భగవంతుడు నీకోసం చిటికెన వేలు కూడా ఎత్తడు! 😱 Why God Never Helps? | Bhagavad Gita
Author Name:Sanmaarg Thoughts
Youtube Channel Url:https://www.youtube.com/@sanmaargthoughts18
Youtube Video URL:https://www.youtube.com/watch?v=UAQaoZJqz44
Transcript:
(00:00) భగవంతుడు మీకోసం తన చిటికెని వేలు కూడా ఎత్తడు ఈ మాట వినగానే మీకు కోపం రావచ్చు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకోవచ్చు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం ఒక విషయాన్ని వింటూ పెరిగాం కష్టం వస్తే దేవుణ్ణి ప్రార్థించు సమస్య వస్తే దేవున్ని పిలువు ఏ దారి కనిపించకపోతే ఆ దేవున్ని నమ్ము అని కానీ ఈ ప్రశ్న ఎప్పుడైనా మీకు వచ్చిందా ఈ ప్రపంచంలో కోట్ల మంది దేవున్ని నమ్ముతారు కోట్ల మంది ప్రార్థిస్తారు కోట్ల మంది ఎన్నో మొక్కులు మొక్కుకుని ఆ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు.
(00:32) అయితే అందరి జీవితాలు ఒకేలా ఎందుకు మారవు కొంతమంది జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. మరికొందరు మాత్రం సంవత్సరాలు తరబడిన అదే సమస్యలతో ఉంటారు. దేవుడు ఒకరికి దగ్గరగా మరొకరికి దూరంగా ఉంటాడా లేక మనమే దేవుణని తప్పుగా అర్థం చేసుకున్నామా అసలు భగవంతుడు మనకోసం తన చిటికెని వేలు కూడా ఎందుకు ఎత్తడు ఈ ప్రశ్నకు సమాధానం పూర్తిగా తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని పూర్తిగా చూడాలి.
(00:53) ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీ జీవితం ఎలా మారుతుందో నేను చెప్పనవసరం లేదు అది మీ అనుభవానికే వస్తుంది. హాయ్ హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ నాని వెల్కమ్ టు సన్మార్గ థాట్స్ ఫ్రెండ్స్ టాపిక్ లోకి వెళ్ళే ముందు ఒక చిన్న అప్డేట్ ఇప్పటి వరకు మన ఛానల్ ఆర్యవర్త స్టోరీస్ అనే పేరుతో ఉంది. ఇక నుంచి అదే ఛానల్ సన్మార్గ థాట్స్ అనే కొత్త పేరుతో మీ ముందుకు రాబోతుంది. పేరు మాత్రమే మారింది.
(01:17) కానీ మన ఉద్దేశం మాత్రం మారలేదు. సనాతన ధర్మంలోని నిజమైన జీవన సూత్రాలను ఈ కాలానికి అర్థమయ్యే భాషలో మీ ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం కాబట్టి మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మన ప్రయాణంలో భాగం అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. ఇప్పుడు ఒక నిమిషం ఆలోచించండి. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? ఈరోజు ఎగ్జామ్ రాయాలి.
(01:41) కానీ దానికంటే ముందు ఏదైనా టెంపుల్ కి వెళ్లి భగవంతుని ప్రార్థించుకొని స్వామి ఈ ఎగ్జామ్ లో పాస్ అయితే నేను ఫలానా మొక్కు తీర్చుకుంటానని మొక్కు పెట్టుకుంటారు. జాబ్ కోసం ఇంటర్వ్యూ కి వెళ్తే దేవుడా నాకు ఈ జాబ్ రావాలి. నాకు ఈ జాబ్ వస్తే నా మొదటి శాలరీ నీకు ఇచ్చేస్తాను అని మొక్కుకుంటారు. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా భగవంతుడా నీదే భారం అని మొదలు పెడతారు.
