ప్రశాంతంగా బతకాలంటే ఈ ముసుగును తక్షణమే తీసెయ్! | Life Changing Reality Check | Satyagrahi
Author Name:Satyagrahi
Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ks_FjegyrbQ
Transcript:
(00:04) [సంగీతం] మీ జీవితంలో జరిగిన అతి పెద్ద అన్యాయానికి కారణం పక్కింటోడో లేకపోతే మీ బాసో అందులోనూ మీ లక్కో కాదంటే మీరు ఒప్పుకుంటారా మనకి బాధ కలిగిన ప్రతిసారి సమాజం నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది. కాలం కలిసి రాలేదు అని చెప్పేసి సాకులు వెతుక్కుంటాం. కానీ ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించండి. మీరు పడుతున్న బాధకి నిజమైన కారణం అవతలి వారి ప్రవర్తన కాదు మీ అసలు రూపాన్ని కప్పి పుచ్చడానికి మీరు వేసుకున్న ఈగో మాస్క్ ఈరోజే ఈ ముసుగుని తీసేయకపోతే మీ మిగిలిన జీవితం కూడా ప్రశాంతంగా ఉండదు.
(00:40) మనం ఉదయాన్నే నిద్ర లేవగానే మొదట ఏం చేస్తాం అద్దం ముందుకు వెళ్తాం జుట్టు సరి చేసుకుంటాం మంచి బట్టలు వేసుకుంటాం బయట ప్రపంచానికి మనం చాలా పర్ఫెక్ట్ గా కనిపించాలి. కానీ ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఆ లోపల ఉన్న మనిషి ఎవరు ఆ లోపల ఒక భయస్తుడు ఉన్నాడు ఒక అసూయపరుడు ఉన్నాడు ఎప్పుడూ ఇతరులతో పోల్చుకునే ఒక బలహీనుడు ఉన్నాడు.
(01:03) జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక మాట అంటారు మీరు ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించే ముందు మీ మనసులోని గంధరగోళాన్ని చూడండి అని మనం ఆ లోపలి గంధరగోళాన్ని చూడటానికి భయపడతాం. అందుకే బయట ఒక నాటకం ఆడతాం. నేను చాలా మంచివాడిని అని మనకి మనమే సర్ది చెప్పుకుంటాం. బిజినెస్ లో లాస్ వచ్చిందా పార్ట్నర్ మోసం చేశాడు అని చెప్పేస్తాం. రిలేషన్షిప్ దెబ్బతిందా అవతలి వాళ్ళకి అండర్స్టాండింగ్ లేదు అంటాం.
(01:28) కానీ మీ నిర్ణయంలో ఉన్న తప్పును మీరు ఎప్పుడైనా అంగీకరించారా? మీ లాభపేక్షను మీ స్వార్థాన్ని ఎప్పుడైనా ఒప్పుకున్నారా? ఒప్పుకోరు ఎందుకంటే తప్పు ఒప్పుకోవడం అంటే ఈగో చచ్చిపోవడం. ఈ ఈగో చావకూడదని మనం ఈ బాధనంతా భరిస్తున్నాం. మనం వేసుకున్న ఈ ముసుగునే నిజమని నమ్మడం మొదలు పెడతాం. చివరికి ఆ ముసుగే మన ముఖానికి అతుకోబోతుంది.
(01:52) జిడ్డు కృష్ణమూర్తి గారు తరుచుగా ప్రశ్నించేవారు మీరు మీ ఆలోచనల ప్రతిబింబం మాత్రమేనా లేక అంతకుమించి ఏమైనా ఉన్నారా అని నిజానికి మనం మన ఆలోచనలకు మన భావోద్వేగాలకు ఒక బానిసలా మారిపోయాం. మన ఓటమికి కారణం వేరే ఎవరు అని నమ్మడంలో ఒక సుఖం ఉంటుంది. ఎందుకంటే ఆ నమ్మకం మనకి బాధ్యత నుంచి విముక్తిని ఇస్తుంది. నా తప్పేమీ లేదు పరిస్థితులు నన్ను ఇలా చేసాయి అనుకోవడం చాలా ఈజీ కానీ ఆ ఆలోచనే మిమ్మల్ని ఒక బాధితుడిగా మార్చేస్తుంది.
