Kapala Moksham Part 17
Author Name:Telugu Books
Youtube Channel Url:https://www.youtube.com/@telugubooks1031
Youtube Video URL:https://www.youtube.com/watch?v=V5uKtcn2Uis
Transcript:
(00:01) ప్రేతశక్తి ఉన్నదా శ్రీశైలంలోని పంచమటాల్లోని ఒకటైన విభూతి మటంలోని సాధువు నాకు దైవశక్తి అలాగే ప్రేతశక్తి ఉన్నదని ఏదో మంత్రించిన విభూది నా మీద జల్లి చూపించినాడని మీకు తెలుసు కదా అయినా నాకు వీటి మీద నమ్మకం రాలేదు కలగలేదు. ఎందుకంటే ఇలాంటి సాధువులు ఏవో కొన్ని తాంత్రిక విద్యలు నేర్చుకొని మన మీద ప్రయోగజనాలు ప్రయోగాలు చేస్తూ ఉంటారని వివిధ తంత్ర గ్రంధాల ద్వారా నేను తెలుసుకున్నాను.
(00:34) దానితో అవి ఉన్నాయో లేవో నేనే స్వయంగా తెలుసుకోవాలని అందుకు నాకు వీటి గురించి చెప్పేవారు ఎవరూ లేకపోవడంతో నేను కూడా ఇలాంటి గ్రంథాలు చదవడం ప్రారంభించాను. అందులో ఒక పుస్తకంలో రాత్రిపూట ఆరు బయట నగ్నంగా నిద్రపోతే అవి మన ఒంటి మీదకు వచ్చి పడతాయని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఎవరైతే స్త్రీలు తలంటు స్నానం చేసిన తర్వాత జుట్టుకు నూనె పెట్టకుండా విరబూసుకుని రాత్రులు వీధుల వెంట తిరిగితే వారికి ఇబ్బందులు కలుగుతాయని చదవడం జరిగింది.
(01:02) దాంతో నా బడి స్నేహితులకు ఈ విషయం గురించి చెప్పడం జరిగింది. అందులో ఆడ స్నేహితులు కూడా ఉన్నారు. నేను చెప్పినది నమ్మకపోగా ఇలాంటివి బట్టి అభూత కల్పనలని కొట్టిపారేశారు. దాంతో మాకు ఇవి అసత్యాలని లోకానికి చెప్పాలని మాలో కొంతమంది కలిసి రాత్రిపూట ఇంటి డాబాల పైన నగ్నంగా పడుకోవాలని నిర్ణయించుకున్నాం. అలాగే మా ఆడ స్నేహితులు కూడా తలంటు పోసుకొని జుట్టుకు నూనె లేకుండా రాత్రులు వీధులు వెంట తిరగాలని నిర్ణయించుకున్నారు.
(01:31) కొన్ని రోజుల తర్వాత నాతో పాటు మరో ఇద్దరు కూడా రాత్రిపూట డాబాల పైన నగ్నంగా పైగా కాళ్ళకి పసుపు పారాణి వేసుకొని మరింత పడుకున్నాం. కొన్ని రోజులు బాగానే నిద్రపోయారు ఆ తరువాత అసలు కథ మొదలయింది. మధ్యరాత్రి అయ్యేసరికి అనగా అర్ధరాత్రి 12 గంటల నుండి రెండు గంటల మధ్యకాలంలో నల్లటి ఆకారాలు మా మీదకు వచ్చి మా గంతు నలిపేస్తున్నట్లుగా గుండెల మీద ఎవరో కూర్చున్నట్లుగా ఎవరో మమ్మల్ని తొక్కుతున్నట్లుగా ఉన్న నల్లటి ఆకారాలు కనిపించడం మొదలైంది.
