అసలు మనిషికి ఏం కావాలి? | The Dark Truth About Human Life (Telugu)
Author Name:Nagna Satyam
Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=gb22w07fITE
Transcript:
(00:02) అసలు మనిషికి ఏం కావాలి? ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే ప్రపంచం పుట్టినప్పటి నుంచి కోట్ల మంది జీవితాలు తిరిగాయి ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. కొంతమంది ఇలా అంటారు తిండి, బట్ట, ఇల్లు ఉంటే చాలు అని కానీ ఇవన్నీ పుష్కలంగా ఉన్నవాడే అర్ధరాత్రి పూట సీలింగ్ వైపు చూస్తూ శూన్యంలోకి ఎందుకు జారిపోతున్నాడు. నిజానికి మనిషికి కావాల్సింది సుఖం కాదు ప్రశాంతత కూడా కాదు మనిషికి కావాల్సింది ఒక భ్రమ తను ఈ భూమిమీద బ్రతకడానికి ప్రతి ఉదయం మంచం దిగడానికి ఏదో ఒక బలమైన కారణం ఉందని భ్రమ ఆ కారణం దొరకనప్పుడు లేదా
(00:48) దొరికిన కారణం అబద్ధమని తేలినప్పుడు మనిషి లోపల ఒక నల్లటి చీకటి నెమ్మదిగా పెరుగుతుంది. ఆ చీకటిని కప్పి పుచ్చుకోవడానికే చచ్చేంత ఆరాటం లేనిపోని బంధాలు అవసరం లేని ఆస్తుల కూడబెట్టడం ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక అడవిలో ఒంటరిగా ఉన్నావు చుట్టూ క్రూర జంతువులు ఉన్నాయి. అప్పుడు నీకు కావాల్సింది ఒక్కటే ప్రాణం నిలుపుకోవడం కానీ ఆకలి తీరిన తర్వాత భయం తగ్గిన తర్వాత అక్కడే మనిషి అసలు నరకం మొదలవుతుంది.
(01:26) ఆ ఖాళీ సమయం ఆ శూన్యం దాన్ని తట్టుకోలేక మనిషి తన చుట్టూ ఒక కృత్రిమ ప్రపంచం కట్టుకుంటాడు. నన్ను గుర్తించాలి నన్ను మెచ్చుకోవాలి నేను గొప్పవాడిని కావాలి అని అంటే మనిషి తన సొంత ఉనికినే భరించలేడు. తనని తాను మర్చిపోవడానికి ఒక వ్యాపకం కావాలి. అది వ్యాపారం కావచ్చు ప్రేమ కావచ్చు పగ కావచ్చు. ఏదో ఒకటి మెదడును నిరంతరం బిజీగా ఉంచాలి. ఎప్పుడైనా గమనించారా దూరం నుంచి చూస్తే కొండలు నున్నుపుగా కనిపిస్తాయి.
(01:58) మనిషి జీవితం కూడా అంతే అది సాధిస్తే జీవితం సెట్ అవుతుంది అని నమ్ముతాడు. కానీ అది దొరికిన తర్వాత దాని విలువ క్షణాల్లో ఆవిరైపోతుంది. ఒకప్పుడు ప్రాణంగా ప్రేమించిన మనిషి ఇప్పుడు పక్కనున్న బోరు కొడుతుంది. ఎంతో కష్టపడి కొన్న వస్తువు కొన్ని రోజులకే కనిపించదు. ఎందుకంటే మనిషికి కావాల్సింది గమ్యం కాదు. ఆ గమ్యం వైపు పరిగెత్తే సమయంలో వచ్చే ఆ వేగం ఆ హడావిడి అదే ఆ పరుగు ఆగిపోతే తాను ఏమిటో ఒక నశించిపోయే మాంసపు ముద్ద మాత్రమేననే నిజం ముఖం మీద కొట్టినట్టుగా కనిపిస్తుంది.
(02:36) ఆ నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం లేకనే మళ్ళీ ఇంకో పరుగు మొదలవుతుంది. అదే ఆశ అది అమృతంలా కనిపించిన అది చావు వరకు లాకెళ్లే ఒక తీపి విషం. ఓకే మనమంతా ప్రేమ గురించి మాట్లాడతాం బంధాల గురించి గొప్పలు చెబుతాం. కానీ నిజంగా లోతుగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరు తమ స్వార్థం కోసమే బ్రతుకుతున్నారు. ఎవరో నిన్ను ప్రేమిస్తున్నారు అంటే నీ వల్ల వాళ్ళలో ఏదో ఒక అవసరం తీరుతోంది.
(03:05) ఆ అవసరం ఆగిపోయిన క్షణమే ఆ ప్రేమ కూడా ఎండ్ కార్డ్స్ పడుతుంది. ఇక్కడ బంధం అంటే ఒంటరితనాన్ని దాచుకునే ఒక ప్రయత్నం. మన భయాలను మన బలహీనతలను ఎక్కడో పడేయడానికి ఒక డస్ట్ బిన్ కానీ దానికి మనం పెట్టే పేరు ప్రేమ అని మీకు తెలుసా నువ్వు పుట్టకముందు ఈ ప్రపంచం ఇలాగే ఉంది. నువ్వు చచ్చాక కూడా ఇదే ఉంటుంది. నీ వల్ల ఈ విశ్వానికి లాభం లేదు నష్టం లేదు.
(03:35) ఒక చిన్న చీమ చనిపోతే ఎంత పట్టించుకోదో నువ్వు పోయినా అంతే అయినా మనం అనుకుంటాం నేను తోపు తురుము అని బట్ నా పేరు చిరస్థాయిగా ఉండాలి. నీ ఉనికి ఒక ఇసుక రేణువు కంటే తక్కువ కానీ అద్దంలో చూసుకొని నేను స్పెషల్ అనుకునే ఆ భావమే మనిషికి ఉన్న అతి పెద్ద రోగం. సో నా పాయింట్ ఏంటంటే నీ బ్రతుక్కి అర్థం ఉందనే భ్రమలోనే బ్రతకాలా? లేక ఈ అర్థం లేని శూన్యంలో నీ దారి నువ్వే వెతుక్కోవాలా దీనికి నువ్వు సమాధానం వెతుక్కుంటావా లేక ఆ శూన్యంలో కలిసిపోతావా అది పూర్తిగా నీ ఇష్టం
No comments:
Post a Comment