ఒంటరిగా ఉండటం భయం కాదు అది ఒక వరం! | Why Being Alone is a Superpower | Satyagrahi Thoughts
Author Name:Satyagrahi
Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=e0HYkXJMS5U
Transcript:
(00:01) [సంగీతం] ప్రతిరోజు ఉదయం లేవగానే మీ ఫోన్ చూడటం ఎవరో ఒకరు మెసేజ్ చేయాలి లేదా ఎవరో ఒకరికి మీరు మెసేజ్ పంపించాలి [సంగీతం] అని చెప్పేసి తపించడం ఇది మీ ఒక్కరి సమస్యే కాదు మనందరిలోనూ ఉన్న ఒక వెలితి అసలు సమస్య ఒంటరితనం కాదు ఒంటరిగా ఉండాల్సి వస్తుందేమో అనే భయం మన చుట్టూ ఉన్న మనుషులు లేకపోతే మన ఉనికి అర్థం లేదని మనం ఎందుకు [సంగీతం] పనికి రామని లోలోపల ల ఒక అభద్రత భావం మనల్ని కంటిన్యూస్ గా వెంటాడుతూనే ఉంటుంది.
(00:34) ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు అందరూ గ్రూపులుగా ఉంటే మీరు మాత్రం ఒక పక్కన ఒంటరిగా నిలబడితే ఏదో తెలియని అవమానం అందుకే పని లేకపోయినా సరే ఫోన్ తీసి ఏదో ఒకటి స్క్రోల్ చేస్తూ బిజీగా ఉన్నట్లు నటిస్తారు. ఎందుకంటే నేను ఒంటెరిని అని ప్రపంచానికి తెలియడం మీకు ఇష్టం లేదు కాబట్టి రాత్రిపూట గదిలో లైట్లు ఆపి పడుకున్నప్పుడు ఆ నిశశబ్దం మిమ్మల్ని భయపెడుతుంది.
(01:00) ఆ నిశ్శబ్దంలో మీ మనసు అడిగే ప్రశ్నలకి [సంగీతం] మీ దగ్గర సమాధానాలు ఉండవు. అందుకే ఆ భయం నుంచి తప్పించుకోవడానికి అర్థం లేని పరిచయాలు అవసరం లేని రిలేషన్షిప్స్ పనికిరాని సోషల్ మీడియా నోటిఫికేషన్ల వెనుక మీరు పరిగెడుతున్నారు. నిజానికి మీరు మనుషుల కోసం వెతకడం లేదు. మీలో [సంగీతం] ఉన్న ఆ శూన్యాన్ని నింపడానికి ఒక మత్తు కోసం వెతుకుతున్నారు.
(01:22) మనకి చిన్నప్పటి నుంచి నేర్పించింది ఏమిటంటే నలుగురితో కలిసి ఉండాలి. అందరితో కలవాలి. అది మంచిదే కానీ నీతో నువ్వు ఎలా ఉండాలి అనేది ఎవ్వరు నేర్పించరు. సమాజం మనల్ని ఎలా ప్రోగ్రాం్ చేసిందంటే ఒంటరిగా ఉండే వ్యక్తిని ఒక ఫెయిల్యూర్ లాగా లేదా డిప్రెషన్ లో ఉన్నవాళ్ళలాగా చూస్తుంది. అందుకే మనకి మనతో గడపడం అంటే బోరు కొడుతుంది. మనలో ఉన్న లోపాలు మన భయాలు మనం చేసిన తప్పులు ఇవన్నీ మనం ఒంటరిగా ఉన్నప్పుడే మన కళ్ళ ముందు కదిలాడుతూ ఉంటాయి.
(01:51) ఆ నిజాన్ని ఫేస్ చేసే ధైర్యం లేక మనం బయట ప్రపంచంలోకి పారిపోతుంటాం. మరో ముఖ్యమైన కారణం వాలిడేషన్ మనల్ని ఎవరో ఒకళ్ళు మెచ్చుకోవాలి మన ఫోటోలకి లైకులు కొట్టాలి మనం చేసే పనిని ఎవరో ఒకరు గుర్తించాలి మన సంతోషాన్ని ఇతరుల చేతుల్లో పెట్టేసాం కాబట్టే వారు లేనప్పుడు మనం శూన్యంగా కనిపిస్తాం. ఇతరుల అభిప్రాయాలే మన [సంగీతం] జీవితానికి కులమానం అనుకోవడం వల్లే ఒంటరితనం మనకి ఒక శాపంలా అనిపిస్తుంది.
