Saturday, June 27, 2026

*కర్మ అనుభవించే తీరాలి ఐతే?* *పూజలు, హోమాలు, అభిషేకాలు ఎందుకు?*

 *కర్మ అనుభవించే తీరాలి ఐతే?*

*పూజలు, హోమాలు, అభిషేకాలు ఎందుకు?* 


*బయట ఎండ ఉన్నప్పుడూ మీరు పనిమీద వెళ్ళాలి అనుకున్నప్పుడు , 

గొడుగు వేసుకుని వెళతారు. 

తక్కువ శ్రమ అనుభవిస్తారు. 

వాన ఉన్నప్పుడూ అంతే. తక్కువగా తడుస్తారు.మీరు వేసుకునే గొడుగు ఎండను కానీ, వానను కానీ, ఆపేసిందా ?లేదు కదా ??*

కానీ మీ వరకూ... ఉపశమనాన్ని ఇచ్చిందా ? లేదా ?? గొడుగు వేసుకోవడానికి సరిపడ్డా భాగ్యం మీకున్నప్పుడే , మీకు ఆ ఆలోచన తడుతుంది, గొడుగూ దొరుకుతుంది.

పూజలూ, హోమాలు చేయడం అన్నది.. కర్మను తగ్గించే మార్గాలు, అంతే...అవి చేయడానికీ, 

ఆ ఆలోచన రావడానికీ రెండింటికీ, మీకు ప్రాప్తం ఉండాలి. ఈ ప్రాప్తం భాగ్యం నుంచే వస్తుంది.

కర్మ అనుభవించే తీరాలి..కానీ ఎంత మోతాదు లో ? దీన్ని బట్టే, మీకు పూజలు కానీ అభిషేకాలు కానీ చేస్తే వచ్చే ఫలితం ఉంటుంది.దేవునికి అన్నీ తెలుసు... ఆయన అన్నీ సరయిన సమయంలోనే, సరయిన మోతాదులోనే ఇస్తారు. మనకు అర్థం కాకపోవడం వల్లనే ఇలాంటి ఆలోచనలు వస్తాయి.*           *ఆధ్యాత్మిక కుటుంబం*                        

No comments:

Post a Comment