Thursday, June 18, 2026

మగవాళ్ళ పాత్ర ఉండదా? || @sridevi_vlogs515

మగవాళ్ళ పాత్ర ఉండదా? || @sridevi_vlogs515

Author Name:RAJAHMAHENDRI__SRIDEVI

Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515

Youtube Video URL:https://www.youtube.com/watch?v=eXjtKsiur9Y



Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మనందరి జీవితాలని మార్చేసే చిన్న టాగ్ చెప్పుకుందాంండి సంతోషం కావాలి అంటే ఉన్నదానితో సంతృప్తి చెందాలి అన్న విషయం అయితే మర్చిపోకండి మరి ఈరోజు మనం ఏ టాపిక్ మీద వీడియో చేస్తున్నామో అన్నది చర్చించుకుందాము. ఈ సొసైటీని బిల్డ్ చేసేది ఆడవాళ్లేనా మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లోకి వచ్చి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఇది ఒకప్పుడు మాట ఒకప్పుడు ఆడవాళ్ళు జాతి నిర్మాతలుగా వ్యవహరించేవారు కుటుంబ వ్యవహారాల్లోనూ పిల్లల పెంపకంలోనూ తల్లి మొదటి గురువుగా తమ ప్రధానమైన
(00:47) పాత్రలోనూ అలాగే బయట వ్యవహార శైలిలో లోన అన్నిటిలోనూ ముందుండి కుటుంబాల్ని నడిపించేవారు. మరి ఈరోజు అటువంటి పరిస్థితులు ఉన్నాయా ఆడవాళ్ళు ఈ సొసైటీని బిల్డ్ చేయటం పోగా ఇంకా నాశనం చేస్తున్నారనే చెప్పాలా మరి ఇది ఎంతవరకు నిజం ఆడవాళ్ళందరూ ఇలాగే ఉన్నారా అంటే టక్కుమని మనం చెప్పొచ్చు ఎక్కువ శాతం మంది ఇలానే ఉన్నారు ఈ సొసైటీ పొల్యూట్ అయిపోతుంది అనే ఈరోజు ఈ టాపిక్ తీసుకోవాల్సి వచ్చింది అనమాట ఏ టాపిక్ చేసిన ఆడవాళ్ళకి చాలా కోపం వస్తుంది మేము తప్పులు చేశమని అంటున్నారు మరి మగవాళ్ళు తప్పులు చేయట్లేదా వాళ్ళు చేస్తే తప్పు తప్పు కాదా మేము చేస్తే ఒకటా వాళ్ళు
(01:32) చేస్తే ఒకటా అని ప్రశ్నిస్తున్నారు అన్నమాట మరి సొసైటీ బిల్డ్ అవ్వటానికి మగవాళ్ళ పాత్ర లేదంటారా అది ఎంతవరకు ఉంది మగవాడి పాత్ర ఉంటుంది అది కొంతవరకే అని మనందరికీ తెలుసు ముఖ్యంగా ఒక ఇల్లు గాని ఒక కుటుంబ గాన ఒక ప్రాంతము గాని ఒక దేశము గాని బాగుపడాలి అంటే ఆడవాళ్ళ పాత్ర అత్యధికంగా ఎక్కువ శాతంలో ఆడవాళ్ళ పాత్రే ఉంటుంది.
(02:04) మరి మొదటి గురువు తల్లి ఒక తల్లి పిల్లలకి మొదటి గురువుగా వ్యవహరిస్తుంది. తన పిల్లలకు విలువలతో పాటు సంస్కారంతో పాటు క్రమశిక్షణ నేర్పిస్తూ ఉంటుంది. సమాజంలో ఎలా మెలగాలి ధర్మం మీద నిలబడాలి క్రమశిక్షణగా ఎలా ఉండాలి చెడ్డదారులు ఎలా తొక్కకూడదు అనే అవగాహన కల్పిస్తుంది. మరి ఈరోజు స్త్రీలకి అటువంటి అవగాహన ఉందంటారా ఖచ్చితంగా లేదనే చెప్పాలి.
