🕉️_*ఓం నమః శివాయ*👏
*ఓం గురుభ్యోనమః*
*ఓం శేషాద్రిస్వామినే నమః*
*ఓంశ్రీఅరుణాచలేశ్వరాయనమః🕉️🕉️🕉️🕉️🕉️_శివతత్వం - శివారాధన_*
*┈┉┅━❀꧁ఓంనమఃశివాయ꧂❀━┅┉┈*
*శివ అనేనామం అత్యంత పవిత్రమైనది మంగళప్రదమైనది శివుడుఅంటే శుభాన్ని ప్రసాదించేవాడు అశుభాలను తొలగించేవాడు భక్తులకు సుఖశాంతులు ఐశ్వర్యం జ్ఞానం వైరాగ్యం చివరికి మోక్షాన్ని ప్రసాదించే పరబ్రహ్మస్వరూపుడు శివస్మరణ మనస్సును పవిత్రంచేస్తుంది ధర్మంలో స్థిరత్వాన్ని జీవితంలోశాంతిని ఆత్మవిశ్వాసాన్నిప్రసాదిస్తుంది*
*రుద్రుడుఅంటే ఎవరు?*
*శివునికి రుద్రుడుఅనే నామం కూడాఉంది రుద్రుడుఅంటే రోదనాన్ని దుఃఖాన్ని తొలగించేవాడు జీవితంలో సుఖదుఃఖాలు సహజం అలలులేని సముద్రంలేనట్లే కష్టాలులేని జీవితంఉండదు అలాంటిసమయంలో మనిషికి ధైర్యం ఓర్పు దైవబలాన్ని ప్రసాదించేది శివస్మరణ శివారాధనే*
*స్థాణువు అనే పేరులోని ఆంతర్యం*
*స్థాణువు అంటే అచంచలుడు స్థిరస్వరూపుడు ఎంతటి విపత్తువచ్చినా మనస్సుచలించకుండా ధర్మంలోనిలబడే మానసికస్థైర్యానికి శివుడు ప్రతీక హాలాహలవిషాన్ని తన కంఠంలోనిలుపుకుని లోకాలన్నింటినీ రక్షించిన త్యాగమూర్తికూడా పరమేశ్వరుడే అందుకే కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవడం శివతత్వంలోని గొప్పసందేశం*
*కామాన్నిజయించిన మహాదేవుడు*
*మనిషినిపతనానికి దారితీసేది అదుపులేని కామం క్రోధం లోభం శివుడుసంయమనానికి ప్రతిరూపం మన్మథుడిని భస్మంచేసిన సంఘటన అదుపులేని కోరికలను జయించి ధర్మమార్గంలో జీవించాలిఅనే శాశ్వత సందేశాన్ని అందిస్తుంది*
*ఆదర్శదాంపత్యానికి ప్రతీక*
*అర్ధనారీశ్వర స్వరూపంద్వారా పరమేశ్వరుడు స్త్రీ–పురుష సమానత్వాన్ని పరస్పర గౌరవాన్ని ప్రేమను త్యాగాన్ని ప్రపంచానికి బోధించాడు పార్వతీపరమేశ్వరులు ఆదిదంపతులుగా గృహస్థులకు శాశ్వత ఆదర్శంగానిలిచారు*
*సర్వం శివమయంజగత్*
*పంచభూతాలలో శివుడు ఉన్నాడు సూర్యచంద్రుల్లో శివుడుఉన్నాడు ప్రతిఅణువులో ప్రతిజీవిలో ప్రతిశ్వాసలో పరమశివుడే ఉన్నాడు అందుకే వేదాలు సర్వం శివమయం జగత్ అనే మహత్తరభావాన్ని బోధిస్తున్నాయి ప్రతిజీవిలో శివుడినిదర్శించినప్పుడే నిజమైన భక్తికలుగుతుంది*
*నిజమైన శివారాధనఅంటే*
*శివారాధనఅంటే కేవలం పూజలు అభిషేకాలు చేయడం మాత్రమేకాదు*
*ధర్మాన్ని ఆచరించడం*
*సంయమనంతోజీవించడం*
*స్థిరమైన మనస్సును అలవర్చుకోవడం*
*ప్రలోభాలకులొంగకుండా ఉండడం*
*కుటుంబాన్ని ప్రేమ గౌరవంతో నడిపించడం*
*సమస్తప్రాణుల శ్రేయస్సును కోరుకోవడం*
*ప్రతిజీవిలో పరమశివుని దర్శించడం*
*నిత్యం ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మహామంత్రాన్ని భక్తితో జపించడం*
*శివో భూత్వా శివం యజేత్ అనే శాస్త్రవాక్యంప్రకారం మనలో శివుని దయ కరుణ సంయమనం స్థిరత్వంవంటి దివ్యగుణాలను పెంపొందించుకోవడమే పరమశివునికిచేసే అత్యుత్తమఆరాధన శివున్నిఆరాధించడం అంటే ఆయనను పూజించడం మాత్రమేకాదు ఆయన బోధించినధర్మాన్ని సంయమనాన్ని కరుణను త్యాగాన్ని మనజీవితంలో ఆచరించడమే నిజమైన శివారాధన*
*వాగర్థ వివసంపృక్తౌ*
*వాగర్థ ప్రతిపత్తయే*
*జగతః పితరౌవందే*
*పార్వతీపరమేశ్వరౌ*
*ఓంనమః ప్రణవార్థాయ*
*శుధ్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయేనమః*
*గురువే సర్వలోకానాం*
*భిషజే భవరోగిణామ్*
*నిధయే సర్వవిద్యానామ్* *దక్షిణామూర్తయే నమః*
*ఓం శ్రీదక్షిణామూర్తయేనమః*
*ఓం నమఃశివాయ*
🪷🪷🪷🪷🪷
*ఓంఅరుణాచలేశ్వరాయనమః*
*ఓం శ్రీ అరుణాచల*
🕉️🙏🕉️
No comments:
Post a Comment