When Ego Breaks a Marriage… and Humanity Heals It | Inspiring True Story | NTV Digital
Author Name:NTV Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@ntvtelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=A_MpW0oEqfE
Transcript:
(00:00) చట్టం ఒక ఆయుధం కానీ అది ఆత్మరక్షణకు వాడాల్సిన కవచమా లేక అహాన్ని తృప్తి పరుచుకోవడానికి ప్రయోగించే బ్రహ్మాస్త్రమా ఈ రోజుల్లో వివాహ బంధాలు ఎంత వేగంగా మూడు ముళ్ళతో ముడిపడుతున్నాయో అంతకంటే వేగంగా కోర్టు మెట్లపై ముక్కలవుతున్నాయి. అహాలు పట్టింపులు తప్పుడు కేసులు లీగల్ నోటీసులు ఇలాంటివన్నీ కలిసి పవిత్రమైన బంధం కాస్త పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టు వాయిదాల చుట్టూ నలిగిపోతుంది.
(00:29) కానీ చట్టాల కంటే కోర్ట్ల కంటే సమాజం నిర్దేశించిన నిబంధనల కంటే మనుషుల మధ్య ఉండే కరుణ ఎంత బలమైందో నిరూపించింది ఢిల్లీలో జరిగిన ఒక సంచరణ ఘటన [సంగీతం] భారతీయ సంస్కృతిలో వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక కాదు రెండు కుటుంబాల ప్రయాణం కానీ మారుతున్న సామాజిక పోకడలు పెరిగిపోతున్న వ్యక్తిగత స్వేచ్ఛ ఆర్థిక స్వాలంభనతో పాటు
(01:13) నేను అనే అహంకారం ఈ బంధాల పునాదులను కదిలిస్తోంది. ఒకప్పుడు కుటుంబ పెద్దల సమక్షంలో సర్దుబాట్లతో ముగిసిపోయే చిన్నపాటి గొడవలు నేడు నేరుగా న్యాయస్థానాల గడప తొక్కుతున్నాయి. మహిళల రక్షణ కోసం వరకట్న వేదింపుల నుంచి వారిని కాపాడడం కోసం సెక్షన్ 498A వంటి చట్టాలు వస్తే దురదృష్ట వసాతు వాటిని కొందరు భార్యలు భర్తలపై వారి కుటుంబాలపై కక్ష సాధింపు చర్యలుగా ఒక బ్లాక్ మెయిలింగ్ అస్త్రంగా వాడుతున్నారు అనే విమర్శలు నేడు విస్తృతంగా వినిపిస్తున్నాయి.
(01:45) ఢిల్లీకి చెందిన సిఖ సౌరభుల కథ కూడా సరిగ్గా ఇలాంటి ఒక అహంకార పోరాటంతోనే మొదలైంది. 2020 లో సిఖ సౌరభుల వివాహం ఎన్నో ఆశల మధ్య వైభవంగా జరిగింది. కానీ పెళ్లైన కొద్ది రోజులకే వారి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే సహనం లోపించింది. ఈ క్రమంలో శిఖ భర్తపై అతని కుటుంబంపై కోర్ట్లు వరకట్న వేధింపుల కేసు నమోదు చేసింది.
(02:12) ఆ క్షణం నుంచి ఆ కుటుంబంలో ప్రశాంతతే కరువైపోయింది. ఏ తప్పు చేయని భర్త అతని తల్లిదండ్రులు కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఏళ్ల తరబడి విచారణలు సాగాయి కానీ అటు శిఖ అహం తగ్గలేదు. ఇటు సౌరభ్ వైపు నుంచి సయోధ్య కుదరలేదు. న్యాయ పోరాటాలు ఎప్పుడూ ఇరువైపుల విధ్వంసాన్ని మిగులుస్తాయి. కూతురి పెళ్లి పేరిట కోర్ట్ల చుట్టూ తిరగడం లాయర్ల ఫీజులు భరించడం సమాజంలో తలెత్తుకోలేకపోవడం శిఖ తండ్రిని తీవ్ర మానసిక క్షోభకు గురిచేసింది.