(02:33) కుటుంబానికి కేంద్రబిందువై వ్యవహరిస్తుంది. ఒక ఆడది కుటుంబ సభ్యులను ఒకటిగా ఉంచటంలో మహిళల పాత్ర ఎంతగానో ఉంటుంది. కలిసి మెలిసి కుటుంబాలని ఉంచటం ఉమ్మడి కుటుంబాలుగా మెలగటం మహిళలు ఆ స్థానానికే ఎంతో కృషి చేసేవారు. మంచి సమాజానికి పునాది వేసేది ఒక మహిళే నండి అది మనందరికీ కూడా తెలుసు కానీ ఈరోజు పరిస్థితులు అలా లేవు కాబట్టే మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది.
(03:02) ఒక మహిళ బలంగా ఉంటే ఆ కుటుంబం బలంగా ఉంటుంది. ఆ కుటుంబం బలంగా ఉంటే సమాజం బలంగా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే ఒక మహిళే నండి ఈ దేశానికి మంచి పౌరులని అందించడంలో ఈ సమాజానికి పౌరులను తీర్చిదిద్దడంలో మహిళ కీలక పాత్ర వహిస్తుంది. అంతేకాకుండా సంస్కృతి సంప్రదాయాలని పరిరక్షిస్తుంది. మన ఆచార వ్యవహారాలను పాటించడంలో పిల్లలను తీర్చిదిద్దుతుంది.
(03:38) ఒక మహిళ పిల్లల చదువు విషయంలోనో వాళ్ళ అభివృద్ధి విషయంలోనో తన జీవితాన్ని త్యాగం చేస్తుంది. ఆరోగ్యం విషయంలోనూ సమాజం పట్ల అవగాహనకై తన సమయం అంతా కుటుంబం పైనే పెడుతుంది. సంక్షేమ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ కుటుంబాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటుంది. సమాజంలో ప్రేమ, కరుణ, సానుభూతి పెంపొందించడంలో మహిళల పాత్ర ఎంతో ఉంది. ఉద్యోగాలు మరియు వ్యాపారాల ద్వారా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకొని దేశ ఆర్థిక వ్యవస్థకై మహిళలు తోడ్పడుతున్నారన్న విషయం కూడా మనం మర్చిపోకూడదు.
(04:18) మహిళలు అక్కడితో ఆగలేదండి నాయకత్వ లక్షణాలతో ముందుండి సమాజాన్ని నడుపుతున్నారు రాజకీయాల్లో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవడమే కాక ఈ దేశాన్ని ఏలుతున్నారన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే మరి ఇదంతా ఇక్కడికి అలా ఉంచితే ఈరోజు మహిళలు ప్రత్యేకంగా ఏమైనా చేస్తున్నారా వెనకటి వాళ్ళు ఇవేమి చేయలేదా అంటే ఖచ్చితంగా చేశారు నే చెప్పాలి వాళ్ళ బాధ్యతలు మర్చిపోకుండా కుటుంబం అని పిల్లలు పెద్దవాళ్ళు సొంత విషయాలు పిల్లలని ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు విలువలతో పెంచటం సంస్కారంతో పెంచడం వాళ్ళ అభివృద్ధికై తోడ్పడటం ఉమ్మడి కుటుంబాలు నిలుపుకోవటం
