Friday, July 3, 2026

పిల్లల ప్రైవసీని చంపేస్తున్న సోషల్ మీడియా క్రేజ్.. |

పిల్లల ప్రైవసీని చంపేస్తున్న సోషల్ మీడియా క్రేజ్.. |

Author Name:Shiva Chandana

Youtube Channel Url:https://www.youtube.com/@ShivaChandana27

Youtube Video URL:https://www.youtube.com/watch?v=eOg_MK7HJSg



Transcript:
(00:13) హలో నేను చందన ఈరోజు నేను ఒక టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. అదేంటంటే ఆ ఈ మధ్యకాలంలో పిల్లలు YouTube ఛానల్స్ పెట్టుకుంటూ ఉన్నారన్నమాట. అంటే పేరెంట్స్ే వీటిని ఆపరేట్ చేస్తుంటారు. కాకపోతే కంటెంట్ మొత్తం పిల్లలకి రిలేటెడ్ గా పెడుతూ ఉంటారు. అంటే ఎలా అంటే ఈరోజు మా పిల్లలు ఇలా చేశారు వీళ్ళ యక్టివిటీ ఇలా ఉంది అని ఒక వీడియో అట్లా పోస్ట్ చేస్తూ ఉంటారున్నమాట.
(00:40) అయితే ఈ క్రమంలో పేరెంట్స్ ఏమనుకుంటూ ఉంటారంటే మేము ఇలా చేయడం ఓకే కదా అంటే పిల్లలు దీన్నేమి నో చెప్పట్లేదు కదా అనుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి సంబంధించిన విషయాల్ని వీడియో తీయడం లేదా దాన్ని పోస్ట్ చేయడం లేదా వాళ్ళతో ఒక రోల్ ప్లే చేయించడం ఇలాంటివి చేయిస్తున్నప్పుడు ఏమవుతుందంటే తెలియకుండానే పేరెంట్స్ పిల్లల ప్రైవసీని కిల్ చేస్తూ ఉంటారున్నమాట.
(01:13) ఇది తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ఒక అడల్ట్ ఇండివిడ్యువల్ ఉన్నారనుకోండి వాళ్ళతో మనం ఒక కంటెంట్ చేయించాలి అన్నప్పుడు వాళ్ళకి ఇష్టం లేకపోతే నాకు ఇది నచ్చలేదు నేను చేయను నాకు ఇలా ఉంటే కష్టం నా ఒపీనియన్ ఇలా ఉంది ఇలా ఎక్స్ప్రెస్ చేస్తారన్నమాట బట్ ఎప్పుడైతే పిల్లలు చేస్తున్నారో పిల్లలకి సహజంగా ఏముంటుంది మమ్మీ లేదా డాడీ చెప్పారు ఇది ఇలా ఉంటుందని అంటున్నారు ఇది బాగుంది అని ఆ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఒక నమ్మకంతో స్టార్ట్ చేస్తూ ఉంటారు.
(01:54) ఈ క్రమంలో ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండానే మెల్లమెల్లగా ఆ ఈ సోషల్ మీడియాకి అలవాటు పడిపోతూ ఉంటారున్నమాట. అంటే వాళ్ళ వీడియో ఏదైతే ఉందో దానికి ఎలాంటి కామెంట్స్ వచ్చాయి ఎవరు ఎలా స్పందిస్తున్నారు ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి అంటే నేను ఒక విషయం పర్ఫామ్ చేసినప్పుడు దానికి సొసైటీ నుండి ఎలాంటి రియాక్షన్ వచ్చింది ఆ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు అన్న ఆలోచనల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారున్నమాట ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సహజంగా పిల్లలు ఆ వాళ్ళ వయసుతో కొన్ని విషయాలు నేర్చుకోవాల్సినవి ఉంటాయి అన్నమాట ఎప్పుడైతే తే పేరెంట్స్ ఆ టైంలో మరీ ముఖ్యంగా అండర్ సిక్స్ ఉన్న
(02:33) పిల్లలతో వీడియోస్ చేయిస్తున్నప్పుడు వీడియోస్ ని పోస్ట్ చేసి దానిలో వాళ్ళని ఎంగేజ్ చేస్తున్నప్పుడు తెలియకుండానే పిల్లలకి కెమెరా కాన్షియస్ బిహేవియర్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అంటే నేను ఒక బిహేవ్ ఒకటి బిహేవ్ చేస్తున్నాను అంటే ఇది అప్లోడ్ అవుతుంది. దీన్న అందరూ చూస్తారు దీంతో ఒక ఒపీనియన్ అనేది వస్తూ ఉంటుంది.