(02:00) ఇలా చాలా మంది చేసే ఉంటారు. నేను కూడా చేశాను అలా మనందరం కూడా చేశం. కానీ రిజల్ట్ ఏమైంది కొంతమందికి సక్సెస్ వచ్చింది చాలా మందికి రాలేదు. ఇలా ఎందుకు జరిగింది ఇక్కడ అందరూ దేవుణే నమ్మారు అందరూ ప్రార్థించారు ఇంకా ప్రార్థిస్తూనే ఉన్నారు. కానీ రిజల్ట్ మాత్రం అందరికీ ఒకలా కాకుండా వేరు వేరుగా వచ్చింది కదా అంటే ఇక్కడ దేవుడు కొందరికి మాత్రమే ఫేవర్ గా ఉన్నారా మిగిలిన వారికి లేరా కాదు దేవుడు ఎవ్వరికీ ఫేవర్ గా లేరు కానీ దీనికి ఒక రూల్ ఉంది.
(02:30) ఆ రూల్ తెలిసిన వాళ్ళకి జీవితాలలో అద్భుతాలు జరుగుతున్నాయి. తెలియని వాళ్ళు మాత్రం సంవత్సరాల తరబడి అదే చోట నిలబడి ఉన్నారు. ఆ రూల్ ఏమిటో ఇప్పుడు మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి. మనం భగవంతున్నని ఒక తప్పు కోణంలో చూస్తున్నాం. అంటే ఆయన్ని మనం ఒక ఏటీఎం లా చూస్తున్నాం. కార్డు పెడితే డబ్బు వచ్చినట్టు పూజ చేస్తే కోరిక తీరుతుందని ఏదైనా మొక్కుకుంటే సమస్య పోతుందని అనుకుంటున్నాం.
(02:53) కానీ భగవంతుడు అంటే ఒక ఏటీఎంఆ చెప్పండి మనం ఒకసారి భగవంతుని వేరే కోణంలో చూద్దాం. భగవంతుడు అంటే ఒక పవర్ స్టేషన్ లాంటివాడు. పవర్ స్టేషన్ ఏం చేస్తుంది కరెంట్ ఇస్తుంది శక్తిని ఇస్తుంది కానీ మీరు స్విచ్ వేయకుండా కూర్చుంటే లైట్ వెలుగుతుందా వెలగదు తిరగదు కదా కరెంట్ ఉంది శక్తి ఉంది కానీ స్విచ్ అనేది మీరు వేయాలి అదే భగవంతుడు మీకు ఇచ్చిన శక్తి ఆయన మనకు రెండు చేతులు ఇచ్చారు బుద్ధిని ఇచ్చారు సంకల్పాన్ని ఇచ్చారు.
(03:20) ఇవన్నీ మనకు స్విచ్చెస్ లాంటివి వాటిని మనం వాడాలి. వాడకుండా కూర్చుంటే ఆయన మీకోసం తన చిటికిన వేలు కూడా ఎత్తడు. ఇది నేను చెబుతున్న మాట కాదు భగవద్గీతలో ఆయనే స్వయంగా చెప్పారు. అందరికీ ఈ శ్లోకం తెలుసు కదా కర్మణ్యే వాధికారస్తే మా ఫలే సుఖదాచన అంటే నీకు కర్మ చేసే అధికారం మాత్రమే ఉంది. ఫలితంపై కాదు అని ఈ శ్లోకం అర్థం.
(03:42) ఇది కేవలం ఒక శ్లోకం మాత్రమే కాదు. ఇది విశ్వ నియమం కూడా. మీరు చేసే ప్రతి పని మీరు వేసే ప్రతి అడుగు మీరు పడే ప్రతి శ్రమ ఇవన్నీ మీ కర్మలే. మీ కర్మలను మీరు నిస్వార్థంగా, శ్రద్ధగా నమ్మకంతో చేయాలి. ఫలితం గురించి ఆలోచించకుండా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. అప్పుడే ఆ ఫలితం భగవంతుడి చేతిలో ఉంటుంది. ఆయన మీకు ఏది మంచిదో ఏది అవసరమో అదే ఇస్తారు.