(05:03) అలాగే సంబంధాలని కలుపుకోవటం ఇవన్నీ చేస్తూనే వాళ్ళ వ్యాపారాలు చేశారు ఉద్యోగాలు చేశారు ఎందులోనూ తప్పటడుగు వేయలేదు. మరి ఈ రోజు మహిళలు సొసైటీని బిల్డ్ చేస్తున్నారా అంటే ఖచ్చితంగా చేయట్లేదనే చెప్పాలి ఎందుకంటే ఉన్న సంసారాన్ని గాని కుటుంబాన్ని గాని పట్టించుకోకుండా డబ్బు వెనకాతలో పరిగెడుతున్నారు మీరు ఎప్పుడు ఆడవాళ్ళని నిందిస్తూనే ఉంటారా ఆడవాళ్ళకి డబ్బు పిచ్చా అని మరి మీరు నన్ను అడగొచ్చు నాకు కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ పెట్టొచ్చు కానీ నేను ఖచ్చితంగా ఇదే చెప్తానండి చాలామంది ఎక్కువ శాతం మంది మంద ఇలాగనే ఉన్నారు కాబట్టే చర్చించుకోవాల్సి
(05:46) వస్తుంది. ఆడవాళ్ళు ఖచ్చితంగా డబ్బు వెనకాతల పడి కుటుంబాన్ని పిల్లలని భర్తని వదిలేస్తున్నారు పక్కన పెడుతున్నారనే చెప్పాలి మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నామ అన్న అపోహులా ఉన్నారు ఏది ప్రయారిటీ ఇవ్వాలి దేనికి ఇవ్వకూడదు అన్న విషయాలు అయితే మర్చిపోతున్నారు. ఇంకా అహంతో భర్త మాట పక్కన పెట్టడం భర్తని పట్టించుకోకపోవడం ఇంకా ఈ ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవటం విడాకుల వరకు రావటం సింగిల్ గా బతకటం కాపురాలు నాశనం చేసుకోవడం వరకు వచ్చారు.
(06:22) మరి ఈరోజు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే మన సొసైటీ దారుణంగా పాడైపోయింది. చెదర పట్టినట్టు సమాజం తయారవుతుంది. దానికి కారణం కేవలం ఆడవాళ్లేనండి మహిళలకి ఎంత శక్తి ఉంది. ఎంత ప్రతిభ ఉంది ప్రత్యేకమైన స్థానం ఉంది అన్నది గమనించలేకపోతున్నారు కేవలం వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు డబ్బు కోసం ఇంకా సుఖమరిగిపోయి స్వేచ్ఛ కోసం అన్ని వదిలేస్తూ చీప్ గా బిహేవ్ చేస్తున్నారని మనం గట్టిగా చెప్పుకోవచ్చు మరి మగవాడికి బాధ్యత లేదా అని మీరు అడగవచ్చు ఈ సొసైటీకి కీ రోల్ పోషించేదే ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళు లేకపోతే పోతే సమాజం లేదు ఇల్లు లేదు ఈ సొసైటీలో కీలకమైన
(07:09) పాత్ర పోషించేదే మహిళలండి మరి మగవాళ్ళకి ఎటువంటి బాధ్యతలు లేవా కీరోలు పోషించట్లేదా సొసైటీని వాళ్ళు బిల్డ్ చేయరా అనిఅంటే కచ్చితంగా చేయరు ఎందుకు అంటే మగవాళ్ళు ఎంత ప్రతిభావంతులైనా ఎంత బలశాలలైనా కుటుంబ పెద్ద అయినా కూడా వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా పరిగణలోకి తీసుకోబడట్లేదు కేవలం ఆడది ది చిన్న తప్పు చేస్తేనే ముద్ర వేస్తున్నారు ఇది మీరు గమనించగలరు.
