Thursday, June 25, 2026

అంబుబాచి మేళా రహస్యం | కామాఖ్య దేవాలయం రహస్యం! 😱 #ambubachimela #shortsfeed #facts #telugufacts

అంబుబాచి మేళా రహస్యం | కామాఖ్య దేవాలయం రహస్యం! 😱 #ambubachimela #shortsfeed #facts #telugufacts

Author Name:Maro Prapancham

Youtube Channel Url:https://www.youtube.com/@maro_prapancham

Youtube Video URL:https://www.youtube.com/watch?v=fZ_gdTEVBHw



Transcript:
(00:00) కుంభ మేళ గురించి మీకు తెలుసు కానీ ప్రతి సంవత్సరం జరిగే అంబూబాచి మేళ గురించి మీకు తెలుసా? ఈ గుడి అస్సం రాష్ట్రంలోని గౌహతి అనే సిటీలో ఉన్న నీల్చ అనే ఒక కొండ మీద ఉంది. ఆ గుడిలో పూజించేది ఒక మహిళ యొక్క యోని ఆకారంలో ఉండే ఒక శిల. ఇది చూడటానికి ఒక రాయి ఆకారంలో ఉంటుంది. ప్రతి సంవత్సరం జూన్ నెలలో మూడు రోజులు మాత్రమే ఆ రాయితో చేసిన యోని నుండి ఒక ఎర్రడి ద్రవం కారుతుంది.
(00:21) ఆ యోనిలో నుండి ఆ లిక్విడ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది సైంటిస్టులకు కూడా తెలియని ఒక పెద్ద రహస్యం. ఈ లిక్విడ్ ని ఆ దేవత యొక్క పీరియడ్స్ గా భావిస్తారు. అలా ఎందుకు జరుగుతుంది అనే సైంటిఫిక్ రీజన్ లేదు. ఆ దేవత యొక్క మాన్స్ట్రుేషన్ ని సెలబ్రేట్ చేసే ఏకైక ఆలయం ఇదే. ఆ సమయంలో ఆ గుడిని మూడు రోజులు క్లోజ్ చేస్తారు. అటువైపు చీమ కూడా పోకుండా సెక్యూరిటీస్ ఇబ్బంది కాపులాగా పెడతారు.
(00:39) నాలుగో రోజు ఆ గుడి తలుపులు తెరవడానికి లక్షల మంది ఆ గుడికి వస్తారు. దేశంలో ఉన్న 51 శక్తిపీఠాల్లో అతి ముఖ్యమైన శక్తిపీఠం ఇదే. ఈ గుడి యొక్క స్థల పురాణం ఏంటంటే దక్ష ప్రజాపతికి ఒక కూతురు ఉంది. ఆమె పేరు సతి. సతికి శివుడు అంటే చాలా ఇష్టం. ఒకరోజు దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తూ ఉంటాడు. ఆ యజ్ఞానికి శివుడిని తప్ప దేవతలందరిని పిలుస్తాడు.
(00:57) ఎందుకంటే శివుడు స్మసానాల్లో తిరుగుతాడు, బూడిది పూసుకుంటాడు, బట్టలు వేసుకోకుండా పులి చర్మం కప్పు ఉంటాడు, బూతు గణాలతో ఉంటాడు. రాచరిక మర్యాద అనేది పాటించడు. అని దక్ష ప్రజాపతికి శివుడు అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు శివుడు గురించి దక్ష ప్రజాపతి చాలా చులకనగా మాట్లాడుతాడు. అది అవమానంగా భావించి దక్ష ప్రజాపతి కూతురైన సతి ఆ యజ్ఞంలో దూకి ఆత్మహత్య చేసుకుంటది.
