సర్దుకుపోవడమే దాంపత్యం..బ్రతికున్నప్పుడే ప్రేమించండి..The Real Meaning of Marriage
Author Name:R Voice
Youtube Channel Url:https://www.youtube.com/@RVoice188
Youtube Video URL:https://www.youtube.com/watch?v=eA7yvqqZw5E
Transcript:
(00:03) [సంగీతం] [సంగీతం] వందేమాతరం నేను మీ జర్నలిస్ట్ నవత దాంపత్యం అంటే ఎప్పుడూ గొడవలు లేకుండా జీవించడం కాదు. గొడవలు అపార్థాలు బాధలు ఉన్నా ఒకరినొకరు వదలకుండా జీవితాంతం తోడుగా నిలబడటమే నిజమైన వివాహ బంధం జీవితంలో చివరివరకు మనతో ఉండేది జీవిత భాగస్వామి మాత్రమే అందుకే వారు బ్రతికున్నప్పుడే వారి విలువను గుర్తించి ప్రేమ గౌరవం ఓర్పుతో కలిసి జీవించాలి.
(00:41) భార్యా భర్తలు జీవితపు చివరివరకు తోడుగా ఉండే సహచరులు. వివాహం అంటే ఫోటోలలో నవ్వుతూ కనిపించే రెండు ముఖాలు కాదు ఒకే ఇంట్లో కలిసి జీవిస్తూ ఎన్నో సార్లు మనసులు విరిగిపోయినా ఆ విరిగిన బంధాన్ని ఎవరికీ తెలియకుండా మళ్ళీ కట్టుకొని ముందుకు సాగే రెండు జీవితాల కథ భార్యా భర్తల మధ్య ప్రేమ మాత్రమే ఉండదు కోపం ఉంటుంది అహం ఉంటుంది బాధ ఉంటుంది మాటలు లేని రోజులు కూడా ఉంటాయి.
(01:08) భార్య మనసులో ఇతను ఎప్పటికీ మారడు అనే బాధ ఉంటుంది. భర్త మనసులో ఆమె నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోదు అనే ఆవేదన ఉంటుంది కానీ చూడండి ఇదే దాంపత్యం యొక్క అందమైన విరుద్ధం అదే భార్య భర్త ఆలస్యంగా ఇంటికి వస్తే తలుపు చప్పుడుకే మేలుకుంటుంది. అదే భర్త కోపంగా ఉన్నా ఆమె భోజనం చేయలేదని తెలిస్తే నిశశబ్దంగా ఆమె ముందుకు భోజనం పెడతాడు. దీనినే వివాహ బంధం అంటారు.
(01:33) పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు ఇల్లు సందడిగా ఉంటుంది. వారి చదువులు ఉద్యోగాలు పెళ్లిల్లు మనవళ్ళు ఇలా తల్లిదండ్రుల జీవితం వారికే అంకితం అవుతుంది. కానీ ఒకరోజు పిల్లలు తమ తమ జీవితాల్లో స్థిరపడిపోతారు. ఇల్లు నెమ్మదిగా ఖాళీ అవుతుంది. అప్పుడు మిగిలేది భార్యా భర్తలు ఇద్దరే ఒకప్పుడు చికాకుగా అనిపించిన గురక ఒకరోజు వినిపించకపోతే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి.
(01:57) ఎంత మాట్లాడతావు అని విసుక్కున్న అదే స్వరం ఒకరోజు శాశ్వతంగా మౌనం అయితే ఆ ఇంటి గోడలే వెలితిగా అనిపిస్తాయి. ఒకరు లేకపోతే ఓదార్చడానికి చాలా మంది వస్తారు. కానీ రాత్రి పక్కన ఖాళీగా ఉన్న మంచాన్ని ఎవ్వరు నింపలేరు. మందులు ఇచ్చిన చెయ్యి భోజనం చేశవా అని అడిగిన స్వరం కోపం వెనుక దాగిన ఆప్యాయతతో చూసిన ఆ కళ్ళను ఎవ్వరు తిరిగి తీసుకురాలేరు. అందుకే గుర్తుంచుకోండి.
(02:20) గొడవలు ఎప్పుడూ జరగని జంట ఉత్తమమైనది కాదు. గొడవల తర్వాత కూడా ఒకరినొకరు వదిలిపెట్టని జంటే ఉత్తమమైనది. దాంపత్యంలో ప్రేమ కంటే గొప్పది సర్దుకుపోవడం సర్దుకుపోవడం కంటే గొప్పది ఓర్పు ఓర్పు కంటే గొప్పది చివరివరకు కలిసి ఉండాలనే మనసు చిలిపితనం సిగ్గు గొడవలు, మౌనం, కష్టాలు, సంతోషాలు, కన్నీళ్లు, నవ్వులు, రాజీలు ఇవన్నీ కలిసే దాంపత్యాన్ని పవిత్రంగా మారుస్తాయి.
(02:48) మీ జీవిత భాగస్వామి విలువను వారు బ్రతికి ఉన్నప్పుడే గుర్తించండి. ఎందుకంటే బ్రతికున్నప్పుడు ఇచ్చే ప్రేమ గౌరవమే నిజమైనది వారు లేని తర్వాత కార్చే కన్నీళ్లు కాదు. గుర్తుంచుకోండి జీవితంలో పరిపూర్ణమైన జీవిత భాగస్వామి దొరకపోవచ్చు కానీ మన లోపాలను అంగీకరించి చివరివరకు మనతోనే నిలిచే భాగస్వామి కంటే గొప్ప వరం మరొకటి ఉండదు లేదు కూడా అవునంటారా కాదంటారా కాబట్టి బ్రతికున్నప్పుడే జీవితం చాలా చిన్నది సంతోషంగా కలిసి బ్రతికేయండి గొడవపడండి కొట్టుకోండి తిట్టుకోండి కానీ మరుక్షణమే దానిని మర్చిపోండి ప్రేమ ఆప్యాయతలు కడవరకు ఒకరికొకరు అందించుకుంటూ ఒక గొప్ప జంటగా చరిత్రలో
(03:30) నిలిచిపోండి. పోయిన తర్వాత బాధపడటం కంటే ఉన్నప్పుడు మధుర స్మృతులను లికించుకోండి. నేను చెప్పింది నిజమా కాదా కామెంట్ చేయండి. జై హింద్ జై భారత్ అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మూడు ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి.
(03:51) ఆర్థికంగా ఆర్ వాయిస్ చాలా చాలా ప్రాబ్లమ్స్ లో ఉంది దయచేసి మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఆర్థికంగా ఆర్ వాయిస్ ని ఆదుకోండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉందివ టుఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్ లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీదగ పేఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి.
(04:09) వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. జైహింద్, జై భారత్.
No comments:
Post a Comment