(07:40) మరి ఆడవాళ్ళు ప్రవర్తన ఎలా ఉండాలి అన్నది కన్న తల్లులు చెప్తున్నారా మొదటి నుంచి చిన్న వయసు నుంచి కూడా ఆడవాళ్ళకి అంటే ఆడపిల్లలకి ఈ సొసైటీ పైన గాని ప్రవర్తన పైన గాని ఎలా ఉండాలి ఉండకూడదో గాని ఒక అవగాహన కల్పించాలి. ఆడపిల్లలకి చిన్న వయసు నుంచే ఖచ్చితంగా సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు తల్లి చెప్పవలసిన పని ఉంటుందండి ఆడపిల్లలు ఎలా మెలగాలి మెసలాలి ధర్మం అంటే ఏమిటి న్యాయం అంటే ఏమిటి ఆడపిల్ల పడికెట్టు ఏమిటి వస్త్రధారణ ఏమిటి కుటుంబాన్ని ఎలా నిలబెట్టాలి ధర్మం మీద ఎలా నిలబడాలి సంస్కృతి సంప్రదాయాలని ఎలా పాటించాలో తల్లి కచ్చితంగా చెప్పాలి
(08:24) ఎందుకంటే ఈరోజు చిన్న చిన్న పిల్లలే ఎదురు సమాధానాలు చెప్పటం తల్లిదండ్రుల మాట పెడచెవును పెట్టటం అలాగే ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉండటం దాంతోనే టైం వేస్ట్ చేయటం, కాలక్షాపం చేయటం ఏమన్నా పని చెప్తే విసుక్కోవటం గట్టిగా అరవటం దయ్యం పట్టినట్టు భూతాలు పట్టినట్టు బిహేవ్ చేయటం ఇలాగే చేస్తున్నారు కాబట్టి చిన్నతనం నుంచే మనం ఇటువంటి అలవాట్లన్నీ చేస్తే ఈ సొసైటీలో మహిళలే కీరోలు పోషిస్తారని గట్టిగా చెప్పగలం మళ్ళీ అటువంటి మంచి రోజులు రావాలని ఆశిద్దాం దయచేసి ఆడవాళ్ళు ఎవ్వరూ వాటాలు వంతులు వేయకండి ఎందుకంటే మగవాడితో సరిసమానంగా ఉండాలి అన్నది ఎంత నిజమో అలాగే ఆడవాళ్ళు
(09:14) అనుకువగా ఉండాలన్నది కూడా అంతే నిజమండి అనిగి మనిగి ఉండమంటారా అన్న మాట అయితే మీరు నన్ను క్వశ్చన్ వేయవద్దు ఎందుకంటే ఏ ఎండక ఆ గొడుగు పట్టినప్పుడే మన సంసారా లు బాగుంటాయని మీరు గమనించాలి ఒక కుటుంబానికి ఆడది ఎంత ముఖ్యమైనది ఆమె పాత్ర ఎంత విలువైనది ఆ కుటుంబం నిలబడాలంటే ఆడవాళ్ళ బిహేవియర్ ఎలా ఉండాలి అలాగే వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉండాలి అన్నది తెలుసుకుంటే కచ్చితంగా ఈ సొసైటీ బాగుంటుందని నేను గట్టిగా చెప్తాను ఇది కచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి ఒక మహిళ ని విద్యావంతురాలని చేస్తే ఆ కుటుంబం విద్యావంతం అవుతుంది. ఒక కుటుంబం
(10:01) అభివృద్ధి చెందితే ఈ సమాజం అభివృద్ధి చెందుద్దన్న విషయం మర్చిపోవద్దు. సమాజానికి ఆడవాళ్ళ అవసరం చాలా ఉందండి. సొసైటీని బిల్డ్ చేసేది కేవలం ఆడవాళ్లే మగవాళ్ళు ఎన్ని తప్పులు చేసినా అవి గాలికి కొట్టుకుపోతాయి అనే విషయం మీరు మర్చిపోవద్దు. మీ విలువైన క్యారెక్టర్ ని కాపాడుకోండి. కుటుంబాన్ని బిల్డ్ చేసుకోండి.
(10:27) ఒక కుటుంబం బాగుంటే ఈ సమాజం బాగుంటుంది దేశ అభివృద్ధి బాగుంటుంది. అలాగే భారతదేశం సస్యశ్యామలంగా ఉంటుంది అని ఈరోజు ఈ వీడియో ముగిస్తున్నాను. ఈ వీడియో పై మీ అమూల్యమైన సలహాల్ని సూచనల్ని అందిస్తారని ఆశిస్తూ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అందరికీ ఉపయోగపడుతుంది. [సంగీతం]

No comments:

Post a Comment