(01:15) ఇది తెలుసుకొని శివుడు అక్కడికి వచ్చి సతి శరీరాన్ని భుజాన్ని వేసుకొని బాధతో విశ్వం అంతా తిరుగుతూ ఉంటాడు. అప్పుడు ఈ శివుడి యొక్క దుఃఖం వల్ల విశ్వంలో అసమతులత ఏర్పడుతుంది. దానివల్ల లోకంలో చాలా దారుణాలు జరుగుతాయి. సృష్టి యొక్క సమతుల్యత దెబ్బ తింటుంది. అప్పుడు దేవతలు వెళ్లి విష్ణువుని ప్రార్థిస్తారు. విష్ణువు తన సుదర్శన చక్రంతో సీతదేవి శరీరాన్ని కండకండాలుగా చేస్తాడు.
(01:35) అప్పుడు ఆ సతి యొక్క దేహం 51 ముక్కలుగా విడిపోయి ముక్కలన్నీ కూడా ఇండియాలోనే పడతాయి. అలా పడిన ముక్కల్లో ఆ సతి యొక్క యోని భాగం అస్సాం రాష్ట్రంలోని గౌహవతి అనే సిటీలో ఉన్న నీల్చ అనే ఒక కొండ మీద పడిపోతుంది. అప్పటి నుండి యోని నుండి సంవత్సరంలో మూడు రోజులు ఎర్రడి ద్రవం కారుతుంది. ఇప్పటి వరకు ఆ ఎర్రటి ద్రవం ఎందుకు వస్తుంది అని శాస్త్రవేత్తలు కూడా ఆ గుడిలోకి ఎంటర్ కానివ్వలేదు.
(01:53) అయితే కొంతమంది శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ఆ ప్రాంతంలో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే అక్కడ ఉన్న మట్టిలో ఉన్నటువంటి ఖనిజాలు నీటిలో కలవడం వల్ల ఈ ఎర్రటి రంగు రావచ్చని చెప్తున్నారు. అలాగే మెర్క్యూరీ సల్ఫేడ్ అనే ఒక సహజమైనటువంటి ఖనిజం ఎరుపు రంగులోనే ఉంటుంది. అది నీటితో కలవడం వల్ల ఎర్రటి రంగుతో ఉన్నటువంటి ఒక లిక్విడ్ ప్రవహిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు.
(02:12) ఇది కేవలం ఒక థియరీ మాత్రమే. ఈ కామాఖ్య ఆలయ గర్భ గుడిలోని పవిత్ర స్థలానికి అందరికీ ప్రవేశం ఉండదు. కాబట్టి స్వతంత్రంగా కొంతమంది శాస్త్రవేత్తలు ఇక్కడికి వచ్చి పరిశోధన చేయడం చాలా కష్టం. రేడియో కార్బన్ టెస్టింగ్ ప్రకారం ఈ ఆలయం 2200 సంవత్సరాల పురాతనమైంది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ గుడి ఉదయాన్నే 5:30ర గంటలకు ఓపెన్ చేస్తారు.
(02:29) రాత్రి 10 గంటలకలా క్లోజ్ చేస్తారు. ఈ గుడి దగ్గరికి మీరు వెళ్ళాలంటే అక్టోబర్ మార్చ్ నెలలో చాలా మంచి సమయం. జూన్ లో వెళ్తే ప్రతి సంవత్సరం జూన్ లో అంబుచి మేళ జరుగుతుంది లక్షల్లో జనాలు వస్తారు కాబట్టి అప్పుడు కొంచెం మీరు ఇబ్బంది పడతారు. ఈ అంబుచి మేళాకి శక్తులు సంపాదించడానికి ధ్యానం చేయడానికి ఆ సమయంలో అఘోరీలు, తాంత్రిక సాధకులు, శక్తి ఉపాసకులు పెద్ద సంఖ్యలో వస్తారు.
(02:48) ఆ సమయంలో చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తే వాళ్ళ కుటుంబాలకు మంచి జరుగుతుంది అని వాళ్ళ ఇంట్లో ఉండే ఆడపిల్లలకు మంచి జరుగుద్ది అని చెప్పేసి నమ్ముతారు. మరి ఈ కామాక్షి దేవి టెంపుల్ గురించి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

No comments:

Post a Comment