Saturday, August 15, 2026

"తార రాణి శ్రీవాస్తవ" ఈమె గురించి ప్రతీ స్త్రీ కి తెలియాలి.

PRATIKULA VEDAM
13 hours ago (edited)
"తార రాణి శ్రీవాస్తవ" ఈమె గురించి ప్రతీ స్త్రీ కి తెలియాలి.




ఈ రోజుల్లో Women Empowerment అంటే.. ఉద్యోగం చెయ్యడం, సొంత డబ్బులు సంపాదించడం, లేదా మగాళ్ళతో సమానంగా బార్‌లోకి వెళ్లి మందు కొట్టడం. ఇవన్నీ కేవలం భౌతికమైన, ఆర్థికపరమైన మార్పులు మాత్రమే. కానీ మానసిక బానిసత్వం, భయం ఇంకా ఎంతో మంది స్త్రీలలో అలాగే ఉన్నాయి.

మీకో చారిత్రక వాస్తవం చెప్తాను. (భారత ప్రభుత్వ అధికారిక స్వాతంత్య్ర సంగ్రామ రికార్డుల ప్రకారం) బీహార్ రాష్ట్రం, 1942. క్విట్ ఇండియా ఉద్యమం తారాస్థాయిలో ఉంది. తారా రాణి శ్రీవాస్తవ అనే ఒక సాధారణ మహిళ, తన భర్త "ఫులేందు బాబు"తో కలిసి సివాన్ పోలీస్ స్టేషన్ మీద జెండా ఎగరెయ్యడానికి బయలుదేరింది. ఆ రోజుల్లో ఆడవాళ్ళు గడప దాటడమే గొప్ప, అలాంటిది ఉద్యమంలోకి వచ్చింది. వస్తుండగా బ్రిటిష్ పోలీస్ లు కాల్పులు జరిపారు. భర్త గుండెకి బుల్లెట్ తగిలింది. రక్తం కారుతోంది. ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

ఇక్కడ ఆగి కొంచెం logically ఆలోచించండి. మన society conditioning ప్రకారం, ఒక భార్య ఆ క్షణంలో ఏం చేయాలి? గుండెలు బాదుకోవాలి, ఏడవాలి, చుట్టుపక్కల వాళ్ళని సహాయం అడగాలి, తన లక్ష్యాన్ని వదిలేసి, పతియే ప్రత్యక్ష దైవము అన్నట్టు, భర్త భౌతిక దేహాన్ని పట్టుకుని కూర్చోవాలి. ఎందుకంటే మనకు సినిమాల్లో, సమాజంలో నేర్పించిన 'ప్రేమ' అంటే అదే కదా!

కానీ "తారా రాణి" ఏం చేసిందో తెలుసా? తను కట్టుకున్న చీర కొంగు చించి, ఆ రక్తపు గాయానికి కట్టు కట్టి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న భర్తను అక్కడే వదిలేసి.. చేతిలో జెండా పట్టుకుని ముందుకు వెళ్లిపోయింది. పోలీస్ స్టేషన్ మీద జెండా ఎగరేసి, వెనక్కి వచ్చేసరికి ఆమె భర్త ప్రాణాలు వదిలేశాడు.

ఈ సంఘటన వినగానే 'ఆమె ఎంత గొప్ప దేశభక్తురాలు' అనిపిస్తుంది. కానీ దీన్ని ఇంకో లోతైన angle లో చూద్దాం. అసలు ఆమెకు ఆ క్షణంలో అంత నిలకడ, అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే ఆమె identity కేవలం 'ఒక వ్యక్తికి భార్య' అన్న దగ్గర ఆగిపోలేదు. ఆమెకు attachment (వ్యామోహం) కంటే purpose (లక్ష్యం) ముఖ్యం. భర్త అంటే కేవలం శరీరానికే పరిమితమైన ఒక మాంసపు ముద్ద కాదు, ఇద్దరూ నమ్మిన ఒక ఆశయం అని ఆమెకు తెలుసు. తాను అక్కడ ఆగిపోయి ఏడుస్తూ కూర్చుంటే, తన భర్త ప్రాణత్యాగాన్ని అవమానించినట్టే అని గ్రహించేంత high level of consciousness ఆమెలో ఉంది.

