కామాఖ్యా అమ్మవారి ఆలయ రహస్యాలు | నిజంగా అమ్మవారి ఋతుస్రావం జరుగుతుందా.. | Malladi Surya Kiran
Author Name:iDream Omkaram
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamOmkaram
Youtube Video URL:https://www.youtube.com/watch?v=e8AYtATbYTI
Transcript:
(00:04) చాలామంది కామాఖ్య అమ్మవారిని వెళ్లి దర్శించుకుంటూ ఉంటారు ఎస్పెషల్లీ ఈ 22 26 తేదీలో గుడి మూలడం జరుగుతుంది. సో కారణం ఏంటి అండ్ వెళ్లి దర్శించుకుంటే అమ్మాయిలకు ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి. అక్కడ అమ్మవారికి రూపం లేదు యోని భాగం మాత్రమే ఉంటుంది దాని మీద వాళ్ళు వస్త్రం కప్పి జలధార పడుతూ ఉంటారు. అయిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు ఆ అమ్మవారి యొక్క ఆ ప్రాంతాన్ని తుడిచినటువంటి వస్త్రం ఏదైతే ఉందో దానిని అక్కడ వాళ్ళు ప్రసాదంగా అందరికీ ఇస్తారు.
(00:38) ఏమిటి దాని ప్రాముఖ్యత అంటే అందుకని ఈ సమయంలో ఆ పవిత్రతకి భంగం కలగకుండా అక్కడ అమ్మవారి ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది. ఏ పూజలు జరిగినా మనము ఆలయాలకు వెళ్ళినా ప్రసాదంగా పులిహోర అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు. దాని ప్రాముఖ్యత ఏంటి పులిహోరనే ఎందుకు ప్రసాదంగా ఇస్తూఉంటారు. నెగిటివ్ ఎనర్జీని రానివ్వకుండా కాపాడటంలో పసుపుకి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యం.
(01:03) అందుకనే పూర్వకాలంలో గడపలకి పసుపు రాసేవారు అందుకే చూడండి పసుపు రంగుని ఎలక్ట్రిక్ సిగ్నల్ కింద వాడతారు రెడ్ సిగ్నల్ ని డేంజర్ కి వాడతారు. వాటిలో ఉండేటువంటి వేవ్ లెంత్ వలన నెగిటివ్ ఎనర్జీ మన దగ్గరికి రాకుండా ఉంటుంది అంటే ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ ముహూర్తం టైం కి కాకుండా బెల్లం జీలకర్ర పెట్టడం దగ్గర నుంచి తాలి కట్టడం వరకు వాళ్ళు ఎలా చెప్తే అలా పోజులు ఇచ్చుకుంటూ తాలి కట్టడం పోజులు ఇచ్చుకుంటూ బెల్లం జీలకర్ర పెట్టడం అనేది చాలా చూస్తున్నాం.
(01:31) దీని వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అసలు మనకి తాలి కట్టడం ముహూర్తం కాదు జీలకర్ర బెల్లం పెట్టడమే ముహూర్తం అది మీ సహస్రారం మీద ఎప్పుడైతే పడిందో ఈ చేతిలో ఉండేటువంటి ఎనర్జీ అటు ఆ చేతిలో ఉండేటువంటి ఎనర్జీ ఇటు పాస్ అయ్యి ఒకళ్ళకొకళ్ళకి ఆ అనుబంధం ఏర్పడుతుంది. సహస్రారం ద్వారా ఏర్పాటయినటువంటి కనెక్టివిటీ కళ్ళ ద్వారా అటాచ్మెంట్ లోకి వెళ్తుంది.
(01:54) అందుకనే ఎంత సిస్టమేటిక్ గా చెప్పారు అంతవరకు ఒకళళనొకళ్ళు చూసుకోకూడదు. ముహూర్త సమయానికి మాత్రమే చూసుకునేటట్టుగా జీవితాంతం కలిసి ఉండేటట్టుగా అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి ప్రస్తుతం మనతో పాటు హరితస ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ సూర్యకిరణ్ శర్మ మల్లాది గారు మనతో పాటే ఉన్నారు.
(02:13) ఆయన్ని అడిగి బోల్డని విశేషాలు అడిగి తెలుసుకుందాము. ఎస్పెషల్లీ గృహప్రవేశం గురించి కామాఖ్య దేవత గురించి అండ్ తర్వాత ముహూర్త బలం గురించి ఇలా ప్రతి ఒక్కటి వాటి యొక్క విశిష్టత ప్రాముఖ్యత ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సూర్యకిరణ్ గారు నమస్కారం గురువుగారు శ్రీరామలక్ష్మి ఎలా ఉన్నారు అమ్మవారిదే [నవ్వు] సో చాలా మంది కామాఖ్య అమ్మవారిని వెళ్లి దర్శించుకుంటూ ఉంటారు అండ్ కామాఖి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు అండ్ ఎస్పెషల్లీ ఈ 22 26 తేదీల్లో గుడి మూడవడం జరుగుతుంది.
(02:44) సో కారణం ఏంటి అండ్ వెళ్లి దర్శించుకుంటే అమ్మాయిలకు ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి. లలితా సహస్రనామాన్ని నిశితంగా పరిశీలిస్తే శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ కంఠాధక్కటి పర్యంతం మధ్యకూట స్వరూపిణి శక్తికూటైకతాపన్నా కట్యదో భాగధారిణి అని అమ్మవారికి పేరు మ్ అమ్మవారికి స్థూల స్వరూపముగా ఏది చెప్పబడలేదు అంతా కూడా మంత్ర స్వరూపంగా చెప్పారు.
(03:13) అమ్మవారి శరీరాన్ని మూడు కూటములుగా విభజించి వాగ్భవ కూటము మధ్యమ కూటమి శక్తి కూటమిగా వర్ణించారు. ఈ శక్తి కూటమి అనేటువంటిది పురుషుడికైనా స్త్రీకైనా కటి భాగం నుంచి కింద భాగం ఏదైతే ఉందో అది పురుషుడికైనా స్త్రీకైనా అతి ముఖ్యమైనటువంటి ప్రదేశం అది సృష్టికి పునరుత్పత్తి హేతువు అవుతుంది అది అలా అమ్మవారి యొక్క అష్టాదశ శక్తి పీఠాలలో అతి ప్రాముఖ్యమైనటువంటి అతి మహిమాన్వితమైనటువంటి శక్తి క్షేత్రము శక్తి పీఠముగా భాసిల్లుతు ఉన్నటువంటిది కామాఖ్యాదేవి గౌహతిలో ఉన్నటువంటి కామాఖ్యాదేవి ఆ శరీరము సతీదేవి యొక్క భాగము విచ్చిన్నమైన వాటిల్లో యోని ప్రదేశము
(03:58) అక్కడ అక్కడ ఏర్పడింది. ఉపాసనా స్థితిలో ఉపాసనా భాగములో ఉత్కృష్టమైనటువంటి ఫలితాలను ఇవ్వగలిగినటువంటి క్షేత్రముగా ఇప్పటికీ కూడా కామాఖ్యాదేవి సన్నిధి పేరుపొందింది. కాకపోతే అక్కడ ఏం జరుగుతుంది అంటే కామాఖ్యా దేవి సన్నిధిలో వామాచారం ప్రబలంగా ఉంటుంది. ఓకే దక్షిణాచార సాంప్రదాయం కంటే ఇప్పటికీ అక్కడ మనం బలులు ఇవ్వడం ఇవన్నీ చూస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం అలాని దక్షిణాచార సాంప్రదాయంలో కూడా అక్కడ ఆచారము వ్యవహారము కూడా జరుగుతూ ఉంటుంది.
(04:32) ఇదే మన హరితస ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో అక్కడ శతచండి హోమం కూడా మనం జగద్గురువుల ఆశీసులతో చేయగలిగాము చేయగలుగుతారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహాత్మం ఏమిటి అంటే మొత్తము అమ్మవారి యొక్క దశమహావిద్య స్వరూపాలఅన్నీ కూడా ఆ కామాఖ్యా దేవి సన్నిధిలో ఉంటాయి. ఓకే భగళాముఖి లలితా మహా త్రిపుర సుందరి దేవి తార కాళి ఇట్లా అన్ని స్వరూపాలు కూడా ఆ చుట్టుపక్కల వెలసి ఉన్నాయి అక్కడ వీటన్నింటికీ అధిదేవతగా అక్కడ మనకి అమ్మవారి యొక్క కామాఖ్యా దేవి మూల విగ్రహము అక్కడ అమ్మవారికి రూపము లేదు యోని భాగం మాత్రమే ఉంటుంది.
