Wednesday, June 17, 2026

మంత్రాలు సాధనలు అంటూ సమయాన్ని వృధా చేసుకోవద్దు ! | MEDITATION IS A WASTE OF TIME #prasadthota

మంత్రాలు సాధనలు అంటూ సమయాన్ని వృధా చేసుకోవద్దు ! | MEDITATION IS A WASTE OF TIME #prasadthota

Author Name:Vastavam Channel

Youtube Channel Url:https://www.youtube.com/@vastavam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=u5RAGMaqFUo



Transcript:
(00:00) చాలామంది నాకు కామెంట్స్ లో ఈమెయిల్స్ లో నాకు ఒక మంత్రాన్ని ఉపదేశించండి నాకు ఫలానా కష్టం ఉంది లేదంటే ఫలానా కోరిక ఉంది నేను మంత్ర సాధన చేయాలనుకుంటున్నాను అని అడుగుతూ ఉన్నారు దీని గురించి మీకు కొన్ని ముఖ్యమైన ఆ వివరాలు ముఖ్యమైన విషయాలు చెప్పడం నా బాధ్యత మంత్రం మంత్ర సాధన మంత్రోపదేశాలు వీటి గురించి ఈ విషయాలు మీరు తెలుసుకొని తీరాలి మంత్ర సాధన అనేది ఇంతకు ముందు చాలాసార్లు చెప్పినట్టు ఎవరైనా చేయొచ్చు కానీ అది అంత సులువైన మార్గం కాదు ముందు దానికి ఒక మూడు లక్షణాలు మీలో ఉన్నాయో లేదో చూసుకోండి ఆ తర్వాత అసలు
(00:45) మంత్ర సాధనకు వెళ్లొచ్చా వెళ్ళకూడదా అనేది మీరే నిర్ణయించుకోవచ్చు పట్టుదల పట్టుదల ఏంటంటే ప్రతి రోజు కూడా ఆ మంత్రాన్ని సాధన చేయడం గంట రెండు గంటలు ఆ మంత్రానికి నిర్దేశించిన సమయం సమయాన్ని కేటాయించి ప్రతి రోజు పట్టుదలగా చేయడం రెండవది క్రమశిక్షణ ప్రతి దేవతా ఉపాసనలో కూడా కొన్ని విధానాలు విధిగా పాటించవలసినవి ఉంటాయి వాటిని క్రమశిక్షణతో మనం పాటించగలమా లేదా మూడోది సహనం ఏ మంత్రం అయినా సరే ఏ దేవతా ఉపాసన అయినా సరే చేయంగానే మొదలు పెట్టంగానే కొన్ని రోజుల్లో మనకు ఫలితాన్ని ఇవ్వదు కొన్ని కొన్ని మంత్రాలు కొన్ని కొన్ని ఉపాసనలు కొన్ని కొన్ని
(01:30) నెలలు పట్టొచ్చు కొన్ని సంవత్సరాలు కూడా పట్టొచ్చు అప్పటివరకు అది ఆ ఫలితం వచ్చేవరకు కూడా సహనంగా వేచి చూసే శక్తి మనలో ఉందా లేదా అసలు మనకు అంత సమయం ఉందా లేదా మీరు అనుకున్న కోరిక అప్పటివరకు ఆగలదా లేదా ఇవన్నీ తెలుసుకోకుండా మంత్ర సాధన అంటూ మొదలు పెడితే ఒకటే జరిగేది ఏంటంటే మీ జీవితంలో సమయం మొత్తం వృధా అయిపోయినట్టే అనవసరంగా కాలయాపన చేయడం తప్ప దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు సరే ఈ మూడు లక్షణాలు మీకు మీకు ఉన్నాయి మంత్ర సాధన దేవతో ఉపాసన చేయాలనే బలమైన కోరిక మీకు ఉంది ఆ సంకల్ప బలం ఉంది అనుకుందాం నిజాయితీగా మీకు మీరే మీ గురించి మీరు
(02:10) తెలుసుకున్నారు ఇప్పుడు నెక్స్ట్ గురువు మీకు ఆ మంత్రాన్ని ఉపదేశించి ఆ మంత్రాన్ని సాధన చేయడంలో చివరి వరకు కూడా అంటే ఆ ఫలితం ఆ లభించే వరకు కూడా మీతోనే ఉండి మిమ్మల్ని నడిపించగలిగే గురువు కావాలి అవునా అయితే ఇక్కడ ఇంకొక చాలా ముఖ్యమైన విషయం గురువు అంటే ప్రతి ఒక్కరు కూడా పొరపాటు పడేది ఏంటంటే పండితులు వేరు ప్రవచన కర్తలు వేరు అట్లాగే స్వాములు వేరు యోగులు వేరు వీళ్ళందరిలోనూ ఈ పేర్లల్లో చాలా వ్యత్యాసం ఉంది ఎవరో youtube లో మీకు ఆధ్యాత్మిక విషయాలు నాలుగు చెప్పంగానే వాళ్ళు స్వామి అయిపోరు వాళ్ళు గురువు అనొచ్చు గురువు అంటే మీకు ఏదో
