Saturday, June 13, 2026

ఈ బాధలు ఈ కష్టాలు అన్ని అబద్ధాలు | The Cosmic Illusion of Pain | Satyagrahi

ఈ బాధలు ఈ కష్టాలు అన్ని అబద్ధాలు | The Cosmic Illusion of Pain | Satyagrahi

Author Name:Satyagrahi

Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=KFh8sFUzJdQ



Transcript:
(00:01) [సంగీతం] మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక పులి మిమ్మల్ని తరుముతుంది అనుకోండి అప్పుడు మీకు భయంతో వళ్ళంతా చమటలు పడతాయి. గుండె శబ్దం మీకే వినపడేంత వేగంగా కొట్టుకుంటుంది. ప్రాణం పోతుందనే భయంతో అరుస్తూ లేస్తారు. కానీ కళ్ళు తెరిచాక అక్కడ పులి లేదు ఏమీ లేదు. అది కేవలం ఒక కల అని తెలిసి అమ్మయ్య అని చెప్పేసి ఊపురు పిలుచుకుంటారు.
(00:27) నిజం చెప్పండి ఆ కలలో ఉన్నంత సేపు అది కల అని మీకు తెలుసా? తెలిీదు కదా అది 100% నిజమే అని చెప్పేసి నమ్మారు కదా ఆ భయం నిజం ఆ చెమటలో నిజం. మరి ఇప్పుడు మీరు కళ్ళు తెరిచి చూస్తున్న ఈ జీవితం కూడా ఒక పెద్ద కల మాత్రమేనని ఎప్పుడైనా ఆలోచించారా? పరమహంస యోగానంద్ గారు ఒక అద్భుతమైన మాట చెప్తారు. ఈ ప్రపంచం అనేది దేవుడు నిర్మించిన ఒక కాస్మిక్ మోషన్ పిక్చర్ అంటే ఒక సినిమా అనమాట.
(00:54) మనం నిద్రలోకి అనేది వ్యక్తిగత కల అయితే మనం మేల్కొని చూసే ఈ జీవితం భగవంతుడి కల. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే మనం ఈ సినిమాని ఈ కలని అతిగా నమ్మేస్తున్నాం. స్క్రీన్ మీద పులు వస్తే నిజంగానే భయపడి చచ్చిపోతున్నాం. స్క్రీన్ మీద లాభం వస్తే ఎగిరి గంతేస్తున్నాం. నష్టం వస్తే కుప్పకూలిపోతున్నాం. ఈ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న అవమానాలకి బ్యాంకు ఈఎంఐ బాధలకి విపరీతంగా కురింగిపోతున్నాం.
(01:20) ఈ ఆఫీస్ టెన్షన్లు అవ్వచ్చు ఈ చుట్టాల గొడవలు అవ్వచ్చు ఈ ఆస్తుల పంపకాలు అవ్వచ్చు ఇవే శాశ్వతం అనుకొని చచ్చిపోతున్నాం. కానీ నిజం అనేది ఒకటి ఉంటుంది. ఆ నిజం ఏంటంటే మీరు పడుతున్న ఈ అంతర్గత సంఘర్షణ అంతా ఒక భ్రమ. చాలా మంది అనుకుంటారు నేను చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నాను అని. కానీ నిజానికి మీరంతా ఒక నిరంతర ఆందోళనలో బ్రతుకుతున్నారు.
(01:43) ఎందుకంటే మీరు చూస్తున్న ఈ ప్రపంచమే నిజమని గట్టిగా ఫిక్స్ అయిపోయారు. ఇక్కడ గెలిస్తేనే నా లైఫ్ సక్సెస్ ఇక్కడ ఓడిపోతే నా బతుకు వేస్ట్ అని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. పరమహంస యోగానంద గారి జీవితంలో ఒక విషయాన్ని పదే పదే గుర్తు చేశారు. మనం ఒక థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తున్నప్పుడు అక్కడ స్క్రీన్ మీద ఒక ఇల్లు తగలబడిపోతూ ఉంటుంది.