(02:22) మీరు ఎంతకాలం అయితే మిమ్మల్ని మీరు బాధితుడిగా భావిస్తారో అంతకాలం మీరు మీ జీవితానికి యజమాని కాలేరు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదో ఒక రాయి తగిలి కింద పెడతాం. రాయిని తిడితే మీ కాలికైన గాయం మానిపోతుందా? లేదా కింద పడినందుకు నవ్వే జనాన్ని చూసి కోప్పడితే మీ నొప్పి తగ్గుతుందా? తగ్గదు కదా మీరు చూసుకోకుండా అడుగు వేశారనే పచ్చి నిజం అక్కడ ఉంది.
(02:45) కానీ ఆ నిజాన్ని ఒప్పుకోవడానికి మీ మనసు అంగీకరించదు. ఎందుకంటే మీ తప్పును మీరు ఒప్పుకుంటే మీరు చిన్నబోయినట్లు అనిపిస్తుంది. ఈ చిన్నతనం అనే భయమే మీ మనశశాంతిని తగలబెడుతుంది. ఒకసారి ఆలోచించండి. మీరు రోజు ఎన్ని నాటకాలు ఆడుతున్నారు? మీతో మీరు ఎంత అసత్యంగా బ్రతుకుతున్నారు ఈ ప్రపంచంలో ప్రశాంతత కోసం తిరగని ప్రదేశం లేదు ఆధ్యాత్మిక క్షేత్రాలు తిరుగుతారు పుస్తకాలు చదువుతారు రకరకాల గురువులను ఆశ్రయిస్తారు కానీ లోపల ఉన్న అసత్యం అలాగే ఉంటుంది.
(03:16) జుడు కృష్ణమూర్తి గారు స్పష్టంగా చెప్పారు నిజం అనేది ఒక దారి లేని నేల. దానికి ఏ మతమో ఏ సంస్థో ఏ గురువు మిమ్మల్ని తీసుకెళ్ళలేరు. మీ అంతరంగంలో ఉన్న ఆ సత్యాన్ని మీరు చూడనంతవరకు మీ తప్పులను మీరు కప్పి పుచ్చుకున్నంతవరకు మీకు ఏ మార్గము ప్రశాంతతను ఇవ్వలేదు. సమస్య మీలో లేదు సమస్య మీలోనే ఉంది. ఇదే పచ్చి నిజం కానీ ఆ నిజాన్ని అంగీకరించే ధైర్యం మనలో ఎంతమందికి ఉంది.
(03:44) అసలు మనిషి తన తప్పును తాను అంగీకరించడానికి ఎందుకు అంత భయపడతాడు? ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి సమాజం మనకి ఒక అబద్ధాన్ని నూరుపోసింది నువ్వు ఎప్పుడు గెలవాలి నువ్వు ఎప్పుడూ పర్ఫెక్ట్ గా ఉండాలి అని తప్పు చేయడం అంటే నేరం అని సమాజం ముద్ర వేసింది. చిన్నప్పుడు స్కూల్లో మార్కులు తక్కువ వస్తే టీచర్ దండించేవారు. ఇంట్లో తల్లిదండ్రులు తిట్టేవారు.
(04:08) దానివల్ల మన మనసులో ఒక తీవ్రమైన భయం నాటుకుపోయింది. నేను తప్పు చేశానని తెలిస్తే ఈ సమాజం నన్ను తక్కువ చేసి చూస్తుంది అనే భయం. ఆ భయం నుంచే యుగో పుడుతుంది. యుగో అంటే ఏంటో తెలుసా మీరు నిజంగా ఏమిటో అది కాదు మీరు సమాజం ముందు ఎలా కనిపించాలనుకుంటున్నారో ఆ భ్రమ అన్నమాట ఆ భ్రమని కాపాడుకోవడానికి మనిషి ఏమైనా చేస్తాడు అబద్ధాలు చెప్తాడు మోసాలు చేస్తాడు చివరికి తప్పుని ఎదుటు వారిపై నెట్టేస్తాడు.