(02:03) ఎవరికీ చెప్పుకోలేక మాకు నిద్ర కరువయింది. ఎవరికీ చెప్పినా నమ్మరు మమ్మల్ని పిచ్చివాళ్ళ కింద జమకడతారు. మా అనుభవాలు మా ఆడ స్నేహితులకు చెప్తే వాళ్ళు కూడా నమ్మలేదు. మీరంతా వాటిని ఊహించుకొని పడుకొని ఉంటారు అందువలన మీకు అలా నల్లటి ఆకారాలు వచ్చినట్లుగా చూసినట్లు కనిపించి ఉండవచ్చు దెయ్యాలు లేవు భూతాలు లేవు అంతా మీ పిచ్చి మీ అపనమ్మకం అని మమ్మల్ని ఎగతాలి చేసి వెళ్ళిపోయారు.
(02:31) దీనెమ్మ మీకు కూడా జరిగితే గాని నా సామిరంగా మా మాట వినరు నేను చెప్పింది నిజమని సత్యమని నమ్మి చావరని నాకు అర్థమయింది. మరి కొన్ని రోజుల తర్వాత చూస్తే మా ఆడ స్నేహితులకు కూడా నిద్ర కరువై రోగం వచ్చిన వాళ్ళలాగా సన్నగా పీలగా మారటం కనిపించింది. అప్పుడు అసలు విషయం ఏంటని ఆరాధిస్తే వీరు కూడా తమ తలంటు జుట్టుకి నూనె రాసుకోకుండా కావాలని రాత్రిపూట వీధుల వెంట రాత్రి తిరిగి దానితో ఇంటికి వచ్చిన తర్వాత వీరికి నిద్రలో నల్లటి ఆకార వ్యక్తులు కనిపించి గొంతు నలిపేస్తున్నట్లుగా గుండెల మీద ఎవరో కూర్చున్నట్లుగా ఎవరో తొక్కుతున్నట్లుగా ఎవరో కూర్చుని ఏడుస్తున్నట్లుగా అనిపించసాగింది. దానితో
(03:11) వీరి వీధుల వెంట తిరగడం ఆపివేసినా కూడా వీరిని నల్ల ఆకారాలు వదలడం లేదని తెలిసింది. అకారణంగా ఏడుపు రావడం చీకటి అంటే భయపడిపోవడం ఎవరినైనా చూస్తే కోపతాపాలు రావటం వెర్రి కేకలు వెర్రి అరుపులు రావటం నిద్రలో మూలుగులు రావటం పిల్లికూతలు రావటం భయంకరమైన దృశ్యాలు కనపడటం ఎవరో మంచం దగ్గర ఏడుస్తున్నట్లు కనిపించడం కాలి అందెలు శబ్దాలు వినబడటం ఎవరో తమ చుట్టూ తిరుగుతున్నట్లుగా అనిపించడం ఇలాంటి లక్షణాలు వీరికి కలిగినాయి. దాంతో నాకు భయం వేసింది.
(03:44) అవి ఉన్నాయో లేదో తెలుసుకోవాలని ఆత్రంలో ఒకవేళ కనబడితే ఏం చేయాలో మళ్ళీ కనిపించకుండా ఉండడానికి ఏం పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలనే విషయం నాకు గుర్తుకు రాలేదు. దానితో ఈ విషయం తెలుసుకున్న వారంతా నీ అవ్వ నిన్ను నమ్మి అవి ఉన్నాయో లేదో తెలుసుకున్నాము. తీరావి మా వెంట పడితే వాటిని ఎలా వదిలించుకోవాలో తెలియదని ఇప్పుడు తాపీగా చెబుతున్నావే నీ అమ్మ బలిసిందా ఏం చేస్తావో మాకు తెలియదు మాకు పట్టుకున్న ఈ నల్లటి ఆకారాలు వదిలించకపోతే మా తల్లిదండ్రులకు నీవు చేయించిన ఈ ప్రయోగం గురించి చెప్పేస్తామని వీళ్ళంతా నన్ను బెదిరించి వెళ్ళిపోయినారు. ఏం
