Partners లేదా wife & husband మధ్య రెండు విషయాలలో తేడా ఉందని గమనించాలి:
ఒకటి - వారి మధ్య ఉన్న ప్రేమ, emotions.
రెండు: వారు ఇతర విషయాలలో ఎలా ఉన్నారు - అంటే డబ్బులు, ఆస్తులు, jobs, career, బంధువులు, బంధువుల influence, ఇతర బాధ్యతలు మొదలైనవి.
ఈ రెండు కలపొద్దు. రెండవది మొదటి దాంట్లోకి రావొద్దు.
రెండవ వాటి వల్ల మొదటిది డిస్టర్బ్ అవుతుంది, ఇది మూర్ఖత్వం. కానీ ఈ తేడా గమనించటం అంత సులువు కాదు. Soul స్థాయిలో (ఆత్మ స్థాయిలో) ఉండాలి. లేదంటే మొదట్లో ప్రేమలో ఉన్నప్పుడు మొదటిది మాత్రమే ఉంటుంది కాబట్టి problem అనిపించదు, కొత్త మురిపెం ఉంటది, తరువాత దూల తీరుతది.
కాబట్టి ఆత్మ స్థాయిలో ఉండే ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మికతలో ధ్యానంలో యోగంలో లేకపోతే అంతే సంగతులు, స్పష్టత ఉండదు. స్పష్టత లేనప్పుడు సమస్యలు ఉంటాయి. స్పష్టత ఉంటూ సమస్య ఉండటం కొంత మంచిదే. స్పష్టత లేకుండా సమస్య ఉండటం మంచిది కాదు.
http://youtube.com/post/UgkxutDHcdnyOLLX3BuxhvlOo8Jm3P16Zdgi?si=DcjPbLKeV8fWCSxy
No comments:
Post a Comment