(04:36) జిడ్డు కృష్ణమూర్తి గారు తరుచుగా ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. మనం మన ఇంట్లో ఒక మురికి మూలను చూసినప్పుడు ఆ మురికిని శుభ్రం చేయడం మానేసి దానిపైన ఒక అందమైన కార్పెట్ కప్పేస్తాం. బయట నుంచి వచ్చే వాళ్లకు ఇల్లు చాలా శుభ్రంగా కనిపిస్తుంది. కానీ ఆ కార్పెట్ కింద మురిగి కుళ్లి పోతూనే ఉంటుంది. దుర్వాసన వస్తూనే ఉంటుంది. మన మనసు కూడా సరిగ్గా అలాంటిదే మన లోపల ఉన్న అసూయని భయాన్ని స్వార్థాన్ని మనం అంగీకరించం.
(05:07) వాటి పైన మంచివాడు అనే ఒక పెద్ద కార్పెట్ ని కప్పేస్తాం. ఆ మురికి వల్ల లోపల అశాంతి మండుతూనే ఉంటుంది. అయినా సరే బయట ప్రపంచానికి నవ్వుతూ కనిపిస్తాం. ఆ నటన ఉందే అది మనిషిని లోపల నుంచి పిప్పి చేస్తుంది. మీకు తెలుసో లేదో మన బాధకి కారణం వేరొకరి ప్రవర్తన కాదు ఆ ప్రవర్తనని మన ఈగో ఎలా స్వీకరిస్తుంది అనేదే అసలు సమస్య ఎవరైనా మిమ్మల్ని వేలు చూపి తిట్టారనుకోండి మీకు కోపం ఎందుకు వస్తుంది వారు అన్న మాటల వల్ల కాదు మీలోని నేను అనే భావనకి దెబ్బ తగిలినందుకు ఆ నేనుని కాపాడుకోవడానికి మీరు ఎదురు దాదాడి చేస్తారు లేదా రోజంతా ఆ మాటల్ని తలుచుకుంటూ కుమిలిపోతారు మీరు ఎంతటి
(05:46) బానిసత్వంలో ఉన్నారో ఒకసారి ఆలోచించండి ఎవడో ఒకడు అన్న మాట మీ రోజంతటి ప్రశాంతతని తుడిచేస్తుంది. ఎందుకంటే మీ శాంతి మీ చేతుల్లో లేదు. సమాజం మీ చేతికి తోలు బొమ్మ దారాలు కట్టి ఆడిస్తుంది. జుడు కృష్ణమూర్తి గారు మనిషి యొక్క స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ ఒక మాట అంటారు అన్వేషణ ఉన్నంత కాలం సత్యం దొరకదు. పరిశీలన ఉన్నచోటే అవగాహన మొదలవుతుంది.
(06:12) మనం నిరంతరం మన తప్పిదాలను దాచుకోవడానికి ఒక సమర్ధన కోసం వెతుకుతుంటాం. అంటే సెల్ఫ్ జస్టిఫికేషన్ కోసం వెతుకుతుంటాం. ఎందుకంటే సరిదిద్దుకోవడం కంటే సమర్ధించుకోవడం చాలా సులభం. మీరు ఒక ఆలోచన చేయండి. ఒక చిన్న పొరపాటు జరిగినప్పుడు దాన్ని అంగీకరిస్తే అక్కడ కథ ముగుస్తుంది. కానీ అలా కాకుండా దాన్ని కప్పి పుచ్చడానికి మరో 10 అబద్ధాలు ఆడాలి.
(06:37) ఆ 10 అబద్ధాలు నిజం చేయడానికి ఒక ముసుగు వేసుకోవాలి. ఈ క్రమంలో మీ శక్తినంతా మీరు ఆ ముసుగును కాపాడుకోవడానికి తగలేస్తున్నారు. అందుకే మీరు సాయంత్రం అయ్యేసరికి ప్రాసెస్ చేయడానికి ఏ శక్తి మేలడం లేదు. తీవ్రమైన అలసట వస్తుంది. ఆ అలసట శరీరానికి కాదు మీరు రోజంతా ఆడిన నాటకానిది. మన ఆలోచన విధానంలో ఉన్న అతి పెద్ద లోపం ఏంటంటే మనం జీవితాన్ని ఒక యుద్ధంలా చూస్తున్నాం.
