Monday, May 4, 2026

లజ్జా( సిగ్గు )వదిలేసిన వారి గురించి వేమన పద్యం || vemana padyalu with bhavam

లజ్జా( సిగ్గు )వదిలేసిన వారి గురించి వేమన పద్యం || vemana padyalu with bhavam

Author Name:The nagraj show

Youtube Channel Url:https://www.youtube.com/@thenagrajshow

Youtube Video URL:https://www.youtube.com/watch?v=hAk49EEVE7Q



Transcript:
(00:00) నిత్య జీవితంలో ఎదుర్కొనే అతి పెద్ద శత్రువు అదేనండి మొహమాటం లేదా బిడియం ఈ విషయం మీద మన ప్రజాకవి వేమన గారు వందల ఏళ్ల క్రితమే అద్భుతమైన పద్యాన్ని చెప్పారు. అరయ లజ్జ చూడనందరి యందుండు లజ్జ లేనివాడు లాలితుండు లజ్జ గలుగువాని లాభంబు లేదయ్యా విశ్వదాభిరామ వినురవేమా చాలా చిన్న పదాలు కానీ ఇందులో దాగున్న అర్థం మాత్రం చాలా లోతైనది ఈ పద్యంలో వేమన వాడిన ముఖ్యమైన పదం లజ్జ ఇక్కడ లజ్జ అంటే కేవలం సిగ్గు అని కాదు అనవసరమైన బిడియం లేదా భయం అని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు.
(00:45) అరయ లజ్జ చూడనందరి యందుండు సహజంగా మనుషులందరిలోనూ ఏదో ఒక స్థాయిలో సిగ్గు మొహమాటం లేదా భయం ఉంటాయి. ఇది సృష్టి ధర్మం నలుగురిలోకి వెళ్ళాలన్నా కొత్త పనులు చేయాలన్నా మన హక్కును మనం అడగాలన్నా మనలో చాలామందికి ఒక రకమైన బిడియం భయం అడ్డుపడుతుంది. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళ ఏమనుకుంటారో అన్న జంకు ప్రతి ఒక్కరి లోపల ఖచ్చితంగా ఉంటుంది.
(01:10) అది వేమన మొదటి లైన్లో చెప్పినటువంటి పచ్చి నిజం. లజ్జ లేనివాడు లాలితుండు ఇది పద్యంలో అత్యంత కీలకమైనటువంటి భాగం లజ్జ లేనివాడు అంటే ఇక్కడ సిగ్గుమలినవాడు అని నెగిటివ్ కోణంలో మనం తీసుకోవద్దు. మొహమాటం లేనివాడు ధైర్యంగా అడిగేవాడు అనే అర్థాన్ని మనం తీసుకున్నట్లయితే ఎవరికైతే ఈ అనవసరమైన బిడియం ఉండదో వారు సమాజంలో సులభంగా తమ పనులు పూర్తి చేసుకుంటారు అందరి మననలు పొందుతారు అంటే లాలితుండు అని చెప్పాడు వేమన గారు ఉదాహరణకు ఒక తరగతి గదిలో సందేహం వస్తే లేచి నిలబడి అడిగే విద్యార్థికి జ్ఞానం దక్కుతుంది.
(01:48) అదే మొహమాటపడి కూర్చుంటే నష్టమే కదా అలాగే మనం ఇచ్చిన అప్పు తిరిగి అడగాలంటే మనకు మొహమాటం కానీ అడిగే వాడికే కదా డబ్బు తిరిగి వస్తుంది. లజగలుగువాని లాభంబు లేదయ్యా మొహమాట పడేవాడికి అనవసరమైన బిడియం ప్రదర్శించే వాడికి జీవితంలో ఎలాంటి లాభం చేయకూరదు. అవకాశాలు వాటంతట అవే తలుపు తట్టవు మనమే ముందుకు వెళ్లి వాటిని అందుకోవాలి.
