Thursday, June 25, 2026

​మీ శరీరంతో మాట్లాడండి,రోగాలను దూరం చేసుకోండి! | #Mind-Body Connection#SelfHealing #MindBodyMedicine

​మీ శరీరంతో మాట్లాడండి,రోగాలను దూరం చేసుకోండి! | #Mind-Body Connection#SelfHealing #MindBodyMedicine

Author Name:Maha

Youtube Channel Url:https://www.youtube.com/@healingwithmaha

Youtube Video URL:https://www.youtube.com/watch?v=OHQ1KB87ULo



Transcript:
(00:00) అందరికీ నమస్కారం మన శరీరంతో మనం మాట్లాడుకోవడం వల్ల కలిగే ఐదు ప్రయోజనాల గురించి ఈ వీడియోలో చూద్దాం. మనతో మనం మన శరీరంతో మనం మానసికమైన ఆధ్యాత్మికమైన ఒక కనెక్షన్ ఏర్పరచుకోవాలి ఎందుకంటే మన శరీరంలో ఒక సూపర్ కాన్షియస్ వ్యవస్థ అనేది ఉన్నదన్నమాట. ఫస్టు మన శరీరంతో మనం మాట్లాడుకోవాలి. అంటే ఏంటో వింతగా ఉంది అనుకుంటున్నారా ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత గానీ లేదా నైట్ పడుకోబోయేటప్పుడు గానీ ఒక టూ మినిట్స్ మనతో మనం మాట్లాడుకోవటం అన్నమాట మన చేతుల్ని ఇలా హృదయం పైన పెట్టుకొని కళ్ళు మూసుకొని నా శరీరం నాకు ఒక రక్షణ వలయం లాగా కాపాడుతుంది.
(00:41) నా శరీరంలోని ప్రతి కణం ఆరోగ్యంగా ఆనందంగా ఉంది అని ఇలా చెప్పుకోవడం వల్ల మన మైండ్ లో హ్యాపీ హార్మోన్స్ అనేది రిలీస్ అయ్యి మనకి ఇమ్యూనిటీ పవర్ పెరగటానికి బాగా హెల్ప్ చేస్తుంది. రెండు ప్రాణాయామం ప్రాణాయామం అనేది మన మనసుకి మన శరీరానికి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది అన్నమాట. మనం ఎప్పుడైనా సరే ఒత్తిడిగా ఉన్నప్పుడు షార్ట్ బ్రెత్ తీసుకుంటాం అన్నమాట సో మనం దీర్ఘ శ్వాస తీసుకోవాలి మన వెన్నుని నిటారుగా పెట్టుకొని మన దృష్టిని ఇక్కడ నాసాగ్రం పైన పెట్టి ఆ శ్వాస లోపలికి తీసుకునేటప్పుడు ఈ యూనివర్స్ లో నుంచి ఒక ప్రాణశక్తి
(01:28) జీవశక్తి అనేది మన లోపలికి ఎంటర్ అవుతున్నట్టు బయటకి గాలి వదిలేటప్పుడు ఇప్పుడు మనలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకి వెళ్ళిపోతున్నట్టు విజువలైజేషన్ చేసుకోవాలి అంటే ఊహించటం అన్నమాట ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన శరీరం మన మైండ్ లో రెస్ట్ అండ్ డైజెస్టివ్ అనే కాస్ చేసే నర్వస్ సిస్టం యాక్టివేట్ అవుతుందన్నమాట ఈ నర్వస్ సిస్టం యొక్క మెయిన్ పని ఏంటి మనకి బాడీకి కావలసిన తగినంత విశ్రాంతి ఇవ్వటానికి అలాగే మనం తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అయ్యి మన బాడీలో ప్రతి పార్ట్ కి చేరటానికి నర్వస్ సిస్టం చాలా పనిచేస్తుంది అన్నమాట దీని వల్ల మనకి
(02:06) ఏమవుతుంది స్ట్రెస్ తగ్గుతుంది డిప్రెషన్ తగ్గుతుంది హార్మోనల్ ఇంబాలెన్స్ అన్నీ సరవుతాయి అన్నమాట మూడు లిసెన్ టు ద బాడీ సిగ్నల్స్ అంటారు అంటే మన బాడీ మనతో మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుందో వినాలట మన బాడీ మనకి అలసట ఆకలి నొప్పులు ఇలా మనకి మనతో మాట్లాడుతుంది అలసటగా ఉన్నప్పుడు ఇంకా బర్డెన్ చేయకుండా తగినంత విశ్రాంతిని ఇవ్వటము నొప్పులు అంటే పెయిన్ కిల్లర్స్ వేసుకోకుండా ఏ మెథడ్స్ ఫాలో అవుతే మనకి ఆ పెయిన్ నుంచి మనం దూరం అవుతామో అది ఫాలో చేయటము ఆకలిగా అంటే ఆకలిగా ఉన్నప్పుడు ఫుడ్ తీసుకోవడం ఏం ఫుడ్ తీసుకోవాలో ఏం ఫుడ్ తీసుకోకూడదో బాడీ మనకి కమ్యూనికేట్