(05:09) ఓకే దాని మీద వాళ్ళు వస్త్రం కప్పి జలధార పడుతూ ఉంటుంది. ఇది అమ్మవారి యొక్క ఆలయం గురించి దీని పక్కనే బ్రహ్మపుత్ర అనేది ప్రవహిస్తూ ఉంటుంది. అది విశిష్టమైనటువంటి మహోత్తుంగమైనటువంటి ప్రవాహం కలిగినటువంటి నది అసలే శక్తి ఆ కటి భాగము నుంచి కింద ఉన్నటువంటి ప్రాంతము మహోత్కృష్టమైనది అని మనకి తెలుస్తూనే ఉన్నది మానవ జీవితంలోనే దాని ప్రాముఖ్యత ఎక్కువ దైవము సృష్టి విలాసము ఈ సృష్టి అంతటిన నడిపించేటువంటి మాతృమూర్తి ఆవిడ అలాంటి అమ్మవారికి ప్రాకృతికంగా ఒక స్త్రీకి జరిగేటువంటి బహిష్టు అనేటువంటి ఒక ప్రక్రియ అక్కడ అమ్మవారికి కనబడుతుంది అని మనకి నిరూపణ
(05:55) అవుతున్నది. అండ్ ఈ డేస్ లో ఈ రోజుల్లో సంవత్సరంలో ఈ ఆషాడ మాసము ఈ ప్రాంతాలలో అక్కడ అమ్మవారికి సహజంగా ఏంటంటే ఈ సంవత్సరం మనకి అధిక జేష్ట మాసం వచ్చింది అధిక జేష్ట మాసం రాకపోయింటే ఇప్పుడు ఆషాడ మాసం నడుస్తూ ఉండేది మనకి ఓకే అంతేనా కదా వాళ్ళందరూ సౌర సాంప్రదాయాన్ని పాటిస్తారు కాబట్టి వాళ్ళకి అధిక మాసాలు ఉండవు వాళ్ళకి కాబట్టి వాళ్ళ లెక్కల్లో ఈ నెల 22 నుంచి వాళ్ళకి అది అమ్మవారికి అది ఋతుస్రావం జరుగుతుంది అనేటువంటి విశ్వాసం సో నిజంగానే జరుగుతుంది కొన్ని సాక్షాలు ఏమనా ఉ ఉన్నాయి ఉన్నాయి కాబట్టే నమ్ముతున్నారు ఈ సమయంలో బ్రహ్మపుత్ర అనది కూడా కొంత మేర
(06:33) ఎరుపు రంగులోకి మారుతుంది అనే ప్రమాణం కూడా మనకి కనబడుతుంది. అందుకని ఈ సమయంలో ఆ పవిత్రతకి భంగం కలగకుండా అక్కడ అమ్మవారి ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని అక్కడ జరిగేటువంటి ఆ ఉత్సవాన్ని అంబూబాచి అనేటువంటి పేరుతోటి వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. సో ఈ టైంలో ఆలయం మూసి ఉంటది కాబట్టి జనాలు వెళ్లి అంబు బాచలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు ఆ ఉత్సవంలో పార్టిసిపేట్ చేస్తూ ఆలయంలోకి వెళ్లి చూడలేము చూడలేము అయిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు ఆ అమ్మవారి యొక్క ఆ ప్రాంతాన్ని తుడిచినటువంటి వస్త్రం ఏదైతే ఉందో దానిని అక్కడ వాళ్ళు ప్రసాదంగా అందరికీ ఇస్తారు.
(07:15) ఏమిటి దాని ప్రాముఖ్యత అంటే ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని ఎప్పుడైతే మనం తీసుకుంటామో మనలో ఉండేటువంటి అంతర్గత శత్రువులు మనల్ని బాహ్యం నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి బాహ్య శత్రువుల నుంచి కూడా అమ్మవారు మనల్ని కాపాడుతుంది అనేటువంటి నమ్మకమే కాదు ప్రమాణాలు కూడా మనకు కనబడుతున్నాయి. మహోత్కృష్టమైనటువంటి అంటే అమ్మవారి వివిధ స్వరూపాలు వివిధ కారణాలతో ఉంటాయి మనకి ఉపాసనా విభాగంలోకి వెళ్ళామ అనుకోండి అవన్నీ మనం బయటికి చెప్పలేం కానీ ఉదాహరణకి చెప్తున్నాను ఉపాసనా విభాగంలోకి వెళ్ళామ అనుకోండి చిన్నమస్తా దేవి దశమహావిద్యలలో ఒక ఉత్కృష్టమైనటువంటి విద్య అమ్మవారిది
(07:56) వజ్ర వైరోచనీ దేవి అని కూడా పిలుస్తారు ఆవిడ్ని ఆవిడ్ని ఉపాసన చేసినప్పుడు శత్రువులపై విజయం సాధించటం అనేది తర్చము. భగముఖి అమ్మవారిని బ్రహ్మాస్త్ర విద్యగా చెప్పబడుతున్నది అలాంటి అమ్మవారిని కొలిస్తే ఎలాంటి పరాజయం లేనటువంటి అప దాన్ని ఏమంటారు అప్రతిహతమైనటువంటి విజయ పదంలో మనిషి దూసుకు వెళ్తాడు అని చెప్పబడుతున్నది.
(08:18) ఇవన్నీ కేవలం చెప్పబడుతున్నాయా అంటే సాధన చేసినటువంటి వాళ్ళకి ఫలితాలు కనబడుతున్నాయి. అలా ఈ అమ్మవారి యొక్క ఆ ఆలయంలో మనం చేసే అనుష్టానం గాన ఆ అమ్మవారిని చేసుకున్నటువంటి దర్శనం గాన చాలా విధాలైనటువంటి మానసికమైనటువంటి వేదనల నుంచి మనిషిని దూరం చేస్తుంది. అక్కడికి మనోవేదనతో వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆనందంగా ఉన్నాము అని చెప్తున్న వాళ్ళు కొన్ని వేల మంది ప్రశాంతత అనేది అంటే ఏ వేదన ఇప్పుడు మానసికంగా మనిషి వేదనగా ఉన్నాడు అంటే అర్థం ఏమిటి అది ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది పెడుతుంది ఆ ఇబ్బంది తొలిగితేనే కదా వాడు ఆనందంగా
(08:54) ఉంటాడు అవును డెఫినెట్లీ అంటే మానసిక వేదనతో వెళ్ళినటువంటి వాళ్ళు అమ్మవారి దర్శనం అయ్యి అమ్మవారి సేవ చేసుకున్న తర్వాత ఆనందంగా ఉండడం అనేది నిరూపణ అవుతున్నటువంటి సత్యం సో అక్కడికి వెళ్లి వెళ్లి చూడడం కానీ వెళ్ళడం కానీ నియమాలు ఏమైనా ఉన్నాయా ఇవి చేయాలి అక్కడికి వెళ్ళాక పూజలు కానీ ఒక సాధకుడిగా వెళితే మీరు చేసుకునేటువంటి అనుష్టానాలు ఒకలా ఉంటాయి.
(09:17) ఒక భక్తుడిగా మీరు వెళ్తే వెళ్లి దర్శనం చేసుకుని వస్తే చాలు మన స్థాయి ఏమిటో మనం తెలుసుకుంటే చాలు మనం సాధనా స్థాయిలో ఉన్నామా భక్తుల స్థాయిలో ఉన్నామా నేను భక్తుడిని నాకేంటి కోరిక అమ్మవారికి ఒక చీర పెట్టుకోవాలి అమ్మవారికి ఒక జాకెట్ బట్ట పెట్టుకోవాలి ఒక పూలమాలు ఇచ్చుకోవాలి అయిపోయాయి అంతే ఆ దర్శన ప్రభావం చేతనే అమ్మవారి ఫలితాన్ని ఇస్తుంది మరి ఈ టైంలో వెళ్తే ఇంకా ఎక్కువ లాభం పొందుతారు అన్నది ఏమన్నా ఉందా లేకపోతే ఏ టైం అన్నా ఏ సమయం అయినా సరే అమ్మవారి క్షేత్రం మహిమాన్వితమే అందులో సందేహం లేదు అందులో ముఖ్యంగా కామాఖ్యా దేవి మహా మహిమాన్వితం
(09:49) కామాఖ్యా దేవి విజయవాడలో ఉన్నటువంటి దుర్గాదేవి త్రిపురాంతకంలో ఉన్నటువంటి బాలా త్రిపుర సుందరి దేవి వైష్ణవో దేవి వీరికి సమయాలతో పని లేదు మైసూరు చాముండేశ్వరి దేవి కంచి కామాక్షి దేవి వీళ్ళకి సమయాలతో లేదు ఎప్పుడూ సతతము వాళ్ళు ఎప్పుడూ శక్తి సంపన్నులే వాళ్ళు ప్రత్యేకమైన కాలం అంటూ లేదు వాళ్ళు మాతృ స్వరూపాలు ప్రాకృతికంగా ఏర్పడినటువంటి స్వరూపాలు అవి ప్రతి ఒక్కరు వెళ్లి దర్శించుకోవచ్చా ఏమన్నా చక్కగా చేసుకోవచ్చు ఆడవారు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎటువంటి నియమాలు లేవు పిల్లలతో సహా అందరూ వెళ్ళవచ్చు.
(10:20) వాళ్ళకి నియమాలు లేవు. అయితే అక్కడ ఉండేటువంటి వాతావరణం విపరీతమైనటువంటి వర్షాలు ఈ సమయంలో మీరు వెళితే తర్వాత మనలాగా కాదు అక్కడ గౌహతి మీరు వెళ్ళారనుకోండి తెల్లారకంటే మూడు గంటలకే తెల్లారిపోతుంది. మనకి ఇక్కడఏడున్నర ఎనిమిది ఇంటికి ఎలా ఉంటుందో అక్కడ మూడున్నరకి అలా ఉంటుంది. కాబట్టి అక్కడ ఉండే రద్ది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వయసు మీరినటువంటి వాళ్ళతో ఇప్పుడు కాకుండా అనుకూలమైన సమయంలో ప్రయాణం చేయండి.
