*పూజలలో స్త్రీలను నిరోధించలేదు భక్తి కలవారు కొన్ని శాస్త్ర నిమయమాలు పాటించి దైవారాధన చేసుకోవచ్చు ఈ విషయాలు తెలుసుకుందాము*
🌻 బ్రహ్మవైవర్త పురాణే 🌻
*స్త్రీణాం చ ప్రాకృతానాం చ నామ్ని హ్యధికారో మతః।*
*జపే చ ధ్యానమార్గే చ భక్తిరేవ హి కారణమ్॥*
"నామజపం, ధ్యాన మార్గం మరియు పూజలలో స్త్రీలకు, సామాన్య జనులకు సంపూర్ణ అధికారం కలదు. దైవ సాధనలో భక్తి మాత్రమే ప్రధాన కారణం.
🌻 స్కాంద పురాణo 🌻
*స్త్రియో వా పురుషా వాపి భక్తియుక్తా మహేశ్వరే।*
*జపంతి నామమాత్రం తు తే గచ్ఛంతి పరాం గతిమ్॥*
"స్త్రీలైనా, పురుషులైనా మహేశ్వరుని పట్ల భక్తి కలిగి కేవలం నామజపం మరియు ధ్యానం చేసినా సరే, వారు ఉత్తమమైన పరమగతిని పొందుతారు."
🌻 నారద పురాణే 🌻
*జపయజ్ఞో మహాశ్రేష్ఠః సర్వయజ్ఞోత్తమో మతః।*
*నత్ర స్త్రీ శూద్ర భేదో'స్తి సర్వేషామధికారితా॥*
"అన్ని యజ్ఞాల కంటే జపయజ్ఞం అత్యంత శ్రేష్ఠమైనది. ఈ జపయజ్ఞం చేయడంలో స్త్రీ లేక జాతి తో ఎలాంటి భేదమూ లేదు సమాజంలోని ప్రతీ ఒక్కరికీ జపం చేసే అధికారం ఉంది."
🌻 పద్మ పురాణే 🌻
*న స్త్రీ శూద్రో వయో భేదో న దేశ నియమస్తథా।*
*జపే విశేషో నాస్త్యేవ భక్తిరేవ హి కారణమ్॥*
"జపము మరియు భగవదారాధన చేయడంలో స్త్రీ వయస్సు అని కానీ, ప్రత్యేక ప్రాంత నియమాలు కానీ ఏవీ అడ్డురావు. భగవన్నామ జపానికి మరియు పూజకు ‘భక్తి’ ఒక్కటే ముఖ్యమైన కారణం (అర్హత)."
*పతివ్రతా తు యా నారీ పత్యుః సదృశమాచరేత్।*
*సా నారీ పుణ్యచరితా పత్యుర్లోకాయ కల్పతే॥*
"ఏ స్త్రీ అయితే తన భర్తను అనుసరించి ఆయన ధర్మకార్యాలకు, ఆలోచనలకు అనుగుణంగా ప్రవర్తిస్తుందో... ఆ పుణ్యచరిత అయిన స్త్రీ భర్తతో పాటు ఉత్తమ ఆధ్యాత్మిక గతులను పొందుతుంది."
🌻 గరుడ పురాణే 🌻
*స్త్రియో వా పురుషా వాపి యే భక్తా మామనువ్రతాః।*
*తేషామామయహర్తా'హం పూజితః శ్రద్ధయా సదా॥*
"స్త్రీలైనా లేదా పురుషులైనా ఎవరైతే శ్రద్ధతో, నిష్ఠతో నన్ను నిరంతరం పూజిస్తారో, ధ్యానిస్తారో... వారి సమస్త దుఃఖాలను, భయాలను నేను నివారించి కాపాడుతాను."
🌻 భగవద్గీత 🌻
భగవంతుని దృష్టిలో భక్తికి లింగభేదం, కులభేదం లేదని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ గీతలో అభయమిచ్చారు.
*మాం హి పార్థ వ్యపాశ్రిత్య యే'పి స్యుః పాపయోనయః।*
*స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తే'పి యాంతి పరాం గతిమ్॥*
ఓ అర్జునా! నన్ను శరణు వేడినవారు స్త్రీలైనా, ఏ కులంలో జన్మించినవారైనా సరే... వారందరూ పరమ గతిని (ముక్తిని) పొందుతారు."
భక్తితో చేసే జపం, ధ్యానం, పూజలకు ఏ శాస్త్రము స్త్రీలను నిరోధించలేదు శాస్త్ర నియమాలు ఉల్లఘించకుండా ఆర్తి, నిజాయితీ కలిగిన భక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ధారాళంగా దైవచింతన చేయవచ్చు.
సనాతన ధర్మంలో సంధ్యావందనం వంటి కొన్ని నిర్దిష్టమైన వైదిక కర్మలకు మాత్రమే కొన్ని నియమాలు ప్రతిపాదించబడ్డాయి. కానీ ఈశ్వర పూజ, నామజపం, ధ్యానం, స్తోత్ర పారాయణం, మానస పూజ మరియు నవవిధ భక్తి మార్గాలు ఆచరించడానికి స్త్రీలకు పురాణాలలో, శాస్త్రాలలో పరిపూర్ణమైన స్వేచ్ఛ మరియు హక్కు కల్పించబడ్డాయి.
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
No comments:
Post a Comment