Monday, June 15, 2026

 *🕉️🙏హృదయార్పణం🕉️🙏*
                  
🔱🛐సాధన ఆరాధన -  వ్యాసం 🕉️⚜️


*🕉️🙏మనిషి తనకు* *మానవజన్మ ప్రసాదించిన* *భగవంతుడికి అనేక* *విధాలుగా పూజలు చేస్తుంటాడు...🕉️🙏*

*🕉️🙏పూజా సమయంలో యథాశక్తి తనకు ఉన్నంతలో పత్రమో,పుష్పమో,ఫలమో,*
*జలమో సమర్పించుకుంటూ ఉంటాడు.*🕉️🙏

*🕉️🙏ఈ విధంగా సమర్పించడం కృతజ్ఞతా సూచకం అయితే కావచ్చునేమోగానీ, అసలు మనిషి భగవంతుడికి సమర్పించగల శక్తిమంతుడేనా❓ 🕉️🙏*

*🕉️🙏ఇలా ఆలోచిస్తే, ఎంతమాత్రం కాదని చెప్పవచ్చు.🕉️🙏*

*🕉️🙏భగవంతుడిదే ఈ యావత్‌సృష్టి. అలాంటివాడికి భక్తుడు ఇచ్చే కానుకలు అత్యల్పమైనవే.🕉️🙏*

*🕉️🙏కానీ ఏదో ఒకటి సమర్పించకపోతే భక్తుడి మనసు వూరుకోదు.🕉️🙏*

*🕉️🙏పూర్వం ఒక యోగి భగవంతుణ్ని అర్చించడానికి సిద్ధమయ్యాడు.🕉️🙏*

*🕉️🙏అప్పుడు అతడిలో వివేకం ఉదయించింది.🕉️🙏*

*🕉️🙏పూజలో ఒక్కొక్క ఉపచారాన్నీ చేస్తూ భగవంతుడితో ఇలా విన్నవించుకున్నాడు- 'పరమేశ్వరా!🕉️🙏*
*🕉️🙏నీవు బ్రహ్మాండమంతా నిండిఉన్నావు. కనుక నిన్ను ఎలా ఆవాహన చేయాలా ❓*

*🕉️🙏అన్నింటికీ ఆధారమై నీవు ఉండగా నీకు ఆసనం ఎక్కడ వేయాలి ❓*

*🕉️🙏నిరంతరం స్వచ్ఛంగా ఉండే నీకు కాళ్లు కడుక్కోవడానికి నీళ్లెందుకు❓🕉️🙏*

*🕉️🙏పరిశుద్ధుడవైన నీకు ఆచమనం అవసరమా❓🕉️🙏*

*🕉️🙏నిత్య నిర్మలుడవైన నీకు స్నానం ఎలా చేయించాలి❓🕉️🙏*

*🕉️🙏ప్రపంచమంతా నీలోనే ఉండగా నీకు వస్త్రం ఎలా ధరింపజేయాలి❓🕉️🙏*

*🕉️🙏గోత్ర వర్ణాలకు అతీతుడవైన నీకు యజ్ఞోపవీతం అవసరమా ❓🕉️🙏*

*🕉️🙏ఏ లేపనాలూ అవసరం లేని నీకు గంధం ఎలా పూయాలి? 🕉️🙏*

*🕉️🙏నిత్య పరిమళుడవైన నీకు పూలు పెట్టడం ఎందుకు ❓🕉️🙏*

*🕉️🙏మహిమతోనే వెలిగిపోయే నీకు ఆభరణాలు తొడగాలా❓🕉️🙏*

*🕉️🙏నిరంజనుడవైన నీకు ధూపం వేయడం సరి అయినదేనా❓🕉️🙏*

*🕉️🙏జగత్తుకే సాక్షిగా నిలిచిన నీకు దీపం అవసరమా❓🕉️🙏*

*🕉️🙏నిజమైన ఆనందంతో నిలిచే నీకు నైవేద్యం ఎందుకు❓ 🕉️🙏*

*🕉️🙏విశ్వానికే👏 ఆనందాన్ని అందించే నీకు తాంబూలాన్ని అర్పించి సంతృప్తిపరచగలనా❓🕉️🙏*

*🕉️🙏అంతమే లేకుండా అంతటా వ్యాపించిన నీకు ప్రదక్షిణం ఎలా చేయాలి❓🕉️🙏*

*🕉️🙏అద్వయుడవైన నీకు నమస్కారం ఎలా చేయాలి❓🕉️🙏*

*🕉️🙏వేదాలే నిన్ను స్తుతించడానికి శక్తి చాలనివి అవుతుంటే నేను నిన్ను ఎలా స్తుతించాలి❓'🕉️🙏*