(10:45) ఈ సమయంలో వెళ్ళగలిగిన వాళ్ళకి ఆ అంబూబాచి ప్రసాదం వస్త్రం ఇస్తారు అది ఇంట్లో దేవుడి గద్దిలో పెట్టుకోండి చాలు అంతా బాగుంటుంది చాలా విశేషమైనటువంటి పర్వదినాలు మరి ఈ జాత్ర టైంలో అమ్మవారిని దర్శించుకోలేము కదా మరి అలా అప్పుడు ఎలాగా ఒక రోజు అక్కడ ఉండ ఒక రోజు ఉండేటట్టుగా అంటే ఎప్పటినుంచి ఎప్పటిదాకా గుడికి మూసేస్తారని మనకు తెలుసు కాబట్టి ఆ ముందు రోజో తర్వాత రోజో మనం వెళ్లి దర్శనం చేసుకుంటే దాన్ని ఏమంటారు ఆ రద్ది ఆ రష్ ఉంటుంది కదా దాన్ని మనం తట్టుకోగలగాలి అవును అది ఎందుకంటే మన వల్ల కాదు అంత విపరీతమైన రద్యం ఉంటుంది ఎందుకంటే ఆ ఈస్టర్న్ ఘాట్స్ ఆ ప్రాంతంలో ఉండేటువంటి
(11:21) వాళ్ళకి పరమ పూజ్యమైనటువంటి దేవాలయం దేవాలయం ఓకే కాబట్టి మామూలుగా మనకి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకే మనం వెళ్ళలేం డెఫినెట్లీ అలా బ్రహ్మోత్సవాలు మనకి ఎంత ఇంపార్టెంటో ఈ అంబూబాచి వాళ్ళకి అంత ఇంపార్టెంట్ ఎక్కడెక్కడి నుంచో వస్తారు జనాలు ఒరిస్సా నుంచి కలకత్తా నుంచి ఎక్కువగా సంతాన సాఫల్యం కావాలనుకున్న వాళ్ళు ఒక్కటే కాదమ్మ ప్రతి ఒక్కటి ప్రతి ఏ కోరిక అయినా సరే అమ్మవారి దగ్గర తీరుతుంది అవును నిస్సందేహంగా చెప్తున్నాను అనుభవంతో చెప్తున్నాను ఒక కోరిక అమ్మాయి వివాహం అని చదువు విద్య మీరు ఏ మనసులో మీ ఏ వ్యాకులత ఉందో ఆ వ్యాకులత తీరిపోతుంది
(11:54) అబ్బా సో డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళు వెళ్లి దర్శించు దర్శించుకోవాల్సినటువంటి అందరూ వెళ్లి దర్శించుకోవాలి ఎంతమందిని నేను చూడలేదమ్మ చిన్నపాటి అనారోగ్యంతో వెళ్లి వెళ్లి రాగానే నాకు ఆరోగ్యం బాగుందండి అన్నవాళ్ళు ఎంతమంది అంతకంటేనా ఇంకా సో అందుకని ఆ క్షేత్రం ఏదో సాధారణమైనటువంటి క్షేత్రం కాదు అది వెళ్తే శ్రద్ధగానే వెళ్ళాలి కానీ ఒకటి మీరు ఇందాక అన్నారు అక్కడికి వెళ్తే మనం పాటించాల్సిన నియమాలు ఏమిటి కొన్ని కొన్ని క్షేత్రాలకు ఒక గొప్పతనం ఉంటుంది.
(12:22) అది ఏమిటి అంటే మీరు మనసులో అనుకున్న కోరిక నెరవేరడానికి వెళ్తున్నారు అక్కడికి కాబట్టి ఏ విధమైనటువంటి అపభ్రంసపుడు ఆలోచనలు చేయకండి చాలా మందిని చూసాను నేను ఎవరో వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాళ్ళకి ఏదో జరగాలన్న అనేటువంటి తప్పనతో వెళ్తూ ఉంటారు అలా చేయకండి మంచిగా కోరుకోండి నేను బాగుండాలని కోరుకోండి కోరుకోండి అంతే అంతే కదా ఇప్పుడు వాళ్ళు ఒక చాణుకుడు ఒక గొప్ప మాట చెప్తాడు శత్రువుని జయించటము అంటే శత్రువుని సంహరించడం కాదు ఆ శత్రువు నీకు మిత్రుడిగా మారినా నువ్వు గెలిచినట్టే అంతేగా ఏమో అమ్మవారి అనుగ్రహం ఉంటే ఈ రోజు నన్ను ఇబ్బంది పెడుతున్నవాడే రేపు నీ కాళ్ళ
(12:57) దగ్గరికి వచ్చి నన్ను కాపాడండి స్వామి అంటాడు వాడు తెలియదు కదా కాబట్టి ఎవరి చెడు మనం కోరుకోవద్దు మనకు మంచి జరగాలి నేను ఆనందంగా ఉండాలి మనకు నచ్చిన వాళ్ళు ప్రేమించిన వాళ్ళు ఆనందంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఇంతే మన కోరిక అలా ఒక మంచి సత్సంకల్పం తోటి వెళ్ళండి కోరిక తీరడం తజ్యం అంత మహిమాన్విత క్షేత్రం సో డెఫినెట్లీ వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు మటుకు కొత్తగా వెళ్ళేవారు ఎవరైనా ఉంటే అక్కడ బలి ఇచ్చే సంప్రదాయం ఉంది.
(13:22) మ్మ్ కాబట్టి దయచేసి కొంచెం ఆ అలాంటి సున్నితమైనటువంటి అంశాలు చూడకుండా దూరంగా ఉండి మీ పని మీరు చేసుకొని రండి. ఓకే ఎందుకంటే మనసు కొంచెం మనకి అలవాటు లేకపోతే మనసు వికలం అయిపోతుంది ఎటువంటి బలిదానం అనేది జరుగుతా ఉంటుంది దున్నపోతులని బలిస్తారు మేకల్ని బలిస్తారు అవన్నీ చూసి మనం తట్టుకోలేంు మనకి అలవాటు లేదు కదా ఇవన్నీ అక్కడ అది సాంప్రదాయం దాన్ని మనం ఖండించకూడదు అది సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి మనం మన పని చేసుకొని వచ్చేయాలి అంతే అంతే అనవసరమైనటువంటి అది మళ్ళీ ఏమవుతుందంటే అలాంటి అసందర్భ వాటిల్లో మనం తల దూరిచామ అనుకోండి ముందు మనం వెళ్ళినటువంటి కోరిక
(13:58) మనం మర్చిపోతాం డెఫినెట్లీ అందుకని కొంచెం జాగ్రత్తగా సునిశ్చితంగా కొన్ని వసతులు ఇస్తున్నారు పెద్దవాళ్ళు వయోవృద్ధులు వెళ్ళారనుకోండి టికెట్ డైరెక్ట్ గా పంపించేస్తారు. యువకులు ఉన్నారనుకోండి లైన్ లో నుంచోవల్సి వస్తుంది అలా కొన్ని వసతులు ఉన్నాయి వసతులు ఉన్నాయి ఓకే సో అన్ని విధాలుగా మీకు ఆ గుడి ప్రాంగణంలోనే చక్కటి హోటల్స్ అవి ఉంటాయి మీకు చక్కగా మీ ప్రయాణాన్ని ప్రణాళికబద్ధంగా చేసుకోండి కానీ ఇంత హడావిడిగా అందరూ కలిసి చూసేయాలి ఇదే టైంలో చూసేయాలి అనే నియమం ఏమ లేదు ఎప్పుడు వెళ్ళినా అమ్మవారు శక్తివంతురాలే గురువుగారు ఇంకొకటి ఇప్పుడు ఏ పూజలు
(14:28) జరిగినా మనము ఆలయాలకు వెళ్ళినా ప్రసాదంగా పులిహోర అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు. పులిహోరకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి ఎందుకు పులిహోరనే ఇవ్వాలి ఇప్పుడు మనం వరలక్ష్మీ వ్రతం చేసుకున్న ఏ పూజ చేసుకున్న పులిహోర అనేది వచ్చిన వాళ్ళందరికీ అతిథులందరికీ ఇస్తూ ఉంటారు దాని ప్రాముఖ్యత ఏంటి పులిహోరనే ఎందుకు ప్రసాదంగా ఇస్తుంటారు మంచి ప్రశ్నే పులిహోర ఒక్కటే కాకుండా చాలా చోట్ల మీరు గమనిస్తే వాయనం కింద శెనగలు ఇస్తారు పులిహోర శెనగలు పులిహోర శెనగలు ఇదొక ఇది హరిద్రాన్నయక రసిక హాకిని రూపధారిణి అని అమ్మవారికి పేరు లలితా సహస్ శాస్త్రం చదివితే అమ్మవారికి కొన్ని కొన్ని అన్నాలు అంటే
(15:06) ఇష్టం అలాంటి వాటిలో హరిద్రాన్నయక రసిక హరిద్రము అంటే పసుపు పసుపుతో చేసినటువంటి అన్నానికి పసుపుతో చేసినటువంటి వంట అంటే అమ్మవారికి చాలా ఇష్టం శెనగ తీసుకుంటే ఎలా ఉంటుంది అది రెండు కలిసి ఒకటిగా ఉంటుంది అవును అవునా అందుకని ఒక ముత్తైదువ అది పంచిపెట్టడంలో అంతరం ఏమిటంటే అన్యోన్య దాంపత్యము ఆనందదాయకమైనటువంటి కుటుంబ జీవితము అందులో ప్రాధాన్యత రెండవది శెనగలు ఎవరికి ప్రీతి అంటే బృహస్పతి గురుడికి ప్రీతి దత్తాత్రేయులు వారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నివేదన శెనగలు అంటే గురువులు గురువు యొక్క అనుగ్రహము
(15:49) గురు గ్రహము యొక్క అనుగ్రహము అదేవిధంగా అన్యోన్య దాంపత్యము అందరూ కలిసి ఉన్నటువంటి కుటుంబ జీవితము ఇవన్నిటికీ కూడా కారణం ఏమిటి అంటే శెనగలు అంటే ఆ పదార్థ అర్థమ ఆ రీతిలో తయారయింది. కాబట్టి ఒక ముత్తైదువు ఏం కోరుకుంటుంది తన భర్త పిల్లలు అత్త మామ అందరూ బాగుంటారు అందుకని వాళ్ళకి అది ఇస్తారు. ఇక పులిహోర పులిహోర ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి అంటే ఇందులో రెండు సైన్సులు చూడాలి మీరు మ్ పులిహోరకి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే దాంట్లో మీరు వేసినటువంటి పదార్థము పాడవ్వకుండా చేస్తారు దాన్ని మ్ మీరు మామూలు అన్నం వండారనుకోండి సాయంకాలానికి పాడైపోతుంది. ఇంక ఏ వస్తువు
(16:31) చేసినా పాడైపోతుంది. ఒక్క పులిహారు మటుకు మూడు రోజులు ఉంటుంది. ఎందుకని ఆ పులిహారులో ఉన్నటువంటి ఇంగ్రిడియంట్స్ ని తీసుకుంటే ఒక్కొక్క దాంట్లోనూ ఒక్కొక్క విశిష్టత ఉంది శెనగలు శెనగపప్పు చింతపండు ఏవండీ పసుపు అన్నం ఎవ్రీథింగ్ హస్ గాట్ ఇట్స్ ఓన్ న్యూట్రిషన్స్ వాల్యూస్ అయినా రెండవది నెగిటివ్ ఎనర్జీని రానివ్వకుండా కాపాడటంలో పసుపుకి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యం ఉంది.