ఇప్పుడు ఈ lense తో, మన తెలుగు రాష్ట్రాల్లోని ఆడవాళ్ళ పరిస్థితిని విశ్లేషిద్దాం.

మన దగ్గర ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి 'నీకంటూ ఒక ఇల్లు లేదు, నువ్వెప్పటికైనా ఇంకో ఇంటికి వెళిపోవాల్సిన దానివి' అని ఒక భయాన్ని నూరిపోస్తారు. ఆ భయంతోనే పెరిగి, పెళ్లి అనే దాన్ని జీవితానికి ఒక ultimate goal గా పెట్టుకుంటారు. భర్త, పిల్లలు, అత్తమామలు, సీరియల్స్, బంధువులతో politics, పక్కింటి వాళ్ళ ముందు statusలు ఇదే ఎంతో మంది స్త్రీల జీవన శైలి.

మీరు modern clothes వేసుకోవచ్చు, corporate office లో లక్షల్లో salary తెచ్చుకోవచ్చు, కానీ మీ mind ఇంకా ఆ 'Society ఏమనుకుంటుంది' అనే జైలులోనే బందీ అయి ఉంది కదా? ఒక చిన్న సమస్య వస్తే చాలు, breakdown అయిపోతారు. మీ భర్తకో, పిల్లలకో చిన్న జ్వరం వస్తే మీ ప్రపంచం ఆగిపోతుంది, మీరెవరో మీరు మర్చిపోతారు. దాన్ని మీరు 'ప్రేమ' అనుకుంటున్నారు. కాదు, అది కేవలం 'భయం'. మీ ఉనికి, మీ identity ఇంకొకరి మీద ఆధారపడి ఉన్నప్పుడు వచ్చే తీవ్రమైన insecurity అది. మీకు మీకంటూ ఒక స్వతంత్రమైన ఆలోచన లేదు కాబట్టే, పక్కవాళ్ళను పట్టుకుని వేలాడుతున్నారు.

"తారా రాణి" తన భర్త కళ్ళెదురుగా రక్తపు మడుగులో పడిపోయినా, తన ధర్మాన్ని వదల్లేదు. ఎందుకంటే ఆమె తనను తాను ఒక శరీరంగా, ఒక సంబంధంగా మాత్రమే చూడలేదు కాబట్టి.

చివరగా, ఇప్పటి స్త్రీలకి, కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. సమాధానాలు కామెంట్స్ లో పెట్టక్కర్లేదు, మీ ego ని పక్కన పెట్టి మీకు మీరే నిజాయితీగా చెప్పుకోండి..

🟠మీ జీవితంలో మీ భర్త, పిల్లలు, మీ బ్యాంక్ బ్యాలెన్స్, మీ నగలు.. ఇవి తీసేస్తే, అసలు మీరెవరు? మీకంటూ ఒక స్వతంత్రమైన అస్తిత్వం ఉందా?

⚪ మీరు రోజువారీ జీవితంలో చేసే పనులలో, తీసుకునే నిర్ణయాలలో.. ఏది సమాజం పట్ల భయంతో చేస్తున్నారు, ఏది నిజమైన స్పృహతో చేస్తున్నారు?

🟢 మీరు ప్రేమ అని పిలుస్తున్నది నిజంగా ప్రేమేనా? లేక వాళ్ళు దూరమైతే మీ భద్రత ఎక్కడ పోతుందో అన్న భయమా?

🔴కళ్ళ ముందు భర్త ప్రాణాలు పోతున్నా ఒక మహిళ తన లక్ష్యం వైపు నడవగలిగినప్పుడు.. కేవలం 'నలుగురు ఏదో అనుకుంటారు' అన్న భయంతో మీరు మీ సొంత కలలను, మీ ఆలోచనలను ఎందుకు చంపేసుకుంటున్నారు?

ఆలోచించండి. ఈ ప్రశ్నలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. But ఇబ్బంది కలగకుండా ఎదుగుదల సాధ్యమా?

- PRATIKULA VEDAM 🇮🇳
18


http://youtube.com/post/Ugkx81tvnrDi5S34hIgZqiwHCSZPi4gdm2qI?si=SVIAJm4F-XWqWU55

No comments:

Post a Comment