(04:05) కానీ మీరు కర్మ చేయకుండా కేవలం ఫలితం కోసం మాత్రమే ఎదురు చూస్తే అది మీకు ఎప్పటికీ రాదు. మనం చేసే ప్రతి కర్మకు పంచకారణాలు అని ఉంటాయి. అవి ఏం నేర్పిస్తాయో తెలుసా? భగవద్గీత 18 వ అధ్యాయం 14వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నారు అధిష్టానం తథాకర్త కరణంచ ప్రదగ్విధం వివిధాచ ప్రదక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం అని అంటే ఏ పని జరిగినా దానికి ఐదు కారణాలు ఉంటాయి.
(04:31) ఈ ఐదు కారణాలను అర్థం చేసుకుంటే దైవశక్తి పాత్ర ఏమిటో మన పాత్ర ఏమిటో మనకు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది అధిష్టానం అంటే మన శరీరం. మనం ఏ పని చేయాలన్నా ఈ శరీరం మనకు ఒక సాధనం. ఇది లేకుండా ఏ కర్మ సాధ్యం కాదు. మీ శరీరాన్ని మీరు ఎంత ఆరోగ్యంగా ఎంత శక్తివంతంగా ఉంచుకుంటే మీ కర్మ అంత సమర్థవంతంగా ఉంటుంది. రెండవది కర్త అంటే అది మీరే మీ సంకల్పం, మీ నిర్ణయం, మీ ప్రయత్నం.
(05:00) మీరు ఏదైనా చేయాలనుకుంటేనే ఆ పని మొదలవుతుంది. మీరు చేయాలనుకోకపోతే ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని బలవంతం చేయడు. మీలో చేయాలనే కోరిక, ఆ తపన ఉండాలి. మూడవది కరణం అంటే మన ఇంద్రియాలు కళ్ళు చెవులు చేతులు కాళ్ళు మన మనసు మన బుద్ధి ఈ సాధనాలను ఉపయోగించేది కర్త అంటే మనమే మనం మన ఇంద్రియాలను ఎంత నియంత్రణతో ఉంచుకుంటే మన పని అంత ఏకాగ్రతతో జరుగుతుంది. నాలుగవది వివిధ చేష్టలు అంటే మీరు చేసే రకరకాల ప్రయత్నాలు శ్రమలు ఒక పనిని పూర్తి చేయడానికి మీరు పడే కష్టం మీరు చేసే ప్రణాళిక మీరు తీసుకునే చర్యలు ఈ చేష్టలు లేకుండా ఏ ఫలితం మీకు రాదు.
(05:41) ఇక ఐదవది దైవం మనం చేసే ప్రయత్నాలకు అతీతంగా ఉండే ఒక శక్తి. మనం ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు ఫలితం మన చేతుల్లో ఉండదు. అప్పుడు దైవం పాత్రను అర్థం చేసుకోవాలి. దైవం అనేది మిగతా నాలుగు కారణాలకు వేరుగా ఉండే శక్తి కాదు. ఆ నాలుగు కారణాలతో కలిసి పని చేసే ఐదవ కారణం. మన ప్రయత్నానికి దిశను బలాన్ని ఇచ్చేదే దైవశక్తి కానీ మనకు బదులుగా కర్మను చేసేది మాత్రం కాదు.
(06:06) మీరు మొదటి నాలుగు కారణాలను విస్మరించి కేవలం దైవం కోసం ఎదురుచూస్తూ ఉంటే అది నిష్ప్రయోజనమే అవుతుంది. ఈ పంచ కారణాలను గనుక అర్థం చేసుకుంటే దైవం మనకు సహాయం చేయాలంటే మనం మొదట మన వంతు ప్రయత్నం చేయాలి అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దైవం అనేది మనకు మద్దతు ఇచ్చే శక్తి అది మన ప్రయత్నాలకు బలాన్ని ఇస్తుంది. కానీ మన బదులుగా అది పని చేయదు.