(16:59) అండ్ సైన్స్ యంటీబయోటిక్ యంటీబయోటిక్ అందుకనే పూర్వకాలంలో గడపలకి పసుపు రాసేవారు అవునా ఆడవాళ్ళు కాళ్ళకు పసుపు రాసుకుంటారు దాంట్లో ఉండేటువంటి ఈ రెసిస్టెన్స్ పవర్ అనేటువంటి ఆ గుణం వలన అది రెసిస్టెన్స్ పవర్ అనేటువంటి గుణము మన ఆరోగ్యానికి దానిలో ఉండేటువంటి విశిష్ట లక్షణము నెగిటివ్ ఎనర్జీ మన దగ్గరికి రాకుండా కాపాడుతుంది.
(17:23) ఉమ్ ఓకే చిన్న ఇంకొక చిన్న జాగ్రత్తగా నిశిధంగా పరిశీలిస్తే డేంజర్ సిగ్నల్ ఉంటుంది. దాని కలర్ ఏంటి? రెడ్ ఆ రెడ్ కి మనకు పూజలో వాడేటువంటి వస్తువు ఏంటి కుంకుమ ఆ కుంకుమ ఎక్కడి నుంచి వస్తుంది పసుపు నుంచి పసుపు కొమ్ము నుంచే వస్తుంది. అర్థమైందా అంటే దానిలో ఉండేటువంటి కొన్ని విశిష్ట లక్షణాలు ఒక సింధూరము రంగు ఒక పసుపు రంగు అందుకే చూడండి పసుపు రంగుని ఎలర్ట్ సిగ్నల్ కింద వాడతారు.
(17:52) రెడ్ సిగ్నల్ ని డేంజర్ కి వాడతారు. వాటిలో ఉండేటువంటి వేవ్ లెంత్ వలన నెగిటివ్ ఎనర్జీ మన దగ్గరికి రాకుండా ఉంటుంది అందుకంటే ఆంజనేయ స్వామి భక్తులు సింధూరం పెట్టుకుంటారు అమ్మవారి భక్తులు కుంకం పెట్టుకుంటారు పసుపు రాసుకుంటారు ఇవన్నీ దేనికి అంటే నెగిటివ్ ఎనర్జీస్ మన దగ్గరికి రానివ్వకుండా కాపాడుతుంది మీ ఇంటికి వచ్చేటువంటి వాళ్ళ ఆలోచనలు ఏముంటాయి మీకు తెలుసా తెలియదు తెలిీదు కదా మిమ్మల్ని చూసి మెచ్చుకునే వాళ్ళు ఒకళ్ళయితే అసూయ చెందే వాళ్ళు ఒకళ్ళు వాళ్ళ ఏ ఆలోచన మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఈ పులిహార అనేటువంటి నివేదన ద్వారా ఆ నెగిటివ్ ఎనర్జీని మన కట్టడి
(18:25) చేయడానికి ఉపయోగపడుతుంది ఒకటే రీజన్ రెండు అమ్మవారికి ఇష్టమైన నివేదనలలో పులిహోర అత్యంత ప్రాముఖ్యమైనది మూడు ఏ బ్యాక్టీరియా అంటకుండా ఆరోగ్యంగా మన ఇంటికి రావచ్చు సో సైన్స్ అండ్ ట్రెడిషన్ నెగటివ్ ఎనర్జీని దూరం చే స అందుకనే సనాతన ధర్మము అది ఒక మతము కాదు ఇన్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ లైఫ్ మీరు వేసే ప్రతి అడుగులోన ఒక సైన్స్ ఉంది సైన్స్ ఉంది అఫ్కోర్స్ ఈనాటి కాలానికి ఆ సైన్స్ చాదస్తం అనిపిస్తుంది.
(18:57) ఏమో ఇప్పుటికి అలా అనిపోస్తుంది రేపు పొద్దున వాళ్ళు నిజం తెలుసుకుంటారు. లేదు మళ్ళీ ఓల్డ్ ఈస్ గోల్డ్ లాగా పాత పద్ధతులే అనుసరిస్తున్నారు అనుసరిస్తున్నా అంటే స్టైల్ దగ్గర నుంచి ఓల్డ్ ఫ్యాషన్ దగ్గర నుంచి ఇప్పుడు కొత్త విధానాలు ఎలా అయితే అలవరిస్తున్నారో పాత పద్ధతులే ఇప్పుడు అలవరిస్తున్నా అలవాటు చేసుకోవడం కూడా ఎందుకంటే దేని గురించి అంటే మీ ఆరోగ్యం ఐ విల్ టెల్ యు వన్ థింగ్ మొన్న నా ఫ్రెండ్ ఒకతను అమెరికా నుంచి నాకు ఒక వీడియో పంపించాడు.
(19:20) హమ్ ఒక బేకరీలో ఫెర్మెంటెడ్ కర్డ్ రైస్ అంటే పులిసినటువంటి పెరుగు అన్నాన్ని ఆ 10 డాలర్స్ కో 8 డాలర్స్ కో పెట్టి అమ్ముతున్నారు వాళ్ళు మీ పూర్వం రోజుల్లో మీ నాన్నగారు మీ నాన్నగారి నాన్నగారు వాళ్ళు ఏం తినేవారు ఉదయం పూట తర్వానే అన్నం తినేవారు అంతేనా రాత్రి పొలియబెట్టినటువంటి దాని అన్నాన్ని పొద్దున్న ఆవకాయ కలుపుకొని తింటే రోజు మొత్తంలో ఎక్కడైనా వాళ్ళకి ఏమైనా అనారోగ్యం ఉందా మనం మన చేజేతుల మన ఆహారపుట అలవాట్లతోటి జీవన విధాన ధానంతోటే మన ఆరోగ్యాలు పాడు చేసుకుంటాం పాడుచేసుకుంటాం సో ఈ ఈనాటి కాలంలో ఏదైనా ఒక పండగ వచ్చింది అంటే పులిహారు మర్చిపోయాం మనం బిర్యానీ
(19:59) నూనను ఫ్రైడ్ రైస్లకి వెళ్ళిపోతున్నాం మనం బట్ దీంట్లో ఉన్నటువంటి ఆహారం చింతపండు తిన్న వ్యక్తికి అజీర్తి అనేటువంటి రోగం రాదు. దాంట్లో కొన్ని ఇంగ్రేడియంట్స్ లో కావలసినంత మాగ్నీషియం ఉంటుంది మీకు దట్ ఇంక్రీసెస్ యువర్ ఎపటైట్ మీ ఆకలి పెంచుతుంది ఇవన్నీ దాంట్లో ఉండే లక్షణాలు ఏదో ఒక ట్రెడిషన్ కి కచ్చితంగా సైన్స్ అనేది ముడిపడి ఉంటుంది అది ఆరోగ్యానికి సంబంధించి ఇంకొక రెండు నెలల్లో మీకు వినాయక చవితి వస్తుంది అవును వినాయక చవితిలో ఉండ్రాలు తింటారు మీరు ఏమిటిది బికాజ్ మీకు వర్షాకాలం ఉడకబెట్టిన ఆహారాలు తినాలి తినాలి వేయించిన పదార్థాలు తక్కువ తినండి
(20:35) మ్ ఎంత సైన్స్ ఉంది దాంట్లో కరెక్ట్ సో సో అవర్ ట్రెడిషన్ ఇస్ నాట్ మెంట్ ఫర్ సూపర్స్సియస్ అప్రోచ్ ఒక చాదస్తపు పోకడతో వెళ్ళడానికి కాదు చాదస్తము ఉంది అంటే అది వ్యక్తిగతం అది అంతే కానీ అందులో ఉన్న సాంప్రదాయం వెనకుఉన్న రహస్యం మనల్ని ప్రకృతికి అనుసంధానం చేస్తుంది. ఇట్స్ నాట్ సూపర్స్టిషియస్ మూఢ నమ్మకాలు కాదు కానే కాదు అది ప్రకృతిని మనకు అనుసంధానం చేస్తుంది.