(02:18) మనం ఒంటరిగా ఉన్నామంటే మనల్ని ఎవరూ ప్రేమించడం లేదని మనకు విలువ లేదని మనల్ని మనమే తక్కువ చేసుకుంటున్నాం. మొదట మీరు ఒక నిజాన్ని అంగీకరించాలి. ఒంటరితనం అంటే మనుషులు లేకపోవడం కాదు మిమ్మల్ని మీరు కనుకునే ఒక గొప్ప అవకాశం, భయాన్ని పక్కన పెట్టి మీతో మీరు సమయాన్ని గడపడం నేర్చుకోండి. రోజు ఒక అరగంట ఫోన్ పక్కన పెట్టి ఏ పని లేకుండా ప్రశాంతంగా కూర్చోండి.
(02:42) [సంగీతం] మీ మనసులో వచ్చే ఆలోచనల్ని గమనించండి. అవి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? అయితే ఎందుకు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకోండి. ఏకాంతం అంటే మీతో మీరు ప్రేమలో పడటం ఇతరుల వాాలిడేషన్ కోసం ఎదురు చూడటం ఆపేయండి. మీకు నచ్చిన పనిని ఎవరి కోసమో కాకుండా మీ సంతోషం కోసం చేయండి. ఒక్కరే సినిమాకి వెళ్ళండి ఒక్కరే నచ్చిన రెస్టారెంట్ లో భోజనం [సంగీతం] చేయండి లేదా ఒక్కరే లాంగ్ డ్రైవ్ కి వెళ్ళండి.
(03:09) ఇవన్నీ మిమ్మల్ని బలహీన పరచవు. పైగా మీకు ఒక అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. మీరు మీతో ఉండటాన్ని ఎంజాయ్ చేయడం మొదలు పెడితే ఈ [సంగీతం] ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని బాధ పెట్టలేదు. మీ సంతోషానికి మీరే యజమాన్ అవ్వాలి. ఒంటరిగా ఉండడం నేర్పుకున్న వ్యక్తికి ఒక సూపర్ పవర్ వస్తుంది. అదే [సంగీతం] క్లారిటీ ప్రపంచంఅంతా గందరగోళంలో ఉన్నప్పుడు మీరు మాత్రం చాలా ప్రశాంతంగా మీ లక్ష్యం వైపు అడుగులు వేయగలరు.
(03:34) గొప్ప గొప్ప ఆవిష్కరణలు, గొప్ప గొప్ప [సంగీతం] అద్భుతమైన కళాకాండాలు, చరిత్రను మార్చిన ఆలోచనలన్నీ ఏకాంతంలో పుట్టినవే. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ మైండ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అనవసరమైన రిలేషన్స్ నుంచి మీరు బయటపడతారు. ఎవరు మీకు అవసరమో ఎవరు మీ ఎదుగుదలకు తోడుపడతారో మీకు క్లారిటీ వస్తుంది. మీరు ఒంటరిగా ఉండడం అంటే సమాజాన్ని వదిలేయడం కాదు.
(03:57) సమాజంలో ఉంటూనే మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ఉండటం. మీ విలువ మీకు తెలిసినప్పుడు ఇతరులు మిమ్మల్ని గౌరవించడం మొదలు పెడతారు. మీ జీవితం ఒకరి మీద ఆధారపడి లేదు అనే స్పృహ మీకు వచ్చిన రోజున మీరు నిజమైన స్వేచ్ఛని అనుభవిస్తారు. రేపటి గురించి భయం ఉండదు. నిన్నటి గురించి బాధ ఉండదు. కేవలం ఈ క్షణం మీ లక్ష్యం మాత్రమే మీకు కనిపిస్తుంది.
(04:20) ఇప్పటివరకు మీరు ఇతరుల కథల్లో ఒక పాత్రలా బతికారు. ఇక నుంచి మీ జీవితం అనే పుస్తకానికి మీరే ఒక రచయిత అవ్వండి. మీరు ఏకాంతాన్ని మీ ఎదుగుదలకి ఇంధనంగా మార్చుకోండి. ఆ పవర్ మీలోనే ఉంది. ఈరోజే ఇప్పుడే ఈ ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆలోచించండి. మీ గురించి మీకు తెలిసినంత ఈ ప్రపంచంలో ఎవరికైనా తెలుసా? లేదు కదా మరి మీ గురించి మీకే తెలియాలంటే మీరు మీతో గడపాలి కదా.
(04:45) ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే కచ్చితంగా లైక్ చేయండి. [సంగీతం] [సంగీతం]
No comments:
Post a Comment