారి కన్యాదానం చేయాలని చెప్తాడు దీన్ని
(07:16) అపార్థం చేసుకోకండి ముందు ఎందుకు చెప్తున్నాను అంటే గనక దాన్ని అర్థం చేసుకోండి ప్రభువు ఒక్కసారే శాసిస్తాడు సాధారణంగా వీడికి ఊర శిక్ష వేయండి అన్నాడు అంటే వేసేయవలసిందే మళ్ళా ఇందాక ఉర శిక్ష అని చెప్పాను కదా అలా కాదు మరోసారి తీసుకురండి మళ్ళీ అని ఉండదు లేదా ప్రభువు ఒకసారి ఉరిశిక్ష వేసేయమని చెప్పాక మళ్ళీ వెయిట్ చేసి మళ్ళీ రేపు ఏమైనా మార్చుకుంటాడేమో కంగారు పడద్దు అని ఆగడానికి లేదు ప్రభువు ఒక్కసారి గనుక నిర్ణయం తీసుకున్నాడు అంటే అది వేసేయవలసిందే అలాగే విద్వాంసులు సారవంతమైనటువంటి మాట తప్ప అక్కలేని మాటలు చవాకులు పలకరు విద్వాంసులు అంటే తెలివైన
(07:50) వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ గా రాముడు ఉన్నాడు అనుకోండి రాముడిని మనం మిత భాషి మృదు భాషి అంటాం రాముడు ఒకసారి మాట్లాడాడు అంటే గనక ఊరికే మనకిలాగా ఆచితుచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడు ఆచి తూచి మాట్లాడతాడు మాట్లాడేటాడు అంటే గనక దానికి 100 అర్ధాలు వెతకచ్చు అలాగే సత్పురుషుడు గొప్పవాడు తెలివైన వాడు విద్వాంసుడు పండితుడు ఎప్పుడూ కూడా ఊరికే అవాకు చవాకు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడు అరుగు మీద కూర్చొని అక్కలేని కబుర్లు చెప్పడు కానీ ఏదైనా ఒకసారి మాట్లాడాడు అంటే గనక దాంట్లో 100 అర్ధాలు వస్తాయి ఎన్నో మనుషుల జీవితాలు మార్చేటటువంటి
(08:21) పెద్ద గొప్ప పదాలు చెప్తాడు కాబట్టి ఇక్కడ అంటే ఇవి పోలికలు ఎలా పోలుస్తున్నాడో చూడండి ఇక్కడ అలాగే ఒక్కసారే కన్యాదానం ఉంటుంది అంటే ప్రభువు శాసనం ఒక్కసారే ఉంటుంది అలాగే పండితుడి మాట ఒక్క మాటకి 100 అర్ధాలు వస్తాయి గొప్పగా ఉంటుంది అలాగే కన్యాదానం ఒక్కసారే ఉంటుందంటే గనక ఒక్కసారే వివాహం చేసుకోవాలి అని అయితే ప్రస్తుతాల్లో రెండేసి మూడేసి పెళ్లిలు చేసుకుంటున్నారు కానీ చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్లి మైక్ పెట్టాము అనుకోండి వాళ్ళు చెప్తారు వాళ్ళు బాధలు నిజంగా మైక్ పెడితే చెప్పరేమో కానీ మైక్ పెట్టకుండా అమ్మ ఏదైనా రెండో వివాహం వల్ల ఇబ్బంది
(08:51) పడుతున్నావా అంటే కచ్చితంగా చెప్తారు ఎప్పుడు ప్రథమ వివాహం ప్రధమ వివాహమే ద్వితీయ తృతీయాది వివాహాలు తృతీయ వివాహాలే మొట్టమొదటి వివాహంలో ఉండేటటువంటి ఆ ఇది ఆ అనుబంధము ఆ రెస్పాన్సిబిలిటీ ఆ వ్యవస్థ అనేది రెండో పిల్లల్లో రాదు రెండో పెళ్లి అంతా కూడా ఆస్తులు అనుమానాలు రకరకాలు తప్పక లేకపోతే అవకాన దశలో ఏదో చూస్తారని అనేక రకాల టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఉంటాయి మీ పిల్లల్ని ఇలా చూడాలని లేకపోతే పిల్లలు ఉంటే పెళ్లి చేసుకోనని లేకపోతే పిల్లలు పెద్దయ్యాక ఏదో చేయాలని అనాధ శరణాలు ఇల్లు వేయాలని ఆస్తులు పిల్లలకి ఇవ్వకూడదని మా పిల్లలకి ఇవ్వాలని మాకు