(02:17) అక్కడ లజ్జ పడితే ఆ అవకాశం ఇంకొకరి పాలవుతుంది. వ్యాపారంలో అయినా ఉద్యోగంలో అయినా సంబంధాల్లో అయినా సరే మనసులో ఉన్నది చెప్పకుండా అడగాల్సింది అడగకుండా మొహమాట పడే వారికి నష్టమే తప్ప లాభం అస్సలు ఉండదు అని వేమన గారు ఈ పద్యం ద్వారా స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నారు. తప్పు చేయకూడదు అన్న సిగ్గు ఉండడం వేరు హక్కును అడగలేనంత మొహమాటం ఉండడం వేరు అనవసరమైన బిడియాన్ని వదిలేయండి ధైర్యంగా ముందడుగు వేయండి అప్పుడే జీవితంలో లాభం విజయం మీ సొంతం అవుతాయి.
(02:49) ఇదే విషయాన్ని అద్భుతంగా తెలియపరిచే బౌద్ధుల జాతక కథల్లోని ఒక గొప్ప కథ. అలాగే పంచతంత్రం కథల్లో కూడా ఒక మంచి కథ ఉంది. ఆ రెండు కథల్ని విందాం. ఆ రెండు కథల్ని బేరీజు వేసుకొని వేమన గారి పద్యానికి అన్వయించుకొని చెప్పుకుందాం. చివరివరకు వినండి తప్పకుండా మీ జీవితానికి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని జోడించే ఈ వీడియో అవుతుంది తప్పకుండా చివరివరకు రెండు కథలు వినండి అలాగే వేమన గారి పద్యానికి దాన్ని అనుసంధానిస్తూ చెప్పేటటువంటి విషయాలని కూడా వినండి.
(03:21) ఏదో ఒక సందర్భంలో తప్పకుండా ఈ అంశాలు మీకు మీ జీవితంలో ఉపయోగపడతాయి. అరయ లజ్జ చూడనందరి యందుండు లజ్జలేనివాడు లాలితుండు లజ్జగలుగువాని లాభంబు లేదయ్యా విశ్వదాభిరామ వినరవేమ చుల్లక శెట్టి జాతక కథ ఈ కథ వేమనగారి పద్యానికి అక్షరాల సరిపోతుంది. పూర్వం వారణాసి నగరంలో ఒక గొప్ప వ్యాపారి ఉండేవాడు. ఆయనకు వ్యాపార మెలకోవలతో పాటు జ్యోతిష్య శాస్త్రం కూడా తెలుసు.
(03:53) ఒకరోజు ఆయన వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా దారిలో ఒక చనిపోయిన ఏలుక కనిపించింది. అప్పటి గ్రహ స్థితులను లెక్కించి ఆ వ్యాపారి ఆ పక్కన ఉన్న వారితో ఇలా అన్నాడు. గ్రహ బలాలు ఇప్పుడు అద్భుతంగా ఉన్నాయి. తెలివితేటలు పట్టుదల ఉండి అనవసరమైన మొహమాటం లేని ఏ యువకుడైనా సరే ఈ చనిపోయిన ఎలుకను పెట్టుబడిగా పెట్టి మహా కోటీశ్వరుడు కూడా అవ్వచ్చు అని అన్నాడు.
(04:20) ఆ సమయంలో అక్కడే ఉన్న ఒక పేద యువకుడు ఈ మాటలు విన్నాడు. అతనికి డబ్బు సంపాదించి వృద్ధిలోకి రావాలన్న కసి చాలా ఉంది. వెంటనే అతడు ఆ చనిపోయిన ఎలుకను చేతిలోకి తీసుకున్నాడు. సాధారణంగా ఎవరైనా చనిపోయిన ఎలుకను పట్టుకోవడానికి అసహ్యించుకుంటారు. నలుగురు చూస్తే ఏమనుకుంటారు అని సిగ్గుపడతారు. కానీ ఆ యువకుడు ఆ సిగ్గును ఆ లజ్జను పక్కన పెట్టేసాడు.
(04:45) ఆ ఎలుకను తీసుకువెళ్లి ఒక పెంపుడు పిల్లి ఉన్న ఒక దుకానదారుడికి ఆ ఎలుకను అమ్మేసాడు. అతనికి ఒక చిన్న రాగి నానం కాసు ఆయన ఇచ్చిండు. ఆ ఒక్క రాగి నానంతో అతను బెల్లం నీళ్లు కొన్నాడు. అడవి నుంచి పూలు కోసుకొని అలసిపోయి వస్తున్న వారికి ఆ బెల్లం పానకం ఇచ్చి దాహం తీర్చాడు. అందుకు కృతజ్ఞతగా వారు తలా కొన్ని పూలు ఇచ్చారు. ఆ పూలను అమ్మి మరికొంత డబ్బు సంపాదించాడు.
