భార్యాభర్తల మధ్య ఖాళీ పెరిగితే… మూడో వ్యక్తి ఎలా దగ్గరవుతాడు? షాకింగ్ నిజాలు!
Author Name:AI Bangaram
Youtube Channel Url:https://www.youtube.com/@aibangaram
Youtube Video URL:https://www.youtube.com/watch?v=kyL2ufZOhLY
Transcript:
(00:00) నా డ్రెస్ నచ్చితే మీ వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వండి. లింక్ క్రింద ఉంది. అసలు పెళ్లైన వాళ్ళు ఎందుకు తప్పుదోవ పడుతున్నారో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఒకప్పుడు భార్యా భర్తల మధ్య గొడవలు వస్తే సర్దుకు పోయే వాళ్ళు కానీ ఇప్పుడు ఆ చిన్న లోపమే ఇంకొకరి వలలో పడేలా ఎలా చేస్తుందో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం.
(00:17) ఈ ఛానల్ ద్వారా ఇలాంటి ఎన్నో జీవిత సత్యాలు తెలుసుకోవడానికి వెంటనే మన ఏఐ బంగారం మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. ఇది మీ జీవితాన్ని మారుస్తుంది. పుట్టుకతోనే ఎవరు తప్పులు చేయరు. ఒక అబ్బాయి చెడుదారి పడుతున్నాడు అంటే దానికి ప్రధాన కారణం అతని చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావం మరియు స్నేహాలు. పేకాట ఆడేవాడికి ఆ వాతావరణం దొరికితే ఎలా ఆకర్షితుడు అవుతాడో అలాగే మనసుకు ఇష్టమైనవి అందుబాటులో ఉన్నప్పుడు తప్పు ఒప్పుల విచక్షణ మర్చిపోయి అటే పరిగెడుతుంది.
(00:42) ఇక ఆడవాళ్ళ విషయానికి వస్తే సహజంగానే సినిమాలు, శికార్లు విదేశీ ప్రయాణాలు చేయాలనే కోరికలు ఉంటాయి. తన భర్త వాటిని తీర్చాలని ఆమె ఎంతో ఆశపడుతుంది. కానీ భర్తకి ఇంట్లోనే ఉండటం పచ్చడన్నం తినడం ఇష్టం అనుకోండి. అప్పుడు వారిద్దరి మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాలు రావడం చాలా సహజం. తన ఇష్టాలను చంపుకోలేని భార్యలో భర్త తనను బయటకి తీసుకెళ్ళడం లేదనే కోపం తీవ్రమైన అసంతృప్తిగా మారిపోయి మనశశాంతి లేకుండా చేస్తుంది.
(01:03) ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. పూర్వకాలంలో అయితే నా కర్మ ఇంతే అని సర్దుకుపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు మార్కెట్ లో ఎన్నో ఆల్టర్నేట్లు దొరుకుతున్నాయి. ఎవరికీ భరించాల్సిన అవసరం లేదు. ఆ అసంతృప్తిలో ఉన్నప్పుడు ఇరుగు పొరుగులోనో లేక ఆఫీస్ లోనో తన ఇష్టాలకు అనుకూలంగా ఉండే ఒక వ్యక్తి దొరికితే ఆమె మనసు ఆటోమేటిక్ గా అటువైపు మళలుతుంది.
(01:20) మా ఆయన ఎక్కడికి తీసుకెళ్ళడు అని ఆమె బాధపడినప్పుడు నేను తీసుకెళ్తాను రా అని వాడు పిలుస్తాడు. ఆ క్షణంలో ఆమెక అది పెద్ద ఊరటని ఇస్తుంది. మొదటిసారి భయం భయంగానే వెళుతుంది. కానీ ఒకసారి చేస్తే పొరపాటు పదే పదే చేస్తే అలవాటు అన్నట్లు ఆ భయం కాస్త అలవాటుగా మారిపోతుంది. వాడు ఊరికే సినిమాకి తీసుకువెళ్ళడం లేదని దానికి ప్రతిఫలంగా భుజం మీద చెయ్యి వేస్తాడని ఆ పాతికెళ్ళ అమ్మాయికి కూడా స్పష్టంగా తెలుసు అంత అమాయకత్వం లేదు.