(21:02) వర్షం పడుతుంది నేను ఉడికించిన ఆహారం తింటే నేను జ్వరం వస్తుందా నాకు రాదు అప్పుడు నా నా జీవనశైలి ఎంత సాఫీగా వెళ్తుంది లేకపోతే కచ్చితంగా జ్వరం వస్తుంది వారం రోజులు మందులు తీసుకోవాలి పడుకోవాలి అయిపోయింది బాడీ కూడా ప్రాబ్లమ ప్రాబ్లమేటిక్ గా అయిపోతుంది అలా ఓకే సో అంత సైన్స్ ఉంది సో పులిహార ఈ శెనగలు అనేటువంటి దాంట్లో ఇంత రహస్యం తాగి ఉంది సో నెక్స్ట్ ఈ మధ్యకాలంలో పెళ్లిలన్నీ చూస్తున్నాము ముహూర్త బలం అనేది ఎంత విశిష్టమైనదో అందరికీ తెలుసు ప్రాముఖ్యత చెందింది తెలుసు అయితే ఫోటో ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ ముహూర్తం టైం కి కాకుండా బెల్లం జీలకర్ర పెట్టడం
(21:35) దగ్గర నుంచి తాలి కట్టడం వరకు వాళ్ళు ఎలా చెప్తే అలా పోజులు ఇచ్చుకుంటూ తాలి కట్టడం పోజులు ఇచ్చుకుంటూ బెల్లం జీలకర్ర పెట్టడం అనేది చాలా చూస్తున్నాం. దీని వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అసలు ఆ ముహూర్తానికి ఉన్న బలం గాని విశిష్టత గాని ప్రాముఖ్యత ఎందుకు రోజు రోజుకి తగ్గిపోతుంది అలా అయితే ఏంటి పరిస్థితి ఇప్పుడు నేను దీనికి వివరణ చెప్పాను అనుకోండి ఈ ఫొటోగ్రాఫర్స్ అందరూ వచ్చి నా మీద దాడి చేస్తారు వాళ్ళు కానీ చెప్పాలి ఎందుకంటే నూరేళ్ల కాపురం అసలు ముహూర్తం పెట్టేది ఎందుకు ఆ ముహూర్త బలానికి ఆ ముహూర్త సమయానికి ఒకరినొకరు చూసుకుని ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుని
(22:12) మనకి తాలిక కట్టడం ముహూర్తం కాదు జీలకర్ర బెల్లం పెట్టడమే ముహూర్తం అవును ఆ పెట్టే సమయంలోనే తెరచాటు పక్కకు తీసి ఒకళ్ళొకళ్ళలోకి ఒకళ్ళు చూసుకోవాలి. వీళ్ళు ఇంకా తెరచాటు తీయను కూడా తీయరు ఫోటోగ్రాఫర్లు ఎంటర్ అవుతారు. ఒకసారి ఇటు చూడండి అంటారు ఆవిడ ఎవని చూస్తుంది ఆవిడ ఫోటోగ్రాఫర్ని పెళ్లిఅయిన తర్వాత ఇంకా వాళ్ళ మీద ఒకరి మీద ఒకళకి ఆసక్తి ఉంటుంది ఇంకా అక్కడ సో బెల్లం జీలకర్ర పెట్టడమే ఒకరినొకరు ఒకరినొకరు చూసుకోవడం ఆ కంటి కలయక కంటి ద్వారా శక్తి ప్రసరణ జరుగుతుంది.
(22:44) ఇక్కడి నుంచి ఆ బెల్లం జీలకర్ర కూడా ఒక విశిష్టత ఉంది బెల్లం జీలకర్ర అక్కడ పెట్టడంలో అది ఎంత గట్టిగా బంధం అది ఏర్పడుతుందో అది మీ సహస్రారం మీద ఎప్పుడైతే పడిందో ఈ చేతిలో ఉండేటువంటి ఎనర్జీ అటు ఆ చేతిలో ఉండేటువంటి ఎనర్జీ ఇటు పాస్ అయ్యి ఒకళ్ళకొకళ్ళకి ఆ అనుబంధం ఏర్పడుతుంది. ఇది శక్తి క్షేత్రం లలితా సహస్రనామాన్ని చదివితే సహస్రారాం భుజారుడా సుధా సారాభివర్షిణి అని అమ్మవారికి పేరు ఇది మనకు ఉన్నటువంటి ఏడు చక్రాలలో ఇది సహస్రార చక్రం అక్కడ ఉన్నటువంటి అమ్మవారు అమృత బృందువులని స్రవింప చేస్తోంది అని మనకి దాని అర్థం దానికి మరి ఈనాటి కాలానికి ప్రమాణం
(23:26) లేకుండా ఎవరో నమ్మరు కదా మ్ 1985 లో లండన్ శాస్త్రవేత్తలు ఒక విశిష్టమైనటువంటి ఒక గుణాన్ని కనుకున్నారు ఏమిటి అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఆకారంలో మీరు కూర్చుని మీరు ఒక మంత్రోచ్చాటన కనుక విశేషంగా చేస్తూ అమ్మవారి ధ్యానం గాన ఏదైనా మీకు నచ్చినటువంటిది ధ్యానం చేస్తూ ఉంటే మీ ధ్యాన ఫలితం వలన ఈ సహస్రారం నుంచి ఒక 90 డిగ్రీస్ ఈ ఆజ్ఞా చక్రానికి సహస్రారానికి ఒక 90 డిగ్రీస్ పర్పెండికులర్ కోణంలో ఒక రకమైనటువంటి ద్రవం స్రవిస్తోంది.
(24:00) ఒక లిక్విడ్ ఆరిజినేట్ అవుతోంది. ఆ లిక్విడ్ ని క్యాన్సర్ కణాలు ఉన్నటువంటి ఎలక మీద ప్రయోగిస్తే అది యాంటీడోట్ గా పనిచేసింది దానికి అంటే మీరు చేస్తున్నటువంటి అమ్మవారి అనుష్టానము మీలో కలిగిస్తున్నటువంటి మీలో సృజింపచేస్తున్నటువంటి ఆ ద్రవము మిమ్మల్ని శక్తివంతంగా మారుస్తుంది సెల్స్ ఏవైనా రిపేర్ కూడా అయ్యే ఛాన్సెస్ కాదు ఉన్నాయి ఇంకొకటి దీనికి కంటిన్యూస్గా అదే ఎగజాంపుల్ చెప్తాను ఎయిమ్స్ 2009 మే నెలలో సండే టైమ్స్ తేదీ నాకు గుర్తులేదు ఎవరైనా లైబ్రరీకి వెళ్ళగలిగితే మే జూన్ ఆ ప్రాంతాలలో సండే టైమ్స్ లో ఒక ఆర్టికల్ వచ్చింది.
(24:44) ఎడిషన్లో సండే ఎడిషన్ లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఎయిమ్స్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక లేడీ షి వాస్ డయాగ్నైజ్డ్ విత్ బ్రెయిన్ ట్యూమర్ ఓకే ఏవండీ ఆ బ్రెయిన్ ట్యూమర్ ఆవిడని బాధిస్తున్న సమయంలో కొంతకాలం నేను రోగులకు సేవ చేసి ఆరు నెలలు టైం ఇచ్చారు ఆవిడకి నేను దాటిపోదాం అన్న ఉద్దేశంతోటి ఆవిడ ఎయిమ్స్ లో జాయిన్ అయ్యి యోగా ప్రాక్టీస్ చేస్తూ నిరంతరము కూడా మెడిటేషన్ చేస్తూ ఆవిడ అక్కడ సేవ చేయడం ప్రారంభించింది.
(25:13) ఈవెన్ టుడే షి ఇస్ అలైవ్ ఏం జరిగి ఉంటది గురువుగారు లోపల ఉన్నటువంటి బ్రెయిన్ ఆ ట్యూమర్ కరిగిపోయింది ఆ ధ్యానం అనేటువంటి గొప్ప ప్రక్రియ వలన మంత్రోచ్చాటన అనేటువంటి గొప్ప ప్రక్రియ వలన ఆ ట్యూమర్ కరిగిపోయింది ఆ ట్యూమర్ కి ఆ శక్తి ఉన్నది. కరిగిపోయే శక్తి ట్యూమర్ కి ఉన్నది కరిగించే శక్తి ధ్యానానికి ఉన్నది. ఇట్స్ నాట్ ఏ జోక్ అందుకని ఈ సహస్రారం ఏదైతే అంత శక్తివంతమైనదో అక్కడే మీ చేత జీలకర్ర బెల్లం పెట్టిస్తున్నారు అది చేతిలో పెట్టొచ్చుగా నోట్లో పెట్టొచ్చుగా ఎందుకు సహస్రాల మీదే పెట్టిస్తున్నారు అంత శక్తివంతమైన అంటే అక్కడ ఒక మనిషిని ఇంకొక మనిషిని
(25:54) కనెక్ట్ చేసేటువంటి ఒక ప్రక్రియ అన్నమాట ఒక గురువు తన శిష్యుడికి శక్తిపాతం ఇవ్వడానికి ఇదే సహస్రారం మీద చెయి పెడతాడు. అందుకనే ఎవళని పడితే వాళ్ళని చెయి పెట్టనివ్వకూడదు తల మీద చాలా డేంజర్ మనకు ఉన్నటువంటి ఎనర్జీని వాళ్ళు లాగేసుకుంటారు. అందుకనే అక్కడ ఏం జరుగుతుంది వాళ్ళద్దరి మధ్యన ఒక కనెక్టివిటీని ఏర్పరుస్తున్నారు. ఆ కనెక్టివిటీని సహస్రారం ద్వారా ఏర్పాటు చేస్తున్నారు.
(26:19) సహస్రారం ద్వారా ఏర్పాటయినటువంటి కనెక్టివిటీ కళ్ళ ద్వారా అటాచ్మెంట్ లోకి వెళ్తుంది. అందుకనే ఎంత సిస్టమేటిక్ గా చెప్పారు అంతవరకు ఒకళళనొకళ్ళు చూసుకోకూడదు ముహూర్త సమయానికి మాత్రమే చూసుకునేటట్టుగా జీవితాంతం కలిసి ఉండేటట్టుగా ఎంత అద్భుతమైన ప్రక్రియ ముహూర్త బలం ముహూర్త బలం ముహూర్త బలం ఆ ముహూర్త బలం కూడా మన వాళ్ళు శాస్త్రం ఎంత చక్కగా చెప్పింది రాత్రిపూట వివాహ ముహూర్తాలు పెట్టమని చెప్పింది వివాహానికి గ్రహ ప్రవేశానికి రాత్రిపూట పెట్టమని చెప్పింది ఎందుకని చంద్రబలం అధికంగా ఉంటుంది.