(05:16) కొన్నాళ్లకు నగరంలో పెద్ద గాలివాన వచ్చింది. రాజుగారి తోటలో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. వాటిని శుభ్రం చేయడం తోటమాలికే తలకు మించినటువంటి భారం అయింది. అప్పుడు ఈ యువకుడు అక్కడికి వెళ్లి ఈ చెక్కలన్నీ నాకు ఇస్తే నేను తోటను శుభ్రం చేస్తాను అని మొహమాటం లేకుండా అడిగాడు. తోటమాలి సంతోషంగా ఒప్పుకున్నాడు. అప్పుడు ఆ యువకుడు అక్కడున్న చిన్న పిల్లలకు తలా ఒక తీపి మిఠాయి ఇచ్చి వాళ్ళ సహాయంతోటి తోటను శుభ్రం చేసి ఆ కలపను రాజుగారి కుమ్మరికి అమ్మి భారీగా లాభం పొందాడు.
(05:56) ఇలా ఏ పని చేయడానికైనా నామోషి పడకుండా మొహమాటం లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకొని అనతి కాలంలోనే ఆ నగరంలోనే అతి పెద్ద కోటీశ్వరుడుగా ఆ యువకుడు ఎదిగాడు. తన విజయానికి కారణమైన ఆ పాత వ్యాపారి ఎవరైతే శెట్టి ఈ ఎలక గురించి జ్యోతిష్యం చెప్పాడో అతని దగ్గరికి వెళ్లి కృతజ్ఞతలు చెప్పగా ఆ యువకుడి నైపుణ్యానికి మురిసిపోయిన ఆ వ్యాపారి తన కూతురిని ఇచ్చి పెళ్లి చేశాడు.
(06:25) అరయ లజ్జ చూడనందరి యందుండు సహజంగా అందరిలోనూ నామోసి సిగ్గు లజ్జ అనేటివి తప్పకుండా ఉంటాయి. నడివీధిలో పడి ఉన్న ఒక చనిపోయిన ఎలుకను తీసి అమ్ముకోవాలి అంటే ఎవరికైనా సిగ్గు లజ్జ నామోషితనం అనేది అడ్డు వస్తుంది. ఛి ఈ పనిఏంటి ఇదో వ్యాపారమా జనాలు చూసి నవ్వుతారు కదా అని చుట్టుపక్కల ఉన్నవారంతా అనుకుంటారు సమాజంలో మెజారిటీ మనుషుల ఆలోచన విధానం ఇదే రకంగా ఉంటుంది అని వేమన గారు మొదటి లైన్ లోనే మనకు స్పష్టంగా తెలియపరిచింది.