(02:41) కూతురి భవిష్యత్తు ఏమైపోతోందో నన్న ఆందోళన నిరంతర ఒత్తిడి ఆయన ఆరోగ్యాన్ని క్షీణింపజేశయి. ఒకరోజు ఆ భారం తట్టుకోలేక ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. అత్యవసర స్థితిలో ఆయనను ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల సరైన వైద్య సదుపాయాలు అందక ఆయన అక్కడ మరణంతో పోరాడుతున్నారు. కూతురు పెట్టిన కేసు చివరికి కన్నతండ్రి ప్రాణాలకే ముప్పుగా పరిగమనించిన దారుణ పరిస్థితి.
(03:08) కథ ఇక్కడే ఒక ఊహించని ఉద్వేగభరితమైన మలుపు తిరిగింది. తనను తన కుటుంబాన్ని కోర్ట్ల చుట్టూ తిప్పి నరకం చూపించిన భార్య తండ్రి చావు బతుకుల్లో ఉన్నాడు అనే వార్త భర్త సౌరభ్కి తెలిసింది. సాధారణంగా అయితే కక్ష సాధింపులు కేసు వ్యవహారాలు వాళ్ళ మధ్య దూరాన్ని పెంచుతాయి. కానీ సౌరభ్ తనలోని మానవత్వాన్ని చంపుకోలేదు. అహాన్ని పక్కన పెట్టాడు.
(03:33) తక్షణమే స్పందించి ఆయన ప్రభుత్వ ఆసుపత్రి నుండి దేశంలోనే అత్యున్నతమైన కార్పొరేట్ హాస్పిటల్ మెదాంతకు తరళించాడు. తన సొంత డబ్బు ఖర్చుపెట్టి దగ్గరుండి పర్యవేక్షించి ఒక కన్న కొడికిలా నిలబడి ఆ మొసరి ప్రాణాన్ని కాపాడాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే కోర్ట్లో తదుపరి విచారణ వాయిదా వచ్చింది. జడ్జ్ బెంచ్ మీదకి వచ్చారు. లాయర్లు తమ వాదనలు వినిపించడానికి సిద్ధమయ్యారు.
(03:55) విడాకుల పత్రాలు టేబుల్ మీద ఉన్నాయి కానీ అందరిని దిగ్భ్రాంతికి గురి చేస్తూ శిఖ ముందడుగు వేసింది. లాయర్ చేతిలోని విడాకుల పత్రాలను లాక్కొని జడ్జి ముందే వాటిని ముక్కలు ముక్కలుగా చింపేసింది. కన్నీళ్లతో భర్త సౌరభ్ కాళ్ళపై పడింది. ఏ చట్టాలు ఏ లాయర్లు ఏళ్ల తరబడి సాగిన కోర్టు వాదనలు మార్చలేని ఆమె కఠిన హృదయాన్ని భర్త చూపిన ఆ ఒక్క మానవత్వం నిష్కల్మశమైన కరుణ పూర్తిగా మార్చేసింది.
(04:22) తప్పుడు కేసుల కంటే ఈగోల కంటే బంధం గొప్పదని గ్రహించిన ఆమె భర్తతో కలిసి జీవించడానికి సిద్ధమైంది. ఈ విడాకుల ఉదంతం నేటి ఆధునిక సమాజానికి ముఖ్యంగా వైవాహిక బంధాల్లో ఉన్నవారికి ఒక పవర్ఫుల్ అర్థం పడుతుంది. కోట్లు, కాగితాలు, బంధాలను విడదీయగలవేమో కానీ మనసులను కలపలేవు. ఒక రిలేషన్షిప్ నిలబడాల్సింది ఇగోతో కాదు క్షమించే గుణంతో మానవత్వంతో పరస్పర అవగాహనతో మాత్రమే సమస్యలు వచ్చినప్పుడు కోర్టు మెట్లెక్కడం కంటే ఒకరినొకరు అర్థం చేసుకొని మాట్లాడితే కరుణతో ఆలోచిస్తే సమాజంలో విడాకులు అనే పదానికి తావే ఉండదు గారు,
No comments:
Post a Comment