ఆడవాళ్ళనిలా అవమానించే ఛండాలపు సంస్కృతి అసలెందుకొచ్చింది? ఎలా వొచ్చింది? || PRATIKULA VEDAM
Author Name:PRATIKULA VEDAM
Youtube Channel Url:https://www.youtube.com/@pratikulavedam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=hrc7jlLG9z4
Transcript:
(00:00) ఏంటి నేనేమనా గాజులు తొడుక్కొని కూర్చున్నాను అనుకుంటున్నావా మన సొసైటీలో చాలా క్యాజువల్ గా ఎంతో పౌరుషంగా ఫీల్ అవుతూ వాడే డైలాగ్ ఇది సినిమాలో హీరోల దగ్గర నుంచి పాలిటిక్స్ లో మైకులు వెరగకొట్టే నాయకుల దాకా చివరికి వీధుల్లో జరిగే కొట్లాటల్లో కాళ్ళ ఎగరేసే కుర్రాళ్ళ దాకా అందరూ వాడే అల్టిమేట్ పంచ్ డైలాగ్ ఇది.
(00:21) కానీ దీని వెనుకున్న లాజికల్ కారణం ఏంటో ఏ రోజైనా ఆలోచించారా లేదు [సంగీతం] ఎందుకంటే మన ఈగో కి ఆ డైలాగ్ ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. దీని వెనకున్న ఇండైరెక్ట్ అర్థం ఒకటే గాజులు తొడుక్కునే ఆడవాళ్ళు చేతకాని వాళ్ళు మరి నేను మగవాడిని కాబట్టి నేను వాళ్ళలా వీక్ కాదు అని ఈ డైలాగ్ వెనుకున్న ఫేక్ పౌరుషాన్ని అందులో ఉన్న డొల్లతనాన్ని ఒక లాజికల్ దృక్పదంతో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
(00:51) అసలు ఈ డైలాగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ముందుగా ఫాక్ట్స్ మాట్లాడుకుందాం. భాష అనేది ఎప్పుడు ఒక సమాజపు ఆలోచన విధానానికి అర్థం పడుతుంది. కానీ దీని రూట్స్ మన పేట్రియార్కిల్ హిస్టరీలో ఉన్నాయి. ఏన్షియంట్ ఇండియాలో ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఇద్దరు చేతులకి కడియాలు వేసుకునేవాళ్ళు. అవి వారియర్స్ కి యుద్ధంలో ఒక షీల్డ్ లా పనిచేసేవి అంటే ఒకప్పుడు అవి బలానికి సింబల్స్ కానీ కాలక్రమంలో సమాజం మారింది.
(01:24) ఆ స్త్రీ అధికారం మగాడి చేతుల్లోకి వెళ్ళాయి. మరి ఆడవాళ్ళని కేవలం ఇంటికి వంటగదికే పరిమితం చేశారు. ఆ సమయంలో ఆడవాళ్ళు ఎలాగో ఇక యుద్ధాలకి వెళ్ళాల్సిన అవసరం తగ్గిందని తాము వేసుకునే ఆభరణాల్లో బరువైన ఇనుము లేదా రాగి నుంచి సున్నితమైన గాజు పదార్థాల్లోకి మార్చుకున్నారు. అంటే గాజు పదార్థంతో తయారయ్యాయి కాబట్టే వాటిని గాజులు అని అనడం స్టార్ట్ చేశారు.
(01:51) అలా ఆడవాళ్ళని ఇంటి నాలుగు గోడల మధ్య బంధించి వాళ్ళకి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా చేసి వాళ్ళ చేతులకి ఆ సున్నితమైన గాజులు వేసి ఆ సున్నితమైన తత్వానికి చేతకానితనం అని పేరు పెట్టారు. ఆ రోజుల్లో కత్తులు పట్టుకొని తిరిగే మగవాళ్ళు తమ సుపీరియర్ పవర్ ను చూపించుకోవడానికి క్రియేట్ చేసిన ఫాల్స్ నెర్రేటివ్ ఇది.