(06:59) లజ్జగలుగువాని లాభంబు లేదయ్యా అన్నాడు వేమ మొహమాటం ఉన్నవాడికి లాభం శూన్యం ఒకవేళ ఆ యువకుడు కూడా నలుగురిలాగే లజ్జపడి పరువు కోసం ఆలోచించి ఎలకను పట్టుకోవడానికి సిగ్గుపడి ఉంటే అతనికి ఆ మొదటి రాగినానం దక్కేది కాదు ఆ తర్వాత పూల వ్యాపారం కలప వ్యాపారం చేసేవాడే కాదు వ్యాపారంలో ఒకరిని సాయం అడగాలన్నా ఒక వస్తువును అమ్మాలన్నా సిగ్గుపడితే జేబులోకి డబ్బులు రావు లజ్జ కారణంగా అతను ఒక గొప్ప లాభాన్ని కోల్పోయేవాడు వేమన చెప్పినట్లుగా మొహమాట పడేవాడికి లాభం రాదు అనడానికి ఇది నిదర్శనం లజ్జ లేనివాడు లాలితుండు అంటే బిడియం నామోషి వదిలేసినవాడు విజయుడు
(07:44) అవుతాడు కథలోని యువకుడు పనుల పట్ల తనకున్న లజ్జను అంటే ఫాల్స్ ప్రెస్టేజ్ అంటాం కదా మనం దాన్ని పూర్తిగా వదిలేసాడు ఏ పని చిన్నది కాదు అనుకున్నాడు మొహమాటం లేకుండా మాట్లాడాల్సిన చోట మాట్లాడిండు అడగాల్సిన చోట అడిగిండు తోటమారిని కలప అడగడం కుమ్మరికి ఆ కలపను అమ్మడం ఇలాంటివి చేసిండు ఫలితంగా సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకున్నాడు అందరి చేత కీర్తింపబడ్డాడు లాలితుండు అయ్యాడు వేమల పద్యం కేవలం మాటలకే పరిమితం కాదు అది ఒక ప్రాక్టికల్ లైఫ్ స్కిల్ అంటే జీవన నైపుణ్యం అలాగే ఈ బౌద్ధుల జాతక కథల్లో కూడా మేమన గారు చెప్పినటువంటి పద్యంలోని భావం సంపూర్ణంగా
(08:31) ప్రస్పుటం అవుతుంది. ఇలాంటిదే పంచతంత్రం కథలో కూడా ఒక గొప్ప కథ ఉంది. ఆ కథను కూడా సంపూర్ణంగా చివరి వరకు వినండి. పూర్వం ఒక అడవిలో గోమాయువు అనే ఆకలితో ఉన్న ఒక నక్క ఆహారం కోసం వెతుకుతూ ఉంటుంది. ఎక్కడ దానికి ఆహారం దొరకదు. అలా తిరుగుతూ తిరుగుతూ అది ఒక పాత యుద్ధభూమికి చేరుకుంటుంది. అక్కడ ఒక పెద్ద డప్పు అంటే భేరి చెట్టు పొదల మధ్యన పడి ఉంటుంది.
(09:01) గాలి వీచినప్పుడల్లా ఆ పక్కనే ఉన్న చెట్టు కొమ్మలు ఆ డప్పు పైన ఇట్లా ఊగుతూ ఊగుతూ కొడుతూ ఉంటాయి. దానివల్ల డం డం డం డం డం డం అంటూ పెద్దగా శబ్దం వస్తుంది. ఆ శబ్దాన్ని విన్న నక్క ఒక్కసారిగా భయంతో వనికిపోయింది. అమ్మో ఇంత పెద్ద శబ్దం వస్తుందంటే ఇక్కడ ఏదో భయంకరమైన జంతువు ఉండి ఉంటుంది. అది నన్ను చూస్తే చంపేస్తుంది నేను ఇక్కడి నుంచి పారిపోవడమే మంచిది అని అనుకుంటుంది.
(09:29) పారిపోవడానికి సిద్ధపడిన నక్కకు వేమన గారు చెప్పినట్లుగా లజ్జ అంటే బిడియం ఇక్కడ శబ్దానికి భయపడి వెనకడుగు వేయడం లాంటిది అడ్డం వస్తుంది. కానీ ఆ నక్క వెంటనే ఆలోచించింది. కేవలం శబ్దాన్ని చూసి భయపడి పారిపోతే నా ఆకలి ఎలా తీరుతుంది. అసలు ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో ఒక్కసారి ధైర్యంగా చూస్తాను అని తనలోని భయాన్ని బిడియాన్ని పక్కన పెట్టేసింది.
(10:00) నెమ్మదిగా డప్పు దగ్గరికి వెళ్లి చూస్తే అది కేవలం తోలుతో కప్పబడిన ఒక కర్ర వస్తువు అని నక్కకు అర్థమయింది. గాలికి కొమ్మలు తగలడం వల్లే ఆ శబ్దం వస్తుందని గ్రహించింది. అంతేకాకుండా ఆ డప్పు లోపల ఏదైనా మాంసం ఉంటుందేమో అని ఆశతో దాన్ని కురికి చూసింది. మాంసం దొరకకపోయినా ఆ పరిసరాల్లో యుద్ధం జరిగినప్పుడు పడిపోయిన ఆహార పదార్థాలు దానికి దొరికాయి.
