Monday, June 15, 2026

 శ్లోకం:

కురంగ మాతంగ పతంగ భృంగ, మీనా హతాః పంచభిరేవ పంచ ఏకః ప్రమాదీ స కథం న హన్యతే, యస్సేవతే పంచభి రేవ పంచ

గరుడపురాణం

భావం:

కురంగము (లేడి): శబ్దము అనే ఒకే ఒక ఇంద్రియ బలహీనత (సంగీతానికి లొంగిపోవడం) వల్ల వేటగాడికి చిక్కుతుంది.

మాతంగము (ఏనుగు): స్పర్శ అనే బలహీనత వల్ల ఆడ ఏనుగు బొమ్మను తాకబోయి గోతిలో పడి బంధించబడుతుంది.

పతంగము (శలభము/మిడత): రూపము (వెలుతురు) పై మోజుతో

అగ్ని వైపు దూకి ప్రాణాలు కోల్పోతుంది.

భృంగము (తుమ్మెద): వాసన (సువాసన) కు లోబడి తామరపువ్వులో బంధీ అయి ప్రాణాలు విడుస్తుంది.

మీనము (చేప): రుచి అనే ఏకైక బలహీనత వల్ల గాలానికి ఉన్న ఎరను మింగి ప్రాణాలు పోగొట్టుకుంటుంది.

ముగింపు:

కేవలం ఒక్కొక్క ఇంద్రియ చాపల్యం వల్లే ఈ ఐదు ప్రాణులు నాశనమైపోతున్నాయి. మరి ఈ ఐదు ఇంద్రియాల (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాల) వలలో చిక్కుకుని, వాటిని అనుభవిస్తూ ప్రమాదంలో ఉన్న సాధరణ మానవుడు ఎలా నాశనం కాకుండా తప్పించుకోగలడు? (అంటే ఇంద్రియ నిగ్రహం చాలా అవసరం అని దీని అర్థం).

No comments:

Post a Comment