(09:21) పుట్టే పిల్లలకి ఇవ్వాలని లేదా రకరకరకాల టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడూ మొట్టమొదటి వివాహంలో ఉండే సౌకర్యం సుఖం ఇంకొకటి ఏం లేదు రెండో పెళ్లి అనేది అనేటువంటిది ఎప్పుడూ కూడా సుఖం అయితే మాత్రం కాదు అది ఒక్కసారే వివాహం చేస్తేనే ఆనందంగా ఉంటుంది స్త్రీ అని ఖచ్చితంగా చెప్తున్నాడు ఇది ఎప్పటికైనా సరే సత్యం సత్యమే అలాగే ఏకాకినా తపో ద్వాభ్యాం పఠనం గాయనం త్రిబిహి చతుర్భ్యర్ గమనం క్షేత్రం పంచబిహి బహువిరణః అంటే ఏ ఏం పని ఎవరెవరు ఎంతమంది చేయాలి ఇది చాలా చాలా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ శ్లోకం మళ్ళీ చెప్తున్నాను ఏకాకినా తపో ద్వాభ్యాం
(09:57) పఠనం గాయనం త్రిబిహి చతుర్భిర్గం మనం క్షేత్రం పంచబిహి బహువి రణః ఇది ఏమిటి దీని అర్థం ఏంటి గనక ఏకాకినా తప్పు అంటే తపస్సు ఎప్పుడు కూడా ఒంటరిగానే చేయాలి నేను ధ్యానం మెడిటేషన్ చేసుకుంటున్నానండి అంటే సభల్లోనూ లేకపోతే గనక ఒక గ్రూప్ గాను చేయకూడదు దాన్ని అందరూ కలిపి మెడిటేషన్ చేసుకుందాం అనకూడదు మెడిటేషన్ ఎప్పుడూ కూడా ఎక్కడికైనా దూరంగా పోయి ఒంటరిగా చేసుకోవాలి అందరూ కూర్చొని మెడిటేషన్ చేసుకున్నారంటే అక్కలేని మాటలన్నీ వస్తాయి అందుచేత నలుగురు కలిపి మెడిటేషన్ చేయకూడదు ఒకవేళ చేసిన దూరం దూరంగా కూర్చోవాలి ఒకళ్ళకి ఒకళ్ళకి సంబంధం లేకుండాను అందుచేత
(10:29) ఏకాకి తప్పు తపస్సు చేసినా లేకపోతే జపం చేసిన ఒక్కడు చేయాలి ఇద్దరు ముగ్గురు చేశారంటే అక్కలేని గబులు అన్నీ వస్తాయి వాడు ఎలా చేస్తాడు కళ్ళు తెరిచి చూడడం రకరకాలు ఇవన్నీ పిచ్చి పిచ్చి పనులు అన్ని వస్తూ ఉంటాయి అన్నమాట అందుచేత అవ్వదు అది మాకు అనుభవం బాగానే తపస్సులు మేము జపాలు అవి చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇద్దరు ముగ్గురు ఉన్నామంటే జపం చెడిపోతుంటుంది అందుచేత దూరం దూరంగా కూర్చొని చేసుకుంటూ ఉంటాం లేకపోతే మా ఋత్వికల్ని మా పీటల్లో ఏం చేస్తాం అంటే పక్క పక్కన కూర్చోబెట్టాం మాటలు ఎక్కువైపోతాయని దూరం దూరంగా కూర్చోబెట్టి జపం చేయమంటాం అందుచేత