(02:13) నా చేతిలో కత్తి ఉంది నీ చేతికి గాజులు ఉన్నాయి. నువ్వు కేవలం ఇంటికే పరిమితమైన ఒక వస్తువువి అనే ఆధిపత్య అహంకారం నుంచి పుట్టిన డైలాగే నేనేమి గాజులు తొడుక్కోలేదు అనే స్టేట్మెంట్ అసలు చేతగనోళ్ళ అంటే ఎవరు నేనేమి గాజులు తొడుక్కోలేదు అని డైలాగులు కొట్టే ఒక యవరేజ్ మగవాడిని తీసుకుందాం. చిన్న జ్వరం వస్తే చాలు మంచం మీద పడుకొని రగ్గు కప్పుకొని అమ్మో నాయనో అని వారం రోజులు రెస్ట్ తీసుకునే ఈతరం మగవాళ్ళు డెలివరీ టైంలో మనిషి శరీరంలోని 20 ఎముకలు ఒకేసారి విరిగితే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పిని భరించే ఆడవాళ్ళ గురించి చేత కాని వాళ్ళు అని ఇండైరెక్ట్ గా కామెంట్ చేయడం
(02:52) ఎంత హాస్యస్పదం ఆడవాళ్ళు ఆ గాజులు వేసుకున్న చేతులతోనే ఉదయం నాలుగు గంటలు గలేచి ఇల్లు ఊడ్చి బట్టలు ఉతికి వంట చేసి వ్యవసాయ పనులకు వెళ్లి బరువ వైన బిందెలతో నీళ్ళు మోసి మళ్ళీ ఇంటికివచ్చి పిల్లలకు పాలు పెట్టి మొగుడికి అన్నం పెట్టే ఆ స్త్రీ చేతకానిది ఎలా అవుతుందివ నెవర్ క్వశన్ ద అబ్సడిటీ ఆఫ్ అవర్ ఓన్ కండిషనింగ్ భార్య వండి పెట్టకపోతే సొంతంగా ప్లేట్ కడుక్కోవడం కూడా చేతకాని మగవాళ్ళు పౌరుషం కోసం గాజుల గురించి మాట్లాడడం కంటే హాస్యస్పదం మరొకటి లేదు ఇప్పుడు దీన్ని కంప్లీట్ గా ఒక యూనిక్ పర్స్పెక్టివ్ లో చూద్దాం.
(03:31) గాజులు ముఖ్యంగా గ్లాస్ బ్యాంగిల్స్ అనేవి చాలా సున్నితమైనవి. కాస్తంత గట్టిగా ఎక్కడైనా తగిలితే పగిలిపోతాయి పగిలితే చేతిని కోసేస్తాయి. కానీ ఒక స్త్రీ ఆ సున్నితమైన గాజులు వేసుకొని బండకేసి బట్టలు ఉతుకుతుంది గిన్నెలు తోముతుంది పొలంలో పార పట్టుకొని మట్టి తవ్వుతుంది వంటగదిలో నిప్పుతో ఆడుకుంటుంది. కానీ ఒక్క గాజు కూడా పగలకుండా ఈ పనులన్నీ చేస్తుంది.
(03:57) ఆలోచించండి అలా చేయడానికి ఎంత ఫోకస్ ఉండాలి ఎంత బాడీ కంట్రోల్ ఉండాలి ఎంత ప్రెజర్ మేనేజ్మెంట్ ఉండాలి. ఒక మగాడికి ఆ గాజులు వేసి ఒక్కరోజు ఇల్లు ఊడిచి గిన్నెలు తోమనండి నేను గ్యారెంటీ ఇస్తా గంట లోపల ఆ గాజులన్నీ పగలుకొట్టుకొని చేతులు కోసుకుపోయాయని హాస్పిటల్ కి పరిగెడతాడు. సో గాజులు వేసుకోవడం అనేది చేతకానితనానికి సింబల్ కాదు ఇట్ రిక్వైర్స్ అబ్సల్యూట్ కంట్రోల్ మల్టీ టాస్కింగ్ ఎబిలిటీ అండ్ ఎక్స్ట్రీమ్ ఫోకస్ ఇట్ ఇస్ ఆన్ అల్టిమేట్ ఫ్లెక్స్ ఆఫ్ హ్యూమన్ కేపబిలిటీ గాజులు వేసుకుంటే సౌండ్ వస్తుంది నడిస్తే గళ గళమని చప్పుడుఅవుతుంది.