(07:02) నేను గెలవాలి. ఎదుటివాడు ఊడిపోవాలి. నా వాదనే నగ్గాలి. అవతలివాడి మాటలు చెల్లకూడదు. ఈ గెలుపోటములు ఆటలో మీ జీవితం కరిగిపోతుంది. ఒకవేళ మీరు ఆటలో గెలిచినా మీరు పొందేది ఏముంది ఒక తాత్కాలికమైన ఈగో తృప్తి తప్ప కానీ మీరు కోల్పోతున్నది ఏమిటో తెలుసా? మీ అమూల్యమైన అంతర్గత ప్రశాంతతని. అయితే ఈ అసత్యం నుంచి ఈ నిరంతర నటన నుంచి మనం ఎలా బయటపడాలి? ఒకవేళ సాధన ఏమైనా చేయాలా? అది కూడా కాకపోతే జపాలు ఏమనా చేయాలా అంటే జిగు కృష్ణమూర్తి గారు ఏ రకమైన సాంప్రదాయ పద్ధతులను లేదా గురువులని ఆశ్రయించమని చెప్పరు.
(07:41) ఆయన చెప్పే ఏకైక మార్గం చోద్యం చూడటం అంటే ఛాయిస్లెస్ అవేర్నెస్ అన్నమాట మీ లోపల ఉన్నదానిని మీరు ఏ తీర్పు ఇవ్వకుండా ఉన్నది ఉన్నట్లుగా చూడటం మీకు కోపం వచ్చిందా కోపం రావడం తప్పు అని నైతిక సూత్రాలు వల్లించకండి లేదా అతను ఇలా అన్నాడు కాబట్టి నాకు కోపం వచ్చిందని చెప్పేసి సమర్ధించుకోకండి ప్రశాంతంగా కూర్చొని మీలోని ఆ కోపాన్ని ఒక మూడో వ్యక్తిలా చూడండి.
(08:05) ఆ కోపం ఎక్కడ పుడుతుందో మీ శరీరంలో ఎలాంటి మార్పులు తేస్తుందో ఆ కోపం వెనుక ఏ భయం దాగి ఉంది. ఏ తీర్పు ఇవ్వకుండా మీరు మిమ్మల్ని గమనించినప్పుడు ఒక విచిత్రమైన మ్యాజిక్ జరుగుతుంది. ఆ కోపం ఆ భయం ఆ అసూయ మెల్లగా కరిగిపోవడం మొదలవుతాయి. ఎందుకంటే గమనించడం ఉన్నచోటే ఈగో మానజాలదు. ఈగో బ్రతకాలంటే దానికి సమర్ధానలు కావాలి. వాదనలు కావాలి. కానీ ప్రశాంతమైన పరిశీలన ముందు అది నిలబడదు.
(08:33) జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిన మరో గొప్ప సూత్రం బాధ్యత. మీ జీవితంలో జరుగుతున్న ప్రతిదానికి మీరే బాధ్యులు అని గుర్తించండి. ఎవరినో వీలు చూపించి నిందించడం ఆపేయండి. సమాజాన్ని పరిస్థితులని గతాన్ని బ్లేమ్ చేయడం ఆపేయండి. నా ఆలోచనే నాకు ఈ పరిస్థితిని సృష్టించింది అనే నిజం వైపు చూడండి. ఎప్పుడైతే మీరు బాధ్యత తీసుకుంటారో అప్పుడే మీ చేతికి పవర్ వస్తుంది.
(08:57) అంతవరకు మీ జీవితపు రిమోట్ కంట్రోల్ ఇతరుల చేతిలో ఉన్నట్లే వాళ్ళు బటన్ నొక్కితే మీరు కోప్పడతారు. ఇంకో బటన్ నొక్కితే బాధపడతారు. మీ జీవితానికి మీరే ఓనర్ కావాలంటే ముందు మీ తప్పులని మీ లోపాలని యదార్థంగా అంగీకరించే ధైర్యం రావాలి. తప్పు ఒప్పుకోవడం బలహీనత కాదు అది అంతర్గత బలానికి సంకేతం. ఒక్కసారి మీ ముసుగుని తీసి కింద పడేయండి.