(02:04) ఆ మంటలు చూసి థియేటర్లో కూర్చొని మీరు ఏడుస్తారా? అక్కడ ఇల్లు కాలిపోతుందని చెప్పేసి నెత్తి నోరు బాధుకుంటారా లేదు కదా ప్రశాంతంగా పాప్కార్న్ తింటూ చూస్తారు. ఎందుకు అది కేవలం కాంతి కిరణాల ఆట అని మీకు తెలుసు కాబట్టి అంటే అది కేవలం సినిమా అని మీకు తెలుసు కాబట్టి కానీ మీ సొంత జీవితంలో ఒక చిన్న సమస్య రాగానే ఎందుకు అలా ఏడుస్తున్నారు ఎందుకంటే ఈ డ్రామాలో మీరు కేవలం క్యారెక్టర్ అని మర్చిపోయి ఆ క్యారెక్టరే నేను అని చెప్పేసి లీనమైపోయారు.
(02:30) అదే మీ జీవితంలో ఉన్న అతి పెద్ద సమస్య. మీరు ఎప్పుడైనా గమనించారా ఒక నటుడు స్టేజ్ మీదకు వచ్చి పిచ్చోళ్ళు యాక్ట్ చేస్తాడు. ఆ క్యారెక్టర్ లో పడిపోయి ఏడుస్తాడు నవ్వుతాడు అందరిని తిడతాడు. కానీ నాటకం అయిపోగానే ఆ మేకప్ తీసేసి ప్రశాంతంగా ఇంటికి వెళ్లి పడుకుంటాడు. ఎందుకంటే తను వేసేది ఒక వేషం మాత్రమే అని తెలుసు. కానీ మీరు ఏం చేస్తున్నారో తెలుసా? ఈ జీవితం అనే నాటకంలో మీకు ఇచ్చిన క్యారెక్టర్ ని మీ ఒంటికి పూర్తిగా పూసేసుకుంటున్నారు.
(02:56) ఆఫీస్ లో బాస్ తిట్టగానే మీ ఆత్మగౌరవం దెబ్బతిన్నట్లు ఫీల్ అయిపోతున్నారు. మామూలు ఫీలింగ్ కాదు వ్యాపారంలో నష్టం రాగానే మీ జీవితమే ముగిసిపోయినట్లు లబోది అంటారు. మళ్ళీ ఇంకో వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు లేకపోతే ఏదో చిన్న పని చేసుకొని ప్రస్తుతానికి జీవితాన్ని సెట్ చేసుకొని ఆ తర్వాత ఇంకో వ్యాపారం చేయొచ్చు.
(03:16) కానీ అది చేయకుండా లబోది ఇవ్వమంటూ ఉంటారు. నిజం ఏంటంటే మీరే ఒక పెద్ద బ్రమలో బ్రతుకుతున్నారు. పరమహంస యోగానంద్ గారు ఒక బ్లైండ్ స్పాట్ ని బయట పెడతారు. మనుషులు తాము అనుభవిస్తున్న దుఃఖాన్ని చూసి ఏడుస్తారు కానీ ఆ దుఃఖం వెనుకున్న అజ్ఞానాన్ని చూడరు. మీరు ఈ భూమి మీద పడే తాపత్రాయం అంతా దేనికోసం ఏదో ఒక పొజిషన్ సంపాదించాలి. నలుగురిలో గొప్పగా నిలబడాలి.
(03:40) ఇదే కదా కానీ ఈ పరుగులో మీరు మీ అసలు గుర్తింపుని మర్చిపోతున్నారు. మీరు కేవలం రక్త మాంసాలు ఉన్న ఈ శరీరం మాత్రమే కాదు మీరు ఈ కాస్మిక్ డ్రామాను చూస్తున్న ఒక సాక్షి కానీ ఆ సాక్షి స్థానాన్ని వదిలేసి స్క్రీన్ మీద పడుతున్న దెబ్బలన్నీ మీరే తినేస్తున్నారు. అందుకే ఈ నిరంతర ఆందోళన అందుకే ఈ మానసిక ఒత్తిడి. ఈ జనరేషన్ యువతను చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నవ్వవస్తుందన్నమాట.
