స్త్రీల బాహ్య సౌందర్య వ్యామోహంలో పడి నశించే వారి గురించి వేమన పద్యం /vemana padyalu with meaning
Author Name:The nagraj show
Youtube Channel Url:https://www.youtube.com/@thenagrajshow
Youtube Video URL:https://www.youtube.com/watch?v=r3-4tDC0ezo
Transcript:
(00:01) చంచలమైన విశాలమైన కన్నులు కలిగిన సౌందర్యవతుల వలపులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అవి క్షణికమైనవి వారి బాహ్య సౌందర్యాన్ని నటనను చూసి నువ్వు ఎందుకు భ్రమపడిపోతున్నావు నిజానికి ఈ భౌతిక శరీరం అనేది కేవలం పంచభూతాల కలయిక రేపు మట్టిలో కలిసిపోయే ఈ వెలుపలి రూపాన్ని బాహ్య శరీరాన్ని చూసి అంతగా మురిసిపోవడం దాని గురించే నిరంతరం ఆలోచించడం ఎందుకు అదంతా కేవలం శూన్యం రూపం వెనుక ఉన్న ఆత్మతత్వాన్ని శాశ్వతమైన తత్వాన్ని తెలుసుకోవడం ముఖ్యం.
(00:43) జానలనయట్టి చపలాయతాక్షుల వలపులరసి చూసి బ్రమయకేల బయలి రూపులరసి పరికింపగానేల విశ్వదాభిరామ వినురవేమా జానలనయట్టి చెపలాయతాక్షుల వలపులరసి చూసి బ్రమయకేల బయలిరూపులరసి పరికింపగానేల విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావాన్ని ఒక చిన్న కథనాత్మక రీతిలో తెలుసుకుందాం ఒకానొక గ్రామంలో ఆనందుడు అనే ఒక యువకుడు ఉండేవాడు అతను జీవితంలో నిజమైన సంతోషం ఎక్కడఉందో తెలియక ప్రాపంచిక సుఖాల వెంట పరుగులు తీస్తుండేవాడు.
(01:26) ముఖ్యంగా అందగత్తలైన స్త్రీల చంచలమైన చూపులకు వారి బాహ్య సౌందర్యానికి సులభంగా ఆకర్షితులైపోయేవాడు. వారిపై మోహంతో వలపులతో తన అమూల్యమైన సమయాన్ని మనశశాంతిని కోల్పోతుండేవాడు. ఒకరోజు ఆ గ్రామానికి ఒక జ్ఞాని వచ్చాడు. ఆనందుడి ఆరాటాన్ని ఆవేదనను గమనించిన ఆ జ్ఞాని అతన్ని దగ్గరకు పిలిచి ప్రకృతి రహస్యాన్ని ఈ విధంగా అతనికి తెలియపరిచాడు. నాయనా ఆనంద చంచలమైన విశాలమైన కన్నులు కలిగిన సౌందర్యవతుల వలపులు ఎప్పుడూ ఒకేలా ఉండవు.
(02:05) అవి క్షణికమైనవి వారి బాహ్య సౌందర్యాన్ని నటనను చూసి నువ్వు ఎందుకు బ్రమపడిపోతున్నావు నిజానికి ఈ భౌతిక శరీరం అనేది కేవలం పంచభూతాల కలయిక రేపు మట్టిలో కలిసిపోయే ఈ వెలుపలి రూపాన్ని దీన్ని చూసి అంతగా మురిసిపోవడం దాని గురించే నిరంతరం ఆలోచించడం ఎందుకు అదంతా కేవలం శూన్యం రూపం వెనుక ఉన్న ఆత్మతత్వాన్ని శాశ్వతమైన సత్యాన్ని తెలుసుకో అని జ్ఞాని చెప్పిన ఈ మాటలతో ఆనందుడి కళ్ళు తెరుచుకున్నాయి.