(04:22) చేయాలో అర్థం కాక తెల్ల మొహం వేసినాను దానితో నాకు ఏదో తెలియని భయం మొదలైంది. నేను కొన్ని రోజుల పాటు నీరసంగాను ఉత్సాహంగాను లేకుండా ఉండడం చూసేసరికి మా అమ్మకి ఏదో అనుమానం వచ్చి విషయం ఏంటి అని అడిగేసరికి అసలు విషయం చెప్పి నిజంగానే ప్రేతశక్తి ఉందా అని అడిగేసరికి దానికి ఆమె వెంటనే అవి ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ నా జీవితంలో నాకే జరిగిన యదార్థ సంఘటన ఒకటి చెబుతాను అది ఏమిటి అంటే ఇంకా నువ్వు అప్పటికి పుట్టలేదు మీ అన్నయ్య ఒకటిన్నర సంవత్సరం వయసు ఉంటుంది ఒకరోజు పని హడావిడి వల్లనే నేను ఆ రోజు తలస్నానం చేసి ముడి వేసుకోకుండా కనీసం జుట్టు
(05:00) చివర్లకు కూడా నూనెని రాసుకోకుండా అనుకోకుండా రాత్రిపూట పేరంటానికి ఒకళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్లి వచ్చిన ఆ రాత్రి నుండి నిద్రపోయేసరికి నిద్రలో ఎవరో ఒకరు ఒక నల్లటి ఆకారం ఉన్న స్త్రీమూర్తి నా మీదకు వచ్చి నన్ను చంపుతానని బెదిరిస్తూ ఉండేది మధ్యరాత్రి అయ్యేసరికి నాకు ఇలాంటి కలలు వంటి అనుభవాలు రావటం మొదలయింది.
(05:22) సాయంత్రంఆరు గంటలు అయ్యేసరికి చీకటి అంతా ఏదో తెలియని భయం మొదలైంది ఇలా కొన్ని వారాల పాటు బాధపడటం జరిగింది. నిద్రా కరువైంది రాత్రులు ఎవరో ఒంటి మీదకి వచ్చి కూర్చున్నట్లుగా అనిపించేది ఒళ్ళంతా నొప్పులతో ఉండేది తల భారంగా ఉండేది ఎవరినైనా చూస్తే కోపం కలుగుతుంది విపరీతమైన తిండిపిచ్చి మొదలైంది గారెలు కావాలని విపరీతంగా అడిగి చేయించుకొని తినేదాన్ని ఇదంతా మీ నాన్న గమనించి తన మంత్ర శక్తితో నా మీద ఏదో ప్రేత ఉన్నదని గమనించి ఒక రోజున నాకు కావలసిన అన్ని రకాల పదార్థాలు చేయించి తినమని అని చెప్పి ఆ తరువాత ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ప్రతిరోజు 108
(06:04) సార్లు ప్రదక్షణాలు చేయమని చెప్పారు కొన్ని వారాలకు నా మీద ఉన్న ప్రేత శక్తి నన్ను వదిలి వెళ్ళిపోవడం జరిగిందని చెప్పేసరికి నాకు నోట మాట రాలేదు. అంటే ఈ లెక్కన ప్రేత శక్తి ఉన్నట్లే కదా అంటే మనవాళ్ళని కూడా మన గుడిలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ప్రదక్షణాలు వెంటనే చేయించాలని నిర్ణయించుకని వాళ్ళకి ఈ విషయం చెప్పడానికి పరిగెత్తుకొని వెళ్లి వారికి చెప్పి వారి చేత హనుమంతుడికి ప్రదక్షణాలు చేయించి వారిని తిరిగి ఆరోగ్యవంతులు అయ్యేసరికి నా ప్రాణం తోక్క వచ్చింది.
(06:32) కానీ నాకున్న వానర బుద్ధి వలన నిద్రలో కేవలం ఏవో నల్లటి ఆకారాలు కనిపించినంత మాత్రం చేత ప్రేత శక్తి ఉన్నట్లేనని నమ్మాలా అనే సందేహం రావడంతో ఇది నిజముగా ఉంటే నన్ను పట్టుకొని పీడిస్తే గాని నమ్మరాదని నిశ్చయించుకున్నాను. దీనికి తగినట్లుగా నన్ను ఒక కర్ణ పిశాచం పట్టుకుంది ఆపై ఏం జరిగిందో తెలియాలంటే అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి.