(04:05) ఎందుకంటే చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ప్రపంచం అంతా వాళ్ళ వేళ్ళ మీద ఉంటుంది. కానీ మనసు మాత్రం చిన్న గాలి వానికే కొట్టుకుపోయే కాగితపు పడవలా ఉంటుంది. ఒక చిన్న బ్రేకప్ జరిగితే లోకం చీకటి అయిపోతుంది. బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు తగ్గితే గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఎందుకు ఈ బలహీనత ఎందుకంటే మీరు దేన్నైతే పట్టుకొని వేలాడుతున్నారో అది ఎప్పుడైనా కరిగిపోయే మంచు మొక్క అని మీకు తెలియదు.
(04:30) యోగానంద గారు చెప్పినట్లు ఈ సృష్టి అంతా లైట్ అండ్ షాడో గేమ్ వెలుగు ఉంటుంది, నీడ ఉంటుంది, లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. ఇవన్నీ ఈ సినిమా స్క్రిప్ట్ లో భాగమే. ఈ సత్యాన్ని గ్రహించకపోవడమే ఈరోజు మీకున్న అసలైన సమస్య. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనకి ఈ చిన్న చిన్న విషయాలకే ఎందుకు అంత భయం వేస్తుంది? ఎందుకు ప్రతి చిన్న అవమానానికి మన అహంకారం గాయపడుతుంది.
(04:55) ఎందుకు మనం ఈ ప్రపంచాన్ని ఇంత గట్టిగా నమ్ముతున్నాము? దానికి కారణం మన అటాచ్మెంట్ మన బంధాలు మన ఆశలు పరమహంస యోగానంద గారు దీనినే మాయ అంటారు. మాయ అంటే అదేదో మంత్రం కాదు ఉన్నదాన్ని లేనట్లు లేని దాన్ని ఉన్నట్లు చూపించే పెద్ద ఇల్యూజన్ ఈ మాయ ఏం చేస్తుందంటే మిమ్మల్ని మీ అసలు ఇంటిని మార్చేలా చేస్తుంది. మర్చిపోయేలా చేస్తుంది.
(05:20) ఒక రేడియో స్టేషన్ నుంచి వచ్చే పాటని రేడియో పెట్టి పాడుతుంది అనుకుంటే ఎంత మూర్ఖత్వమో మీ శరీరం మీ బుద్ధి మాత్రమే మీరు అనుకుంటే అంతకంటే పెద్ద మూర్ఖత్వం మరొకటి ఉండదు. నిజం ఏంటంటే మీ అహంకారం మిమ్మల్ని నిరంతరం మోసం చేస్తూనే ఉంటుంది. ఇది నా [సంగీతం] ఇల్లు ఇది నా ఉద్యోగం వీళ్ళు నా వాళ్ళు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత అని ఇలా ప్రతిదాన్ని పట్టుకొని నాది నాది అని లాక్కుంటుంది.
(05:43) యోగానంద్ గారు ఒక సూటి ప్రశ్న అడుగుతారు మీరు పుట్టినప్పుడు ఈ భూమ్మీదకి ఏమైనా తెచ్చారా? లేదు కదా మరి రేపు చనిపోయేటప్పుడు ఈ ఎమ్మెలని ఈ ఆస్తులని మీతో పాటు పట్టికెళ్తారా? మరి లేదు కదా మధ్యలో వచ్చిన ఈ కొద్దిపాటి కాలంలో అంతా నాది అని ఎందుకు అంత కొట్టు చేస్తున్నారు ఈ అజ్ఞానమే మీ దుఃఖానికి అసలైన కారణం అలా అని చెప్పేసి ఏ పని చేయకండి డబ్బులు సంపాదించుకోమాకండి ఈ భూమి మీద దుర్భరంగా బ్రతకండి అని కాదు మనకి ఎంత కావాలో మనకు తెలిసి ఉండాలి.
(06:15) మనకి ఏ టైం కి ఏం కావాలో తెలిసేంత జ్ఞానం మనలో ఉండాలి. మీరు దేన్నైతే శాశ్వతం అనుకుంటున్నారో అది రేపు ఉదయం కల్ల మాయమైపోవచ్చు. కానీ మీ మనసు ఆ సత్యాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలి కాకపోతే ఇక్కడ ఎవరికీ లేదు. ఈ రోజుల్లో 18 నుంచి 35 ఏళ్ల వయసున్న వాళ్ళని చూడండి సోషల్ మీడియాలో ఎవడో కారు కొన్నాడని వీడు డిప్రెషన్ లోకి వెళ్తాడు.
