Wednesday, June 17, 2026

 1. ప్రారంభ ప్రార్థన (Opening Prayer)

మనం చేసే యోగాకి మనస్సు, శరీరం సహకరించాలని మరియు అందరిలో సద్భావన ఉండాలని కోరుకుంటూ ఈ ప్రార్థన చేస్తారు:

మంత్రం:


ఓం సంగచ్ఛధ్వం సంవదధ్వం 
సం వో మనాంసి జానతామ్ |
దేవా భాగం యథా పూర్వే
 సంజానానా ఉపాసతే ||

అర్థం:

ఓ మానవులారా! మీరంతా కలసికట్టుగా నడవండి. మీరంతా ఏకమై ఒకే మాట మాట్లాడండి. మనస్సులన్నీ ఏకమై, పూర్వపు దేవతల వలె తమతమ విధులను సక్రమంగా నిర్వర్తించండి.

 యోగా ముగింపు ప్రార్థన (Shanti Path / Closing Prayer)

యోగ పూర్తి అయిన తర్వాత, శాంతిని మరియు అందరి శ్రేయస్సును కాంక్షిస్తూ ఈ ప్రార్థనను పఠిస్తారు:

మంత్రం:

ఓం సర్వే భవంతు సుఖినః 
సర్వే సంతు నిరామయాః |
సర్వే భద్రాణి పశ్యంతు 
మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ ||
ఓం శాంతిః శాంతిః శాంతిః ||

అర్థం:

ప్రపంచంలోని జనులందరూ సుఖంగా ఉండాలి. అందరూ రోగరహితులుగా (ఆరోగ్యంగా) ఉండాలి. అందరూ శుభాలనే చూడాలి. ఎవరూ కూడా దుఃఖాన్ని అనుభవించకూడదు.

No comments:

Post a Comment