(26:55) ఎప్పుడైతే చంద్రబలం ముహూర్తంలో అధికంగా ఉంటుందో మనసు నిర్మలంగా ఉంటుంది పెళ్లిలకి గృహ ప్రవేశ ప్రవేశానికి చంద్రబలం బాగుండేటట్టుగా ముహూర్తాలు పెట్టమన్నారు మనమేమో ఇప్పుడు మధ్యాహ్నం 11:30రకి మన కంఫర్టబుల్ టైం అందరూ వచ్చి భోజన భోజనాలు చేసి నాకు రెండో ఖర్చు లేకుండా ఇలా ఆలోచిస్తున్నాం మనం కానీ ఒకప్పుడు ముహూర్తాలు చంద్రబలం తెల్లవారు జామున ముహూర్తాలు ఎందుకు పెట్టేవారు అంటే ఎక్కడైతే చంద్రబలం అధికంగా ఉందో ఒకళళనొకళ్ళ అర్థం చేసుకుని అన్యోన్ ంగా ఉంటాడు ఇతను కోప్పడిన ఆమె ఎక్కువ అందుకని పూర్వకాలంలో మగవాళ్ళు ఎంత కోప్పడినా ఆడవాళ్ళు ఓర్చుకునేవాళ్ళు ఆడవాళ్ళు ఎంత
(27:31) కోప్పడినా మగవాళ్ళు అంతే సరదాగా తీసుకునేవాళ్ళు ఇప్పుడంటే చిన్న మాట అంటే పౌరుషాలు వచ్చేస్తాయి సో ఇవన్నీ పాటించట్లేదు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ వస్తుంది సో దీని పర్యవసాన మనం చూస్తున్నాం మనం కాబట్టి ఎంతటి ఎన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టి మీరు పెళ్ళళ్లు చేస్తున్నా అంతిమంగా దాని యొక్క లక్ష్యం ఏమిటి అంటే వాళ్ళద్దరూ అన్యోన్యంగా ఉండడం అంతే కదా సో ఆ మెమరీస్ ఉండాలి అంటే మీరు కచ్చితంగా అన్యోన్యంగా ఉంటేనే ఆ మెమరీస్ కి విలువ ఆ ఫోటోలకి విలువ అంతే అంతే కదా లేకపోతే ఏమవుతుంది ఈ రోజు ఫోటో తీసుకుంటాం రేపు పోతే మళ్ళీ ఇంకోటితో తీసుకోవాల్సి వస్తుంది ఎందుకు వచ్చింది ఆ
(28:04) కర్మ [నవ్వు] ఇప్పుడేదో డైరెక్ట్ గా ప్రశాంతంగా చేయడం చక్కగా ఫోటోగ్రాఫర్ ని ఒక క్షణం నియంత్రించండి ఫోటోగ్రాఫర్లు మీ జీవితంలో ఈ ఫోటోలు అనేటువంటివి ఎంత మెమరబుల్ అంటే ఒక ఒక ఐదేళ్లో ఆరేళ్లో వాటి విలువ ఉంటుంది. తర్వాత మీరు మామూలుగా జీవనశ్రవంతలో పడిపోతారు పిల్లలుని కాపురం అని చనిపోతారు. కానీ మిమ్మల్ని అలా నడిపించేటువంటి ఆ బలం ముహూర్తానికి ఉంది కాబట్టి ముహూర్తాన్ని నిర్లక్ష్యం చేయకండి.
(28:32) ప్రొసీజర్స్ ని విలువిచ్చి కాపాడుకోండి. సో ఇది చూసిన వాళ్ళు డెఫినెట్లీ ఇప్పటి నుంచనాయనా పెళ్ళీలలో ముహూర్త బలము అండ్ ఈ ప్రొసీజర్స్ డైరెక్ట్ గా డెఫినెట్ గా పాటించాలి. పాటించి అన్యోన్యంగా [గొంతు సవరించుకోవడం] ఉండండి ఫస్ట్ అంతకుమించి ఏం గేమ అక్కర్లే గురువుగారు ఇప్పుడు గృహప్రవేశాలు చాలా మంది చేసుకుంటూ ఉన్నారు అండ్ ఇందులో ప్రధానమైన కన్ఫ్యూషన్ ఏంటంటే ఇప్పుడు భార్యా భర్త గృహప్రవేశం చేయాలా లేకపోతే భర్తకు సంబంధించిన అమ్మ నాన్న అంటే అత్త మామ చేయాలా పూజలు కానీ అక్కడ వ్రతాలు కానీ అండ్ గృహ ప్రవేశం కానీ ఎవరు చేయాలి పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు
(29:01) చేయాలా ఈ భార్యా భర్త చేయాలా అనేది చాలా సందిగ్దంలో ఉన్న ప్రశ్న నిజంగానే సో ఏం చేయాలంటారు ఒక ఇల్లు మీరు కొంటున్నారు అనుకోండి ఆ ఇంటికి సంబంధించినటువంటి ద్వారము గాని అయము గాని ఆ సింహద్వారం గాని లేకపోతే మిగిలినటువంటి చాలా అంశాలు ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉన్నది అనేది చూసి అక్కడ వాస్తు సిద్ధాంతి మీకు ఒక ప్లాన్ ఇవ్వడం గాన ఆ వాస్తు ప్రకారం ఇల్లు కట్టడం గాన జరుగుతుంది.
(29:29) మ్ సహజంగా గ్రహ ప్రవేశ ముహూర్తం అనేటువంటిది జన్మ నక్షత్రాన్ని బట్టి కాక నామ నక్షత్రాన్ని బట్టి పెడతారు. ఓకే ఎందుకు ఇప్పుడు నా పేరు సూర్యకిరణ నన్ను ఇంట్లో మా నాన్నగారు మా అమ్మగారు మిగతా వాళ్ళందరూ సూర్యకిరణ గారు సూర్యకిరణో సూర్యకిరణో కిరణో ఏదో పిలుస్తారు నన్ను నన్ను ఎంత ఆ పేరుతో ఆ ఇంట్లో పిలుస్తూ ఉంటే ఆ ఇంటికి నాకు అంత బలం పెరుగుతూ ఉంటుంది.
(29:52) మ్ అందుకని ఆ బలం పెరగడం కోసం నామ నక్షత్రంతో పెట్టేటువంటిది గృహప్రవేశ ముహూర్తం. ఓకే ఏవండీ అయితే ఇప్పుడు ఒక ఒక అబ్బాయి ఒక తండ్రి తల్లి తండ్రి అబ్బాయి కోడలు ఉన్నారు. అబ్బాయి కోడలు పేరు మీద ఇల్లు కొనుక్కున్నారు. ఇల్లు కట్టేటప్పుడు అన్ని విధాలుగా కూడా వాళ్ళద్దరికీ సరిపడే విధంగా వాళ్ళు ప్లాన్లు వేయించుకున్నారు ముహూర్తాలు పెట్టుకున్నారు అన్నీ బాగున్నాయి.
(30:19) ఇప్పుడు తండ్రి అక్కడ చేయడం వలన ఆ ముహూర్తం గాని లేకపోతే ఆ వాస్తు గాని అతనికి పడదుఅనుకోండి ఆ ఇంట్లో శోభ ఎలా జరుగుతుంది కాబట్టి పెద్దవాళ్ళుగా వాళ్ళు ఉండి ఆశీర్వదించి ఎవరి పేరు మీద అయితే ముహూర్తం పెట్టారో ఎవరి పేరుని అనుసరించి ఇల్లు కట్టారో వాళ్ళు చేసుకోవడం అనేటువంటిదే సంప్రదాయం ఓకే కానీ ఇప్పుడు ఏంటంటే కొంతమంది పురోహితులు లేకపోతే కొంతమంది పెద్దవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు ఉండగా చిన్న పిల్లల చేత చేయిస్తున్నారు ఏమిటి మీరు అనేటువంటి ఒక స్పర్ధని తీసుకురావడం జరుగుతుంది కానీ పిల్లలు కూడా అమ్మ నాన్నకు ఆ ప్రాముఖ్యత ఇవ్వాలి ప్రాముఖ్యత ఇవ్వాలనేటువంటి దానితోటి
(30:53) వాళ్ళు చేస్తున్నారు అది పొరపాటు ఓకే ఎందుకంటే ఏ పేరుమీద మీద ఆ స్థలం బలం అయం బలం ద్వార బలం ముహూర్త బలం ఉన్నాయో వాళ్లే కూర్చుని చేయాలి. సో ఇవన్నీ కూడా అంటే ఫస్ట్ లో కూడా నామబలం మీదనే మనం ముహూర్తాలు పెట్టడం కానీ వాస్తు కానీ ప్లానింగ్ కానీ ఇవన్నీ కూడా అన్నీ కూడా నామబలం మీదనే మీరు గృహ ప్రవేశం చేసినంత మాత్రాన పిల్లవాడు యజమాని అయిపోడు.
(31:20) వాడు ఇంటికి ఈఎంలు కట్టుకుంటూ ఉంటాడు కానీ ఇంటికి యజమాను ఎప్పుడు తండ్రే డెఫినెట్లీ పెద్దవాళ్ళు ఎవరున్నారో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ వా శాస్త్రం చాలా స్పష్టంగా ఏం చెప్తుంది మీ నాన్నగారు మీ అమ్మగారు ఉన్నారుఅనుకోండి మీరు మీ వారు ఉన్నారనుకోండి మీ నాన్నగారు అమ్మగారే నైరుతి బెడ్రూమ్ లో పడుకోవాలి మీరు పడుకోకూడదు. ఇంటికి పెద్దవాళ్ళు ఇంటికి పెద్దవాళ్ళు వాళ్ళే యజమానులు వాళ్ళు అక్కడ పడుకోవాలి.