(06:36) ఎవడో కొత్తగా వచ్చిన ఐఫోన్ కొన్నాడని చెప్పేసి వీడు కొనాలని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. కానీ వాస్తవం ఏంటంటే పరమహంస యోగానంద గారు చెప్పేది అదే మీకు ఏం కావాలో మీరు నిర్ణయించుకోవాలి. ఇంకొకడిని చూసి మీరు నిర్ణయించుకుంటే అది మీ జీవితం ఎలా అవుతుంది ఇంకొకడిని చూసి మీరు ఇలా బ్రతకాలి అనుకుంటే అది మీ బ్రతుకు ఎలా అవుతుంది మనమందరం భగవంతుడు సృష్టించిన మనుషులం ఈ కాస్మిక్ ఎనర్జీలో మనందరం ఒక భాగం కానీ మనం మాత్రం ఒక చిన్న గుడిసలో కూర్చొని నేను పేదవాడిని అనాదిని అని ఏడుస్తూ బిచ్చగాడిలా బ్రతుకుతున్నాం.
(07:08) మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావడానికి మనకు భయం రిస్క్ తీసుకోవడానికి కూడా మనకి భయం ఎందుకంటే ఈ భ్రమల సామ్రాజ్యం ఎక్కడ కోలిపోతుందో అని మనందరి ఆందోళన ఈ భయమే మనల్ని జీవితాంతం ఒక ఖైదీలా ఉంచుతుంది. అందులోనూ మనుషులందరూ పడే ఇంకొక అతి పెద్ద భ్రమ ఉంది. అదేంటంటే తాము అనుభవిస్తున్న ఈ సుఖాలు ఈ విలాసాలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయని నమ్మడం.
(07:33) యోగానంద్ గారు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తారు. ఒక వ్యక్తి రాత్రి కల కంటున్నాడు. ఆ కలలో అతను ఒక పెద్ద సామ్రాజ్యానికి రాజయ్యాడు. కోటలు, గుర్రాలు, వజ్రాల కిరీటం వందల మంది సేవకులు అంతా అట్టహాసంగా ఉంది. అతను గర్వంతో ఊగిపోతున్నాడు. నేను రాజుని ఇదంతా నాదే అని చెప్పేసి అరుస్తున్నాడు. కానీ సరిగ్గా తెల్లవారు జామున నాలుగు గంటలకి అలారం మోగింది. అతను కళ్ళు తెరిచాడు.
(07:57) ఇప్పుడు ఎక్కడున్నాయి ఆ కోటలు [సంగీతం] ఎక్కడున్నాడు ఈ రాజు అక్కడ ఉన్నదల్లా ఒక చిరిగిన చాప ఒక చిన్న గది అతను రాజు కాదు కేవలం ఒక సామాన్యుడు నిజం ఏంటంటే ఇప్పుడు మీరు కూడా అలాగే బతుకుతున్నారు. మీకు ఉన్న అద్దిలు మీ ఆఫీస్ క్యాబిన్ మీ చేతిలో ఉన్న లేటెస్ట్ ఐఫోన్ ఇవన్నీ చూసుకొని మీరు ఇది నా సామ్రాజ్యం అని మురిసిపోతున్నారు.
(08:19) కానీ కాలం అనే అలారం మోగినప్పుడు మరణం అనే మేలుకొలుపు వచ్చినప్పుడు మీరు దేన్నైతే గట్టిగా పట్టుకుంటున్నారో అదంతా ఒక్క సెకండ్ లో గాలిలో కలిసిపోతుంది. సమస్య ఎక్కడ వస్తుందంటే మనం ఈ కలని శాశ్వతం అనుకుంటున్నాం. ఈ కలలో ఎదురయ్యే చిన్న చిన్న గొడవలకి నష్టాలకి మన ప్రాణాలు తీసేసుకుంటున్నాం. పక్కవాడు మనకంటే నాలుగఅడుగులు ముందుకు వేస్తే కుళ్ళితో చచ్చిపోతున్నాం.