(04:35) అంటే అర్థం ఏంటి నేను ఇక్కడే ఉన్నాను నేను వస్తున్నాను అని ధైర్యంగా ప్రపంచానికి అనౌన్స్ చేయడం. వెన్నుపోటు పొడిచేవాడు దొంగచాటుగా కుట్రలు చేసేవాడు భయస్తుడు ఎప్పుడూ సౌండ్ చేయకుండా సైలెంట్ గా వస్తాడు. కానీ ఒక స్త్రీ తన ఉనికిని చాటుకుంటూ ధైర్యంగా అడుగులు వేస్తుంది. సో గాజులు తొడుక్కోవడం అంటే పిరికితనం కాదు దాక్కోవలసిన అవసరం లేని ఒక ట్రాన్స్పరెన్సీ ఒక మనిషి అనేవాడు ఎప్పుడు తన బలాన్ని పక్కవాళ్ళ బలహీనతతో పోల్చి గొప్పగా ఫీల్ అవ్వాలనుకుంటాడు.
(05:07) ఇది హ్యూమన్ ఈగో యొక్క బేసిక్ నేచర్ తన లోపల ఉన్న భయాన్ని ఇన్సెక్యూరిటీని కవర్ చేసుకోవడానికి వాడే ఒక డిఫెన్స్ మెకానిజమే ఈ డైలాగ్ ఎప్పుడైతే ఒక వ్యక్తి నేనేమి గాజులు తొడుక్కొని కూర్చోలేదు అని అంటాడో అనలిటికల్లీ స్పీకింగ్ వాడు భయపడుతున్నాడు అని అర్థం. తన స్థాయి కంటే బలమైన ప్రత్యతి ఎదురైనప్పుడు తనలో ఉన్న ధైర్యం సరిపోనప్పుడు ఇలాంటి పనికి మాలిన డైలాగ్స్ తో ఎదుటి వాళ్ళ మీద సైకలాజికల్ ప్రెజర్ పెట్టి తన డొల్లతనాన్ని కవర్ చేసుకునే ఒక చీప్ ట్రిక్ ఇది.
(05:40) మనం వాడే ప్రతి పదం ప్రతి వాక్యం మన సబ్కాన్షియస్ మైండ్ ని ప్రోగ్రామ్ చేస్తుంది. మనం ఇలాంటి డైలాగ్స్ ని గ్లోరిఫై చేస్తున్నంత కాలం సమాజంలో ఆడవాళ్ళ పట్ల ఉన్న ఆ చిన్న చూపు సటిల్ మిస్ ఆగని ఎప్పటికీ పోదు. సో ఇక నుంచయనా ఎవరైనా మీ ముందు బిల్డప్ ఇస్తూ నేనేమి గాజులు తొడుక్కోలేదు అని అంటే వాళ్ళ భుజం తట్టి చెప్పండి అవును తమ్ముడు ఆ సున్నితమైన గాజులు వేసుకొని అంత కఠినమైన జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం నీకు చేత కాదు దానికి ఎంతో ధైర్యం ఓపిక బలం కావాలి అండ్ అంత సీన్ నీకు లేదు కాబట్టి నువ్వు తొడుక్కోలేవులే అని ఇక్కడ నేను కన్వే చేయాలనుకుంటున్నది ఒక్కటే ఒక మనిషి లోపల
(06:22) ఉన్న బలాన్ని బలహీనతల్ని వాళ్ళ వస్త్రాలంకరణ చూసి మనం జడ్జ్ చేయకూడదు అవునా కాదా ఆలోచించండి
No comments:
Post a Comment