(10:55) ఏకాకినా తపో తపస్సు ఎప్పుడు కూడా ఒంటరిగా చేయాలి అలాగే ద్వా వ్యాం పట్టణం చదువు ఎప్పుడు ఒంటరిగా చదువుకోకూడదు ఎందుచేతనంటే కొన్ని కొన్ని డౌట్స్ వస్తే పక్కవాడు క్లియర్ చేస్తారు పక్కవాడి డౌట్స్ వస్తే వీడు క్లియర్ చేస్తాడు వాడు చదువుకుంటున్నాడు కదా అని వీడు వీడు చదువుకున్నాడు పోటీ పోటీగా చదువుకుంటారు ఒంటరిగా చదువుకుంటే ఆ కాసేపు మూసేద్దాం ఒక అరగంట పోయిగా చదువుకుందాం లేకపోతే ఈ గేమ్ ఆడి చదువుకుందాం లేకపోతే ఈ చాటింగ్ చేసి చదువుకుందాం ఈ వీడియో చూసి చదువుకుందాం అనే ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి చదువు ఎప్పుడు కూడా ఇద్దరు చదువుకోవాలి అప్పుడు
(11:21) పోటీ తత్వం పెరుగుతుంది డౌట్లు ఏమైనా ఉంటే ఒకరికొకరికి పంచుకోవడానికి ఉంటుంది అలాగే గాయనం త్రిబిహి పాటలు ఎప్పుడు కూడా ముగ్గురు పాడాలి అందుచేతనే అంటే గనక సాధారణంగా ఇప్పుడు చూడండి మనకి గాయకులు ఉన్నారు అనుకోండి ఒకడు తబల ఒకళ్ళు మృదంగం ఒకళ్ళు పాటలు పాడుతూ ఉంటారు ఇలాగ ఒక తలయిక ఉంటేనే గానానికి అందం లేదా ఒకడు పాడితే వేరు ముగ్గురు పాడారు అనుకోండి స్వరంలో స్వరం కలిసిపోతుంది ఒకళ్ళు ఆపేసిన ఒకళ్ళు అపస్వరంగా మాట్లాడిన ఒకవేళ అపస్వరంగా పాడిన రకరకాల స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చినా కవర్ అయిపోతూ ఉంటాయి ముగ్గురు పాడితే అందుచేత గాయనం త్రిబిహి ముగ్గురు
(11:48) పాడాలి అని చతుర్భిర్గమనం ఒకవేళ ప్రయాణం చేస్తున్నాం ప్రయాణం చేస్తున్నాం అంటే ఒక్కళ్ళు ఎప్పుడు ప్రయాణం చేయకూడదు నలుగురు ప్రయాణం చేయాలి అది కనీసం ఇద్దరు ముగ్గురైనా ప్రయాణం చేయొచ్చు కానీ ప్రయాణాన్ని నలుగురితో ఎందుకు చెప్పారు అంటే సరదా వేరు ఆనందం వేరా సంతోషం వేరు నలుగురు మాటలు మాట్లాడుతూ పంచుకుంటూ ఏదైనా కష్టం వచ్చినా మధ్యలో ఏదైనా ఆపద వచ్చినా కాపాడుకోవడానికి ఉండే పరిస్థితులు ఇవన్నీ ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా గ్రూప్ జర్నీలో ఉండే ఆనందమే వేరు ఆ సుఖమే వేరు కాబట్టి నలుగురితో కలిపి ప్రయాణం చేయాలి అందుకనే యాత్రలు
(12:15) చేసిన తీర్థయాత్రలు చేసిన గ్రూప్ గా చేయాలి ప్రయాణాలు నేను ఒక్కడినే తీర్థయాత్ర చేసి వస్తానని పిచ్చి పిచ్చి పని చేయకూడదు ఈ మధ్యకాలంలో చాలా మంది బైక్లు వేసుకుని దేశమంతా తిరిగి వస్తాను ఒంటరిగా బయలుదేరి వెళ్తున్నారు ప్రమాదాలు జరిగితే కనీసం పట్టించుకొని అంబులెన్స్ కి ఫోన్ చేసే పరిస్థితులు కూడా ఉండట్లేదు ఏ అడవి దారిలోనో లేకపోతే ఒంటరగా ఉండేటటువంటి రోడ్లోనే పడిపోతారు ఏ మూలకో పక్కకి ఆ తర్వాత వాడు పడిపోయాడో లేదో కూడా ఎవరికీ తెలియదు ఎవడు కనపడడు వాడి పరిస్థితి ఏమిటి అందుచేత నలుగురు వెళ్లారు అనుకోండి ఒకవేళ పడిపోయినా ఏదైనా ప్రమాదం జరిగిన మిగతా
