ఆమెను ఇంటికి తీసుకెళ్లను... ఈ ఒక్క మాట వెనుక ఎంత బాధ ఉంది? | Hari Raghav | Srinivas | Square Talks
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=-NPbvyMe2ls
Transcript:
(00:04) [సంగీతం] హాయ్ వెల్కమ్ టు న్యూస్ అండ్ నరేటివ్స్ బై హరిరాఘవ్ నేను శ్రీనివాస్ [సంగీతం] ఈ వార్తను కేవలం ఒక కుటుంబ వివాదంగా చూస్తే ఇందులో ఒక భర్త ఒక భార్య ఒక కోర్ట్ మాత్రమే కనిపిస్తాయి. కానీ కొంచెం లోతుగా చూస్తే ఇది మనుషుల సంబంధాల గురించి బాధ్యత గురించి నాగరికత గురించి చాలా పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది. ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం అతనితో లేదా
(00:49) ఆమెతో బంధాన్ని కొనసాగించడం సులభం. కానీ ఆ వ్యక్తి ఒక్కసారిగా మన జీవితంలో ఒక బాధ్యతగా మారినప్పుడు అదే బంధం అసలు స్వరూపం బయటపడుతుంది. ప్రేమ అంటే ఏమిటి వివాహం అంటే ఏమిటి అది ఇద్దరు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల మధ్య ఉన్న ఒక ఒప్పందమా లేక జీవితంలో అనుకోకుండా వచ్చే బలహీనతలను కూడా కలిసి మోయాలనే ఒక మౌన వాగ్దానమా? కోల్కత్తా హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు కేవలం ఒక చట్టపరమైన నిర్ణయం కాదు మన సంబంధాలను ఎలా అర్థం చేసుకుంటున్నామ అనే ప్రశ్నను కూడా మన ముందుకు తీసుకొచ్చింది.
(01:27) ఈ కేసులో వాస్తవాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన ఒక మహిళ 2021వ సంవత్సరం నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెడికల్ బోర్డ్ ఆమెను ఇంట్లోనే చూసుకోవచ్చని నివేదించింది. ఆమెకు నిరంతర ఐసయు సంరక్షణ అవసరం లేదని ఇంటి వద్దనే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవచ్చని కూడా స్పష్టం చేసింది. అయితే ఆమె భర్త ఆర్థిక ఇబ్బందులు మరియు ఇతర కారణాలను చూపుతూ ఆమెను ఇంటికి తీసుకెళ్ళడానికి నిరాకరించారు.
(01:59) ఆసుపత్రి యాజమాన్యమే కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు హైకోర్ట్ భార్యను వదిలివేయడానికి చేసిన ప్రయత్నంగా ఈ అప్పీల్ను అభివర్ణిస్తూ ఆమెను పోలీసు సంరక్షణతో ఇంటికి చేర్చాలని వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇవి ఈ కేసులో నమోదైన వాస్తవాలు కానీ ఈ వాస్తవాల వెనుక మనిషి గురించి చెప్పే కథ ఇంకా పెద్దది.
(02:26) మన సంబంధాల గురించి మనం తరచు ఒక భ్రమలో ఉంటాం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు నిజానికి మనం చాలాసార్లు చెప్పేది నువ్వు ఇప్పుడున్న రూపాన్ని మాత్రమే ప్రేమిస్తున్నాను అనేదే ఆరోగ్యం ఉన్నప్పుడు సంపాదించే శక్తి ఉన్నప్పుడు మాట్లాడగలిగినప్పుడు నవ్వగలిగినప్పుడు ఆ ప్రేమ సహజంగా అనిపిస్తుంది. కానీ ప్రమాదం అనారోగ్యం వృద్ధాప్యం లేదా అంగవైకల్యం వచ్చిన తర్వాత అదే సంబంధం ఒక్కసారిగా పరీక్షకు వస్తుంది.
(02:57) ఎందుకంటే అప్పటి నుంచి ఆ వ్యక్తి మనకు ఆనందాన్ని ఇచ్చే వ్యక్తి కాదు మన బాధ్యతగా మారతాడు. మనోవిజ్ఞాన శాస్త్రంలో దీన్ని సంబంధాల శరతులు బయటపడే క్షుణణంగా చూడవచ్చు. మనం ప్రేమిస్తున్నది మనిషినేనా లేక అతను లేదా ఆమె మన జీవితంలో పోషిస్తున్న పాత్రనా ఈ ప్రశ్నకు ప్రతి కుటుంబం ఎప్పుడో ఒక్కసారి సమాధానం చెప్పాల్సి వస్తుంది. [సంగీతం] [సంగీతం] అయితే ఈ కథను కేవలం ఒక వ్యక్తి నైతిక వైఫల్యంగా చూడటం కూడా సరైన విశ్లేషణ కాదు.
(03:41) ఎందుకంటే ప్రతి వ్యక్తి నిర్ణయాన్ని ఒక వ్యవస్థ కూడా ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలిక వైద్యం పెరుగుతున్న వైద్య ఖర్చులు ఇంట్లో సంరక్షణకు అవసరమైన వనరుల కొరత కుటుంబ సభ్యులపై పడే మానసిక ఒత్తిడి ఇవన్నీ కలిసి ఒక మనిషిని అలసటకు గురి చేయవచ్చు. దీన్ని కేర్ గివర్ బర్న్ అవుట్ అని కూడా పిలుస్తారు. అంటే బాధ్యతను మోయాల్సిన వ్యక్తి కూడా మానసికంగా పుంగిపోవచ్చు.