(06:30) మహాభారత యుద్ధంలో అర్జునుడు తన బంధువులను చూసి యుద్ధం చేయాలని వెనకడుగు వేసినప్పుడు శ్రీకృష్ణుడు అతనికి సారధిగా ఉన్నారు. కానీ కృష్ణుడు అర్జునుడికి బదులుగా యుద్ధం చేయలేదు కదా అర్జునుడు తన గాండీవాన్ని పట్టుకొని యుద్ధానికి సిద్ధమైనప్పుడే కృష్ణుడు అతనికి మార్గదర్శకం చేశారు. ధైర్యాన్ని నింపారు. సరైన దిశను చూపించారు.
(06:51) కానీ ఆలోచించండి అప్పుడు అర్జునుడు యుద్ధభూమిలోకి అడుగు పెట్టకుండా గాండీవాన్ని పట్టుకోకుండా కేవలం కృష్ణుడినే ప్రార్థించుకుంటూ కూర్చుంటే కృష్ణుడు ఆయనకి సారధి అయ్యేవాడా కాదు కదా ఎందుకంటే నువ్వు నడిస్తేనే ఆయన నీకు సారధి అవుతారు. నువ్వు అడుగు వేస్తేనే ఆయన నీకు దారి చూపిస్తారు. ఇది మహాభారతంలోని అర్జునుడికి మాత్రమే జరిగిన విషయం కాదు. ఈరోజు మీ జీవితంలో నా జీవితంలో ఈ ప్రపంచంలోని ప్రతి మనిషి జీవితంలో కూడా ఇదే సూత్రం పనిచేస్తుంది.
(07:18) మీరు మీ లక్ష్యం వైపు మొదటి అడుగు వేసిన క్షణం నుంచే ఇప్పటివరకు మీకు కనిపించని అవకాశాలు కనిపించడం మొదలవుతాయి. సరైన వ్యక్తులు మీకు ఎదురవుతారు. కొత్త మార్గాలు మీకోసం తెరుచుకుంటాయి. చాలా మంది దీన్ని అదృష్టం అంటారు. ఇంకొందరేమో దీన్ని దైవానుగ్రహం అని అంటారు. ఇక్కడ పేరు ఏదైనా కావచ్చు కానీ ఆ అవకాశాలకు తలుపు తెరిచింది మాత్రం మీరు వేసిన మొదటి అడుగే.
(07:40) అందుకే మీరు మీ సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటేనే ఆ దైవశక్తి మీకు తోడుగా నిలుస్తుంది. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. మన ప్రాచీన ఋషులు మహర్షులు ఈ పూజలు, జపాలు, ధ్యానం, యజ్ఞాలను మనకు ఎందుకు ఇచ్చారో తెలుసా? మనం కోరుకున్న ఫలితాలను పొందడానికి లేదా సమస్యలకు పరిష్కారం దొరకడానికి మాత్రమే కాదు.
(08:02) మనలో భక్తిని ఏకాగ్రతను క్రమశిక్షణను ధర్మాన్ని పెంచి మన కర్మను సరైన దిశలో నడిపించి జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా కర్తవ్యాన్ని విడిచిపెట్టని కర్మ యోగులుగా మనల్ని తీర్చి దిద్దడానికి పూజ మనలో భక్తిని పెంచుతుంది. జపం మన మనసుకి ఏకాగ్రతని ఇస్తుంది. ధ్యానం మన బుద్ధిని స్థిరపరుస్తుంది. గుడి మనల్ని దైవానికి దగ్గర చేసి కర్తవ్య మార్గంలో నడిపిస్తుంది.
(08:27) అంటే ఇవన్నీ కర్మకు బదులుగా చేసే పనులు కాదు. కర్మను మరింత శక్తివంతం చేసే సాధనలు. అందుకే భక్తి ఉండాలి కానీ భక్తితో పాటు కర్మ కూడా ఉండాలి. అప్పుడు దైవశక్తి మన ప్రయత్నానికి బలంగా మారుతుంది. ఇదే భగవద్గీత చెప్పిన కర్మయోగం. ఇదే సనాతన ధర్మం మనకు నేర్పించిన జీవన తత్వం.
No comments:
Post a Comment