Friday, August 14, 2026

మన సంస్కృతిలో పసుపు – కుంకుమ ప్రాధాన్యత.

 [8/13, 05:06] +91 85000 46622: _*"మన సంస్కృతిలో పసుపు – కుంకుమ ప్రాధాన్యత."*_

మన సనాతన భారతీయ సంస్కృతిలో కొన్ని వస్తువులు సాధారణంగా కనిపించినప్పటికీ, వాటి వెనుక తరతరాలుగా వస్తున్న గొప్ప ఆధ్యాత్మిక భావం దాగి ఉంటుంది. 

అలాంటి పవిత్రమైన మంగళద్రవ్యాలే పసుపు–కుంకుమలు.

మన ఇంట్లో ఏ పూజ ప్రారంభించినా, వ్రతం ఆచరించినా, శుభకార్యం మొదలుపెట్టినా, దేవతను ఆరాధించినా, సుమంగళిని గౌరవించినా పసుపు–కుంకుమలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.

పసుపు మన సంప్రదాయంలో పవిత్రతకు, మంగళత్వానికి, శుభారంభానికి ప్రతీకగా భావించబడింది. 

అందుకే పూజా కార్యక్రమాల్లో పసుపుకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. 

పసుపుతో గణపతి రూపాన్ని తయారు చేసి పూజించే సంప్రదాయం ఉంది. 

అలాగే కొన్ని పూజా విధానాల్లో పసుపుతో గౌరీదేవి రూపాన్ని సిద్ధం చేసి ఆరాధిస్తారు.

సాధారణమైన పసుపుకు దైవస్వరూపాన్ని కల్పించి, మంత్రపూర్వకంగా పూజించడం మన సనాతన ధర్మంలోని దైవభావానికి ఒక అందమైన ఉదాహరణ.

పసుపుతో ముడిపడిన కుంకుమకు కూడా మన సంస్కృతిలో విశిష్టమైన స్థానం ఉంది. 

దేవతకు కుంకుమ సమర్పించడం, పూజలో ఉపయోగించడం, పూజ అనంతరం ప్రసాదంగా స్వీకరించడం వంటి ఆచారాలు మనలో భక్తి, శుభభావనలను పెంపొందిస్తాయి.

నుదుటిపై కుంకుమ ధరించడం కేవలం అలంకారం కాదు; దైవస్మరణతో, మంగళభావంతో జీవించాలనే ఆంతర్యాన్ని గుర్తుచేసే పవిత్ర చిహ్నంగా మన సంప్రదాయం దానికి స్థానం ఇచ్చింది.

మన జీవితంలోని శుభసందర్భాలను గమనిస్తే పసుపు–కుంకుమలు మన ఆచారాల్లో అంతర్భాగంగా కనిపిస్తాయి. 

వివాహం వంటి మంగళకార్యాల్లో, వ్రతాల్లో, పూజల్లో, దేవతారాధనలో, సుమంగళి గౌరవంలో వీటికి ప్రత్యేకమైన స్థానం ఉంది. 

అందుకే ఇవి కేవలం పూజా సామగ్రి కాదు; మన శుభసంకల్పానికి, మంగళభావానికి, సనాతన కుటుంబ సంప్రదాయానికి ప్రతీకలు.

సుమంగళికి పసుపు–కుంకుమ ఇవ్వడం మన సంస్కృతిలో ఎంతో అందమైన ఆచారం.

ఆమెకు పసుపు–కుంకుమ అందించడం ద్వారా ఆమె జీవితంలో మంగళం, శుభం, సౌభాగ్యం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. 

అందువల్ల ఇది కేవలం ఒక వస్తువును ఇవ్వడం కాదు; ఒక మంగళాశీస్సును అందించడం, మన శుభభావాన్ని పంచుకోవడం.

మన పూర్వీకులు ప్రతి ఆచారానికీ ఒక ఆధ్యాత్మిక భావాన్ని జోడించారు. 