(08:45) ఈ అహంకారం ఈ పోలికలు ఈ అసూయ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఎందుకంటే మనం ఒక తాత్కాలికమైన నాటక రంగాన్ని చూసి అదే శాశ్వతమైన ఇల్లు అని నమ్ముతున్నాం కాబట్టి మీరు ఎప్పుడైనా గమనించారా ఈ రోజుల్లో ప్రతి ఒక్కడు ఒక భద్రత కోసం వెతుకుతున్నాడు అంటే సెక్యూరిటీ కోసం నా లైఫ్ సేఫ్ గా ఉండాలి నా ఫ్యూచర్ సెక్యూరిటీ గా ఉండాలి. యోగానంద్ గారు అంటారు ఈ ప్రపంచంలో భద్రత అనేది ఒక పెద్ద అబద్ధం ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవ్వడు ఊహించలేడు.
(09:13) మీరు ఎంత దాచుకున్నా ఎంత ప్లాన్ చేసినా ఒక్క భూకంపం ఒక్క చిన్న వైరస్ లేదా ఒక్క హార్ట్ ఎటాక్ మీ ప్లాన్స్ అన్నిటిని తగలబెట్టి అవతలు పడేస్తాయి. కానీ ఈ తరం యువత ఏం చేస్తుందంటే ఆ అభద్రత భావాన్ని తట్టుకోలేక మరింతగా ఈ మాయలో మునిగిపోతుంది. మరింతగా డబ్బు సంపాదించాలి. మరింతగా ఆస్తులు కూడబెట్టాలని చెప్పేసి పరుగెడుతుంది. కానీ లోపల మాత్రం ప్రశాంతత లేదు నిరంతరం భయం ఎందుకంటే వాళ్ళు ఇసుకతో కోట కడుతున్నారు.
(09:40) ఆ కోట ఏ అలకి కింద పడిపోతుంది అని చెప్పేసి గుండెల్లో రైలు పరిగెడుతూనే కోటను కడుతున్నారు భయపడుతూ అది ఎప్పుడు పడిపోద్దో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. అలాంటప్పుడు కోట కడటం ఎందుకు భయపడటం ఎందుకు ఈ భయానికి ఈ ఆందోళనకి మూలం మీ లోపల ఉన్న అసలైన సత్యాన్ని మీరు తెలుసుకోలేకపోవడమే మరి ఈ మాయ నుంచి ఈ నిరంతర ఆందోళన నుంచి బయట పడటం ఎలా ఈ సినిమా చూస్తూనే అందులో మునిగిపోకుండా ఉండటం ఎలా పరమహంస యోగానంద్ గారు దీనికి చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ సొల్యూషన్ ఇచ్చారు.
(10:12) అదేంటంటే సినిమా థియేటర్లో కూర్చున్నప్పుడు స్క్రీన్ మీద మంటలు వచ్చినా వరదలు వచ్చినా ఎంతో ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే ఆ మంటలు మిమ్మల్ని కాల్చలేవని ఆ నీరు మిమ్మల్ని ముంచలేదని మీకు తెలుసు. మీరు కేవలం సీట్లో కూర్చొని చూసే ప్రేక్షకుడు మాత్రమే జీవితంలో కూడా సరిగ్గా అదే చేయాలి. మీకు వచ్చిన కష్టాన్ని, నష్టాన్ని, అవమానాల్ని, మీ స్క్రీన్ మీద పడుతున్న కాంతి కిరణాలుగా చూడటం నేర్చుకోండి.
(10:36) నాకు నష్టం వచ్చింది అనకండి. ఈ క్యారెక్టర్ కి ఇప్పుడు నష్టం వచ్చింది అనే సీన్ నడుస్తుందని అనుకోండి. ఎప్పుడైతే మీరు ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారో అప్పుడు భయం మాయమైపోతుంది. నిజం ఏంటంటే ఈ నిద్ర నుండి మేలుకోవడమే ఆధ్యాత్మిక ధ్యానం అంటే ఏదో మూల కూర్చొని కళ్ళు మూసుకోవడం కాదు ధ్యానం అంటే ఈ కాస్మిక్ మోషన్ పిక్చర్ వెనుకున్న ప్రొజెక్టర్ వెలుగుని చూడటం.
