Thursday, July 30, 2026

 *_𝕝𝕝ॐ𝕝𝕝 29/07/2026 - ఆషాడ పూర్ణిమా -  గురు పూర్ణిమా, వ్యాస పూర్ణిమా 𝕝𝕝卐𝕝𝕝_*
*≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈*

 *గురువంటే ఎవరు?* 

 *ఎవరిని గురువుగా భావించాలి?* 

ఆధ్యాత్మిక ప్రపంచములో ఈప్రశ్నకు చాలా లోతైనసమాధానం వున్నది. గురువంటే అజ్ఞానాంధకారాన్ని తొలగించేవాడు అని అర్ధము. తాను అజ్ఞానములో మునిగి ఇతరుల అజ్ఞానాన్ని తొలగించబూనటం సాధ్యం కాదు. కనుక గురువు అనే పదానికి అర్హతపొందటానికి అందరూ తగరు. కనుక ఎవరిని బడితేవారిని గురువుగా భావించి పరుగులు తీయటం ప్రమాదకరము. గుడ్డివాని చేయి మరొక గుడ్డివాడు దారిచూపమని పట్టుకున్నట్లవుతుంది. గురువు అనేపదముతో సంబోధించాలంటే ఆయనలో మూడు లక్షణాలు ఉండాలి.

1 *సర్వజ్ఞత :-*

ఆయనకు సర్వము తెలిసి వుండాలి ఆయనకు తెలియనిది ఈసృష్టిలో లేదు.

2 *సర్వ వ్యాపకత :-*

ఆయన అణువుమొదలు బ్రహ్మాండమంతా వ్యాపించగలిగివుండాలి. తాను లేని చోటు లేదు కనుక భగవంతుని విశ్వవ్యాపకతా లక్షణము ఆయనకు వర్తించాలి

3 *సర్వ సమర్ధత :-*

తాను శిష్యున్ని రక్షించటం కోసము ఏదయినా చేయగల సమర్ధత కలిగియుండాలి. అవసరమయితే బ్రహ్మాండ నియమాలను సహితం మార్చగలిగేంతగా.

ఇటువంటి వారిని మనపు పరమ గురువులని భావించాలి. భగవంతుని పట్ల భక్తిభావము శాస్త్ర ప్రమాణము ఆయనలో కనపడాలి.

అటువంటివారిని పరిశీలించి, పరీక్షించిమరీ ఆశ్రయించాలేతప్ప కేవలం భావావేశముతో గురువు, గురువు అని నాలుగురోజులు తిరిగి తరువాత ఇంకొక గురువును ఎన్నుకునే గుణము ఆధ్యాత్మికమ్ గా పతన హేతువవుతుంది.

శిష్యువిత్తాపహారులైన గురువులు కలిలో కావలసినంతమంది దొరుకుతారు. శిష్యచిత్తాపహారులు అరుదుగావుంటారని మహాత్ముల మాట. ఉల్లిగడ్దకు కూడ ఉపదేశమిచ్చేటి కల్ల గురువులు భువిన పుట్టెరయా అని వీరబ్రహ్మేంద్ర స్వాములవారు చెప్పి వున్నారు.

కనుక గురువును అని ఒకరిని ఎన్నుకున్నతరువాత మరల వారిని విడిచి పెట్టటం జరిగితే పతనమేతప్ప మరల ఏసద్గురువు వారిని అంగీకరించడు. వానికి సద్గతిలేదు.

మరి కలిలో గురువును ఆశ్రయించే అవకాశము లేదా?

గురువును ఎలా ఎన్నుకోవాలి?

మనము తరించే అవకాశములేదా?

గురువు ఆవశ్యకత ఆధ్యాత్మిక మార్గములో ఎంత అవసరమో మహాత్ములయిన దత్తాత్రేయ స్వామి వారి, శఙ్కర భగవద్ పాదుల వారి, రాఘవేంద్రుల వారి, రామానూజా చార్యుల వారి లాంటి మహాపురుషుల జీవిత గాధలు చదివితే మనకు అర్ధమవుతుంది.

గురువును మనం గుర్తించలేనప్పుడు ఒక సులభమయిన ఉపాయము వున్నది. గురుచరిత్ర పారాయణము చెస్తూ వుంటే మనలోని దుర్గుణాలు నశించి, మన మనోభావాలు శుధ్ధపడి గురు సేవకు అర్హతకలిగి అప్పుడు గురువే మనలను వెతుక్కుంటూ వస్తాడు. భగవ్ంతుని అలా అనన్యంగా సేవిస్తూవున్నా గురువలాగే పరిగెత్తుకొస్తాడు లేగదూడదగ్గరకు గోమాత పరిగెత్తుకొచ్చినట్లుగా అని రామకృష్ణ పరమహంస వారు చెబుతారు.

కనుక మనం ఎవరిని పడితే వారిని గురువు అని పిలవకుండా మీగురువుకొక్కరికే ఆపిలుపును పరిమితం చేసుకొని పవిత్రభావనతో సేవించాలి.

🙏🏻 ॐ *_శ్రీ గురుభ్యో నమః_* 卐 🙏🏻

🚩 *_శుభమస్తు_*🚩

No comments:

Post a Comment