పసుపులో మంగళాన్ని, కుంకుమలో శక్తి–సౌభాగ్య భావాన్ని, అక్షింతల్లో సంపూర్ణతను, దీపంలో జ్ఞానాన్ని, పుష్పంలో భక్తిని దర్శించే ఆధ్యాత్మిక దృష్టిని మనకు అందించారు.

అందుకే పూజా మందిరంలో పసుపు–కుంకుమ కనిపించినప్పుడు వాటిని సాధారణమైన వస్తువులుగా మాత్రమే చూడకుండా, మన పూర్వీకులు తరతరాలకు అందించిన మంగళసంప్రదాయానికి పవిత్రమైన గుర్తులుగా భావించాలి.

పసుపు–కుంకుమలు మన ఇంటి అలంకారం కాదు, మన సనాతన సంస్కృతి అందించిన మంగళానికి చిరునామా. 

 *మన సంప్రదాయాన్ని తెలుసుకుందాం* . 

 *భక్తితో ఆచరిద్దాం - భావితరాలకు అందిద్దాం.  🙏* 

✍🏻 🙏
[8/13, 15:23] +91 94406 44185: అయ్యో సార్ ఓన్లీ బ్రాహ్మణులలోనే 58 శాఖలు ఉన్నాయి. 

విశ్వబ్రాహ్మలు అంటే కంసాలి(పూర్వపు వృత్తులలో ఉండేవారు వడ్రంగి, కమ్మరి, బంగారపు పని చేసేవారు అయితే ఇప్పుడు ఆ పనులన్నిటి లోను ముస్లిమ్స్ వచ్చేశారు) 

నాయీ బ్రాహ్మలు అంటే మంగలి వాళ్ళు.

అసలు బ్రాహ్మలకు ముఖ్యంగా *కట్టు, బొట్టు, జుట్టు* ముఖ్యంగా ఉండాలి. బ్రాహ్మణుడు అని తేలికగా గుర్తించడానికి వీలుగా అలా పెట్టారు. కానీ పాశ్చాత్య చదువులు, ఆధునీకరణ, ఫ్యాషన్సు, వృత్తులకు తగిన గౌరవం లేకపోవడం వలన మన వాళ్ళు *కట్టు, బొట్టు, జుట్టు*  మూడిటినీ మనవారు వదిలేశారు. పంచ కట్టు గోచీ పోసి కట్టుకోవడం మానేశారు.ఇ బొట్టు పెట్టుకోవడం నామోషీగా ఫీలువుతు న్నారు. నేటి ఆడ పిల్లలే ఇష్టపడటం లేదు బొట్టు పెట్టుకోవడానికి. అదియు కాక రక రకాల దిక్కుమాలి న రంగు బొట్లు వచ్చేశాయి, వాటికి స్టిక్కర్స్, రక రకాల షేపులలో బొట్టు బిళ్ళలు వచ్చేశాయి. ఆ తరువాత జుట్టు, ఉపనయన సంస్కారం తో శిఖ వస్తుంది.
శిఖ అనగా పిలక. ఆ శిఖను
ఎంత మంది ఉంచుకుంటు న్నారు.  వెక్కిరిస్తారనో ఏమో నామోషీ గా ఫీలయి, అసలు ఉపనయంలో పెట్టే పంచ శిఖలని కూడా, ఐదు కత్తిరలు ఇచ్చి, దర్భ పెట్టి కార్యక్రమము కానిచ్చేస్తు న్నారు. చౌలము అనగా చెవులు కుట్టించు కోవడం ఉపనయనం లో అవీ ఎత్తేశారు. అన్నీ మంట కలిసిపోయినాయి. కాకపోతే మరలా ఫ్యాషన్ రూపంలో మగ వాళ్ళు చెవులు కుట్టించుకోవడం, జుట్టు పెంచి జడలుగా  వేసుకోవడం, ముడి వేసుకోవడం చేస్తున్నారు, ఇంకో దిక్కుమాలిన సంస్కృతి ఏమంటే గడ్డం పెంచుకోవడం, అలానే పెళ్ళి కొడుకుగా కూర్చోవడం ఫ్యాషన్ అయిపోయింది.

