Friday, August 14, 2026

confuse to clarity #shorts #shortvideo #viral #viralvideo #youtubeshorts #trending

confuse to clarity #shorts #shortvideo #viral #viralvideo #youtubeshorts #trending

Author Name:ajju-baipalli

Youtube Channel Url:https://www.youtube.com/@ajju-baipalli

Youtube Video URL:https://www.youtube.com/watch?v=nM7TxEy6XmQ



Transcript:
(00:01) లక్ష్మీనారాయణ అనే ఒక బ్రదర్ ఒక మెసేజ్ పెట్టాడు బ్రదర్ మీ యొక్క మాటలు వింటూ మీ యొక్క వీడియోలు చూస్తూ వాటి గురించి ఆలోచిస్తుంటే కొన్ని దగ్గర కన్ఫ్యూషన్ వస్తుంది కొన్ని దగ్గర క్లారిటీ వస్తుంది. సో నాకు ఆ కన్ఫ్యూషన్ కూడా పోవాలి నాకు ఒక క్లారిటీ ఇవ్వండి బ్రదర్ అని అడిగారు. చూయిస్తా ఇప్పుడు నా మాటలు వింటూ ఆలోచనలు చేస్తున్నాను అంటున్నారు కదా నా మాటలు వినేది మీరు కాదు మీ చెవులు వింటున్నాయి ఆ విన్నదాన్ని సాక్షిగా చూస్తున్నది మీరు నా మాటలు వింటూ ఆలోచన చేస్తున్నాను అన్నారు కదా ఆ ఆలోచన చేసేది మీరు కాదు బ్రెయిన్ ఆలోచన చేస్తుంది ఆ ఆలోచనలు సాక్షిగా
(00:36) చూస్తున్నది మీరు ఆ ఆలోచన నుండి ఒక కన్ఫ్యూషన్ వస్తుంది అంటున్నారు కదా ఆ కన్ఫ్యూజన్ మీరు కాదు ఆ కన్ఫ్యూజన్ ని సాక్షిగా చూస్తున్నది మీరు ఆ కన్ఫ్యూజన్ లో నుంచి ఒక క్లారిటీ వస్తుంది అంటున్నారు కదా ఆ క్లారిటీ వచ్చేది మీరు కాదు ఆ క్లారిటీని సాక్షిగా చూసేది మీరు ఇది క్లారిటీ మరి ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క లైపి బ్రదర్ సమాధానం ఇస్తున్నారు అన్నిటికీ శరీరం నేను కాదు ఈ మనసు నేను కాదు అని ఇస్తే సరిపోతుంది కదా యూనివర్సల్ ఆన్సర్ లా అంటే అది ఎదురుగా అడిగే వ్యక్తి బట్టి పరిస్థితి బట్టి ఉంటుందండి.
(01:05) ఎందుకంటే ఇప్పుడు శంకరాచార్యుల వారు నిర్వాణ శతకంలో నాకు అసలు జన్మే లేదు తద్వారా నాకు మరణం లేదు అన్నారు. అదే శంకరాచార్యుల వారు శివానందలహరిలో పదవ శ్లోకంలో నరత్వం దేవత్వం నగమన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవత విహగత్వాది జననం సదాత్మ పాదాబజ స్మరణ పరమానందల హరివిహార సక్తం చేతుదయమేహకింతేనస అన్నారు అంటే ఏ జన్మెత్తినా నాకు నీ యొక్క పాదాల యందు నా యొక్క మనసు పట్టుకునేలా చూడు అన్నారు నిర్వాణ సతకంలో అసలు జన్మే లేదు అన్నారు.
(01:38) శివానంద లహరిలో నాకు ఎన్ని జన్మలు ఎత్తిన నా యొక్క మనసు నీ యొక్క పాదాలను పట్టుకోవాలి అన్నారు. ఒకరే శంకరాచాలు వారు ఇన్ని ఎందుకు సమాధానాలు ఇచ్చారు ఒక దగ్గరేమో అసలు నీకు జన్మ లేదు అన్నారు ఇంకొక దగ్గర నీకు జన్మ ఉంది అన్నారు. అంటే ఇక్కడ నిర్వాణ సత్వంలో అడిగింది గురువుగారు గురువుకి తెలుసు ఈ శరీరం ఈ మనసు నేను కాదని తద్వారా సమాధానం ఇచ్చారు ఈ శరీరం నేను కాదు ఈ మనసు నేను కాదు నాకు జన్మ లేదు అన్నారు.
(01:58) ఇక్కడ శివానంద లహరి దగ్గరికి వచ్చినప్పటికి లోకం అడిగింది లోకంకి చెప్పాలి అందుకనే ఎన్ని జన్మలు ఎత్తుతున్న నా యొక్క మనసు నీ యొక్క పాదాలను పట్టుకోవాలి తద్వారా చివరికి తెలుసుకుంటావు అని అడిగే వ్యక్తి బట్టి ఆయన యొక్క స్థితి బట్టి ఉంటుంది సమాధానం అందరికీ ఒకటే చెప్తే వాళ్ళు పట్టుకోకపోవచ్చు కదా సో అందుకు అట్లా చెప్పడం ఇది పరిశీలన చేస్తే మనకు తెలుస్తుంది ఆత్మ విచారణ చేస్తే మనకు తెలుస్తుంది.
(02:23) అది ఏ మార్గంలో అయినా మీరు చేసుకోవచ్చు కర్మ మార్గమా భక్తి మార్గమా జ్ఞాన మార్గమా ధ్యాన మార్గమా ఏ మార్గమైనా పట్టుకోండి చివరా ఆఖరికి వచ్చేది నీ దగ్గరికే సమాధానం నిన్ను నువ్వు తెలుసుకోవడమే సో అది వీలైనంత వేగంగా తెలుసుకోండి ఆత్మ విచారణ చేసుకోండి సరేనా టాటా బాయ్ బాయ్ అరుణాచ ఆ

No comments:

Post a Comment