(02:57) కెమెరా కాన్షియస్ బిహేవియర్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. దీని వల్ల ఏమవుతుందంటే నేను చేసే యక్ట్ ఏదైతే ఉందో అది 10 మంది చూస్తారు. దానిలో నాకు పాజిటివ్ గా కామెంట్స్ రావాలంటే నేను ఇలా ప్రవర్తించాలి. అలా బిహేవ్ చేయాలి. మమ్మీ ఇలా అన్నప్పుడు ఆరోజు ఇలా రియాక్షన్ వచ్చింది లేదా డాడీ నాతో ఇలా బిహేవ్ చేసినప్పుడు దాన్ని ఇలా రెస్పాండ్ అయ్యారు కాబట్టి నా బిహేవియర్ నాకు కావాల్సినట్టుగా రావాలి అంటే నేను ఇలా బిహేవ్ చేయాలి అన్నది నేర్చుకుంటారు అన్నమాట.
(03:29) దాని వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ప్రాపర్ గా వాళ్ళ ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయలేకుండా అయిపోతారు. అంటే వాళ్ళ ఎమోషన్స్ కూడా కంట్రోల్డ్ విధానంలో చూయించడం వాళ్ళు డౌట్స్ ని కూడా హైడ్ చేసుకుంటూ ఉండడం ఎమోషన్స్ ని ప్రాపర్ గా వెంటిలేట్ చేయకుండా బిహేవ్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దాంతో పాటు ఏమవుతుందంటే మరీ ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ ఫాక్టర్ ఏంటంటే వాళ్ళ చైల్డ్హుడ్ అనేది కిల్ అయిపోతూ ఉంటుంది.
(03:59) ఎందుకు మేము ఇక్కడ ఫోర్స్ చేయట్లేదు కదా అన్న వర్షన్ పేరెంట్స్ కి ఉంటుందన్నమాట. అంటే మేము వాళ్ళని ఫ్రీగానే వదిలేస్తున్నాము రికార్డ్ చేసి మేము YouTube లో పెడుతున్నాము. దానికి వల్ల పిల్లల ఫ్రీడమ్ ఎలా పోతుంది అని డౌట్ రేస్ చేస్తూ ఉంటారు. బట్ రియాలిటీలో ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే మీ పిల్లల వీడియోని YouTube లో పోస్ట్ చేయాలి అనుకుంటారో అప్పుడు మీ పేరెంట్స్ గా మీరు అక్కడ ప్లే చేయాల్సిన రోల్ అనేది 100% ప్లే చేయలేకపోతారు అన్నమాట ఎందుకు ఇలా అవుతుంది అంటే మీరు ఆ టైంలో ఎప్పుడైతే మీరు వీడియో షూట్ చేస్తున్నారో ఆ క్రమంలో మీరు ఒక యూట్యూబర్ గా లేకపోతే ఒక వ్లాగర్ గా ఒక ఆ కంటెంట్
(04:44) క్రియేటర్ గా ఉంటారు తప్ప ఒక పేరెంట్ గా ఉండలేకపోతారు. ఎందుకు అంటే ఒక పేరెంటింగ్ లో ఒక పాజిటివ్ రెస్పాన్స్ లేదా ఒక ప్రాపర్ అప్రిసియేషన్ అనేది చాలా రేర్ గా దొరుకుతుంది. కానీ ఒక కంటెంట్ క్రియేటర్ గా ఒక యూట్యూబర్ గా మీకు సోషల్ ఐడెంటిటీ అనేది ఈజీగా వస్తుందన్నమాట. దీనివల్ల తెలియకుండానే ఏమవుతుందంటే పేరెంట్స్ ఎక్కువ ఫోకస్ అనేది వీటి మీద పెట్టడం వల్ల ఆ టైంలో పిల్లలకి వీళ్ళు పేరెంట్ రోల్ ప్లే చేయలేకపోతూ ఉంటారు.
(05:16) దాని వల్ల ఏమవుతుందంటే పిల్లలకి దొరకాల్సిన పేరెంట్స్ కేర్ అనేది ఆ టైంలో దొరకదు కాబట్టి పిల్లలు ఎమోషనల్ గా రిటాచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి YouTube కంటెంట్ క్రియేటర్స్ గా ఉండాలని పేరెంట్స్ అనుకోవద్దు. పిల్లలు మీ ప్రాపర్టీ కాదు పిల్లలకి కూడా ఇండివిడ్యువల్ రైట్స్ ఉంటాయి.
(05:44) వాళ్ళ కన్సర్న్ లేకుండా ఈవెన్ పిల్లలు వాళ్ళ కన్సర్న్ ఇచ్చినప్పటికీ వాళ్ళ కన్సర్న్ అనేది చెల్లదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని యూస్ చేసుకొని కంటెంట్ క్రియేట్ చేసి యూట్యూబర్స్ గా ఉందాము అని ఎట్టి పరిస్థితిలో పేరెంట్స్ అనేవాళ్ళు ట్రై చేయకూడదు. థాంక్యూ ఫర్ వాచింగ్.

No comments:

Post a Comment