ఇవి కాక బ్రాహ్మలలో రకాలు, ప్రధానంగా శైవులు, వైష్ణువులు. వైష్ణువులు అనగా విష్ణువుని ఆరాధించే వారు. కాల క్రమీణా ఆయన అవతారాలను కూడా పూజిస్తున్నారు. ముందుగా వైష్టువులలో శ్రీ వైష్ణువులు, ఆది వైష్ణువులు, క అయ్యంగార్లు, నాయర్లు, వైఖానసులు, కర్ణాలు ఇలా వృత్తిని బట్టి వున్నారు. ఎర్ర బొట్టు *U* ఆకారంలోనూ, మధ్యలో తెల్లబొట్టు పెట్టేవారు, అచ్చగా తెల్ల బొట్టు పెట్టేవారు ఉన్నారు, పొడవుగా ఒక్క ఎర్ర బొట్టు పెట్టే వారూ వారి యొక్క సబ్ సెక్ట్ ప్రకారం ఉన్నారు. న లోతుగా తెలీదు. ఎక్కువగా విష్ణాలయాలలో నూ, రామాలయాలలోనూ, వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో కనిపిస్తారు. 

ఇక శైవులు అనగా శివునిని ఆరాధించే వారు. వైదీకులు, నియోగులు అని రెండు వర్గాలుగా చెప్పవచ్చు. వీరిలో ఆది శైవులు, వీర శైవులు, వీర భద్ర పళ్ళెం పట్టేవారు,  తంబల వాళ్ళు, లింగాయతులు అని ఉన్నారు. శరభ శరభ అని వీర భద్రులు,  బుగ్గల్లో శూలాలు గ్రుచ్చుకొని, శరభ శరభ అని ఈ అయ్యప్ప ఊరేగింపు లలోనూ & తంబల వాళ్ళు  కొలుపులలో కనిపిస్తూ ఉంటారు. శ్రీశైలం లో చేసేది అర్చకులు తంబల వాళ్ళే. లింగాయతులను బలిజ అని కర్ణాటకలో అంటారు. వీరిలో మగ వారికి జంధ్యమునందు, ఆడవారికి మంగళ సూత్రము నందు చిన్న భరిణెలో ఒక  శివలింగము ఉంటుంది. చాలా నిష్టగా ఉంటారు. 

పూర్వం రాజుల కాలంలో ఒక్కొక్క పనికి కొంత మందిని నియోగించే వారు. అందువలన  చేసే పనివల్ల వారు *నియోగులైనారు* , కర్ణము అనగా చెవి, చెవులకు కుండలాలు ధరించే వారిని కర్ణములు అన్నారు. వీరు భూమి కొలతలు, శిస్తు వాసూలు చేసేవారు.  
ఈ నియోగులలో ప్రధమ నియోగులు, ఆరువేల నియోగులు, పాకనాటి, ప్రధమసని, గోల్కొండ వ్యాపారులు ఇలా పలు వర్గాలుగా ఉన్నారు.

మరలా వైదీకులలో వృత్తిని బట్టి వైదీకులని, మరలా వైదీకులలో పురోహితులు, అర్చకులు ఉన్నారు. వైదీకులలో వెలనాడు, కోసలనాడు, మూసలనాడు, పల్నాడు, తెలగాణ్యులు, గోల్కొండ వారు, ఇలా ఉన్నారు. ఇలా బ్రాహ్మలలో 58 శాఖలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే శాఖలు దాటి బయటకొచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే  బ్రాహ్మణులే వేరే  వర్ణాంతర వివాహాల వైపు వెళ్ళి పెళ్ళిళ్ళు చేసేసు కుంటున్నారు. నేటి సమాజంలో ఇటీవల ఇవి ఎక్కువవుతున్నాయి. చూస్తున్నారా. ఇంత కథ ఉన్నది వీటి వెనుక

No comments:

Post a Comment