(07:01) గమనిక ఈ సంఘటనలు యదార్థంగా నా జీవితంలో జరిగాయి. అందరికీ ఇలానే జరగాలని లేదు మాలో కొంతమందికి మాత్రమే జరిగింది. మరి కొంతమందికి ఇలాంటి ఇబ్బంది కలగలేదు. నల్లటి ఆకారాలు కనిపించలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత నాకు తెలిసింది ఏమంటే జాతక రీత్య ఎవరికైతే చెడుస్థానంలో రాహు గ్రహ స్థితి ఉంటుందో అలాగే ఎవరికైతే అనాహతా చక్రం బలహీనంగా ఉంటుందో వారికి మాత్రమే ఇలాంటి నల్లటి ఆకార ప్రేత శక్తులు పట్టుకొని బాధ పెడతాయని అలాగే ఎవరికైతే సర్పదోషాలు అలాగే జాతక రీత్య పంచమ ద్వితీయ స్థానంలో రాహు గ్రహ స్థితి ఉంటుందో వారికి ఇలాంటి ప్రేత శక్తులు కనపడతాయని
(07:41) తెలుసుకున్నాను. వీటికి అంత తేలిగ్గా కొట్టి పారేయకండి కచ్చితంగా పాటించండి వివాహ వధువరులు పారాయణ కాళ్ళతో ఊరి పొలిమేరలు దాటవద్దు అలాగే తలంటు పోసుకొని స్త్రీమూర్తులు తమ జుట్టుకి నూనె రాసుకోకుండా ఉంచుకోవద్దు అలాగే వెరబోసుకొని తిరగవద్దు కనీసం ముడి వేసుకోండి వాటి కొసలకైనా నూనె రాసుకుని ముడి వేసుకోండి.
(08:03) ఇది నా వ్యక్తిగత అభిప్రాయాలే పాటించడం పాటించకపోవడం మీ ఇష్టం ఒకవేళ మీకు ఇలాంటి ప్రేతశక్తుల అనుభవాలు కలిగితే కంగారుపడకండి హనుమాన్ చాలీసాను చదువుకోండి లేదా ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ప్రదక్షణాలు చేయండి లేదా ఎరుపు నీళ్లతో దిష్టి తీయించుకోండి లేదా నూనె గుడ్డతో దిష్టి తీసుకొని తగలబెట్టండి లేదా ఒక కొబ్బరికాయతో దిష్టి తీయించుకొని దాన్ని ప్రవహించే నీటిలో పడవేయండి.
(08:28) ఆ తర్వాత తప్పనిసరిగా స్నానం చేయండి. లేదా నీకు నమ్మకం ఉంటే దగ్గరలో ఉన్న మసీదులకు వెళ్లి అక్కడున్న ఫకీర్ల చేత తాయిత్తులు కట్టుకోండి మానసిక బలహీనతలు ఉన్నవారికి ఇలాంటి మనోదర్శనాలు కలుగుతాయని నాకు తెలుసు నేను పైన చెప్పిన పరిహారాలు చేసుకుంటే వీటి మీద నమ్మకం ఏర్పడి మానసిక ధైర్యం కలిగి ఆరోగ్యవంతులుగా తిరిగి మారుతారని నా వ్యక్తిగత అభిప్రాయం.
(08:50) ఎందుకంటే ఈ విశ్వంలో విశ్వాసంతో నడుస్తోంది కదా మన భారతీయ ఆచార వ్యవహారాలు బట్టి మూఢ నమ్మకాలు కాదని అవి మన పూర్వీకులు గ్రహించిన సత్యాలని నేను తెలుసుకొని మీరు తెలుసుకోవాలన్న నా తపనా తాపత్రయం అని ఒక్కసారి మీరు గ్రహించండి
No comments:
Post a Comment