(02:54) నేర్పించేవాడు మీకు ఒక విషయాన్ని తెలియజేసేవాడు అనొచ్చు కానీ వాళ్ళు స్వామీజీలు అయిపోరు కొన్ని వేషభాషలను చూసి కూడా అందరూ మోసపోతూ ఉంటారు వేషభాషలు అంటే పెద్ద పెద్ద నామాలు పెట్టుకొని పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని ఆ మెడ నిండా రుద్రాక్ష మాలలు వేసుకొని కాషాయ బట్టలు వేసుకొని జుట్టు విచిత్రమైన జుట్టు పిలకలు ఇవన్నీ పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళందరూ కూడా స్వామీజీలు కాదు మిమ్మల్ని గురువులుగా నడిపించే శక్తి వాళ్ళకి ఉండదు పండితులై ఉండొచ్చు వాళ్ళకి ఎంతో జ్ఞానం ఉండి ఉండొచ్చు గొప్ప ప్రవచన కర్తలు అయి ఉండొచ్చు వాళ్ళు వేరు మీకు పేపర్ మీద మీరు
(03:33) అడగంగానే మీకు ఒక మంత్రాన్ని రాసి ఇచ్చేసి పోయి సాధన చేసుకోండి అనేవాళ్ళు మీ గురువులు కాదు మీ అర్హత తెలుసుకొని మీకు ఆ మంత్రాన్ని చేయడానికి కావలసిన అర్హత ఉందా లేదా మినిమమ్ ఎలిజిబిలిటీ ఉందా లేదా ముందు తెలుసుకోవాలి తెలుసుకొని మీకు ఆ మంత్రాన్ని ఇచ్చి దాన్ని ఉపదేశం అంటాం ఇచ్చి దాన్ని ఎలా చేయాలి ఏ విధంగా సాధన చేయాలి అని మీరు సాధన చేస్తుంటే జీవితాంతం మీతో తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించగలగాలి అంతేగాని ఒక పేపర్ మీదో లేకపోతే ఒక ఈమెయిల్ లోనే మంత్రం ఇచ్చేసి చేసేసుకో అయిపోయింది అంటే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు మీకు కనపడరు అలాంటి వాళ్ళు మీకు గురువుగా
(04:10) కాలేరు దాని వల్ల ప్రయోజనం ఉండదు మీకు ఏంటంటే డైరెక్షన్ లేకుండా మీరు వెళ్ళిపోతూ ఉంటారు దాని వల్ల బోల్డ్ అంతా టైం వేస్ట్ మీరు అనుకున్నది జరగదు అయితే మరి ఎలా అండి ఈ సమస్యకు పరిష్కారం మేము ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలి దేవత ఉపాసన చేయాలి మంత్ర సాధన చేయాలి మరి గురువు గురించి ఎలా తెలుసుకోవాలి దానికి ఒక మాట మార్గం ఉంది చెప్తాను మీకు ఆ కోరిక కలిగినప్పుడు అంత పట్టుదల అంత సహనం ఆ క్రమశిక్షణ మీలో ఉన్నాయి అనుకున్నప్పుడు ఏదో ఒక దేవతనో దేవుడినో నమ్ముకొని ముందు మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించండి భక్తి ఆ ఆధ్యాత్మిక ప్రయాణం సింపుల్ గా
(04:46) ప్రతి రోజు మీరు చేసుకునే పని మీరు చేసుకుంటూ ఆ దేవుణ్ణి కొలుస్తూ ఉండండి మనసులో మీ సంకల్పం ఎంత బలమైనదో ఆ బలాన్ని బట్టి మీకు ఒక ఎదుటి మనిషి మాట్లాడుతూ ఉన్నప్పుడు అతను అతనిలో ఆ శక్తి ఉందా లేదా అతను మీకు గురువుగా నిలబడి మిమ్మల్ని నడిపించగలడా అన్న విషయాన్ని గ్రహించగలిగే శక్తి వస్తుంది మీకు ఎవరు పడితే వాళ్ళు గురువులు కాదు వాళ్ళ వేషభాషలు చూసి మోసపోవద్దు మీకు గనక ఆధ్యాత్మిక బలం మీలో గనక చేరితే మీకే ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది మనం మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి నిజమైన గురువా కాదా ఆ వ్యక్తికి ఆ సిద్ధి శక్తి ఉన్నాయా లేదా అలాంటి వ్యక్తి