(02:46) చేస్తుంది. మైండ్ ఫుల్ ఈటింగ్ అంటారు కదా అలాంటిది చేయడం వల్ల మనకి మన బాడీతో మనకొక డీపర్ కనెక్షన్ ఏర్పడటం వల్ల మనలో హీలింగ్ ప్రాసెస్ అనేది ఫాస్ట్ గా జరుగుతుంది. నాలుగు గ్రాటిట్యూడ్ టు ద బాడీ అంటారు అంటే కృతజ్ఞతా భావం కలిగి ఉండటం అంట మన శరీరం పట్ల మనకి మార్నింగ్ పుట్టిన దగ్గర నుంచి ఊపిరితో ఊపిరి బిగిన్ అవుతుంది.
(03:09) మన గుండె కొట్టుకుంటూ ఉంటుంది. ఈవెన్ మన కాళ్ళు నడవటానికి హెల్ప్ చేస్తాయి. మన చేతులు పనులు చేసుకోవడానికి మన కళ్ళు దృష్టించడానికి ఇలా ప్రతి ఈవెన్ మనం నిద్రపోతున్నా సరే కంటిన్యూస్గా మనకి ఊపిరి ఊపిరితిత్తులు పని చేస్తూనే ఉంటాయి. గుండె పని చేస్తూనే ఉంటాయి. అట్లీస్ట్ వాటికి థాంక్స్ చెప్పడం అన్నమాట. ఆ పార్ట్స్ ని పట్టుకొని చేతులు పట్టుకొని థాంక్యూ టు మై హాండ్స్ నాకు పని చేయటానికి హెల్ప్ చేస్తున్నందుకు థాంక్యూ నా చెవులు వినిపిస్తున్నందుకు థాంక్యూ నా కళ్ళు ఈ లోకాన్ని చూపిస్తున్నందుకు థాంక్యూ మై హార్ట్ నా గుండె నిరంతరం ఎటువంటి
(03:40) విశ్రాంతి తీసుకోకుండా కొట్టుకుంటున్నందుకు ఇలా ప్రతి పార్ట్ ని మనం టచ్ చేస్తూ థాంక్స్ చెప్పుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనలో ఒక ఎన్న లేని పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవహిస్తుంది అన్నమాట సో అప్పుడు మనకి మనక ఏమవుతుంది ఇంకా ఒత్తిడి స్ట్రెస్ ఇవన్నీ నెగిటివ్ ఎమోషన్స్ వల్లే కదా ఇవన్నీ దూరమైపోయి మనకి హీలింగ్ అనేది ఫాస్టర్ గా జరుగుతుంది.
(04:04) ఐదు ఈ శరీరం అనేది పంచభూతాలతో తయారయింది. సో కనెక్షన్ టు ద నేచర్ అంటారు అంటే నేచర్ కి దగ్గరగా ఉండటం అన్నమాట. సో మన శరీరం కూడా భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం వీటితో తయారైంది కదా వీటికి దగ్గరగా ఉంటే మనకి హీలింగ్ ప్రాసెస్ అనేది త్వరగా జరుగుతుంది. అంటే డే లో కొంచెం సేపు సన్ లైట్ లో సన్ కి ఎదురుగా నిలబడటం సో దట్ మనకి కావలసిన ఎనర్జీ అంతా సన్ నుంచి వస్తుందన్నమాట.
(04:33) చెప్పులు లేకుండా గ్రాస్ లో నడవటం వాటర్ బాడీస్ దగ్గర కొంచెంసేపు మనం ఎప్పుడైనా వెకేషన్ కి వెళ్ళినప్పుడు స్పెండ్ చేయడం ఇట్లాంటివి చేయటం వల్ల ఏమవుతుంది అంటే మనకి హీలింగ్ అనేది త్వరగా జరుగుతుంది. సో అందుకే అంటారు యద్భావం తద్భవతి అంటే ఈ శరీరం గురించి మనం ఏమి ఆలోచిస్తామో అది అలానే తయారవుతుంది. ఇది రోగాల పుట్ట అని మనం ఆలోచిస్తే అది రోగాల పుట్టలానే తయారవుతుంది.
(05:00) లేదు ఇది వజ్రం అని మనం ఫీల్ అయితే అది వజ్రంలానే తయారవుతుంది మన శరీరాన్ని మనం ఒక శత్రువులా కాకుండా మంచి మిత్రుడులాగా భావించాలి స్వామి వివేకానందులు కూడా ఇదే విషయాన్ని చెప్తారు ప్రతి రోజులో కనీసం ఒక వన్ టూ మినిట్స్ అయినా సరే మనతో మనం మాట్లాడుకోవాలి లేకపోతే మనం ఒక మంచి మిత్రుని మిస్ అవుతాము అని చెప్పి మన శరీరమే మనకి అత్యంత మంచి స్నేహితుడు ఆ స్నేహితురాలు సో దానితో స్నేహం చేద్దాం మనం ఆరోగ్యంగా ఉందాం.
(05:29) శ్రీ మాత్రే నమః

No comments:

Post a Comment