*కనువిప్పు కలిగించే సందేశం.....*
*వివాహం అనంతరం తొలిసారి పుట్టింటికి వచ్చిన కుమార్తెకు వారంరోజుల పాటు ఎంతో ఆప్యాయంగా స్వాగతం పలికారు. ఆ వారం రోజులూ అమ్మాయికి నచ్చినవే అన్నీ చేశారు. తిరిగి అత్తింటికి వెళ్తున్నప్పుడు తండ్రి ఒక ఎంతో సువాసనగల అగరబత్తుల ప్యాకెట్‌ను ఆమెకు ఇస్తూ ఇలా అన్నాడు — “బిడ్డా, నువ్వు అత్తింట్లో పూజ చేసేటప్పుడు ఈ అగరబత్తిని తప్పకుండా వెలిగించు.”*
*అప్పుడు తల్లి చెప్పింది — “మొదటిసారి పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్తున్న కూతురికి అగరబత్తులాంటి వస్తువు ఇస్తారా.?”*
*అంతలోనే తండ్రి జేబులో చేయి వేసి, తన దగ్గర ఉన్న డబ్బంతా కూతురి చేతిలో పెట్టాడు.*
*అత్తింటికి చేరుకున్న తర్వాత, కోడలికి పుట్టింటి వారు ఏమిచ్చారో అని అత్తగారు చూసారు అందులో ఆ అగరబత్తుల ప్యాకెట్ కూడా కనిపించింది. అప్పుడు ఆమె ముఖం చిట్లిస్తూ — “సరే, రేపు పూజలో ఇవి వెలిగించు” అని* *చెప్పింది.*
*మరుసటి ఉదయం అమ్మాయి పూజకు కూర్చొని అగరబత్తుల ప్యాకెట్ తెరిచింది అందులో ఒక చిన్న లేఖ కనిపించింది.*
*ఆ లేఖలో ఇలా వుంది…*
*“బంగారం… ఈ అగరబత్తి తాను కాలిపోతూ కూడా మొత్తం ఇంటిని సువాసనతో నింపుతుంది. అంతేకాదు, చుట్టుపక్కల వాతావరణాన్నీ పరిమళభరితంగా, ఆనందంగా మారుస్తుంది.!!*
*ఎప్పుడైనా నీకు భర్తపై కోపం రావచ్చు, కొన్నిసార్లు అత్తమామలపై మనసు నొచ్చుకోవచ్చు మరికొన్ని సందర్భాల్లో మరిది, మరదళ్లపై కూడా అలక రావచ్చు కొన్నిసార్లు ఎవరో చెప్పిన మాటలు నిన్ను బాధించవచ్చు, లేదా పొరుగువారి ప్రవర్తనతో నీ మనసు కలత చెందవచ్చు అలాంటి ప్రతి సమయంలో నా ఈ కానుకను గుర్తు పెట్టుకో…*
*ఈ అగరబత్తిలా నీవూ కాలిపోతూ, నీ బాధలను భరించుకుంటూ, అత్తింటినే నీ పుట్టింటిలా భావించి, నీ ప్రవర్తనతో, నీ మంచితనంతో ఆ ఇంటిని పరిమళభరితంగా, ఆనందభరితంగా మార్చు…”*
*ఆ లేఖ చదివిన కూతురు ఆపుకోలేక బిగ్గరగా ఏడవసాగింది అత్తగారు పరుగెత్తుకుంటూ వచ్చారు. భర్త, మామగారు కూడా పూజగదిలోకి వచ్చారు.*
*“ఏమైంది? చేతికి ఏమైనా కాలిందా?” అని భర్త అడిగాడు “ఏమైందో చెప్పమ్మా?” అని మామగారు అన్నారు. అత్తగారు చుట్టూ ఏదైనా సమస్య ఉందేమో అని చూసారు.*
*అప్పుడు తండ్రి అందమైన అక్షరాలతో రాసిన ఆ లేఖ ఆమె కంటపడింది లేఖ చదివిన వెంటనే అత్తగారు కోడలిని హత్తుకుని, ఆ లేఖను మామగారి చేతిలో పెట్టారు.*
*కళ్లజోడు లేకపోవడంతో మామగారు ఆ లేఖను తన కుమారుడితో చదివించారు.*
*మొత్తం విషయం అర్థమైన వెంటనే ఆ ఇంట్లో ఉన్న అందరూ నిశ్శబ్దంగా మారిపోయారు.*
*అప్పుడు అత్తగారు అన్నారు — “ఈ లేఖకు వెంటనే ఫ్రేమ్ వేయించాలి మా కోడలికి వచ్చిన అత్యంత విలువైన కానుక ఇదే పూజగది పక్కనే దీనిని పెట్టాలి.” ఆ తరువాత ఆ ఫ్రేమ్‌లోని ఆ మాటలు, వాటి అర్థం, ఆ ఇంటినే కాదు… చుట్టుపక్కల వాతావరణాన్నీ ఎప్పటికీ పరిమళభరితంగా ఉంచాయి… అగరబత్తుల ప్యాకెట్ అయిపోయిన తరువాత కూడా… మీరు కూడా మీ కుమార్తెకు ఇలాంటి సంస్కారాలను ఇవ్వాలనుకుంటారా.? నేను సేకరించి మీకు పెడుతున్న నచ్చితే మీ ఆత్మీయులకు పంపండి... ఎవరి ఇల్లు అయినా పరిమళభరితంగా మారవచ్చు.*
*సమస్త తల్లిదండ్రులకు మరియు పూర్వీకులకు అంకితం... కూతుళ్లు రెండు కుటుంబాలను పరిమళభరితం చేస్తారు.*
*┈┉┅━❀꧁ బంధం ꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🍁🙋🏻♂️🍁 🙏🕉️🙏 🍁🙋🏻♀️🍁
No comments:
Post a Comment