(02:40) బాహ్యమైన ఆకర్షణలు కేవలం మాయ అని శాశ్వతమైన ఆనందం లోపలి ఆత్మజ్ఞానంలోనే ఉందనే సత్యాన్ని అతడు గ్రహించిండు. చంచలమైన కన్నులు గల స్త్రీల వలపులను నిజమని నమ్మి భ్రమపడకూడదు. కేవలం నశించిపోయే బాహ్య రూపాలను చూసి మోహంలో పడడం వ్యర్థం అని వేమన మనకు ఈ పద్యం ద్వారా తెలియపరుస్తున్నారు. జానలయట్టి చెపలాయతాక్షుల వలపులరసి చూసి బ్రమకేల బయలిరూపులరసి పరికింపగానేల విశ్వదాభిరామ విడురవేమ ఈ పద్యంలోని గొప్పతనం విశిష్టత వేమన పద్యాల ప్రత్యేకత ఏంటంటే అవి ఎంతటి గంభీరమైన వేదాంతాన్నైనా పామురులకు సైతం అర్థమయ్యేలాగా చెబుతాయి. ఈ
(03:27) పద్యంలో దాగున్న గొప్పతనాన్ని కొన్ని ముఖ్య అంశాలుగా ఇట్లా చెప్పుకోవచ్చు. నిష్కపటమైన నిజాయితి వేమన సమాజంలోని మనుషుల బలహీనతలను దాచకుండా మొహమాటం లేకుండా ముఖం మీదే చెప్తారు. మనుషులు బాహ్య ఆకర్షణలకు ఎలా లోనవుతారో ఇందులో స్పష్టంగా చూపిస్తారు. మానవ జన్మకు మోహం కామం అనేవి పెద్ద ప్రతిబంధకాలు. భ్రమయకేల ఎందుకు భ్రమపడతావు అని ప్రశ్నించడం ద్వారా మనిషిని అంతర్మధనంలోకి నెట్టి భ్రాంతి నుంచి బయటకు తెచ్చే ప్రయత్నం ఈ పద్యంలో కనిపిస్తుంది.
(04:09) బయలి రూపు అనే పదం చాలా గొప్పది. బయలు అంటే శూన్యం లేదా ఆకాశం అనే అర్థం. ఈ శరీరం చివరికి శూన్యంలో కలిసిపోయేదే అని కనిపించే రూపంంతా మాయ అని చెప్పడానికి ఈ పద్యాన్ని వాడడం వేమన తాత్విక చింతనకు అర్థం పడుతుంది. ఆటవెలది చందస్సులో రాయబడిన ఈ పద్యం నోటికి చాలా సులభంగా తిరుగుతుంది. కానీ దీని వెనక ఉన్న తాత్విక సందేశం మాత్రం మనిషి జీవన విధానాన్ని మార్చగలిగే అంత శక్తివంతమైనది.
(04:39) మహాభారతంలో శారీరక మోహం బాహ్య సౌందర్యం వెనుక ఉన్న భ్రమలను పటాపంచలు చేస్తూ వేమన పద్య భావాన్ని బాహ్య రూపాలను చూసి భ్రమపడకూడదనే సత్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించే ఒక చిన్న ఘట్టాన్ని మనం తెలుసుకోవాలి. మహాభారత కథ ప్రారంభంలో హస్తినాపురాన్ని ఏలేటటువంటి శంతన మహారాజుకు అప్పటికీ గంగాదేవి వల్ల జన్మించినటువంటి దేవవ్రతుడు భీష్ముడు అనే గొప్ప కుమారుడు ఉంటాడు.
(05:14) భీష్ముడిని యువరాజుగా ప్రకటించి శంతనుడు ప్రశాంతంగా జీవిస్తూ ఉంటాడు. ఒకరోజు శంతన మహారాజు యమునా నది తీరంలో వేటకు వెళ్తాడు. అక్కడ అతనికి దాసరాజు కూతురైనటువంటి సత్యవతి అంటే ఆవిడకు మరొక పేరు కూడా ఉంది మత్యగంధి అంటారు. సత్యవతి కనిపిస్తుంది. ఆమె అపురూప లావణ్యవతి ఆమె శరీరం నుంచి ఒక అద్భుతమైనటువంటి సుగంధం పరిమలం వెదజల్లుతూ ఉంటుంది.
(05:46) వేమన పద్యంలో చెప్పినట్లు చెపలాయతాక్షుల వలపులరసి చూచి భ్రమయకేల ఆమె బాహ్య సౌందర్యాన్ని ఆకర్షణను చూడగానే శంతనుడు పటాపంచలైపోతాడు. ముసలితనం దగ్గర పడుతున్న వయసులో కూడా ఒక చక్రవర్తి అయుండి కూడా ఆమె శారీరక రూపానికి దాసుడైపోతాడు. ఆమెను ఎలాగైనా వివాహం చేసుకోవాలని మోహంలో పడిపోతాడు. సత్యవతి తండ్రి అయినటువంటి దాశరాజు ఒక కఠినమైనటువంటి శరత్తు పెడతాడు.