(12:39) వాళ్ళు కాపాడటానికి కూడా ఉంటారు కాబట్టి చేత ప్రయాణం ఎప్పుడు కూడా ఒంటరిగా చేయకూడదు నలుగురితో కలిసి ప్రయాణం అన్నారు అలాగే చతుర్భి గమనం క్షేత్రం పంచభి బహుబిర్రణః అంటే వ్యవసాయం కనీసం ఐదు మంది చేయాలట ఐదు మంది అంటే ఇక్కడ పంచబిహి అంటే ఆ పంచబిహి ఐదుగురు అయినా పర్వాలేదు అంతకన్నా ఎక్కువైనా పర్వాలేదు అంటే అంటే ఎక్కువ మంది కలిపి వ్యవసాయం చేయాలి వ్యవసాయం ఎప్పుడు కూడా ఒంటరిగా నేను ఒక్కడినే చేసేస్తాను అనకూడదు ఒంటరిగా వ్యవసాయం చేస్తే ఆ ఇబ్బంది వేరు నలుగురు కలిపి వ్యవసాయం చేశారు అనుకోండి ఆ సుఖం ఆ సౌఖ్యం ఎందుకంటే గనుక అది పెద్ద పని
(13:10) ఎక్కువ మంది చేయవలసిన పని అందుచేత అందరూ కలిపి వ్యవసాయం చేయాలి అలాగే ఇప్పుడు యుద్ధం ఉందనుకోండి రణః రణః ఉందనుకోండి రణం అంటే యుద్ధం యుద్ధం ఉందనుకోండి యుద్ధం కూడా ఒక్కడు చేయకూడదు అందరూ కలిపి యుద్ధం చేయాలి అందుచేత ఎక్కువ మంది కలిపి చేయవలసినటువంటి పనులు ఇవి అంటే ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి జపం చేస్తే ఒక్కడే చేయాలి చదువుకుంటే ఇద్దరు చదువుకోవాలి పాటలు పాడేటప్పుడు ముగ్గురు ప్రయాణం చేస్తే నలుగురు అలాగే మామూలుగా పొలం కానీ వ్యవసాయం కానీ చేసేటప్పుడు కానీ లేదా యుద్ధాలు చేసేటప్పుడు కానీ ఎక్కువ మంది కలిపి
(13:39) చేయాలి అని మనకి చాణుక్యుడు చెప్పాడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఎంత గొప్ప విషయాలు అనుకుంటున్నారు ఇవన్నీ తెలుసుకోవాలి ఇవన్నీ పిల్లలకు నేర్పాలి జనరల్ గా ఇలాంటి విషయాలు ఎక్కడ మనం పుస్తకాల్లో చదవడానికి అవకాశాలు ఉండవు కాబట్టి ఇవన్నీ ధర్మాలు ఇవన్నీ ఇవన్నీ ప్రత్యేకంగా మనం పిల్లలకు నేర్పాలంటే మనం తెలుసుకోవాలి పిల్లలు ఖచ్చితంగా ఈ విషయాలు చూపించండి నేర్పండి దీనివల్ల వాళ్ళకి తెలియకుండా ఎంతో అద్భుతమైనటువంటి విజ్ఞానం జ్ఞానం వస్తుంది వాళ్ళ పిల్లలు అందించడానికి ఉంటాయి కాబట్టి చాణుక్యుడు చెప్పినటువంటి ప్రతి అక్షరం మన జీవితంలో చాలా ముఖ్యం అనే
(14:05) విషయాన్ని అర్థం చేసుకుని ఈ వీడియో మీకు చక్కగా నచ్చినట్లైతే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ ని గనక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే గనక సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ తదుపరి వీడియోలో ఇంకా అద్భుతమైన విషయాలు చెప్పాడు ఆ విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గో బ్రాహ్మణేభ్యాః శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు స్వస్తి [సంగీతం] ఆ [సంగీతం]
No comments:
Post a Comment