*🕉️🙏ఈ పలుకుల్లో నిజం లేకపోలేదు. 🕉️🙏*

*🕉️🙏భగవంతుడి ముందు ఎంతటి మానవోత్తముడైనా అత్యల్పుడే. 🕉️🙏*

*🕉️🙏వీడి శక్తి భగవంతుడి ముందు పరిగణనలోకి రానే రాదు.🕉️🙏* 

*🕉️🙏అయినా భగవంతుడు మనిషి చేసే పూజలను స్వీకరిస్తున్నాడంటే ఆయన అపార కారుణ్యం వర్ణించలేనిది.🕉️🙏*

*🕉️🙏నిజంగా భగవంతుడు మనిషి నుంచి కోరేవి సంపదలు కావు.*
*వస్తువులు అంతకన్నా కావు.🕉️🙏* 

*🕉️🙏ఆయన మనిషి నుంచి హృదయార్పణను కోరతాడు.* 
*భక్తితో స్మరిస్తే చాలునంటాడు.*🕉️🙏

*🕉️🙏కానీ మనిషి 'మనసు' చంచలం. చపలం. స్థిరంగా ఒకచోట ఉండదు.* 
*లౌకిక లంపటాల వల్ల భగవంతుడిపై లగ్నం కాదు.🕉️🙏* 

*🕉️🙏అందుకే.......*
*శంకరభగవత్పాదులు...*

*🕉️🙏'ఓ పరమేశ్వరా!*
*నా మనసు ఒక కోతి వంటిది.*🕉️🙏

*🕉️🙏అది ఎప్పుడూ సంసారవాంఛ అనే అడవిలో తిరుగుతూ ఉంటుంది.*🕉️🙏

*🕉️🙏భార్యాపుత్రుల ప్రేమ అనే చెట్టుకొమ్మను పట్టుకొని వేలాడుతూ ఉంటుంది.🕉️🙏*

*🕉️🙏క్షణం తీరిక లేకుండా అటూ ఇటూ పరుగులు తీస్తుంటుంది.*🕉️🙏

*🕉️🙏అందువల్ల నా మనసు అనే కోతిని నీకు అర్పిస్తున్నాను.🕉️🙏*

*🕉️🙏దాన్ని తాడుతో గట్టిగా కట్టి నీ అధీనంలో ఉంచుకో' అని ప్రార్థిస్తారు.*🕉️🙏 

*🕉️🙏సామాన్య భక్తులను* *తరింపజేయడానికి* *ఆయన చేసిన విన్నపం ఇది.🕉️🙏*

*🕉️🙏ఓ పరమేశ్వరా!* *బంగారుకొండ* *మేరుపర్వతమే నీ చేతిలో ఉంది. అపార ధనవంతుడైన కుబేరుడు  నీ పాదదాసుడై ఉన్నాడు.*🕉️🙏

*🕉️🙏కల్పవృక్షం, కామధేనువు, చింతామణి నీ ఇంటిలోనే ఉన్నాయి.*🕉️🙏

*🕉️🙏షోడశ కళలను కురిపించే చంద్రుడు అమృతాన్ని వర్షిస్తూ నీ తలపైనే ఉన్నాడు.*🕉️🙏

*🕉️🙏సమస్త మంగళాలనూ కలిగించే పార్వతీదేవి సర్వమంగళయై నీ పక్కనే ఉంది.*🕉️🙏

*🕉️🙏కనుక నీకు నేనేమీ ఇవ్వలేను.* 🕉️🙏

*🕉️🙏నా దగ్గర ఉన్నది ఒక్క 'మనసే'.*🕉️🙏 

*🕉️🙏అది నీకు సమర్పిస్తున్నాను!'* 🕉️🙏

*🕉️🙏అని హృదయాన్ని అర్పిస్తే భగవంతుడు ఎంతో ఇష్టపడతాడు.🕉️🙏*

*🕉️🙏అచంచల విశ్వాసం, అకుంఠిత భక్తి, అన్నింటినీ నివేదించగల మనసు ఉంటే చాలు.🕉️🙏*

*🕉️🙏భగవంతుడు ఏ రూపంలో ఉన్నా పూజల్ని అందుకుంటాడు.🕉️🙏*

*🕉️🙏అట్టహాసాలు, ఆర్భాటాలు నిజమైన పూజలు కావు.🕉️🙏*

*🕉️🙏హృదయార్పణమే పూజ. 🕉️🙏*

*🕉️🙏నిశ్చల ధ్యానమే భక్తి.🕉️🙏*

*🕉️🙏అంతేకానీ లోకమంతా చూడాలని చేసే నటనలు పూజలు కావు. ఈ సత్యాన్ని మనిషి గ్రహిస్తే మేలు!🕉️🙏*                         
                       

 *🕉️🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🕉️🙏*

No comments:

Post a Comment