(09:21) నేను పర్ఫెక్ట్ కాదు నాలో కూడా లోపాలు ఉన్నాయి. నేను కూడా తప్పులు చేశాను అని మీతో మీరు నిజాయితీగా చెప్పుకోండి. ఈ క్షణంలో మీ గుండెల మీద నుంచి ఎంత పెద్ద భారం దిగిపోతుందో మీరు అనుభవపూర్వకంగా చూస్తారు. ఆ క్షణమే మీలో నిజమైన విముక్తి మొదలవుతుంది. నిజాయితీగా ఉండటం అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కడితో మంచిగా మాట్లాడటం ఎవరికీ అన్యాయం చేయకుండా ఉండటం కాదు ముందు మీ అంతరంగంతో మీరు యదార్ధంగా ఉండటం అంటే మీ తప్పులు కూడా మీరు లెక్కించుకునే విధంగా ఉండటం.
(09:51) మీ అంతరాత్మకు తెలుసు మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో కాబట్టి మీ అంతరాత్మ మాట వినండి. మరి ఈ క్షణం నుంచి మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలి మనం చేయాల్సింది కొత్తగా దేన్నో నిర్మించడం కాదు ఉన్న బ్రామలని తుడిచేయడం జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినట్లు పరివర్తన అనేది భవిష్యత్తులో జరిగే ప్రక్రియ కాదు అది ఈ క్షణంలో జరిగే అవగాహన ముందుగా ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం తక్షణమే ఆపేయండి.
(10:17) పోలిక ఉన్న చోట అసూయ పుడుతుంది. అసూయ ఉన్న చోట ముసుగు తయారవుతుంది. పక్కవాడి సక్సెస్ ని చూసి మీరు చినబోతున్నారంటే మీలో అభద్రత భావం ఉందని అర్థం. ఆ అభద్రతను అంగీకరించండి. దాన్ని కప్పి పుచ్చేందుకు అబద్ధపు గొప్పలు పోకండి. రెండవది జీవితంలో వచ్చే కష్టాలు, శిక్షలుగా చూడకండి. అవి మిమ్మల్ని సవరించడానికి కాలం వేసిన ఒక గీత. మీరు దారి తప్పి తప్పుడు మార్గంలోకి వెళ్తున్నప్పుడు కాలం మిమ్మల్ని కొడుతుంది. అది మామూలుగా కొట్టదు.
(10:46) సో ఆ దెబ్బ చూసి ఏడవకండి ఆ దెబ్బ ఎందుకు పడిందో లోతుగా ఆలోచించండి. మూడవది ప్రతిరోజు కొంత సమయం కేవలం మీతో మీరు గడపండి. ఏ ఫోన్ లేకుండా ఏ పుస్తకం లేకుండా ఏ ఆలోచన శ్రమ లేకుండా మౌనంగా కూర్చోండి. మీ మనసులోకి వచ్చే ప్రతి ఆలోచనని ప్రతి భావోద్వేగాన్ని ప్రశాంతంగా గమనించండి. అలా గమనించినప్పుడు ప్రపంచాన్ని గెలవడం చాలా తేలిక అని చెప్పి మీకు అర్థం అవుతుంది.
(11:12) కానీ మీలో మీకు చెప్పుకునే అబద్ధాలను మీరు గెలవడమే అసలైన విజయం. మీ అంతరంగంలో ఉన్న అబద్ధపు ముసుగును తొలగించిన క్షణంలో మీకు ఈ విశ్వానికి మధ్య ఉన్న గోడలు బద్దలవుతాయి. అప్పుడు జీవితం ఒక భారం కాకుండా ఒక ప్రశాంతమంతమైన ప్రవాహంలో మారుతుంది. మీరు మీ అంతరాత్మ ముందు యదార్థంగా ఉన్నంతకాలం ఈ ప్రపంచంలో ఉన్న ఏ శక్తి మీ మనశశాంతిని చిరిపి వేయలేదు.
(11:37) మీ ఆత్మని స్వేచ్ఛగా విడిపించండి. మీలోని అసలైన సత్యాన్ని ఆస్వాదించండి. ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. [సంగీతం]
No comments:
Post a Comment