(04:10) ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు వ్యక్తిగత బాధ్యతను గుర్తు చేస్తూనే సమాజానికి కూడా ఒక ప్రశ్న వేస్తుంది. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న వారి కుటుంబాలకు మన వ్యవస్థ ఎంత సహాయం చేస్తుంది. కుటుంబం ఒక్కటే ఈ భారాన్ని మోయాలని ఆశించడం సరిపోతుందా లేక ఆరోగ్య వ్యవస్థ సామాజిక భద్రత వ్యవస్థ స్థానిక పరిపాలన కూడా ఇందులో భాగస్వాములు కావాలా? ఇక్కడ ఒక ఆసక్తికరమైన మానసిక అంశం కూడా ఉంది.
(04:38) మనిషి జీవితంలో బలహీనతను చూసినప్పుడు చాలా మందిలో రెండు విరుద్ధమైన ప్రతిస్పందనలు కనిపిస్తాయి. కొందరిలో కరుణ పెరుగుతుంది మరికొందరిలో దూరం వెళ్ళాలి అనే కోరిక పెరుగుతుంది. ఎందుకంటే బలహీనత మనకు మన సొంత అసురక్షిత్వాన్ని గుర్తు చేస్తుంది. ఈరోజు వీల్ చైర్ లో ఉన్నది మరొకరు రేపు అదే పరిస్థితి మనకు రావచ్చనే అసౌకర్యమైన సత్యాన్ని మనసు ఎదుర్కోవాలి అనుకోదు.
(05:05) అందుకే కొన్నిసార్లు మనిషి సమస్య నుండి కాదు ఆ సమస్య తనలో రేపే భయం నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ కోణంలో చూస్తే ఈ వార్త ఒక కుటుంబం గురించిన కథ మాత్రమే కాదు మనమందరం మన బలహీనతను ఎలా అర్థం చేసుకుంటామ అనే కథ కూడా చట్టం ఇలాంటి సందర్భాల్లో ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వస్తుంది సాధారణంగా ప్రేమ కరుణ బాధ్యత వంటి విలువలు చట్టం ద్వారా సృష్టించబడవు అవి కుటుంబం సంస్కృతి వ్యక్తిగత నైతికతల ద్వారా పెరుగుతాయి కానీ అవి విఫలమైనప్పుడు చివరి ఆశ్రయం చట్టమే అవుతుంది. ఈ కేసులో కూడా అదే జరిగింది.
(05:40) కోర్టు ఒక భర్తను ప్రేమించమని ఆదేశించలేదు కానీ అతను నిర్వర్తించాల్సిన కనీస బాధ్యత నుంచి తప్పించుకోలేడని చెప్పింది. ఇది చాలా ముఖ్యమైన తేడా. ఎందుకంటే నాగరిక సమాజం భావోద్వేగాలను నియంత్రించదు కానీ బాధ్యతలను మాత్రం నిర్వచిస్తుంది. ఈ తీర్పు అదే సరిహద్దును స్పష్టంగా గుర్తుచేసింది. [సంగీతం] అస్తిత్వవాద దృష్టిలో చూస్తే మనిషి స్వేచ్ఛ అంటే తనకు నచ్చిన దాన్ని మాత్రమే ఎంచుకునే హక్కు కాదు తన ఎంపికల ఫలితాలను స్వీకరించే బాధ్యత కూడా వివాహం అనే
(06:26) నిర్ణయం కూడా అలాంటిదే అది కేవలం సంతోషకరమైన రోజులను మాత్రమే కాదు ఊహించని కష్టాలను కూడా తనలో కలిగి ఉంటుంది అందుకే బాధ్యత అనేది మన స్వేచ్ఛకు చెల్లించాల్సిన ధర ఆ ధర చెల్లించడానికి సిద్ధంగా లేనప్పుడు సంబంధాలు కేవలం ఒప్పందాలుగా మిగిలిపోతాయి కానీ బాధ్యతను స్వీకరించినప్పుడు మాత్రమే అవి అర్థవంతమైన బంధాలుగా మారతాయి ఈ సంఘటన చివరికి మన ముందుంచే ప్రశ్న కోర్టు తీర్పు గురించి కాదు మన జీవితాల్లో అత్యంత బలహీనమైన క్షణంలో మన పక్కన ఎవరు ఉంటారు అన్నదే ఇంకా ఇంతకంటే పెద్ద ప్రశ్న మరో మనిషి జీవితంలో అలాంటి క్షణం క్షణం వచ్చినప్పుడు మనం ఎలా
(07:05) స్పందిస్తాం అన్నది. ఎందుకంటే ఒక సమాజం గొప్పదనం దాని శక్తివంతమైన మనుషులను ఎలా గౌరవిస్తుంది అనే దానితో కాదు నడవలేని మాట్లాడలేని తమ హక్కుల కోసం తామే పోరాడలేని మనుషులను ఎలా సంరక్షిస్తుంది అనే దానితో కలవబడుతుంది. ఈ వార్త కొన్ని రోజుల తర్వాత మర్చిపోవచ్చు. కానీ ఈ ప్రశ్న మాత్రం చాలా కాలం మనతోనే ఉంటుంది. ప్రస్తుత భారతీయ యువతకు ఎంతో అవసరమైన నిష్పాక్షిక విశ్లేషణే ఇది.
(07:34) ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు యువతకు తప్పకుండా షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్. [సంగీతం]
No comments:
Post a Comment