(31:39) వాయువ్యంలోనే మీరు పడుకోవాలి చిన్న పిల్లలు ఓకే ఇంతే శాస్త్రం మిగతా అన్నీ కూడా శాస్త్ర ప్రమాణం అనుసరించి ఎవరి పేరు మీద అయితే మొదటి నుంచి అంతా కట్టారో వాళ్లే చేయడం ఇంటికి శ్రేయస్కరము ఇంట్లో వాళ్ళకి శ్రేయస్కరం సో ఇంకా ఈ గృహప్రవేశానికి సంబంధించి ఎటువంటివి తెలిసి తెలియక చేసిన మిస్టేక్స్ కామన్ గా ఏం చేస్తున్నారు సహజంగా ఏమిటి అంటే గృహప్రవేశ ముహూర్తాలు కూడా ఇప్పుడు సూర్యబలం ప్రాముఖ్యంగా ఉదయం పూట పెట్టేస్తున్నారు.
(32:07) రాత్రి పూట పెట్టండి ఓకే కొన్ని కొన్ని ఉన్నాయి నియమాలు ఉన్నాయి హస్తా నక్షత్రంలో గృహ ప్రవేశం చేయకూడదని కొన్ని నియమాలు ఉన్నాయి మనకి అలా శాస్త్రాన్ని అనుసరించి చంద్రబలం ప్రాముఖ్యంగా ఉన్నప్పుడు గృహ ప్రవేశం చేసుకోండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పద్ధతి మా గురువులు నేర్పిన పద్ధతి మాది అలా ఉన్నాయి ప్రాంతాల పద్ధతులు పూజ మీరు సాయంకాలం చేసేసుకుని నెక్స్ట్ డే కావాలంటే తర్వాత రోజు ఉదయం మీరు అతిథులందరికీ భోజనం పెట్టండి తప్పేమ లేదు సత్యనారాయణ వ్రతం కూడా నెక్స్ట్ డే చేసుకు చేసుకుంటాం ప్రవేశం మాత్రం చంద్రబలం ఉన్నప్పుడు రాత్రిపూట ముహూర్తం
(32:39) చేయడం అనేది సర్వశ్రేయస్కరమైనటువంటి విధానం అది ఎప్పుడైనా చంద్రబలం ఎంత బలంగా ఉంటే మనసు అంత అనుకూలంగా ఉంటుంది. అది చాలా ప్రాముఖ్యత చేయకూడని పొరపాట్లు ఏమిటి అంటే అదే ఈ ముహూర్త విషయాలలో ఇవి లోటుపాట్లు తర్వాత ముందే లోపలికి ఫోటోగ్రాఫర్లు వెళ్ళిపోవడం మళ్ళీ అక్కడ కూడా ఫోటోగ్రాఫ్ లోపల నుంచి ఫోటోలు తీయడం కోసం వెళ్ళిపోతారు వాళ్ళు ముందు నుంచి అవును మరి ముందు వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా యజమానికి విలువ ఉంటుంది అసలు ఇం గృహ ప్రవేశానికి అసలు అది ప్రోగ్రామ్ కర్దే శంటిటీ ఫర్ దట్ డెఫినెట్లీ అవునా సో ఇవన్నీ కొంచెం నియంత్రించండి ఆర్భాటాలకి వెళ్ళకండి ఫోటోలు పెర్మనెంట్
(33:16) కాదు హ్ మంత్రము మంత్ర బలము ఆ ఆ సమయంలో జరుగుతున్నటువంటి ఆ ఆ విధి చాలా ముఖ్యం. ఓకే చాలా మంది ఇంకోటి ఏం చేస్తున్నారంటే పొరపాటు ఇల్లు పూర్తిగా తయారైపోయిన తర్వాత గృహ ప్రవేశం చేస్తున్నారు. అవును ఇంటీరియర్ వర్క్స్ తో పాటు అన్ని అయిపోయిన తర్వాత చేస్తున్నారు అలా చేయకూడదు. హమ్ ప్రాథమిక దశలోనే మీకు కొన్ని వసతులు ఏర్పడిన వెంటనే గృహప్రవేశం చేసుకుని తర్వాత మళ్ళీ మీరు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు పుణ్యాహవచనం చేసుకొని అప్పుడు వెళ్ళాలి.
(33:48) ఓకే గృహప్రవేశం మా గురువు గారు చెప్పేవారు గృహప్రవేశం అయిన తర్వాత కూడా ఇంట్లో రిపేర్లు జరగాలి ఇంటి పని జరగాలి. అంతా అయిపోయింది ఇగో [గొంతు సవరించుకోవడం] ఈరోజు గృహప్రవేశం రేపు సామాలు మార్చేసుకుంటున్నాం అంటే అలా కుదరదు. అది పొరపాటు కిందే లెక్క. అందుకని గృహప్రవేశం చేసుకున్న తర్వాత కూడా ఇంట్లో పనులు జరిగే విధంగా బేసిక్ వసతులతోటి ఇంటి గృహ ప్రవేశం చేసుకునేట్లుగా ఏర్పాటు చేసుకోండి.
(34:11) ఓకే మళ్ళీ నియమాలకు అనుగుణంగా మీరు ఆవుని ఆ వాటి అవన్నీ ఇంట్లోకి ఇప్పుడు తీసుకురాలేం అపార్ట్మెంట్లు కాబట్టి కనీసం ఆ ఎంత వీలైతే అంత కనీసం సాంప్రదాయబద్ధంగా చేసుకునే ప్రయత్నం చేయండి. అవును ఆ ముహూర్త బలం యొక్క గొప్పతనం ఏమిటంటే ఆ ఏ నామ నక్షత్రం తోటి మీకు ముహూర్తం పెట్టారో ఆ పేరుతోటి ఎంత మీరు ఆ ఇంట్లో పిలవబడతారో ఆ ఇంట్లో మీకు అంత వృద్ధి కలుగుతుంది మీ ద్వారా మీ కుటుంబానికి వృద్ధి కలుగుతుంది.
(34:39) అండ్ నెక్స్ట్ చండీ హోమం ఈ మధ్య చాలా మంది చేయించుకుంటున్నారు దాని యొక్క విశిష్టత ఏంటి ప్రాముఖ్యత ఏంటి చండీ హోమ్ ఎవరెవరు చేయించుకోవాలి అసలు ఎక్కడ చేయించుకోవాలి ఏ టైంలో చేయించుకోవాలి చెడి కోపయతీతి చెండి అంటే అధర్మం ప్రబలినప్పుడు అమ్మవారికి కలిగేటువంటి క్రోధ స్వరూపం చెండి చండి చెండి అనగానే అందరిలో ఒక భయం ఏర్పడుతుంది బాబాయ్ క్రోధ స్వరూపం అమ్మవారి కోపంగా ఉంటుంది అని ఒక చిన్న పిల్లవాడు ఏదైనా చేయకూడని పని చేశడు అనుకోండి వెంటనే నే అమ్మ వెళ్లి వెనకాల వాడి వీపు మీద ఒక దెబ్బ వేస్తుంది అంత మాత్రాన్న అమ్మ ఆ బిడ్డకి శత్రువా కాదు
(35:15) అదేవిధంగా అధర్మం ప్రబలినప్పుడు అమ్మవారికి కలిగేటువంటి కోప స్వరూపము చెండి అది అధర్మం వరకే ఆ అధర్మము మళ్ళీ ధర్మ మార్గంలో పడగానే అమ్మవారు మనల్ని దగ్గరికి తీసుకుంటుంది ఆవిడ కలవు చండీ వినాయకః అని శాస్త్రం కలియుగమునందు విశిష్టమైనటువంటి ఆరాధన స్వరూపాలు ఏమిటి అంటే వినాయకుడు చండి ఈ వినాయకుడికి ఉన్నటువంటి మహత్తరమైన శక్తి ఏమిటి అంటే సౌభాగ్యప్రదమైనటువంటి స్వరూపము వినాయకుడు ఆకర్షణ స్వరూపము వినాయకుడు అయితే ఆకర్షణ అనేటువంటి దాంట్లో ఎవరు పడితే వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టకుండా మనల్ని నియంత్రించి నడిపేటువంటిది చెడ్డండి
(35:58) సో ఇప్పుడైతే కచ్చితంగా అది చాలా అవసరం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న సిచువేషన్స్ లో మనకి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అంటే ఎంత పుణ్యం చేసిన వాడికైనా సరే కలి ప్రభావం ఎలా అంటుతుంది వాడిని అంటే ఆకర్షణి అద్భుతమైనటువంటి సత్కార్యాలు చేస్తున్నాడు కదా అయినా గాని వీడికి ఇదో ఏదో ఒక లోపం ఎందుకుఉంది అని అనగానే అక్కడ ఆకర్షణ ఏదో ఉంటుంది ధనమో ఇంకోటో ఏదో ఉంటుంది అక్కడ ఆ అలా వీటన్నింటిని కూడా నియంత్రించి మనల్ని ఉత్తమ మార్గంలో నడిపించగలిగినటువంటి దేవతా స్వరూపాలు కలియుగంలో ఎవరు అంటే వినాయక నాయకుడు దుర్గాదేవి ఆ దుర్గాదేవికి ఉన్నటువంటి మరొక పేరు
(36:42) చండీదేవి అసలు ఏమిటి ఈ ఇద్దరిని ఎందుకు కొలవాలి అది కూడా ఇంపార్టెంటే కదా కలియుగంలో నవగ్రహముల యందు ఛాయా గ్రహములైనటువంటి రాహు కేతువుల యొక్క ప్రభావము భూమండలం మీద అధికంగా ఉంటుంది. ఇప్పుడు సమాజంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే అనవసరమైనటువంటి వైరాగ్యాలు అవునా అవును లేదంటే విపరీతమైనటువంటి జలసా జలస అంతేనా సమాజం ఇలాగే నడుస్తుంది డెఫినెట్లీ ఎమోషనల్ ఇంబాలెన్సెస్ ఎప్పుడు ఎమోషనల్ దానికి కారకుడు ఎవరు కేతు కేతు ఏమ్మా ఇక రాహువు విపరీతమైనటువంటి కోపం విపరీతమైనటువంటి మనిషిలో ఒక రకమైనటువంటి మాత్సర్యం నాకు తెలియదా నువ్వు నువ్వు
(37:28) చెప్పాలా అవునా మనకి పూర్వం ఒక సామెత ఉండేది నోరు మంచిదయితే ఊరు మంచిది అవుతుంది మ్ అంతేనా అవును ఏమ్మా బాగున్నావా అని నేను అడిగాను అనుకో ఆ బాగున్నానండి ఏం బాగున్నావా అంటే ఆ బానే ఉన్నా అంటే నా ప్రశ్నను బట్టి మీ ఉత్తరం అంతేనా కదా అంతే అలా మన మాటలో ఒక రకమైనటువంటి పదును ఏర్పరిచి నేను అనేటువంటి అహంభావాన్ని నాకు కలిగించేటువంటి ప్రయత్నము ఒక గ్రహం రాహు గ్రహం చేస్తే ఆ రాహు గ్రహం యొక్క ప్రతికూలత మనల్ని బాధించకుండా రాహు గ్రహానికి అధిపతి అయినటువంటి చండీపరదేవత మనల్ని కాపాడుతూ ఉంటుంది.