(06:18) సత్యవతికి పుట్టే కొడుకే హస్తినాపురానికి రాజు కావాలి అప్పుడే నా కూతురిని నీకుఇచ్చి పెళ్లి చేస్తాను అంటాడు. అప్పటికే ధర్మాత్ముడైనటువంటి దేవవ్రతుడు భీష్ముడు యువరాజుగా ఉన్నాడు కాబట్టి శంతనుడు ఆ శరతుకు ఒప్పుకోలేక అలాగని సత్యవతి పైన ఉన్నటువంటి మోహాన్ని వదులుకోలేక తీవ్రమైన మానసిక వేదనకు గురవుతాడు. అంతటి చక్రవర్తి కేవలం ఒక స్త్రీ రూపం పై ఉన్న వ్యామోహంతో భ్రమతో అన్నం నిద్ర మానేసి మంచం పడతాడు.
(06:55) తండ్రి బాధను చూసి చలించిపోయిన భీష్ముడు దాసరాజు దగ్గరికి వెళ్లి తండ్రి కోరిక కోసం తాను రాజ్యాన్ని వదులుకోవడమే కాకుండా జీవితాంతం పెళ్లి చేసుకొనని భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పటి నుంచి అతన్ని మనము భీష్ముడుగా పరిగణిస్తున్నాం. ఒక్క క్షణికమైన శారీరక సుఖం కోసం బాహ్య రూపం తెచ్చినటువంటి మోహం కోసం శంతనుడు తన సద్గుణాల కుమారుడైన భీష్ముడి జీవితాన్ని బలి చేశాడు.
(07:25) భవిష్యత్తులో కురువంశం నాశనం కావడానికి పరోక్షంగా బీజం వేశాడు. సత్యవతిని వివాహం చేసుకున్న తర్వాత శంతనుడు కొన్నాళ్ళు సుఖపడ్డాడు. కానీ ఆ తర్వాత ఆమెకు పుట్టిన చిత్రవీర్యుడు విచిత్ర వీర్యుడు అకాల మరణం చెందడం రాజ్యం అరాచకం కావడం చూసి తీవ్ర దుఃఖంతో కన్ను మూస్తాడు. తాను నమ్మిన బాహ్య సుఖం రూపం తన జీవితంలో ఎంతటి శూన్యాన్ని మిగిల్చాయో శంతనుడు చివరి దశలో గ్రహిస్తాడు.
(08:02) వేమల గారు హెచ్చించిన సూత్రాలు ఈ ఘట్టంలో అక్షరాల కనిపిస్తాయి. వలపులారసి చూచి భ్రమయకేల శంతనుడు సత్యవతి అందాన్ని చూసి భ్రమపడకుండా ఉండి ఉంటే భీష్ముడికి ఆ గతి పట్టేది కాదు మహాభారత ఘోర కలి జరిగేది కాదు బయలి రూపులరసి పరికింపగానేల స్త్రీ బాహ్య సౌందర్యం లేదా శారీరక ఆకర్షణ అనేది కాలక్రమమైన నశించిపోయే ఒక బయలు అంటే శూన్యం ఆ తాత్కాలిక రూపం కోసం శాశ్వతమైన ధర్మాన్ని వివేకాన్ని వదిలివేయడం ఎంతటి మహారాజులైనా పతనమైపోతారని శంతనుడి కథ నిరూపిస్తుంది. ఈ విధంగా బాహ్య
(08:50) రూపాల వెనుక ఉన్న మోహాన్ని నిరసించే వేమన పద్యానికి శంతన మహారాజు కథ మరొక అద్భుతమైన చారిత్రక ఉదాహరణ. ఈ కథనం వేమన పద్యంలో ఉన్నటువంటి లోతైన భావాన్ని మీకు మరింత స్పష్టంగా వివరించిందని నేను ఆశిస్తున్నాను. దీనిపైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్ లో తెలియపరిచి ఈ వివరణ ఈ పద్యం కానీ మీకు బాగా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇది మరింతమందికి చేరే విధంగా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.
(09:27) జానలనయట్టి చెపలాయ తాక్షుల వలపులరసి చూచి బ్రమయకేల బయలి రూపులరసి పరికింపగానేల విశ్వదాభిరామ వినురవేమా శుభం భుయాత్ [సంగీతం] [సంగీతం]
No comments:
Post a Comment