(10:59) యోగానంద గారు అంటారు ప్రతిరోజు కొద్దిసేపు నిశశబ్దంగా కూర్చోండి. మీ శ్వాసను గమనించండి. ఎందుకంటే ఈ శ్వేస ఆగినప్పుడు ఈ ప్రపంచంతో మీకున్న కనెక్షన్ కట్ అయిపోతుంది కాబట్టి మరి అంత తాత్కాలికమైన ఈ జీవితం కోసం రోజులో 24 గంటలు ఎందుకు టెన్షన్ పడతారు మీరు ప్రతిరోజు రాత్రి పడుకున్నప్పుడు ఏమవుతుంది మీ బ్యాంక్ అకౌంట్ అవ్వచ్చు మీ డిగ్రీలు అవ్వచ్చు మీ కుటుంబ సభ్యుల మధ్య ఉండే ఆప్యాయితలు అవ్వచ్చు లేకపోతే మీ శత్రువులు అవ్వచ్చు అన్నిటిని మర్చిపోయి శవలా పడి ఉంటారు కదా మరి రాత్రిపూట లేని బాధలు పగలు మాత్రం మిమ్మల్ని ఎందుకు అంతలా పీడిస్తున్నాయి ఎందుకంటే మీరు పగటి పూట
(11:36) కనే కలని అతిగా నమ్ముతున్నారు కాబట్టి ఈ కలని కలలా గుర్తించిన రోజే మీ బంధాలు అవ్వచ్చు మీ భయాలు అవ్వచ్చు [సంగీతం] అన్ని మంచులా కరిగిపోతాయి. ఈ జనరేషన్ కి ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. ఆధ్యాత్మికత అంటే బాధ్యతలు వదిలేసి అడవులోకి వెళ్ళిపోవడం అనుకుంటారు. యోగానంద గారు దాన్ని పూర్తిగా ఖండించారు. ఆయన ఏమంటారంటే నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు.
(11:58) నీ బాధ్యతలు నువ్వు 100% నెరవేర్చు కానీ ఎలా ఒక నటుడిలాగా ఒక నటుడు స్టేజ్ మీద రాజు వేషం వేస్తే డైలాగులకి ప్రాణం పెట్టి చెప్తాడు యుద్ధం గట్టిగా చేస్తాడు. కానీ మనసులో తను రాజు కాదని స్పృహ మాత్రం ఉంటుంది. అలాగే మీరు కూడా ఆఫీస్ కి వెళ్ళండి బిజినెస్ చేయండి డబ్బులు సంపాదించండి ఫ్యామిలీని చూసుకోండి కానీ ఇదంతా ఒక డ్రామా నేను కేవలం నా పాత్ర పోషిస్తున్నాను అనే క్లారిటీతో ఉండండి.
(12:25) లాభం వస్తే పొంగిపోవద్దు నష్టం వస్తే కుప్పకోలిపోవద్దు [సంగీతం] ఎందుకంటే రెండూ కూడా స్క్రీన్ మీద మారే సీన్లు కాబట్టి ఈ స్పృహే మిమ్మల్ని నిజమైన వీరుడుగా మారుస్తుంది. మీకు తెలుసా నిజమైన ధైర్యం ఒక మనిషికి ఎప్పుడు వస్తుందో ఎప్పుడైతే మీకు ఈ జీవితం ఒక ఆట అని అర్థమవుతుందో అప్పుడు మీలో అసలైన పవర్ బయటపడుతుంది. పరమహంస యోగానంద్ గారు ఒక అద్భుతమైన సీక్రెట్ చెప్పారు.
(12:51) ఈ సృష్టిని నడిపించే ఆ పరమాత్మ మనల్ని ఒక తోలు బొమ్మలా ఆడించడం లేదు. ఆయన మనకి ఒక ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ డ్రామాలో మన పాత్ర మనం ఎలాగైనా రంగు మార్చుకొని ఆడుకునే స్వేచ్ఛని ఇచ్చారు. కానీ మనం ఏం చేస్తున్నాం చిన్న కష్టానికే డైరెక్టర్ ని తిడుతూ మూలను కూర్చుని ఏడుస్తున్నాం. డైరెక్టర్ అంటే భగవంతుడు మనక ఏదైనా కష్టం వస్తే నా తలరాత రాసినోడు ఇట్లా రాసాడు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాం.
