Monday, August 10, 2026

 *శివునికి ఆవుపాలతో అభిషేకం ఎందుకు చేస్తారు ?* 

ఆవుపాలతో అభిషేకం చేస్తే మనం నోరు విప్పి అడగవలసిన అవసరం లేకుండా మనకు కలిగే పరమాత్మ నిర్హేతుకకృపాకటాక్ష వీక్షణంగా లభించే ఉత్తర క్షణ ఫలితం కుటుంబంలో సర్వసౌఖ్యాలు కలుగుతాయి. సుఖం అనగా మనకు అభ్యున్నతి ఈశ్వరునిచే కటాక్షించబడడమే. జ్ఞానాన్ని అపేక్షించడం ఆవుపాలతో అభిషేకంచేయడం. ఒకసారి జ్ఞానం కలిగితే మోక్షం వైపు వెళ్ళిపోతారు. అందువల్ల అది అమృతం అయింది. పంచామృతాలలో మొదటిది ఆవుపాలు.

 *శివునికి పెరుగుతో అభిషేకం ఎందుకు చేస్తారు ?* 

బాహ్యంలో ఈ శరీరానికి పాపఫలితంగా అనారోగ్యం వస్తుంది. ఈ రోగానికి ఉపశమనం చూపించు అని అడిగితే ఈశ్వరానుగ్రహంగా రోగం ఉపశమించాలి. అంటే పెరుగుతో అభిషేకం చేయాలి.

 *శివునికి నేతితో అభిషేకం ఎందుకు చేస్తారు ?* 

వంశం పెరగడం ఐశ్వర్యం. ఐశ్వర్యాన్ని . గృహస్థాశ్రమంలో అపేక్షించడం దోషం కాదు. అంతరంలో ఒక గొప్ప రహస్యం ఉన్నది. ముందు మనసు సత్త్వగుణ ప్రధానం అవ్వాలి. పరిశుద్ధమైన మనస్సు ఆ తర్వాత పెద్దల మాటలు వినగా వినగా విషయాలలో సుఖం లేదనే భావన వల్ల కలిగిన వైరాగ్యమనే అగ్నిహోత్రం చేత కాగి భక్తితో ఎర్రని తెట్టు కడితే, శాస్త్ర వచనం అన్న పెరుగు తెచ్చి కలిపి లోపల కదలకుండా నిలబెడితే, ఆ ధ్యానంలో అది తోడుకుంటే అందులో కవ్వం పెట్టి తిప్పి భగవంతుని రూప, గుణ, విభూతులను అనుభవించడానికి మననం చేస్తే, అందులో నుండి వెన్న పుడితే, ఈశ్వరుని వదిలి ఉండలేం అన్న తాదాత్మ్యత బుద్ధి పుడితే, నీటిలో తేలుట, అగ్ని తగిలితే కరుగుట, అనే నేతి స్వభావం పొందితే ఆవచ్చిన నేయిని తపస్సుచే అపరోక్షానుభూతిగా మార్చుకుని, ఇక్కడే ఇప్పుడే పరబ్రహ్మంగా నిలబడగలిగిన స్థితి ఇయ్యమని అడగడం చేతకాదని తెలుసుకోవాలి. బాహ్యంలో ఐశ్వర్యాన్ని అడుగుట కొరకు నేతితో అభిషేకం. పంచామృతాలలో నెయ్యి శివలింగానికి అభిషేకం చేసి అద్వైత స్థితిలో అపరోక్షానుభూతి అడగడం.

 *శివునికి తేనెతో అభిషేకం ఎందుకు చేస్తారు ?* 

తేనె ఎంత తాగినా చాలా బాగుంది అనిపిస్తుంది. మనసు తీరదు. విషయాలను అది అనుభవిస్తే బాగుండు, ఇది అనుభవిస్తే బాగుండు అనిపిస్తుంది. ఎన్ని అనుభవించినా దాని వలన వచ్చే ప్రయోజనం శూన్యం. ఈ వైరాగ్య భావన రమ్మని అంటే వచ్చేది కాదు. విషయాలను అనుభవించడం అంటే శరీరానికి, మనసుకు అంత ప్రీతి. అందుచేత ఎవరు ద్వంద్వాలను అతిక్రమించి విషయాలను విడిచిపెట్టి విషయాలతో సంబంధం లేకుండా ఉండాలి అంటే విషాన్ని కంఠంలో ఉంచుకున్న వాని పాదాల వైపుకు నడవాలి. విషయాల పట్ల తిరస్కార భావం అంత తొందరగా రాదు. ఈ భావన పోవాలంటే స్వామికి తేనెతో అభిషేకం చేస్తారు. తేనెతో అభిషేకం వలన వచ్చేది అపారమైన తేజస్సు. అంతరంలో తేనెను అభిషేకం చేయడం చేత విషయ పిపాస విరిగిపోయి వైరాగ్య భావన అంకురిస్తుంది.

 *శివునికి పంచదార తో అభిషేకం ఎందుకు చేస్తారు ?* 

దేహాత్మ అభిమానం పంచదార. లోపల ఉన్నదాని ఎరుక లేకపోవడం అజ్ఞానం. ఈ అభిమానం తొలగదోయవయ్యా అని అడగడం పంచదారతో అభిషేకం.

 *ఓం నమః శివాయ హర హర మహాదేవ* 🙏.              *ఆధ్యాత్మిక కుటుంబం*                        

No comments:

Post a Comment