(05:27) దొరికే వరకు కూడా మీ ఆధ్యాత్మికంగా మీరు అలా మీ ప్రయాణం చేస్తూ ఉండండి అంతే మీ సంకల్పం బలమైనది అయితే ప్రకృతే మీకు కావలసిన గురువుని మీకు కావలసిన వ్యక్తిని మీ జీవితంలో ప్రవేశించేలా చేస్తుంది ఆ ప్రకృతే దేవత అన్నా దేవుడన్నా అదే దైవశక్తి ఇది వాస్తవం ఇది బాగా అర్థం చేసుకోండి ఈ విషయాలు సరిగ్గా అర్థం చేసుకోకుండా ఆ క్లారిటీ లేకుండా గనక మీరు ఈ మంత్ర సాధనలు అంటూ మొదలు పెట్టారంటే ఎంత కాలం చేసినా సరే ఎన్ని సంవత్సరాలు పట్టిన సరే మీకు ప్రయోజనం ఉండదు కేవలం మీ జీవితంలో సమయాన్ని వృధా చేసుకోవడమే ఇక నా విషయానికి వస్తే నన్ను చాలా మంది
(06:06) అడుగుతున్నారు కాబట్టి నా విషయం కూడా మీకు చెప్పాలి నేను మంత్రాలు మంత్రోపదేశాలు చేసే స్వామీజీని కాను నేను ఒక సాధకుడిని ఒక ఉపాసకుడిని నా స్పిరిచువల్ ప్రయాణంలో నా ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను తెలుసుకున్న విషయాలు నేను నేర్చుకున్న విషయాలు నా సొంత అనుభవాలు అది కూడా హేతుబద్ధం అయితేనే వాటిని మీతో షేర్ చేస్తా అందులో కొన్ని కొన్ని విషయాలు బాహాటంగా చెప్పకూడనివి ఉంటాయి వాటిని రహస్యాలు అంటారు మన శాస్త్రాల్లో అలాంటివి ఎందుకు రహస్యాలు అంటారు అంటే బయటికి చెప్పేస్తే వాటిని అర్థం చేసుకోకుండా గనక ఆచరించడానికి ప్రయత్నం చేస్తే వాటి వల్ల
(06:48) సనాతన ధర్మానికే నష్టం ఆ చేస్తున్న వ్యక్తులకే నష్టమే అందుకని ఏంటంటే అలాంటివి బయట చెప్పడం కన్నా కూడా ఆ రహస్యాలుగా నువ్వు ఉండనివ్వడమే మంచిది కాబట్టి అలాంటి విషయాలు మాత్రం నేను ఎప్పుడూ చెప్పను ఎందుకంటే అలాంటి సాధనలు ప్రయత్నాలు చేయడం వల్ల ప్రయోజనం కన్నా కూడా నష్టమే ఎక్కువ జరుగుతుంది సరైన గురువు లేకుండా అలాంటి సాధన మొదలు పెడితే చాలా నష్టపోతారు కాబట్టి అలాంటి వాటిని నేను ఎట్టి పరిస్థితిలో కూడా పబ్లిక్ గా చెప్పను హేతుబద్ధత లేని మూఢ నమ్మకాలు పిచ్చి నమ్మకాలు మతం పేరుతో నేను ప్రచారం చేయను పుస్తకాల్లో చదివి వాటిని 10 మందికి
(07:26) పంచే అలవాటు నాకు లేదు నేను చేయను మతం పేరుతో చాలా మంది చాలా అవాస్తవాలని ప్రచారం చేస్తున్నారు అది ఒక వ్యాపారం అయిపోయింది దయచేసి వాటిని నమ్మొద్దు వాటిని ఆచరణలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయవద్దు అవన్నీ కూడా హేతుబద్ధత లేని నిరూపణ లేని ఆధారాలు లేని కేవలం కొన్ని కల్పిత కథలు మాత్రమే వాటితోటి మీ జీవితాన్ని మీ జీవిత సమయాన్ని ఎట్టి పరిస్థితులు వృధా చేసుకోవద్దు భక్తి ఒక దేవుణ్ణి నమ్ముకోండి మీకు నచ్చిన దేవుణ్ణి నమ్ముకోండి ఆ దేవతలకి పూజలు చేయండి ఎంతవరకు అంతవరకే ఉపాసన చేయగలిగే శక్తి ఉంటే ఉపాసన చేయండి మిగిలిన సమయాన్ని అంతా మీ కర్మ మీద లేదా
(08:10) అదే కర్మ అంటే మీ పని మీద వినియోగించండి మీ పని మీద ఏకాగ్రత పెట్టండి అదే జీవితంలో విజయాన్ని తెచ్చిపెడుతుంది అంతేగాని తెలిసి తెలియకుండా ఎవరో చెప్పారు ఎక్కడో youtube లో చూసాము అని చెప్పి ఇది చేసేద్దాము ఆధారాలు లేని సాధనల కోసం వెళ్లి మీ సమయాన్ని దయచేసి వృధా చేసుకోవద్దు ఓం శ్రీ మాత్రే నమః

No comments:

Post a Comment