(13:12) నిజం ఏంటంటే మీకు వచ్చే కష్టాలకి బాధ్యులు మీరే మీ ఆలోచనలు మీ చేష్టాలు ఎందుకంటే భగవంతుడికి ఎప్పుడూ దగ్గరగా ఉండే ఒక మనిషి తీసుకునే నిర్ణయాలు అలాగే ఈ బాహ్య ప్రపంచానికి ఎక్కువగా కనెక్ట్ అయిపోయిన మనిషి తీసుకునే నిర్ణయాలు వేరువేరుగా ఉంటాయి. సో మీకు మీరుగా నిర్ణయాలు తీసుకొని ఆ భగవంతుని నిందించడం కరెక్ట్ కాదు కదా ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మీరు అనుభవిస్తున్న నరకానికి స్వర్గానికి కారణం మీ మైండ్ సెట్ మాత్రమే.
(13:41) మీరు దేన్నైతే సమస్య అనుకుంటారో దాన్ని ఒక ఛాలెంజ్ లాగా ఒక సీన్ లా చూడటం మొదలు పెట్టండి. ఓకే నా లైఫ్ లో ఇప్పుడు విలన్ ఎంట్రీ ఇచ్చాడు చూద్దాం ఈ సీన్ ఎలా ఫేస్ చేయాలో అని చెప్పేసి స్పోర్టివ్ గా తీసుకోండి కంగారుపడకండి ఏడవకండి మూలక వెళ్ళిపోయి కూర్చొని బయటికి రాకుండా అక్కడే ఉండిపోమాకండి. కచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక విలన్ ఉంటాడు వాడిని మనం ఫేస్ చేయాలి.
(14:04) అందులోనూ మీకు తెలియకుండానే మీరు ఇంకొకళ జీవితంలో విలనై కూడా ఉండవచ్చు. ఎందుకంటే అవి మన ఆలోచనలు మన నిర్ణయాలు కాబట్టి ఎందుకంటే మనం తీసుకునే నిర్ణయం వల్ల ఈ భూమి మీద అందరూ సుఖంగా ఉండరు. కొంతమంది ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బంది పడ్డ వాళ్ళు మనల్ని విలన్స్ అనుకుంటారు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఒక ఆఫీస్ లో టీం లీడర్ ఉంటాడు. టీం లీడర్ ఏం చెప్తాడు అందరికీ పని చెప్తాడు.
(14:24) కొంచెం ఎక్కువ పని చెప్తే ఏమవుతుంది ఆ టీం్ లో ఉన్న వాళ్ళందరికీ విలన్ అవుతాడు. కాకపోతే పని చెప్పడం టీం మీటర్ పని కదా సో ఇక్కడ మనం ఎప్పుడు ఎవరికి విలన్ అవుతామో ఎప్పుడు ఎవరికి మిత్రులం అవుతామో ఎప్పుడు ఎవరికి మనం శత్రువులు అవుతామో కూడా తెలియదు కాబట్టి ప్రతిదాన్ని ఒక సీన్ లాగా చూడండి స్పోర్టివ్ గా తీసుకోండి చాలా మంది అనుకోవచ్చు మరి ఇదంతా కల అంటున్నావు ఇదంతా సినిమా అంటున్నావు మరి అలాంటప్పుడు మనం కష్టపడటం ఎందుకు పరుగు పెట్టటం ఎందుకు అని ఇక్కడే మీరు పప్పులో మీరు రెండు కాళ్ళు వేస్తున్నారు అదేంటంటే యోగానంద గారు అంటారు ఈ సినిమా రసవత్తరంగా సాగాలంటే మీరు
(14:58) బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయాలి. ఇప్పుడు సినిమాలో హీరో పారిపోతే థియేటర్లో జనాలు చప్పట్లు కొడతారా కొట్టరు కదా హీరో అంటే దెబ్బలు తగిలిన లేచి నిలబడాలి, పోరాడాలి చివరికి గెలవాలి కానీ ఆ గెలుపుని నెత్తిని పెట్టుకోకూడదు. ఆ ఓటమిని గుండెకి హత్తుకోకూడదు. ఎందుకంటే సినిమా అయిపోయాక విలన్ హీరో ఇద్దరు కలిసి కూర్చొని కాఫీ తాగుతారు.