(38:10) ఓకే అలా అని రాహు గ్రహం చెడ్డదా కాదు సుమా మనలో రాహు గ్రహం యొక్క అనుగ్రహం లేకపోతే మీకు అఖండ రాజయోగము సిద్ధించడం అసాధ్యం అంటే ప్రతి గ్రహానికి వాటి వాటి ధర్మాలు నిర్వర్తిస్తాయి అవి ఆ రాహు గ్రహానికి ఉన్నటువంటి చిన్న ప్రతికూలత మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఆ సమయంలో మనం చేయించుకునేటువంటి ఆ అమ్మవారి యొక్క ఆరాధన మనకి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది.
(38:38) ఓకే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మానవీయ సంబంధాలు బాగుండడానికి ఉపయోగపడుతుంది. అంతేనా నేను మీ మంచిని కోరుకొని మీరు నా మంచిని కోరుకొని మనం వేరే వాళ్ళ మంచిని కోరుకుంటూ ఉంటే అందరూ బాగుంటారు కదా డెఫినెట్లీ సో అందుకు చండీ హోమం అనేది చేసుకో ఇది ప్రాతిపదిక అయితే దుర్గాదేవిని కొలవడానికి చండీ దేవిని కొలవడానికి చండీ హోమం ఒక్కటే మార్గమా అనే ప్రశ్న ఉత్సమనం అవుతుంది.
(39:03) [గురకలు] చండీ అనేటువంటిది ఒక మాలా మంత్రంగా చెప్పబడుతుంది. మార్కండేయ పురాణంలో ఒక అంతర్భాగంగా సురధుడు అనేటువంటి మహారాజు చెప్పబడినటువంటి ఒక వృత్తాంతం సమాధి అనేటువంటి ఒక వైశ్యుడు వాళ్ళకి జరిగినటువంటి ఆ సంభాషణ అమ్మవారి యొక్క ప్రాముఖ్యత అమ్మవారు సంహరించినటువంటి మధుకైటవ సంహారము మహిషాసుర సంహారము చండ చండముండులని శుంభ నిశుంభులని సంహరించి రక్తబీజులని సంహరించినటువంటి వృత్తాంతాన్ని 700 శ్లోకాలుగా మనకి చెప్పబడింది.
(39:37) ఓకే దానికి అమ్మవారికి ఉపాంగాలుగా కొన్ని అంటే పూర్వాంగము ఉత్తరాంగం అంటే చెండీ సప్తశతితో పాటుగా ఇంకొన్ని చేయాలి మనం ఆ చేసే నేపథ్యంలో ఒక విశిష్టమైనటువంటి ఒక స్తోత్రాన్ని పారాయణ చేస్తాం. దాని పేరు అర్గ స్తోత్రం అర్గ స్తోత్రం అర్గము అంటే అర్థం ఏమిటంటే గడియ అంటే లాక్ అన్నమాట అంటే ఏదైనా ఒక వ్యవహారము లాక్ అవుతూ ఉంటే ఆ దాన్ని అన్లాక్ చేసేటువంటి శక్తి అర్గ స్తోత్రానికి ఉంటుంది.
(40:12) ఓకే అలా అమ్మవారి యొక్క విశిష్టమైనటువంటి నామాలని అమ్మవారి యొక్క నామాన్ని మంత్రముగా మార్చి మార్కండేయ మహామును మనకు అందించినటువంటిది సప్తశతి అంటారు. సప్తశతి మనం సప్తశతి అంటాం నార్త్ ఇండియాలో దీన్ని చండి అంటారు. కొన్ని కొన్ని చోట్ల దీన్ని దేవీ మహాత్మయము అని కూడా పిలుస్తారు. ఓకే దీనికి మూడు పేర్లు ఉన్నాయి. సహజంగా అమ్మవారికి అష్టమి చాలా విశేషమైనటువంటి తిధి మనకి ఒక ప్రమాణం ఉంది శుక్ల పక్ష అష్టమి ఈశ్వరారాధనకి బహుళ పక్ష అష్టమి అమ్మవారి ఆరాధనకు ప్రీతికరం అలాగే మంగళవారము అలాగే పౌర్ణమి తిధి తర్వాత త్రయోదశీ తిధి ఇలా కొన్ని కొన్ని తిధులు అమ్మవారు మనకి
(40:55) సప్తశతిలో చెప్పబడింది సంవత్సరానికి ఒకసారి ఆస్వయుజ మాసంలో అలా కొన్ని కొన్ని మాసాలు నాలుగు నవరాత్రులు వస్తాయి మనకి మాఘ నవరాత్రులు వసంత నవరాత్రులు ఆషాడ నవరాత్రులు శరణ నవరాత్రులు మాఘ నవరాత్రులని శ్యామలా నవరాత్రులని గుప్త నవరాత్రులు అని పిలుస్తారు. వసంత నవరాత్రుల యందు లలితా మహా త్రిపుర సుందరి దేవిని కొలుస్తాం మనం అలాగే ఆషాడ నవరాత్రులు వారాహి నవరాత్రులుగా ప్రసిద్ధి దానిని కూడా గుప్త నవరాత్రులు అంటారు ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు.
(41:25) ఓకే శరణ నవరాత్రుల్లో మళ్ళీ అమ్మవారిని లలితా మహా త్రిపుర సుందదేవి అని కొలుస్తాం. ఈ నవరాత్రి సమయంలో మనం చండీ హోమం చేయడం అనేటువంటిది అత్యంత శుభప్రదం. ఓకే ఇప్పుడు చండి హోమం అనేటువంటిది సర్వసాధారణం అయిపోయింది నిజానికి అంద ఎవరు పడితే వాళ్ళు చండి అనేస్తున్నారు వాళ్ళు కానీ ఆ చండి అనేటువంటిది కామ్యంతో ఒకటి కంటే కూడా లోక కళ్యాణం కోసం చేయడం అనేది సర్వశ్రేష్ట సర్వశ్రేష్టం దాంట్లో ఉండేటువంటి ప్రతి అధ్యాయంలో ప్రతి మంత్రము కూడా ఏ ఒక్కల గురించో రాసింది కాదు.
(41:57) లోక కళ్యాణం కోసమే కదా అమ్మవారు అవతరించింది అందరూ బాగుండాలని చేయడం సర్వశ్రేష్టం కామ్యం కోసం కూడా చేసే పద్ధతి ఉన్నది విశిష్టమైనటువంటి ఎవరు పడితే వాళ్ళు చండి చెప్పుకున్నాం మేము చండి చేసేస్తున్నాం అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం తప్పుపట్టక్కర్లేదు ఉపాధి కింద ఉంటది ఎలా చేయాలి గురు సాంప్రదాయాన్ని అనుసరించి ఒకళ్ళ సాంప్రదాయము ఇంకొకరి సాంప్రదాయంలో తేడా వస్తే దాన్ని మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా సమర్థవంతంగా చేయించేటువంటి పురోహితులని పట్టుకొని చేయించుకోవడం వలన శీఘ్ర ఫలితం రావడం సత్యము అవును దీనికి కొన్ని విశేషమైనటువంటి సంపుటీకరణలు
(42:33) కూడా ఉన్నాయి. అంటే ఫలితాన్ని బట్టి సో అలా చండి వినాయకుడు అనేటువంటి ఈ రెండు స్వరూపాలు కలియుగంలో మనల్ని అద్భుతమైనటువంటి ఉన్నత పదంలో ఆ ఉన్నత పదము అనేటువంటిది కేవలము ఈ ఆదాయ మార్గమే కాదు ఆధ్యాత్మిక మార్గం కూడా అలా మనల్ని నడిపించి మనతో ఉండేటువంటి వారందరినీ కలుపుకుని సుహృద్భావంతోటి మనం జీవించడానికి ఉపయోగపడే ఇద్దరు దేవతలు వినాయకుడు చండీపలదేవత ఓకే అందులో చండి విశేషమైనటువంటి రాహు గ్రహ అనుకూలతకు కారణం అవుతుంది.
(43:10) వినాయకుడి వలన కేతు గ్రహ అనుకూలతకు కారణమై అఖండ రాజయోగ సూచిక అన్నమాట ఓకే అందుకని చండీ హోమ చేయించుకోవడం చేయించుకోవడం అలా అని విపరీతంగా అది అదఒక ఏంటంటే దాన్ని ఒక మొనటోనియస్ గా కాకుండా దానికి ఒక విధానం ఉంది. ఆ విధానం గురువులని అనుసరించి ఒక విశిష్టంగా చేయడం వలన ఫలితం శీఘ్రంగా వస్తుంది. థాంక్యూ థాంక్యూ సో మచ్ పరమేశ్వరి అనుగ్రహం [సంగీతం]
No comments:
Post a Comment