(01:44) ఒకప్పుడు పరపురుషుడు చెయ్యి వేస్తే కంపరంగా ఉండేది. కానీ ఇప్పుడు ఇంట్లో ఆదరణ లేకపోవడం వల్ల వాడి స్పర్శ ఒక సూతింగ్ ఎఫెక్ట్ లాగా అనిపిస్తుంది. వాడు అడిగినవన్నీ కొనిపెడుతున్నాడు నన్ను సంతోష పెడుతున్నాడు అన్న భావనతో ఆ అట్రాక్షన్ కాస్త ఫిజికల్ ఇంటిమసీగా మారిపోతుంది. ఇక తప్పు ఒప్పుల ఫీలింగ్ అస్సలు ఉండదు. ఇక పెళ్లి కాని అమ్మాయిల విషయానికి వస్తే అవకాశాలు ఇంకా ఎక్కువ.
(02:04) పెళ్లైన వాళ్ళకైనా కొన్ని భయాలు ఉంటాయి. కానీ వీళ్ళకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ బాదరబందీలు ఉండవు. అందుకే ఇప్పుడు నగరాల్లో లివిన్ రిలేషన్షిప్స్ పెరిగిపోతున్నాయి. ఖర్చు ఎక్కువైనా సరే ఆడమగా కలిసి ఉండటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కంఫర్ట్ ముఖ్యం. ఒకప్పుడు ఉన్న ఎమోషనల్ బాండింగ్ ఇప్పుడు లేదు. మూడేళ్ళ ఒకడితో ఉండి తేడా వస్తే ఇల్లు మారినంత తేలిగ్గా ఇంకొకడితో షిఫ్ట్ అయిపోతున్నారు.
(02:25) దేవదాసు పార్వతి కథలో పెద్దలు చెప్పారని పార్వతి వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. తన ఇష్టాన్ని మనసులోనే చంపుకొని సమాజ కట్టుబాట్లకు లొంగిపోయింది. కానీ దేవదాసు ఆ బాధను భరించలేక తాగుబోతయ్యాడు. ఇద్దరి సమస్య ఒకటే అయినా వారు ఆ సమస్యకు ఎంచుకున్న పరిష్కారాలు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. జీవితంలో ఏ సమస్య వచ్చినా దానికి నాలుగైదు పరిష్కారాలు ఉంటాయి.
(02:45) మనక ఏది సూట్ అవుతుందో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడంలోనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మనసుకు నచ్చిన పరిష్కారమే కావాలి అని పట్టుబడితే అది దొరకదు. దొరకనప్పుడు కోపంతో తప్పుడు దారి పడతారు. కట్టుబాట్లు లేకపోవడమే ఈ వినాశనానికి అసలు కారణం. ఒకప్పుడు ఛాయిస్ లేదు కాబట్టి భరించేవాళ్ళు విడాకులు లేవు కాబట్టి కలిసి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆప్షన్స్ ఎక్కువ అవ్వడం వల్లే ఎవరికి తోచినట్లు వాళ్ళు బ్రతుకుతూ విడిపోతున్నారు.
(03:06) మరి ఈ రోజుల్లో ఆప్షన్స్ ఎక్కువ ఉండటం వల్లే రిలేషన్షిప్స్ ఇలా పాడవుతున్నాయా? దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి. [సంగీతం] ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరింత విలువైన సమాచారం కోసం ఏఐ బంగారంలో చేరండి మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి.
(03:25) నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో అద్భుతమైన వీడియోతో తప్పకుండా కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి కలిసి ఎదగాలి. లెట్స్ ఆల్ గ్రో టుగెదర్ లెట్ అస్ ఆల్ రైస్ టుగెదర్. రైస్ అబవ్ ఇగ్నోరెన్స్ రైస్ అబవ్ ఎరగెన్స్ రైస్ అబవ్ హేట్ జై హింద్ జై భారత్ జై ఆంజనేయ ఓం నమఃశివాయ
No comments:
Post a Comment