(15:22) ఈ సృష్టిలో మీ శత్రువు, మీ మిత్రుడు, మీ లాభం, మీ నష్టం అన్నీ ఆ కాస్మిక్ ప్రొజెక్టర్ నుంచి వస్తున్న కాంతి కిరణాలే. ఆ క్లారిటీ మీ మైండ్ లో ఉంటే మీకు డిప్రెషన్ రాదు, యంజైటీ రాదు. ఈ ఈఎంఐల భయం అస్సలు ఉండదు. మీరు గమనించారో లేదో ఇంకో విషయం చెప్తాను మీకు ఒక అల సముద్రం పైకి లేచినప్పుడు అది తానే పెద్ద అల అనుకుంటుంది. పక్కనఉన్న చిన్న అలల్ని చూసి నవ్వుకుంటుంది.
(15:45) కానీ మరి కొద్ది సెకండ్లో అది వెళ్లి మళ్ళీ సముద్రంలోనే కలుస్తుంది. అప్పుడు దానికి తెలుస్తుంది నేను వేరు కాదు సముద్రం వేరు కాదు మేమంతా ఒకటే అని. మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో లేకపోతే మనం కూడా చాలా మంది ఇలాగే ఫీల్ అవుతూ ఉంటాం. అలాగే ఫీల్ అవుతాం. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని నేను ఒక బిజినెస్ మ్యాన్ ని నా రేంజ్ వేర్ అని చెప్పేసి అహంకారంతో ఎగురుతూ ఉంటారు.
(16:06) అది ఎవరైనా అవ్వచ్చు మనం అవ్వచ్చు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అవ్వచ్చు కానీ కాలం అనే తీరం రాగానే మీ అహంకారం మీ పొజిషన్ అన్ని కరిగిపోతాయి. అందుకే చెప్తున్నాను బతికినంత కాలం ఒక రాజులా బ్రతకండి కానీ లోపల మాత్రం రాజు అనే పాత్ర మాత్రమే నేను పోషిస్తున్నాను అనే కాన్షియస్ తో ఉండండి. ఈ మెంటాలిటీ గనుక మీకు అలవాటయితే మిమ్మల్ని కిందకి లాగడం ఈ ప్రపంచంలో ఎవ్వరి వల్ల కాదు బేసికల్ గా చాలా మంది ఈ మెంటాలిటీతో బ్రతుకుతూ ఉంటారు నీ జీవితంలో మీరు చూస్తూ ఉంటారు వినేరా బాబు ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఇంత సింపుల్ గా ఉంటాడు అని చెప్పేసి మీరు చాలా మంది గురించి
(16:39) మాట్లాడుతూ ఉంటారు కానీ డబ్బులు ఉన్నా లేకపోయినా సింపుల్ గా బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే డబ్బులుండి సింపుల్ గా ఉండే వాళ్ళు అంటే మనకి ఇంకొంచెం ఎక్కువ ఇది ఉంటుంది కదా అయ్యో అంత డబ్బు ఉన్నవాడు ఇంత సింపుల్ గా ఎలా ఉంటున్నారు అని చెప్పేసి వాళ్ళందరికీ ఉన్న మనస్తత్వం ఇది వాళ్లు ఏంటంటే జస్ట్ దాన్ని ఒక క్యారెక్టర్ లా ఫీల్ అవుతారు కానీ అదే వాళ్ళు అని చెప్పేసి ఫీల్ అవ్వరు.
(16:59) సో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను మీరు ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తిని గనుక నిజ జీవితంలో చూస్తే మాత్రం అతను ఎవరో కామెంట్ చేయండి. మనస్తత్వం అంటే ఒక రాజులా బ్రతుకుతూనే నేను రాజు అనే క్యారెక్టర్ ని ప్లే చేస్తున్నాను అని చాలా సింపుల్ గా బ్రతికే మనిషి ఎవరో కామెంట్ చేయండి మీకు తెలిస్తే అందులోని ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి.
(17:21) ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఎందుకంటే ప్రతిరోజు ఉదయం 7:30రకి మన ఛానల్ లో వీడియోస్ వస్తూ ఉంటాయి. వాటిని మీరు మిస్ అవ్వకూడదు కాబట్టి బాయ్.

No comments:

Post a Comment