(10:28) ఒకవేళ ఆ నక్క భయపడి పారిపోయి ఉంటే దానికి ఆహారం దొరికేది కాదు వేమన చెప్పిన భావానికి ఈ కథకు ఉన్న పోలికలను మనం సాధారణంగా విశ్లేషించుకుందాం. అరయ లజ్జ చూడనందరి యందుండు సహజమైనటువంటి భయం బిడియం అందరి లోపల ఉంటాయి. టప్పు శబ్దం వినగానే నక్క మొదట భయపడింది ఇది సహజమైన ప్రతిచర్య లోకంలో ఎవరైనా సరే కొత్త విషయాలను చూసినప్పుడు లేదా తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొంచెం బిడియపడడం లేదా వెనకడుగు వేయడం సహజం నక్క కూడా మొదట అట్లాగే అనుకుంది.
(11:05) లజ్జగలుగువాని లాభంబు లేదయ్యా అంటే మొహమాటం ఉంటే నష్టమే ఒకవేళ ఆ నక్క నేను అక్కడికి వెళ్తే ఆ జంతువు నన్ను ఏమంటుందో అని మొహమాటపడి లేదా ప్రాణ భయంతోటి ప్రాణం పోతుందేమో అని భయపడి వెనుతిరిగి ఉంటే లజ్జతోటి వెనుతిరిగి ఉంటే దానికి ఆ రోజు ఆహారం దొరికేది కాదు ఆకలితో అలమటించేది అంటే అనవసరమైనటువంటి భయము లజా వల్ల దానికి లాభం చేకూరేది కాదు అంటే ఆహారం దొరికేది కాదు లజ్జ లేనివాడు లాలితుండు బిడియం వదిలితే విజయం నక్క తనలోని అభద్రత భావాన్ని ఆ లజ్జను విడిచిపెట్టింది.
(11:50) ధైర్యంగా ముందుకు వెళ్లి పరిశోధించింది. ఫలితంగా నిజం తెలుసుకుంది. మరియు ఆహారాన్ని కూడా సంపాదించింది. ఇట్లా అనవసరమైన మొహమాటాలను పక్కన పెట్టి కార్యరంగంలోకి మనం దూకినట్లయితే లాలితుండు అన్నాడు వేమన అదృష్టవంతుడు లేదా ప్రశంసించదగినవాడు అవుతాడు అని వేవ పద్యంలోని భావము ఈ కథలోని భావం కూడా అదే ఇందులో వేవ పద్యంలోని ఆంతర్యము కథలోని ఆంతర్యాన్ని మాత్రమే పట్టుకొని చూద్దాము ఇక్కడ పోలిక ఎట్లా సరిపోయిందో కూడా మీకు సంపూర్ణంగా వివరించాను కాబట్టి కేవలం భావాన్ని మాత్రమే తీసుకొని మన జీవితాలకు దీన్ని అన్వయించుకుందాం. తప్పకుండా మనకు ఏదో ఒక
(12:33) సందర్భంలో ఇది ఉపయోగపడుతుంది. పంచతంత్రంలోని నక్క తన బిడియాన్ని లజ్జను వదిలి ఎలాగైతే ఆహారాన్ని పొందిందో మనిషి కూడా లోకంలో బ్రతకడానికి అనవసరమైన మొహమాటాలను నామోషీలను వదిలేయాలి. అడిగితే ఏమనుకుంటారో చేస్తే ఏమనుకుంటారో అని ఆగిపోతే అభివృద్ధి ఉండదు. వేమన గారు చెప్పినట్లు లజ్జ లేనివాడు అంటే ఇక్కడ అనవసరమైనటువంటి మొహమాటం లేని ధైర్యశాలి అని మనం అర్థం చేసుకోవాలి.
(13:03) అలాంటివారే జీవితంలో విజేతలుగా నిలుస్తారు. ఇంత గొప్ప పద్యాలను అందించిన వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుందాం. అలాగే బౌద్ధుల జాతక కథలో మీకు ఏ అంశం నచ్చింది? తర్వాత పంచతంత్రం కథలో మీకు ఏ అంశం నచ్చిందో కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియపరచండి. ఇలాంటి మరో వీడియోతో మరోవారం తప్పకుండా మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యస్మి శుభం భుయాత్ [సంగీతం] ఓం

No comments:

Post a Comment